Menu
BREAKING
Bigg Boss10 Telugu: మాస్క్ తీసిన దేబ్జాని.. రోహిత్‌ని ఒంటరిని చేసేందుకు ప్రయత్నాలు..   |   Bigg Boss10 Telugu: హౌస్ నుంచి దక్షి, షాలిని ఎలిమినేట్.. పస లేని షో..   |   Bigg Boss10 Telugu: ఎలిమినేట్ అయిన శాలిని.. రోహిత్‌కు దెబ్బ మీద దెబ్బ   |   Bigg Boss 10 Telugu: రోహిత్‌కు బ్లాక్ కార్డ్.. మోకాళ్లపై కూర్చొని వేడుకున్న రోహిత్   |   ఫిట్‌నెస్, గాయాల నుంచి కోలుకోవడంపై డాక్టర్ వెంకటేష్ మోవ్వతో టైగర్ ష్రాఫ్ ఆసక్తికర చర్చ   |   Biggboss10 Telugu: సడెన్ ఎలిమినేషన్.. ఇవాళేనా? వెళ్లబోయేదెవరు?   |   RC17 సినిమాతో సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ విడిపోయినట్లే..!   |   నా బాడీ నా యిష్టం.. నా సైజ్‌ల గురించి మీకెందుకు.. ఆ హీరోయిన్ సీరియస్..!   |   Biggboss10 Telugu: హౌస్‌లోకి షాలిని ఎంట్రీ.. ఈ వారం ముప్పు ఆ ఇద్దరికే..   |   సో కాల్డ్ వారసులను అడిగే దమ్ముందా.. బ్యాగ్రౌండ్ లేని కుర్రాళ్లేనా టార్గెట్..?   |   కుర్రాడు సక్సెస్ అవుతాడా.. దొంగ నా కొడుకుతో మౌళి ఫ్యూచర్ ఏంటి..?   |   దసరాకు పట్టించుకోరా.. విజయదశమి కనీసం కళ్లకు కనిపించలేదా మన హీరోలకు..?   |   Biggboss10 Telugu: సుధీర్, ఝాన్సీలను ఒకాట ఆడుకున్న ఆర్కే.. బయటకొచ్చిన ఎలుకలు..   |   అన్నీ చెప్పిన రాజమౌళి ఆ ఒక్కటి తప్ప.. వారణాసి కథేంటో తెలుసా..?   |   దీపిక పదుకొనే, రణ్‌వీర్ సింగ్ రెండో కూతురు పేరు తెలుసా..?

‘వారణాసి’ షూట్‌కు స్వల్ప విరామం… కుటుంబంతో వెకేషన్‌కు మహేష్ బాబు..

‘వారణాసి’ షూట్‌కు స్వల్ప విరామం… కుటుంబంతో వెకేషన్‌కు మహేష్ బాబు..

దర్శకధీరుడు రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. గత కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న మహేష్ బాబు తాజాగా తన కుటుంబంతో కలిసి చిన్న విరామాన్ని ఎంజాయ్ చేయడానికి బయలుదేరారు.

మహేష్ బాబు తన భార్య నమ్రత శిరోద్కర్, పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో కనిపించారు. కుటుంబ సమేతంగా వెకేషన్‌కు వెళ్తున్న వారి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దీంతో మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్ నుంచి స్వల్ప విరామం తీసుకున్నట్లు స్పష్టమైంది. సమాచారం ప్రకారం, ఆయన జూలై 1, 2026 నాటికి తిరిగి షూటింగ్‌లో పాల్గొననున్నారని తెలుస్తోంది.

ఇక సినిమా విషయానికి వస్తే, ‘వారణాసి’లో మహేష్ బాబు పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారని టాక్. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు కనుల విందుగా నిలుస్తాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో ‘మందాకిని’ పాత్రలో నటిస్తుండగా, మహేష్ బాబు ‘రుద్ర’ మరియు ‘శ్రీరాముడు’ పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

సుమారు రూ.1300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కెఎల్ నారాయణ నిర్మిస్తుండగా, ఎస్‌ఎస్ కార్తికేయ నిర్మాణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభించింది.

ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, కథను విజయేంద్ర ప్రసాద్ రూపొందించారు. ప్రముఖ దర్శకుడు దేవా కట్టా సంభాషణలు అందిస్తున్నారు. అంతేకాకుండా, ఈ చిత్రాన్ని పూర్తిగా IMAX ఫార్మాట్‌లో చిత్రీకరిస్తుండగా, పలు భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360