
తొలిరోజు వరకూ కాదు.. బిగ్‌బాస్ 10 తెలుగు (Bigg Boss 10 Telugu) ప్రారంభమై షో ముగిసిన కొన్ని గంటలకే త్రిగుణ్ (Thrigun) హైలైట్ అవడం ప్రారంభమైంది. కొన్నిసార్లు ప్లస్ అవుతుంటే.. మరికొన్ని సార్లు మైనస్ అవుతున్నాడు. మరి అతనికి కొన్నిసార్లు చూపిస్తున్న రూడ్‌నెస్ ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా? చూద్దాం. వాస్తవానికి హౌస్‌లో కొన్ని గంటల్లోనే హైలైట్ అవుతున్నవారు కొందరే ఉన్నారు. వారిలో త్రిగుణ్ ముందుండగా.. రామ్ ప్రసాద్(Ram Prasad), ముఖేష్, రోహిత్ (Rohit) ముఖ్యంగా హైలైట్ అయ్యారు. వీరిలో ముఖ్యంగా రామ్ ప్రసాద్ బిగ్‌బాస్‌ను చాలా బాగా అనలైజ్ చేయగలుగుతున్నట్టుగా అనిపిస్తోంది. అలాగే మాట్లాడే విధానం కూడా చాలా బాగుంది. ముఖేష్ చాలా ఇన్నోసెంట్‌గా కనిపిస్తున్నాడు.
అర్ధరాత్రి బిగ్‌బాస్.. కంటెస్టెంట్స్‌తో మీరు మహా పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుందని.. ఈవారం పూర్తయ్యే లోపు కొందరు వెళ్లిపోవాల్సి వస్తుందని చెప్పాడు. అలాగే హౌస్‌లో ఉన్నవారిలో 8 మందికి పవర్ కీస్ వచ్చాయని.. మరో ఇద్దరిలో ఎవరికి పవర్ కీస్ ఇవ్వవచ్చో డిసైడ్ చేసి చెప్పమన్నాడు. అలా డిసైడ్ చేసి చెప్పే అవకాశాన్ని సైతం ఆ 8 మందికి ఇచ్చాడు. అప్పుడు మొదలైంది.. త్రిగుణ్ ఓవరాక్షన్. వాస్తవానికి త్రిగుణ్ విషయానికి వస్తే ప్రతి విషయంలోనూ ముందుగా చొరవ తీసుకుంటున్నప్పటికీ కొన్నిసార్లు బూమరాంగ్ అవుతోందని అనిపిస్తోంది. ముందుగా ఈ చొరవ తీసుకోవడం కూడా కంటెస్టెంట్స్‌కి నచ్చడం లేదు. అలాగే అతనికి ఎదుటి వ్యక్తి మాటను వినే పరిస్థితి లేదని అర్ధరాత్రి జరిగిన దాన్ని బట్టి అర్థమవుతోంది. చాలా డామినేటింగ్‌గా ఉన్నాడు.

ముఖ్యంగా ముఖేష్(Mukesh)ని అయితే మాట్లాడనివ్వలేదు. కీస్‌లో ఒకటి కృష్ణుడి(Krishnudu)కి ఇవ్వాలని అందరూ మంచి పాయింట్స్ పెడుతున్నా కూడా త్రిగుణ్ వినే పరిస్థితి లేదు. ఫైనల్‌గా వంశీ, కృష్ణుడికే ఇచ్చారు. అయితే త్రిగుణ్ ఎవ్వరినీ మాట్లాడనివ్వకపోవడంపై అతనికి నెగిటివిటీ పెరిగే అవకాశం ఉంది. ముందుగా హౌస్‌లో మూకుమ్మడిగా త్రిగుణ్‌కు నామినేషన్స్ పడే అవకాశం ఉంది. అందరూ త్రిగుణ్‌కు యాంటీ అవుతున్నారు. అయితే త్రిగుణ్ మాత్రం చాలా వారాలు కొనసాగే అవకాశం ఉంది. ప్రతి దానిలోనూ చొరవ తీసుకోవడం పాజిటివ్ అవుతుంది. అయితే మరికొన్ని వారాలు గడిస్తే కానీ త్రిగుణ్ పరిస్థితి ఎలా ఉంటుందనేది చెప్పలేం.
