Menu
BREAKING
Bigg Boss10 Telugu: మాస్క్ తీసిన దేబ్జాని.. రోహిత్‌ని ఒంటరిని చేసేందుకు ప్రయత్నాలు..   |   Bigg Boss10 Telugu: హౌస్ నుంచి దక్షి, షాలిని ఎలిమినేట్.. పస లేని షో..   |   Bigg Boss10 Telugu: ఎలిమినేట్ అయిన శాలిని.. రోహిత్‌కు దెబ్బ మీద దెబ్బ   |   Bigg Boss 10 Telugu: రోహిత్‌కు బ్లాక్ కార్డ్.. మోకాళ్లపై కూర్చొని వేడుకున్న రోహిత్   |   ఫిట్‌నెస్, గాయాల నుంచి కోలుకోవడంపై డాక్టర్ వెంకటేష్ మోవ్వతో టైగర్ ష్రాఫ్ ఆసక్తికర చర్చ   |   Biggboss10 Telugu: సడెన్ ఎలిమినేషన్.. ఇవాళేనా? వెళ్లబోయేదెవరు?   |   RC17 సినిమాతో సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ విడిపోయినట్లే..!   |   నా బాడీ నా యిష్టం.. నా సైజ్‌ల గురించి మీకెందుకు.. ఆ హీరోయిన్ సీరియస్..!   |   Biggboss10 Telugu: హౌస్‌లోకి షాలిని ఎంట్రీ.. ఈ వారం ముప్పు ఆ ఇద్దరికే..   |   సో కాల్డ్ వారసులను అడిగే దమ్ముందా.. బ్యాగ్రౌండ్ లేని కుర్రాళ్లేనా టార్గెట్..?   |   కుర్రాడు సక్సెస్ అవుతాడా.. దొంగ నా కొడుకుతో మౌళి ఫ్యూచర్ ఏంటి..?   |   దసరాకు పట్టించుకోరా.. విజయదశమి కనీసం కళ్లకు కనిపించలేదా మన హీరోలకు..?   |   Biggboss10 Telugu: సుధీర్, ఝాన్సీలను ఒకాట ఆడుకున్న ఆర్కే.. బయటకొచ్చిన ఎలుకలు..   |   అన్నీ చెప్పిన రాజమౌళి ఆ ఒక్కటి తప్ప.. వారణాసి కథేంటో తెలుసా..?   |   దీపిక పదుకొనే, రణ్‌వీర్ సింగ్ రెండో కూతురు పేరు తెలుసా..?

‘మా చరణ్ బంగారం’.. రామ్ చరణ్‌పై సుకుమార్ ప్రశంసలు, RC17 అప్డేట్‌పై క్లారిటీ

‘మా చరణ్ బంగారం’.. రామ్ చరణ్‌పై సుకుమార్ ప్రశంసలు, RC17 అప్డేట్‌పై క్లారిటీ

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన “పెద్ది” చిత్రం భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కేవలం రామ్ చరణ్ కెరీర్‌కే కాకుండా, టాలీవుడ్‌కు కూడా ఎంతో అవసరమైన సెన్సేషనల్ సక్సెస్‌ను అందించిందని అభిమానులు భావిస్తున్నారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం నేడు హైదరాబాద్‌లో గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్‌ను నిర్వహించింది.

ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకుడు సుకుమార్ ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేశారు. కార్యక్రమంలో సుకుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ సుకుమార్ భావోద్వేగంగా స్పందించారు. “రామ్ చరణ్‌ను నేను ఒక్కడినే కాదు, మా అందరం ఒకే మాట అంటాం… ‘మా చరణ్ బంగారం’. చరణ్ లాంటి వినమ్రుడిని నేను ఇప్పటివరకు చూడలేదు” అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.

సుకుమార్ వ్యాఖ్యలకు అభిమానులు భారీగా స్పందించగా, సభ ప్రాంగణం కేరింతలతో మార్మోగింది. ఇదే సమయంలో అభిమానులు “RC17” అంటూ నినాదాలు చేస్తూ, రామ్ చరణ్‌తో ఆయన చేయబోయే తదుపరి సినిమా గురించి అప్డేట్ ఇవ్వాలని కోరారు.

అయితే అభిమానుల విజ్ఞప్తిపై స్పందించిన సుకుమార్, తనదైన శైలిలో ఎలాంటి వివరాలు వెల్లడించకుండా తప్పించుకున్నారు. ప్రస్తుతం తన పూర్తి దృష్టి పని మీదే ఉందని, ఈ దశలో ఎలాంటి అప్డేట్ ఇవ్వబోనని స్పష్టం చేశారు.

దీంతో సుకుమార్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్‌లో రానున్న RC17పై మరింత ఆసక్తి పెరిగింది. “రంగస్థలం” తర్వాత ఈ ఇద్దరి కలయికలో మరో భారీ సినిమా రాబోతుండటంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360