Menu
BREAKING
విశ్వంభరను మరిచిపోదామా.. బాస్ సినిమా బాక్సుల్లోంచి బయటికి రానట్లేనా..?   |   కామ్రేడ్ కళ్యాణ్ ట్రైలర్ రివ్యూ.. వాళ్ల మనోభావాలు దెబ్బతింటే అంతే సంగతులు..!   |   Biggboss10 Telugu: రెచ్చిపోతున్న సుధీర్.. పడిపోతున్న గ్రాఫ్..   |   ఇదెక్కడి దిక్కుమాలిన ప్లానింగ్.. కనీసం ట్రైలర్స్ కట్ చేయడానికి టైమ్ దొరకట్లేదా..?   |   Biggboss10 Telugu: హాట్ హాట్‌గా నామినేషన్స్.. ఈవారం కూడా కామనర్స్ బలి..   |   లెజెండరీ నటి శారద పరిస్థితి చూస్తున్నారా.. 81 ఏళ్ళ వయసులో కూడా..!   |   Biggboss10 Telugu: నామినేషన్స్‌లో రెచ్చిపోయిన వర్షిణి, ముఖేష్..   |   Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ED సోదాలు.. అసలు నిజమేంటో తెలుసా..?   |   AK47: ఆదర్శ కుటుంబం మళ్లీ వాయిదా.. అసలు కారణం అదన్నమాట..!   |   Biggboss10 Telugu: రోహిత్ పని ఓవర్ అని సెలబ్రిటీలు అనుకుంటున్నారా?   |   Biggboss10 Telugu: నెరవేరిన సెలబ్రిటీల కోరిక.. బిగ్‌బాస్ నుంచి కామనర్ సృష్టి అవుట్   |   Anil Ravipudi: అనిల్ రావిపూడి యామినేషన్ సినిమా వెనక అంత పెద్ద కథ ఉందా..?   |   ఫ్లాప్ వాళ్లను ఆపలేదు.. రూట్ మార్చేలా చేసింది.. కుర్రాళ్ళూ జాగ్రత్త..!   |   లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఇక లేరు.. ది ట్రెండ్ సెట్టర్..!   |   Biggboss10 Telugu: రోహిత్‌కే ఫుల్ డోసు.. మిగిలిన వాళ్లంతా లైట్..

Biggboss Telugu 10: రోహిత్‌కు క్లాస్.. త్రిగుణ్‌కు పనిష్మెంట్

Biggboss Telugu 10: రోహిత్‌కు క్లాస్.. త్రిగుణ్‌కు పనిష్మెంట్

బిగ్‌బాస్ 10 తెలుగు (Bigg Boss 10 Telugu) అంచనాలకు అందకుండా ఉంది. త్రిగుణ్ (Thrigun) ఏ రేంజ్‌లో డోస్ ఉంటుందో చూడాలని ప్రేక్షకులంతా ఆసక్తిగా శనివారం కోసం ఎదురు చూస్తుంటే.. శనివారం హోస్ట్ నాగార్జున (Nagarjuna) తాపీగా వచ్చి మిల్క్ షేక్ తాగించి మరీ రోహిత్‌ (Rohith)కి డోస్ ఇచ్చారు. అసలు రోహిత్‌కి డోస్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? దాని వెనుక మతలబ్ ఏంటో చూద్దాం. బిగ్‌బాస్ యాజమాన్యం ఎప్పుడైనా తమకు పనికి వచ్చేలా ఏ స్టెప్ అయినా తీసుకుంటుంది. రోహిత్ విషయంలోనూ ఇదే జరిగింది. అలాగే ఇది రోహిత్‌కి మైనస్ ఏమీ కాదు.. ప్లస్సే అవుతుంది. అది బయట.. హౌస్ లోపల మాత్రం అది మైనస్. అందరూ అతని నుంచి దూరంగా వెళ్లే అవకాశం ఉంది. బయట మాత్రం బీభత్సమైన సింపతి వస్తుంది.

ముందుగా నాగ్ రాగానే ఎలిమినేట్ అయిన వారిని హౌస్‌మేట్స్‌తో మాట్లాడించారు. ఆ తరువాత టాస్క్ బాగా ఆడినందుకు రామ్ ప్రసాద్, రోహిత్, వంశీలకు నాగ్ మిల్క్ షేక్ ఇచ్చారు. అవి తాగగానే వాళ్లు తాగిన ఎంగిలి గ్లాసులు నాగ్ కడిగారు. వాటిలో రోహిత్ ఎంగిలి చేసిన గ్లాస్ కూడా ఉంది. ఏ పని చిన్నది కాదు.. ఏ పని తక్కువది కాదని అన్నారు. అలాంటిది ఏమైనా ఉంటే హౌస్‌లో ఉండొద్దంటూ రోహిత్‌కి క్లాస్ పీకారు. వాస్తవానికి ఇదొక చిన్న విషయం. దీనికి ఇంత పెద్ద స్టేట్‌మెంట్ ఇవ్వడం అనేది దారుణం. బయట అది రోహిత్‌(Rohith)కు బీభత్సమైన సింపతి క్రియేట్ చేస్తుంది. రోహిత్ ఎంగిలి గ్లాసులు క్లీన్ చేయనన్నందుకు అంత దారుణమైన మాటా? బిగ్‌బాస్ సీజన్స్‌లో ఎప్పుడైనా ఎవరు తిన్నవి.. తాగినవి వారు కడుక్కుంటారు. వండిన గిన్నెలు, ఇతర గిన్నెలు ఏమున్నా కూడా ఆ బాధ్యత ఎవరైతే తీసుకున్నారో వారు చేస్తారు.

Biggboss Telugu 10: రోహిత్‌కు క్లాస్.. త్రిగుణ్‌కు పనిష్మెంట్

వాస్తవానికి రోహిత్ మాట్లాడిన మాటలు తప్పే. కానీ అది పెద్ద విషయమేం కాదు. అయితే నాగ్ ఇంత దారుణంగా క్రియేట్ చేయడం వలన ఇక మీదట రోహిత్ ప్రతి దానికీ భయపడే అవకాశం ఉంది. అలాగే ఇతర కంటెస్టెంట్స్.. రోహిత్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. అర్ధరాత్రి ఝాన్సీ(Jhansi)కి అగ్నిపరీక్ష టీం అంతా క్లాస్ పీకింది. ఆమె కాస్త బెండ్ అయ్యింది. కానీ దీని వలన ఆమె ఇక మీదట వాళ్లతో కలిసే అవకాశం ఉండకపోవచ్చు. పైగా రోహిత్ కాన్ఫిడెన్స్ లెవల్స్ తగ్గిపోతాయి. మరెందుకు అంతలా నాగ్ క్లాస్ పీకారో చూడాలి. ఈ సీజన్‌లో రియాక్షన్‌తో పాటు ఇమ్మిడియట్ పనిష్మెంట్ కూడా ఉంటుందని చెప్పి ‘పిల్లబాతు బచ్చ, డొల్ల రాజా, స్టెరాయిడ్ డొల్ల’ అన్నారు. వెంటనే త్రిగుణ్ లేచి తనది తప్పేనని తన మాటలు వెనక్కి తీసుకుంటానన్నారు. ఈ మూడు పదాలు త్రిగుణ్‌కి గుణమే లేదని కన్ఫర్మ్ చేస్తున్నాయన్నారు. పూల్ పక్కన టైర్ ఉందని ఈ షో అయ్యేవరకూ అది పట్టుకుని తిరగాలంటూ త్రిగుణ్‌కు పనిష్మెంట్ ఇచ్చారు.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360