Menu
BREAKING
Biggboss 10 Telugu: హాట్ హాట్‌గా నామినేషన్స్.. ఆపరేషన్ త్రిగుణ్ సక్సెస్   |   The Paradise: నాని ‘ది ప్యారడైజ్’లో ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు.. స్క్రీన్ షేక్ అయిపోతుందేమో మరి..?   |   Fauzi: ‘ఫౌజీ’ సమస్యేంటి.. ప్రభాస్‌కు క్లారిటీ లేదా..? హను కన్ఫ్యూజ్ అవుతున్నాడా..?   |   Biggboss10 Telugu: మారిపోయిన సుధీర్.. త్రిగుణ్‌కు షాక్   |   ముఖేష్ అంటే చాలా ఇష్టమన్న దేబ్జాని.. ప్రేక్షకుల చేతుల్లో పవర్..   |   Biggboss 10 Telugu: సోషల్ మీడియాలో మారుమోగుతున్న రోహిత్..   |   Biggboss 10 Rohith: రోహిత్‌నే టార్గెట్ చేసిన నాగ్.. ఇకపై పెరగనున్న అటాక్..   |   Biggboss Telugu 10: రోహిత్‌కు క్లాస్.. త్రిగుణ్‌కు పనిష్మెంట్   |   Biggboss 10 Telugu: ఎలిమినేషన్‌లో భారీ ట్విస్ట్.. ఎవరూ ఊహించలే..   |   బిగ్ బాస్ లో ట్విస్ట్‌లు ఉంటాయంటే ఏమో అనుకున్నాం కానీ భారీ ట్విస్ట్‌లు…   |   ‘ఇరుముడి’తో ఏం నేర్చుకున్నారు.. మీకు ఇప్పటికైనా అర్థమవుతుందా స్టార్ హీరోలు..?   |   Biggboss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో లవ్ ట్రాక్ స్టార్ట్..!   |   Biggboss 10 Telugu: చైత్ర వర్సెస్ షాలిని.. హౌస్‌మేట్స్‌గా రోహిత్, వంశీ   |   Biggboss 10 Telugu: మిడ్‌వీక్ ఎలిమినేషన్ నిజమేనా? అసలా వ్యక్తే ఎందుకు?   |   Biggboss 10 Rohith: రోహిత్‌కు కప్ చేతిలో పెట్టడమే వాళ్ల లక్ష్యమా?

Biggboss 10 Rohith: రోహిత్‌నే టార్గెట్ చేసిన నాగ్.. ఇకపై పెరగనున్న అటాక్..

Biggboss 10 Rohith: రోహిత్‌నే టార్గెట్ చేసిన నాగ్.. ఇకపై పెరగనున్న అటాక్..

బిగ్‌బాస్ 10 తెలుగు తొలి శనివారం ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆ తరుణం రానే వచ్చింది. నాగ్ రాగానే శుక్రవారం ఏం జరిగిందో ప్లే చేశారు. త్రిగుణ్ ఎక్కడున్నా రోహిత్ గురించి తప్ప మరేం మాట్లాడడు. ప్రస్తుతం వాష్ రూమ్ దగ్గ కూడా ముఖేష్‌తో త్రిగుణ్ చాలా బ్యాడ్‌గా మాట్లాడుతున్నాడు. రోహిత్ అందరి మధ్య చిచ్చులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడని చెబుతన్నాడు. ఆ తరువాత కూడా త్రిగుణ్.. వెళ్లి రోహిత్‌తో చర్చ మొదలు పెట్టాడు. ముఖేష్.. ఝాన్సీ, సుదీర్‌ల మధ్య త్రిగుణ్ గురించి డిస్కషన్ జరుగుతోంది. ముఖేష్ కాస్త త్రిగుణ్ మెంటాలిటీ అర్థం చేసుకున్నాడేమో అని అతని మాటల్ని బట్టి అనిపించింది. రామ్ ప్రసాద్, నరేష్‌ ఇద్దరూ ఏదో ఫన్ చేయడానికి ట్రై చేశారు కానీ అంతలా వర్కవుట్ కాలేదు. హౌస్‌లోని ప్రతి ఒక్కరి గురించి ఫన్నీగా వివరించే ప్రయత్నమైతే చేశారు.

చాలా సీరియస్‌గా చూసి ఎలా ఉన్నారని నాగ్ నవ్వుతూ అడిగారు. నరేష్‌తో ఫన్ చేశారు. ఆ వెంటనే ఫస్ట్ వీకే హౌస్‌లో నుంచి ఇద్దరిని పంపించేస్తారా? అనే సందేహం మీకు ఉంటుంది కదా. అందుకే ఎలిమినేట్ అయిన వారితో మాట్లాడదాం అని ముందుగా చరణ్‌కి వీడియో కాల్ చేశారు. హౌస్‌మేట్స్‌తోనూ మాట్లాడించారు. ముందుగా చరణ్‌ని లైన్‌లోకి తీసుకున్నారు. అతను ఎలిమినేట్ అవడానికి కారణమేంటో చెప్పారు. ఆ తరువాత తను సీక్రెట్‌ రూమ్‌లో లేనని.. తన ఇంట్లోనే ఉన్నానని చెప్పాడు. ఒకరితో మాట్లాడవచ్చంటే షాలినితో మాట్లాడాడు. షాలినిని బయట ఆడపులిలా చూస్తున్నారని.. చాలా కాన్ఫిడెంట్‌గా ఇచ్చి పడేయమని చెప్పాడు. తనకు ఆ ధైర్యం ఇచ్చినందుకు షాలిని థాంక్స్ చెప్పింది. మొత్తానికి షాలినికి ఓ హింట్ అయితే ఇచ్చేశాడు. వాస్తవానికి అగ్నిపరీక్షతో ఆమెకు కాస్త నెగిటివిటీ వచ్చింది. ఆ కారణంగానే హౌస్‌లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు చరణ్ చెప్పిన మాటలతో షాలిని ఇకపై ఆడపులిలా మారుతుందేమో చూడాలి.

Bigg Boss 10 Telugu Naresh

ఆ తరువాత చైత్రతో మాట్లాడించారు. బయటకు వచ్చి ఫ్రెండ్స్‌ని కలవడం బాగుందని.. హౌస్‌లో చాలా తక్కువ సమయం గడపటం బాధనిపిస్తోందని చెప్పింది. తాను సీక్రెట్ రూంలో లేనని చెప్పింది. ముఖేష్‌తో చైత్ర మాట్లాడింది. బాగా ఆడమని చెప్పింది. తను ఎలిమినేట్ అవడానికి కారణం రోహితేనని చెప్పింది. తను కిచెన్ డ్యూటీ సరిగా చేయలేదని తనను తాను హై రిస్క్‌లో పెట్టుకోవచ్చు కదా అని పేర్కొంది. రోహిత్ చాలా కన్నింగ్ అన్నట్టుగా చెప్పింది. వంశీ, రోహిత్, రామ్ ప్రసాద్ హౌస్‌మేట్స్ అయినందుకు నాగ్ కన్ఫెషన్ రూమ్‌కి పిలిచి మిల్క్ షేక్స్ ఇచ్చారు. ఆ తరువాత వాళ్లు మిల్క్ షేక్ తాకిన ఎంగిలి గ్లాసులను నాగ్ కడిగారు. ఏ పని చిన్నది కాదు.. ఏది తక్కువది కాదు.. అలాంటి ఆలోచన ఉంటే హౌస్‌లో ఉండొద్దని రోహిత్‌కు వార్నింగ్ ఇచ్చారు. మగవాళ్లందరికీ హౌస్‌లోనే కాదు.. బయట కూడా.. ఇంట్లో ప్రతి పనిలోనూ సాయం చేయకుంటే మిమ్మల్ని మెన్‌గానే పరిగణించనని నాగ్ చెప్పారు.

ఆ తరువాత రోహిత్, వంశీని గార్డెన్‌లోకి పిలిచారు. ముఖేష్, వర్షిణి, త్రిగుణ్‌ని కూడా గార్డెన్‌లోకి పంపించారు. ఆడియెన్స్ ఓటింగ్ ప్రకారం ముఖేష్, వర్షిణి, త్రిగుణ్‌ ముగ్గురిలో ఒకరు హౌస్‌మేట్ అవుతారని చెప్పారు. అలా ఫోర్త్ హౌస్‌మేట్‌గా త్రిగుణ్ మారాడు. ఈ సీజన్‌లో మీ యాక్షన్‌కి తన రియాక్షన్ ఉంటుందని చెప్పి నాగ్ ఎంగిలి కప్పులను స్టోర్ రూం నుంచి తెప్పించారు. రోహిత్ తాను చేసిన పని ఎలా తప్పవుతుందని నాగ్‌ని రోహిత్ అడిగాడు. ముందుగానే ఎవరి ప్లేట్లు, కప్పులు వాళ్లే క్లీన్ చేసుకోవాలని మాట్లాడుకున్నారని చెప్పాడు. అయితే వాళ్లు క్లీన్ చేసుకోకుంటే నువ్వు చెయ్యాలి కదా అని నాగ్ రోహిత్‌ని ప్రశ్నించారు. ఝాన్సీని లేపి కూడా నాగ్ అడిగారు. ఈ విషయమై నాగ్ పెద్ద డిస్కషనే పెట్టారు. త్రిగుణ్‌ కూడా లేచి ఒక మూడు పాయింట్స్ చెప్పారు. దానికి సంబంధించిన వీడియోను నాగ్ ప్లే చేశారు. రోహిత్ తరుఫున షాలిని, సృష్టి స్టాండ్ తీసుకోవడం బాగుంది. రోహిత్ ఇంటెన్షన్ తెలుసు కాబట్టి తమకు అది తప్పు కాదనిపించిందని షాలిని, సృష్టి చెప్పారు. ఈ విషయాన్ని నాగ్ బాగా సాగదీయడం అతనికే ప్లస్ అని చెప్పాలి. ఈ దెబ్బకు రోహిత్‌కు బీభత్సమైన సింపతి వర్కవుట్ అవడం కన్ఫర్మ్.

Biggboss 10 Rohith: రోహిత్‌నే టార్గెట్ చేసిన నాగ్.. ఇకపై పెరగనున్న అటాక్..

ఆతరువాత త్రిగుణ్‌ని లేపి ‘నీకు రోహిత్‌తో ప్రాబ్లమ్ ఏంటి?’ అని అడిగారు. త్రిగుణ్‌ని పొగుడుతూనే చురకలు అంటించారు. ‘పిల్ల బచ్చ, డొల్ల రాజా, డొల్ల స్టెరాయిడ్’ అని అన్నందుకు త్రిగుణ్‌తో సారీ చెప్పించారు. అతనేదో చెప్పాలన్నట్టుగా చెప్పాడంతే. అతనికో పనిష్మెంట్ ఇచ్చి పంపించారు. దేబ్జానిని లేపి ప్రశంసలు కురిపించారు. ఆ తరువాత రామ్ ప్రసాద్‌పై ప్రశంసలు కురిపించారు. ఫన్ కోసమని అతను వాడిన ‘వారానికి వెయ్యి’ సాంగ్ విషయమై షాలినిని ‘చాలా ఎక్కువ’ అంటూ అతను మాట్లాడిన మాటను హైలైట్ చేశారు. రామ్ ప్రసాద్‌తో ఒక బోర్డుపై తన ఫస్ట్ శాలరీ 500 కావడంతో 500 సార్లు సారీ చెప్పించారు. బ్రేక్ ఇవ్వగానే.. తనను అటెన్టివ్‌గా లేను అనడం నచ్చలేదని ముఖేష్ వెళ్లి త్రిగుణ్‌తో గొడవపడ్డాడు. వాస్తవానికి అక్కడ ముఖేష్.. రోహిత్ మాటను సరిగా వినకుండా నాగ్‌తో చెప్పేశాడు. వీడియో ప్లే చేశాక ముఖేష్‌ది రాంగ్ అని తెలిసింది. ఆ సమయంలోనే ముఖేష్ అటెన్టివ్‌గా లేడని రోహిత్ అన్నాడు. అదీ గొడవ.

నెక్ట్స్ హౌస్‌మేట్ ఎవరో నాగ్ రివీల్ చేశారు. అది మరెవరో కాదు.. షాలిని. ఆమె ఆనందానికి అవధుల్లేవు. షాలిని హై రిస్క్‌లో ఉన్నప్పుడు సాంగ్ అడగటంపై షాలినిని నాగ్ ప్రశ్నించారు. రోహిత్‌ని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ పదే పదే అటాక్ చేయడంతో వాడి విక్టరీని సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నానని అది తప్ప తనకు మరో ఆలోచన లేదని చెప్పింది. అప్పటి వీడియోను నాగ్ ప్లే చేసి షాలిని క్లాస్ తీసుుకున్నారు. నీ హృదయానికి ఎవరు దగ్గర? ఎవరు దూరం? అని ముందుగా వర్షిణిని పిలిచి అడగ్గా.. దేబ్జాని దగ్గర అని.. రోహిత్ హృదయానికి దూరమని చెప్పాడు. దేబ్జాని.. రామ్ ప్రసాద్‌కు దగ్గర.. రోహిత్ దూరమని చెప్పింది. తనకు దగ్గర త్రిగుణ్ అని.. దూరం కృష్ణుడు అని రోహిత్ చెప్పాడు. త్రిగుణ్ తాను కలిసి టాస్క్ ఆడితే అది గొప్ప టాస్క్ అవుతుందని దానికోసం చూస్తున్నట్టు చెప్పాడు. త్రిగుణ్ వచ్చేసి ఝాన్సీ తనకు దగ్గరని.. దూరం సుధీర్ అని చెప్పాడు. ఝాన్సీ వచ్చేసి దగ్గర ముఖేష్ అని.. దూరం రోహిత్ అని చెప్పింది. సృష్టి.. దగ్గర దేబ్జాని అని.. వర్షిణి దూరం అని చెప్పింది. మిగిలిన వాళ్ల గురించి రేపు తెలుసుకుందాం అని చెప్పి లాస్ట్ హౌస్‌మేట్‌ను రివీల్ చేశారు. ఇవాళ లాస్ట్ హౌస్‌మేట్ దేబ్జాని అని చెప్పారు.

Biggboss 10 Rohith: రోహిత్‌నే టార్గెట్ చేసిన నాగ్.. ఇకపై పెరగనున్న అటాక్..

మొత్తానికి అందరినీ వదిలేసి రోహిత్‌ని మాత్రం ఏకిపారేశారు. దాదాపుగా శనివారం నాగ్ వచ్చి కూడా రోహిత్ చుట్టూనే తిరిగారేమో అనిపించింది. మొత్తానికి ఈవ్యవహారం మొత్తం రోహిత్‌కు బయట బీభత్సమైన ప్లస్ కానుంది. కానీ హౌస్‌లో అతని కాన్ఫిడెన్స్ దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే వర్షిణి, కృష్ణుడు, దేబ్జానిని ఒక్కమాట కూడా అనలేదు. మొత్తంగా రేపటి నుంచి రోహిత్‌పై హౌస్‌లో మరింత అటాక్ పెరగనుందని మాత్రం తెలుస్తోంది. చివరకు ఝాన్సీ కూడా రోహిత్‌కు రివర్స్ అయిపోయింది. ఇక ఇప్పుడు గేమ్ మరింత రసవత్తరంగా మారనుంది.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360