Menu
BREAKING
విశ్వంభరను మరిచిపోదామా.. బాస్ సినిమా బాక్సుల్లోంచి బయటికి రానట్లేనా..?   |   కామ్రేడ్ కళ్యాణ్ ట్రైలర్ రివ్యూ.. వాళ్ల మనోభావాలు దెబ్బతింటే అంతే సంగతులు..!   |   Biggboss10 Telugu: రెచ్చిపోతున్న సుధీర్.. పడిపోతున్న గ్రాఫ్..   |   ఇదెక్కడి దిక్కుమాలిన ప్లానింగ్.. కనీసం ట్రైలర్స్ కట్ చేయడానికి టైమ్ దొరకట్లేదా..?   |   Biggboss10 Telugu: హాట్ హాట్‌గా నామినేషన్స్.. ఈవారం కూడా కామనర్స్ బలి..   |   లెజెండరీ నటి శారద పరిస్థితి చూస్తున్నారా.. 81 ఏళ్ళ వయసులో కూడా..!   |   Biggboss10 Telugu: నామినేషన్స్‌లో రెచ్చిపోయిన వర్షిణి, ముఖేష్..   |   Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ED సోదాలు.. అసలు నిజమేంటో తెలుసా..?   |   AK47: ఆదర్శ కుటుంబం మళ్లీ వాయిదా.. అసలు కారణం అదన్నమాట..!   |   Biggboss10 Telugu: రోహిత్ పని ఓవర్ అని సెలబ్రిటీలు అనుకుంటున్నారా?   |   Biggboss10 Telugu: నెరవేరిన సెలబ్రిటీల కోరిక.. బిగ్‌బాస్ నుంచి కామనర్ సృష్టి అవుట్   |   Anil Ravipudi: అనిల్ రావిపూడి యామినేషన్ సినిమా వెనక అంత పెద్ద కథ ఉందా..?   |   ఫ్లాప్ వాళ్లను ఆపలేదు.. రూట్ మార్చేలా చేసింది.. కుర్రాళ్ళూ జాగ్రత్త..!   |   లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఇక లేరు.. ది ట్రెండ్ సెట్టర్..!   |   Biggboss10 Telugu: రోహిత్‌కే ఫుల్ డోసు.. మిగిలిన వాళ్లంతా లైట్..

Biggboss 10 Telugu: ఎలిమినేషన్‌లో భారీ ట్విస్ట్.. ఎవరూ ఊహించలే..

Biggboss 10 Telugu: ఎలిమినేషన్‌లో భారీ ట్విస్ట్.. ఎవరూ ఊహించలే..

గతంలో బిగ్‌బాస్ తెలుగు హోస్ట్ నాగార్జున వచ్చి ఈసారి బిగ్‌బాస్ ఇలా ఉండబోతోంది.. అలా ఉండబోతోదంటూ మాటలు చెప్పేవారు. కానీ అంత ఉండేది కాదు.. ఈసారి మాటలు కాదు.. చేతల్లో చూపిస్తున్నారు. మామూలు ట్విస్ట్‌లు కాదవి. ఒక్క తెలుగులోనే కాదు.. ఏ భాషలోనూ ఇలాంటి ట్విస్ట్‌లు ఉండి ఉండవేమో. కంటెస్టెంట్ల ఎంపిక నుంచి ప్రతిదీ వావ్ అనిపించేలానే ఉంది. మొత్తమ్మీద ఝాన్సీ వంటి ఒకరిద్దరు తప్ప మిగిలిన వారంతా బీభత్సమైన కంటెంట్ ఇస్తున్నారు. బిగ్‌బాస్ నిర్వాహకులకు చేతి నిండా పని చెబుతున్నారు. ఇక శనివారం అంటే బిగ్‌బాస్ ప్రేక్షకులకు పండగే. హోస్ట్ నాగార్జున వచ్చి మొట్టికాయలు వేయాల్సిన వారికి వేసి.. పొగడాల్సిన వారిని పొగుడుతూ ఉంటారు.

ఈ ఎపిసోడ్ కోసం బిగ్‌బాస్ ప్రేక్షకులు వారమంతా ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈసారి తొలి వారం నాగ్ వచ్చి ఎవరికి మొట్టికాయలు వేస్తారనేది ఆసక్తికరంగా మారింది. త్రిగుణ్‌ని దారిలో పెడితే కంటెంట్ రాదు.. అలాగని పెట్టకుంటే అతను ఇంకా బ్యాడ్ అయిపోతాడు. అలాగే వర్షిణి, కృష్ణుడు, సుధీర్ వంటి వారందరినీ దారిలో పెట్టాలి. మరి దీనిని నాగ్ ఎలా డీల్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. దీంతో ప్రేక్షకులంతా శనివారం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకూ బిగ్‌బాస్ నుంచి ఒక్కటంటే ఒక్క ప్రోమో కూడా బయటకు రాలేదు. దీంతో ఉత్సుకత మరింత పెరుగుతోంది. ఇక ఈవారం ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్ అయి హౌస్ నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు మూడో ఎలిమినేషన్ జరుగనుంది.

Biggboss 10 Telugu: ఎలిమినేషన్‌లో భారీ ట్విస్ట్.. ఎవరూ ఊహించలే..

ఇక ముచ్చటగా మూడో కంటెస్టెంట్‌ను మాత్రం ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ చేయనున్నారు. మరి బయటి కొందరు రివ్యూవర్స్ పెట్టిన పోల్స్‌లో అయితే కృష్ణుడు బయటకు వెళ్లిపోతాడని ఉంది. దీంతో అంతా పెద్ద ఎత్తున మీమ్స్ పెట్టేశారు. ‘వినాయకుడు’ (కృష్ణుడు చేసిన తొలి చిత్రం) ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నాడని.. ఆదివారం నిమజ్జనమే అంటూ పెద్ద ఎత్తున మీమ్స్ వచ్చాయి. తీరా చూస్తే ఈ వారం ఎలిమినేట్ అయ్యేది కృష్ణుడు కాదట. అఫీషియల్ ఓటింగ్ ప్రకారం ఆయన లీస్ట్ నుంచి రెండో స్థానంలో ఉన్నారట. మరి కింది నుంచి ఫస్ట్ స్థానంలో ఉన్నది ఎవరో తెలుసా? సుధీర్ రెడ్డి. గేమ్‌ను అర్థం చేసుకోకుండా త్రిగుణ్ మాయలో ఉండిపోయి ఆటను సర్వనాశనం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే సుధీర్ రెడ్డి హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నట్టు తెలుస్తోంది.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360