Menu
BREAKING
కామ్రేడ్ కళ్యాణ్ ట్రైలర్ రివ్యూ.. వాళ్ల మనోభావాలు దెబ్బతింటే అంతే సంగతులు..!   |   Biggboss10 Telugu: రెచ్చిపోతున్న సుధీర్.. పడిపోతున్న గ్రాఫ్..   |   ఇదెక్కడి దిక్కుమాలిన ప్లానింగ్.. కనీసం ట్రైలర్స్ కట్ చేయడానికి టైమ్ దొరకట్లేదా..?   |   Biggboss10 Telugu: హాట్ హాట్‌గా నామినేషన్స్.. ఈవారం కూడా కామనర్స్ బలి..   |   లెజెండరీ నటి శారద పరిస్థితి చూస్తున్నారా.. 81 ఏళ్ళ వయసులో కూడా..!   |   Biggboss10 Telugu: నామినేషన్స్‌లో రెచ్చిపోయిన వర్షిణి, ముఖేష్..   |   Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ED సోదాలు.. అసలు నిజమేంటో తెలుసా..?   |   AK47: ఆదర్శ కుటుంబం మళ్లీ వాయిదా.. అసలు కారణం అదన్నమాట..!   |   Biggboss10 Telugu: రోహిత్ పని ఓవర్ అని సెలబ్రిటీలు అనుకుంటున్నారా?   |   Biggboss10 Telugu: నెరవేరిన సెలబ్రిటీల కోరిక.. బిగ్‌బాస్ నుంచి కామనర్ సృష్టి అవుట్   |   Anil Ravipudi: అనిల్ రావిపూడి యామినేషన్ సినిమా వెనక అంత పెద్ద కథ ఉందా..?   |   ఫ్లాప్ వాళ్లను ఆపలేదు.. రూట్ మార్చేలా చేసింది.. కుర్రాళ్ళూ జాగ్రత్త..!   |   లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఇక లేరు.. ది ట్రెండ్ సెట్టర్..!   |   Biggboss10 Telugu: రోహిత్‌కే ఫుల్ డోసు.. మిగిలిన వాళ్లంతా లైట్..   |   Biggboss10 Telugu: కామనర్స్‌కు పెద్ద దెబ్బ.. అంతా ముఖేషే చేశాడు..

Biggboss10 Telugu: మారిపోయిన సుధీర్.. త్రిగుణ్‌కు షాక్

Biggboss10 Telugu: మారిపోయిన సుధీర్.. త్రిగుణ్‌కు షాక్

బిగ్‌బాస్ తెలుగు ఫస్ట్ వీక్ తర్వాత మరింత రసవత్తరంగా మారింది. అంతా స్ట్రాటజీలు మార్చేసినట్టుగా ఇవాళ (సోమవారం) వచ్చిన ఫస్ట్ ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా సుధీర్. ఒక్కసారిగా చాలా మారిపోయాడు. కారణం సృష్టి కూడా కావొచ్చు. నిన్న మొన్నటి వరకూ త్రిగుణ్ మాటలకు తలూపిన వ్యక్తుల్లో సుధీర్ కూడా ఒకడు. ఉన్నట్టుండి సడెన్‌గా మారిపోయాడు. త్రిగుణ్‌కి రివర్స్ అయ్యాడు. ఇప్పటి వరకూ జరిగినవన్నీ రీకాల్ చేసుకున్నాడో ఏమో కానీ త్రిగుణ్ ఎప్పుడు ఏమన్నాడో ఎలా ఫ్లిప్ కొట్టాడో చెప్పి మరీ అతనికి షాక్ ఇచ్చాడు. ఈ వారం ప్రోమోను బట్టి చూస్తే త్రిగుణ్‌ను సుధీర్ నామినేట్ చేశాడు.

అసలు త్రిగుణ్‌ను నామినేట్ చేయడమే ఒక వింత అయితే ఎప్పుడు ఏమన్నాడో చెప్పి మరీ షాకిచ్చాడు. గత వారం హౌస్‌మేట్స్ కాకపోవడం వల్ల నామినేషన్స్ చేసే రైట్ హూస్‌మేట్స్‌కు ఇవ్వలేదని.. ఈవారం ఆ హక్కును పునరుద్ధరిస్తున్నట్టు బిగ్‌బాస్ చెప్పాడు. కొన్ని పోల్స్ పెట్టి.. వాటికి తాడు కట్టారు. నామినేట్ చేసే హక్కు పొందేందుకు వాటికి చుట్టి ఉన్న రోప్‌ను తీసేయాలి. అలా తాడును తీసి సుధీర్ తన నామినేషన్ స్టార్ట్ చేశాడు. అందరూ హౌస్‌లోపలికి వెళ్లిన తర్వాత కత్తితో పొడవమంటే త్రిగుణే చైత్ర పేరుపై పొడిచాడట. గేమ్ జరగకుండా చైత్ర పేరు తీసుకురావడం తనకు నచ్చలేదని సుధీర్ చెప్పాడు. ప్రతి ఒక్కరికీ క్లియర్ కట్ పాయింట్ చెప్పే తాను ఆ డ్యాగర్ గుద్దానని త్రిగుణ్ చెప్పాడు.

ఆ తరువాత దేబ్జాని నామినేషన్ సమయంలోనూ సుధీర్ అడ్డుపడి.. అమన్ విషయంలోనూ త్రిగుణ్ మాట మార్చాడని చెప్పాడు. సృష్టి తన దగ్గరకు వచ్చి అవి దాపెడదామని.. ఇవి దాపెడదామని ట్రై చేస్తోంది కానీ తాను పడట్లేదని అన్నాడని సైతం సుధీర్ బయటపెట్టి టోటల్‌గా త్రిగుణ్‌ని లాక్ చేశాడు. మొత్తానికి సుధీర్ అయితే తన ఆట తీరును మార్చుకున్నాడు. ఈ వారం మెజారిటీ నామినేషన్స్ రోహిత్‌కే పడినట్టుగా తెలుస్తోంది. నిన్న జరిగిన దానికి రోహిత్ పూర్తిగా డైలమాలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360