Menu
BREAKING
కామ్రేడ్ కళ్యాణ్ ట్రైలర్ రివ్యూ.. వాళ్ల మనోభావాలు దెబ్బతింటే అంతే సంగతులు..!   |   Biggboss10 Telugu: రెచ్చిపోతున్న సుధీర్.. పడిపోతున్న గ్రాఫ్..   |   ఇదెక్కడి దిక్కుమాలిన ప్లానింగ్.. కనీసం ట్రైలర్స్ కట్ చేయడానికి టైమ్ దొరకట్లేదా..?   |   Biggboss10 Telugu: హాట్ హాట్‌గా నామినేషన్స్.. ఈవారం కూడా కామనర్స్ బలి..   |   లెజెండరీ నటి శారద పరిస్థితి చూస్తున్నారా.. 81 ఏళ్ళ వయసులో కూడా..!   |   Biggboss10 Telugu: నామినేషన్స్‌లో రెచ్చిపోయిన వర్షిణి, ముఖేష్..   |   Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ED సోదాలు.. అసలు నిజమేంటో తెలుసా..?   |   AK47: ఆదర్శ కుటుంబం మళ్లీ వాయిదా.. అసలు కారణం అదన్నమాట..!   |   Biggboss10 Telugu: రోహిత్ పని ఓవర్ అని సెలబ్రిటీలు అనుకుంటున్నారా?   |   Biggboss10 Telugu: నెరవేరిన సెలబ్రిటీల కోరిక.. బిగ్‌బాస్ నుంచి కామనర్ సృష్టి అవుట్   |   Anil Ravipudi: అనిల్ రావిపూడి యామినేషన్ సినిమా వెనక అంత పెద్ద కథ ఉందా..?   |   ఫ్లాప్ వాళ్లను ఆపలేదు.. రూట్ మార్చేలా చేసింది.. కుర్రాళ్ళూ జాగ్రత్త..!   |   లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఇక లేరు.. ది ట్రెండ్ సెట్టర్..!   |   Biggboss10 Telugu: రోహిత్‌కే ఫుల్ డోసు.. మిగిలిన వాళ్లంతా లైట్..   |   Biggboss10 Telugu: కామనర్స్‌కు పెద్ద దెబ్బ.. అంతా ముఖేషే చేశాడు..

Fauzi: ‘ఫౌజీ’ సమస్యేంటి.. ప్రభాస్‌కు క్లారిటీ లేదా..? హను కన్ఫ్యూజ్ అవుతున్నాడా..?

Fauzi: ‘ఫౌజీ’ సమస్యేంటి.. ప్రభాస్‌కు క్లారిటీ లేదా..? హను కన్ఫ్యూజ్ అవుతున్నాడా..?

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న ఫౌజీ సినిమా హాట్ టాపిక్‌గా మారిందిప్పుడు. ఈ సినిమా విషయంలో అసలు ఏం జరుగుతుందనే డైలమా అందరినీ వేధిస్తోంది. ప్రభాస్ లాంటి ఒక రేంజ్ ఉన్న స్టార్ హీరోను, అందులోనూ పాన్ ఇండియా క్రేజ్ ఉన్న హీరోను పెట్టుకుని సినిమా చేస్తున్నప్పుడు నిర్మాతలకు కనీస ప్లానింగ్ లేదా అన్న ప్రశ్నలు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తున్నాయి. సినిమా ఎప్పుడు మొదలైందో, అసలు ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ ఎలాంటి క్లారిటీ లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వందల కోట్ల రూపాయల బడ్జెట్‌తో డీల్ చేస్తున్న ప్రాజెక్ట్‌కి ఒక ప్రాపర్ షెడ్యూల్ ప్లానింగ్ లేకపోవడం అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాలను సైతం కన్ఫ్యూజన్‌కు గురిచేస్తోంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేతిలో ఉన్నప్పుడు మేకర్స్‌కు ఒక స్పష్టమైన విజన్ ఉండాలి కానీ, ఫౌజీ విషయంలో మాత్రం అడుగడుగునా గందరగోళమే కనిపిస్తోంది. ఈ డైలమా ఇలాగే కంటిన్యూ అయితే సినిమా బిజినెస్‌పై కూడా నెగెటివ్ ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంది.

ఇక ఈ సినిమా దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) వర్కింగ్ స్టైల్‌పై కూడా ఇప్పుడు రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమాను విజువల్ వండర్‌గా తీయాలనే తపనలో ఆయన మరో రాజమౌళిలా మారిపోయి ప్రతి ఫ్రేమ్‌ను ఏళ్ల తరబడి చెక్కుతూనే ఉన్నారని టాక్ నడుస్తోంది. ఒక దర్శకుడిగా పర్ఫెక్షన్ కోసం ట్రై చేయడం మంచిదే అయినా, ఇలా గ్యాప్ లేకుండా సినిమాను చెక్కుతూ కూర్చుంటే బడ్జెట్ తడిసి మోపెడవుతుంది. వర్కింగ్ డేస్ పెరిగే కొద్దీ ప్రొడక్షన్ కాస్ట్ అమాంతం పెరిగిపోయి అది నేరుగా నిర్మాతల మెడకే చుట్టుకుంటుంది. రేపు సినిమా రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చినా కూడా, ఇష్టమొచ్చినట్లు పెరిగిన బడ్జెట్‌ను వెనక్కి తీసుకురాలేకపోతే అది కచ్చితంగా కాస్ట్ ఫెయిల్యూర్‌గా మిగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకే క్రియేటివిటీ పేరుతో హద్దులు దాటి బడ్జెట్ పెంచేయడం, ఫైనాన్షియల్‌గా ఏమాత్రం సేఫ్ కాదని ట్రేడ్ విశ్లేషకులు మేకర్స్‌కు గట్టిగా హెచ్చరిస్తున్నారు.

Fauzi: ‘ఫౌజీ’ సమస్యేంటి.. ప్రభాస్‌కు క్లారిటీ లేదా..? హను కన్ఫ్యూజ్ అవుతున్నాడా..?

అసలు ఫౌజీ కథ (Fauzi story) విషయానికి వస్తే, ఇది మనకు స్వాతంత్ర్యం రాకముందు అంటే ఇండిపెండెన్స్‌కు ముందు జరిగే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ పవర్ ఫుల్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. మహానాయకుడు సుభాష్ చంద్రబోస్ అనుచరుడిగా, ఆయన స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీలో ఒక వీరుడిగా ప్రభాస్ ఈ సినిమాలో కనిపించనున్నారు. ముఖ్యంగా ఈ కథ మొత్తం హింస మరియు అహింస అనే రెండు భిన్నమైన సిద్ధాంతాల మధ్య నడుస్తుందని సమాచారం. స్వాతంత్ర్య పోరాటంలో ఈ రెండు మార్గాల మధ్య ఉన్న సైద్ధాంతిక సంఘర్షణను దర్శకుడు చాలా గ్రిప్పింగ్‌గా సిల్వర్ స్క్రీన్ మీద చూపించబోతున్నారు. ప్రభాస్ లాంటి భారీ కటౌట్‌కు ఇలాంటి చారిత్రక పీరియాడిక్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ పడితే స్క్రీన్ మీద విజువల్స్ వేరే లెవెల్‌లో పేలుతాయని, గూస్ బంప్స్ రావడం ఖాయమని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

కేవలం యాక్షన్, దేశభక్తి మాత్రమే కాకుండా హను రాఘవపూడి మార్క్ ఎమోషనల్ లవ్ స్టోరీ కూడా ఫౌజీలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సీతా రామం లాంటి సినిమాతో మ్యాజిక్ చేసిన హను, యాక్షన్‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో, ఈ సినిమాలో ప్రేమకథకు కూడా అంతే ఎమోషనల్ డెప్త్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వి ఇస్మాయిల్ (Imanvi Ismail) ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా, మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. యుద్ధం, రక్తపాతం, పోరాటాల నేపథ్యంలో సాగే ఒక స్వచ్ఛమైన ప్రేమకథను దర్శకుడు తనదైన శైలిలో కవిత్వంలా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇమాన్వి క్యారెక్టర్‌కు, ప్రభాస్ పాత్రకు మధ్య వచ్చే రొమాంటిక్ అండ్ ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్ మనసును బలంగా తాకుతాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఎంత భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నా కూడా, సినిమాను ఎండ్ వరకు నిలబెట్టేది ఆ ఎమోషనల్ డెప్త్ ఉన్న లవ్ స్టోరీనే అని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు. డిసెంబర్ 3 నుంచి కూడా ఫౌజీ వాయిదా పడిందని తెలుస్తుంది.. మరి కొత్త డేట్ ఎప్పుడో చూడాలిక.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360