Menu
BREAKING
అర్థం పర్థం లేని సినిమాలు.. ఆరిపోతున్న నిర్మాతలు.. ప్రేక్షకులకు తలనొప్పులు..!   |   రాధ Vs అంబిక.. అక్కాచెల్లెళ్ల గొడవలో అసలు తప్పు ఎవరిది..? ఎవరు ఎవర్ని మోసం చేసారు..?   |   ఓరి దేవుడో.. వాళ్ళ సినిమాలు వాళ్లు చూడ్డానికి హీరోలకు ఇన్ని ఇబ్బందులా..?   |   నేషనల్ వైడ్ గా సత్తా చాటిన కమిటీ కుర్రోళ్ళు.. అవార్డ్స్ తీసుకున్న నిహారిక అండ్ టీం..   |   ‘ఆదర్శ కుటుంబం’ వాయిదా వెనక ‘ప్యారడైజ్’ హస్తం.. నాని కోసం త్యాగమా..?   |   Biggboss 10 Telugu: వర్షిణి కోసం దేబ్జానిని బలి చేసిన ముఖేష్..   |   Biggboss 10 Telugu: అతి చేస్తున్న శ్రష్టి.. మొత్తం కంటెంట్ కోసమేనా?   |   నానిని తొక్కేయాలని చూస్తున్నారా.. అతడి చుట్టూ కుట్ర జరుగుతుందా..?   |   ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌కు మోహన్ బాబు దూరం.. అదేనా అసలు కారణం..!   |   అయ్యో ఏంది కాకా ఇది.. నువ్వు వినవు.. ఆయన ఆగడు.. సరిపోయారు ఇద్దరూ..!   |   ది ప్యారడైజ్ సినిమా సెన్సార్ రివ్యూ.. 21 కట్స్.. చాలా పెద్ద రిస్క్.. అవే మైనస్..!   |   Biggboss 10 Telugu: రచ్చ లేపిన నామినేషన్స్.. శివాలెత్తిన సృష్టి   |   Biggboss 10 Telugu: కృష్ణుడు ఎలిమినేట్.. బెస్ట్ ప్లేయర్ ముఖేష్..   |   Biggboss 10 Telugu: ఓవర్‌గా క్లాసుల్లేవ్.. చురకలే..   |   Biggboss10 Telugu: బిగ్‌బాస్ హౌస్ నుంచి ఆ కంటెస్టెంట్ అవుట్…

ఓటీటీలోకి విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్లు’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీలోకి విజయ్ ఆంటోనీ 'వంద దేవుళ్లు'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘వంద దేవుళ్లు’ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. విజయ్ ఆంటోనీ పుట్టినరోజు సందర్భంగా తెలుగు ZEE5 ఈ చిత్రం డిజిటల్ రిలీజ్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా ఈ ఆగస్టులో తెలుగు ZEE5లో స్ట్రీమింగ్ కానుండగా, ఖచ్చితమైన విడుదల తేదీని త్వరలో వెల్లడించనున్నట్లు ప్లాట్‌ఫామ్ తెలిపింది.

నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘వంద దేవుళ్లు’ థియేటర్లలో మంచి స్పందనను అందుకుంది. హృదయాన్ని హత్తుకునే కథ, బలమైన భావోద్వేగాలు, కుటుంబ బంధాలను అద్భుతంగా చూపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ సినిమాలో తన కుటుంబం కోసం జీవితాన్ని అంకితం చేసిన ఓ వితంతువు తల్లి కథను చూపించారు. నలభై ఏళ్ల వయసు దాటిన తర్వాత ఆమె మరోసారి పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంటుంది. అయితే సమాజం, బంధువులు, గ్రామస్థుల నుంచి ఆమెకు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. అలాంటి సమయంలో తన తల్లి ఆనందమే ముఖ్యమని భావించి ఆమె నిర్ణయానికి అండగా నిలిచే కుమారుడి పాత్ర సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుంది.

ఓటీటీలోకి విజయ్ ఆంటోనీ 'వంద దేవుళ్లు'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

మాతృత్వం, త్యాగం, కుటుంబ బంధాలు, మహిళల వ్యక్తిగత జీవితంపై సమాజం విధించే పరిమితులు వంటి అంశాలను హృద్యంగా ఆవిష్కరించిన ఈ చిత్రం థియేటర్లలో పాజిటివ్ టాక్‌తో మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు అదే భావోద్వేగ అనుభూతిని ఓటీటీ ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమవుతోంది.

ఇటీవల ‘పరిమళ & కో’తో కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకున్న తెలుగు ZEE5, ఇప్పుడు ‘వంద దేవుళ్లు’తో మరో హృదయాన్ని తాకే కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఈ చిత్రం ఆగస్టులో తెలుగు ZEE5లో స్ట్రీమింగ్ కానుంది. విడుదల తేదీపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Pranav

Writer and contributor at Telugu Cinema 360