Menu
BREAKING
Biggboss10 Telugu: కామనర్స్‌కు పెద్ద దెబ్బ.. అంతా ముఖేషే చేశాడు..   |   సాయి ధరమ్ తేజ్ కష్టాన్ని దోచేస్తున్నారా.. సంబరాల ఏటిగట్టు మళ్ళీ వాయిదా..?   |   చిరంజీవి టాక్ షో.. గెటప్ మార్చేస్తున్న బాస్.. ఎలా ఉండబోతుందో తెలుసా..?   |   రాజమౌళి కోసమే.. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాపై మహేష్, తారక్ రివ్యూ..!   |   భయపెడుతున్న వారణాసి బిజినెస్.. రిలీజ్‌కు ముందే 1000 కోట్లు ఏంటి స్వామి..?   |   ఆ అగ్ర నిర్మాత చేతికి జైలర్ 2 రైట్స్.. మధ్యలో మైత్రి మూవీ మేకర్స్ సడన్‌ ఎంట్రీ..!   |   Biggboss10 Telugu: ఎవరూ తగ్గట్లే.. ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్లదే…   |   Biggboss10 Telugu: ఝాన్సీ గ్రాఫ్ పడగొట్టుకుంటోందా? ఇలా అయితే కష్టమే..   |   బాలయ్య కోసం రేసులో ఇద్దరు దర్శకులు.. కొరటాల సినిమా ఆగిపోయిందా..?   |   Biggbogss10 Telugu: ఫైర్ లేని నామినేషన్స్.. ఇదే తొలిసారి..   |   Biggboss10 Telugu: వామ్మో ఈ గొడవలేంటి? ఒకటా.. రెండా.. ప్రతిదీ రచ్చే..   |   ఇదెక్కడి దిక్కు మాలిన కథ.. ఇదెక్కడి సినిమా.. కీర్తి సురేష్‌కు ఏమైంది..?   |   అప్పుడు నవనీతమ్మా.. ఇప్పుడు నారాయణమ్మ.. మళ్లీ దొరికిపోయావా తమన్..!   |   అంతా ఫేక్.. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు.. అంతా కనికట్టు..!   |   Biggboss10 Telugu: రోహిత్‌కు క్లాసే కాదు.. హ్యాపీ న్యూస్ అందించిన నాగ్..

Biggboss 10 Rohith: రోహిత్‌కు కప్ చేతిలో పెట్టడమే వాళ్ల లక్ష్యమా?

Biggboss 10 Rohith: రోహిత్‌కు కప్ చేతిలో పెట్టడమే వాళ్ల లక్ష్యమా?

ఇవాళ (బుధరాం) బిగ్‌బాస్ హౌస్‌ (Bigg Boss 10 Telugu)లో మహా పరీక్షలో భాగంగా తమ బాస్‌ను కాపాడుకునేందుకు బాగా యత్నించినా కూడా వారి ఫౌల్ గేమ్ కారణంగా బిగ్‌బాస్ వారిని శిక్షించాలని భావించాడు. ఈ క్రమంలోనే రెండు టీమ్‌ల నుంచి ఒక్కొక్కరిని హై రిస్క్‌లో పెట్టాలని తెలిపాడు. రామ్ ప్రసాద్ కెమెరా దగ్గరకు వెళ్లి తనను తాను హైరిస్క్ జోన్‌లో పెట్టుకోవాలని భావిస్తున్నట్టు తెలిపాడు. ఆ తరువాత తమ టీం దగ్గరకు వెళ్లి కూడా తాను హై రిస్క్‌లోకి వెళుతున్నట్టు తెలిపాడు. ఇక రెడ్ టీం నుంచి కొద్దిసేపు చర్చ జరిగిన తర్వాత చరణ్‌ను హై రిస్క్ జోన్‌లో పెట్టారు. దీంతో రోహిత్ (Rohith) కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరోవైపు షాలిని(Shalini) కూడా కన్నీళ్లు పెట్టుకుంది. తనను తీసినందుకు కూడా బాధ అనిపించలేదని.. నిన్ను తీసేసినందుకు బాధగా ఉందని చరణ్ కూడా బాధపడ్డాడు. తరవాత బిగ్‌బాస్‌కు బ్లూ టీం నుంచి రామ్ ప్రసాద్.. రెడ్ టీం నుంచి చరణ్‌ను హై రిస్క్ జోన్‌లో పెడుతున్నట్టు తెలిపారు.

ఆ తరువాత హై రిస్క్ జోన్ బ్యాడ్జ్ తీసుకునేందుకు నువ్వెందుకు ఒప్పుకున్నావని దేబ్జాని పంచాయతి పెట్టింది. ఆ తరువాత ముఖేష్‌కు దేబ్జానీ ఆయన కళ్లు బాగున్నాయని చెప్పి ఛార్మింగ్ ఇచ్చింది. అది వాస్తవానికి ఆమె టాస్క్. దానిని ఫినిష్ చేసింది. హై రిస్క్ జోన్‌లో ఉన్నవారు ఏ టీమ్‌లోనూ ఉండేందుకు అర్హులు కారని బిగ్‌బాస్ చెప్పారు. దీంతో రామ్ ప్రసాద్‌(Ram Prasad)కు కెప్టెన్ హోదా పోయింది. కెప్టెన్‌ని ఎంచుకోమని బ్లూ టీంకు చెప్పడంతో రామ్ ప్రసాద్.. దేబ్జాని (Debjani)ని టీం లీడర్‌గా ప్రటించాడు. ఆ తరువాత రోహిత్‌తో త్రిగుణ్(Trigun) కాన్వర్సేషన్ ప్రారంభించాడు. అగ్నిపరీక్ష నుంచి వచ్చిన వారంతా ప్రతి దానికీ రోహిత్ అంటున్నారని.. అతడిని డౌన్ చేయడానికి చూస్తున్నారని త్రిగుణ్ చెప్పడం విశేషం. త్రిగుణ్ ఎక్కడ చూసినా రోహిత్ గురించి మాట్లాడుతూ డౌన్ అవుతున్నాడు. అది చాలదన్నట్టుగా రోహిత్ దగ్గరకే వెళ్లి నిన్ను డౌన్ చేసేందుకు యత్నిస్తున్నారని చెప్పడం ఆసక్తికరం.

రోహిత్‌తో సుధీర్ గిన్నెలు తోమడం గురించి చర్చ మొదలు పెట్టాడు. వచ్చి గిన్నెలు ఉన్నాయో.. లేదో చూసుకోమని చెప్పాడు. త్రిగుణ్ దగ్గరకు వెళ్లి గిన్నెలు ఏమైనా ఉంటే తనకు చెప్పమన్నాడు. కానీ త్రిగుణ్.. రోహిత్‌ను అక్కడే ఉండి ప్రతి అరగంటకోసారి చూసుకోమన్నాడు. ఇక్కడ రోహిత్ కొంచెం ఓవర్ చేశాడు. పొద్దస్తమానం తనకు గిన్నెలు తోముతూ ఉండటం వలన తన చేతులు హార్డ్ అయిపోతున్నాయని చెప్పాడు. గిన్నెలు ఉన్నప్పుడు పిలవమంటే మీరేమనుకుంటాడో అని సుధీర్ చెబుతున్నాడు. ఏమనుకుంటాడో అని కడిగే బదులు అది రోహిత్ డ్యూటీయే కాబట్టి పిలిస్తే సరిపోతుంది. దీనికోసం పెద్ద చర్చ. ఈ సమయంలో త్రిగుణ్ చేతులు కట్టుకుని చెప్పండి.. చెప్పండి అంటూ ఓవర్ చేశాడు. అప్పుడు కుక్కర్ ఉందని కడిగేసి ఇవ్వమని త్రిగుణ్ చెప్పాడు. ఆ తరువాత బిగ్‌బాస్ వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలని సూచించాడు. అదంతా ఒక టీం సభ్యులు చూసుకోవాలని.. మరో టీం ఆ పనులను మానిటర్ చేయాలని చెప్పాడు.

రోహిత్ వచ్చి కంపారిజన్ ఏమీ చేయట్లేదని.. కాన్‌స్టెంట్‌గా తమ టీం నుంచి చాపింగ్‌లో ముగ్గురు చేస్తున్నారని తెలిపాడు. అయితే కంపారిజన్ అనడం తప్పుగా మారింది. దీంతో దేబ్జాని టీం అంతా గొడవకు దిగింది. వంశీ కల్పించుకుని రోహిత్ చెప్పేది పూర్తిగా విని మాట్లాడమని చెప్పాడు. దేబ్జాని అంతకు ముందు కంపారిజన్ చేసిందని చెప్పాడు. తను డిష్ వాషింగ్ చేశానని గట్టిగా వాదించాడు. అక్కడ రోహిత్ గట్టిగానే వాదించాడు. త్రిగుణ్ చాలా యాటిట్యూడ్ చూపించాడు. కృష్ణుడు(Krishnudu) కూడా ఎంటరై మాట అనేసి వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే త్రిగుణ్ వర్సెస్ రోహిత్ పెద్ద గొడవ జరిగింది. సుధీర్‌తో వాదన జరుగుతున్నప్పుడు త్రిగుణ్ వెళ్లి మీదమీదకు వెళ్లాడు. వర్షిణి క్లియర్‌గా చెప్పడంతో రోహిత్ సారీ చెప్పి తన మాటలకు క్లారిటీ ఇచ్చి ఓ మెట్టు ఎక్కాడు. ఆ తరువాత రోహిత్ జీరో అనడం తప్పుబట్టారని.. కానీ దేబ్జాని కూడా పొటెన్షియల్ అనే మాట వాడటం తప్పని షాలిని చెప్పింది. వర్క్ డిస్ట్రిబ్యూషన్‌లో భాగంగా రోహిత్ టీం నుంచి కుకింగ్ వంశీ, హెల్పింగ్ ఝాన్సీ.. వాష్‌రూం షాలినికి ఇచ్చారు. అమన్‌కు తన బట్టలు ఉతకాలని చెప్పింది. హౌస్ క్లీనింగ్ సృష్టికి, రోహిత్‌కు డిష్ వాషింగ్ ఇచ్చారు. వర్షిణి బిగ్‌బాస్ తనకు ఇచ్చిన పవర్‌ను ఉపయోగించుకుని తన పనిని వర్షిణికి ఇచ్చింది. అయితే హౌస్‌లో ఉన్నంతకాలం వారు ఆ పనే చేయాల్సి ఉంటుంది. అంటే వర్షిణి హౌస్‌లో ఉన్నంత కాలం వాష్ రూమ్ క్లీనింగ్ ఆమే చేయాల్సి ఉంటుంది. తనకు అదొక థెరపి అని.. ఆనందంగా చేస్తానని వర్షిణి చెప్పింది.

గిన్నెలు కడిగేందుకు రావాలంటూ రోహిత్‌కి త్రిగుణ్ చెప్పాడు. 30 సెకండ్స్ అని రోహిత్ చెప్పడంతో త్రిగుణ్ 30 కౌంట్ చేయడం చాలా ఓవర్‌గా అనిపించింది. ఆ తరువాత త్రిగుణ్ తన టీంతో మీటింగ్ పెట్టి న్యాయంగా మానిటర్ చేద్దామని చెప్పాడు. రోహిత్‌ను తను చూసుకుంటానన్నాడు. రోహిత్ తనను గెలుకుతాడని.. తాను కూడా వాడిని గెలుకుతానంటూ మాట్లాడాడు. రోహిత్ ఒక ప్రొఫెసర్ అని తనకు తాను అనుకుంటున్నాడని వర్షిణి చెప్పింది. వీరందరినీ యూజ్ చేసి వాళ్లను తొక్కుకుంటూ వెళతాడని.. వాళ్లు దద్దీలని త్రిగుణ్ అన్నాడు. ఆ తరువాత త్రిగుణ్ వెళ్లి రోహిత్‌తో తానొక స్టాండర్డ్ సెట్ చేశానని చెప్పాడు. రోహిత్ మాట్లాడబోతే అతడిని మాట్లాడనివ్వలేదు. అక్కడ త్రిగుణ్ బిహేవియర్ చాలా వరస్ట్ అని చెప్పాలి. రోహిత్ కూడా బాగానే సమాధానం ఇచ్చాడు. మీరు స్క్రాప్ మాట్లాడతావంటూనే చాలా సిల్లీగా త్రిగుణ్ బిహేవ్ చేశాడు. ‘మిమ్మల్ని పెట్టి స్క్రిప్ట్ రాసేంత బొమ్మ మీకు లేదు’ అంటూ వరస్ట్‌గా మాట్లాడాడు. మాటలు తగ్గించి పని చేయవయ్యా.. అని రూడ్‌గా చెప్పి త్రిగుణ్ వెళ్లిపోయాడు.

ఇవాళ కూడా షో మొత్తం రోహిత్ చుట్టూనే నడిచింది. ఒకవైపు రోహిత్.. రోహిత్‌ను లేపేందుకు త్రిగుణ్ ఉన్నట్టుగా అనిపిస్తోంది. త్రిగుణ్, వర్షిణి, కృష్ణుడు, దేబ్జానిల మాట తీరు.. రోహిత్‌కి చాలా ప్లస్ అవుతోంది. అతని పట్ల సింపతి వర్కవుట్ అయ్యేలా చేస్తోంది. కప్ అతనికే ఇప్పించడమే లక్ష్యమన్నట్టుగా వీరి ప్రవర్తన ఉంది.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360