Menu
BREAKING
అప్పుడు నవనీతమ్మా.. ఇప్పుడు నారాయణమ్మ.. మళ్లీ దొరికిపోయావా తమన్..!   |   అంతా ఫేక్.. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు.. అంతా కనికట్టు..!   |   Biggboss10 Telugu: రోహిత్‌కు క్లాసే కాదు.. హ్యాపీ న్యూస్ అందించిన నాగ్..   |   సిగ్మాతో ఏం చేయబోతున్నారు.. సందీప్ కిషన్ జాతకం ఇప్పటికైనా మారుతుందా..?   |   Rajamouli: రాజమౌళి 25 ఏళ్ల ప్రస్థానం.. ఇంతింతై వటుడింతై..!   |   నన్ను తొక్కేయట్లేదు కదా.. వాళ్లకు సైలెంట్‌గా రాడ్ దించేసిన చిరంజీవి..!   |   ‘ది ప్యారడైజ్’ చుట్టూ రాజకీయం.. తెలియకుండానే నాని ఇరుక్కుపోయాడా..?   |   Biggboss10 Telugu: మళ్లీ హౌస్‌లో రాజుకున్న మంటలు.. రోహిత్ వర్సెస్ త్రిగుణ్   |   Biggboss10 Review: అందరికీ నాగ్ క్లాస్.. ఇలా వచ్చి అలా రూ.15 లక్షలతో మిథిలేష్ జంప్..   |   అయ్యా మోహన్ బాబు గారు.. మీ రేంజ్ ఏంటి.. ఈ క్యారెక్టర్స్ ఏంటి సర్..?   |   ఆ ప్యాన్ ఇండియన్ దర్శకుడిపై ప్రెజర్.. అంతా వారసుడి మహిమ..!   |   Biggboss10 Telugu: రోహిత్‌ వర్సెస్ అపూర్వ.. ఎంజాయ్ చేసిన ఇతర హౌస్‌మేట్స్..   |   Biggboss10 Telugu: వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో మళ్లీ టార్గెట్ రోహిత్..   |   ఇప్పుడేం చేస్తాడు మన చిరంజీవి..? శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేస్తాడా..?   |   నానిని ఏ‘మారుస్తున్నదెవరు..?’.. ఎందుకింత మాస్ పిచ్చి.. నీ రూట్స్ మరిచావా నాని..?

Ram Prasad: Bigg Boss 10 హౌస్‌లొ ఎవరి రెమ్యూనరేషన్ ఎంత? రామ్‌ప్రసాద్‌కు ఎంతో తెలిస్తే…

RamPrasad: Bigg Boss 10 హౌస్‌లొ ఎవరి రెమ్యూనరేషన్ ఎంత? రామ్‌ప్రసాద్‌కు ఎంతో తెలిస్తే...

16 మంది కంటెస్టెంట్లతో బిగ్‌బాస్ 10 (Bigg Boss 10 Telugu) ప్రారంభమైంది. ఆదివారం కంటెస్టెంట్స్ అంతా హౌస్‌లోకి అడుగు పెట్టారు. అయితే బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు వీక్లీ పేమెంట్ ఉంటుంది. ఈ క్రమంలోనే వీరందరికీ కాస్త ముందుగానే కాస్ట్యూమ్స్ కోసం పేమెంట్ చేసేస్తారు. అలా ఎవరెవరికి ఎంత పేమెంట్ అనేది తెలుసుకుందాం. వాస్తవానికి బిగ్‌బాస్‌కి వెళ్లే కంటెస్టెంట్స్ లిస్ట్ అంతా ముందుగానే బయటకు వచ్చింది. అది చూసిన వారికి అసలు ఆటో రామ్‌ప్రసాద్ కెరీర్ అద్భుతంగా ఉంది కదా.. అతనెందుకు బిగ్‌బాస్‌కి అనే సందేహం రావొచ్చు. అతనెందుకనేది.. రెమ్యూనరేషన్ చూస్తే కానీ తెలియదు. షాకింగ్, హయ్యస్ట్ రెమ్యూనరేషన్ అతనికే. అతని దరిదాపుల్లో కూడా రెమ్యూనరేషన్ విషయంలో ఎవరూ లేరు.

ఆటో రామ్ ప్రసాద్ (Auto Ram Prasad) కోసం బిగ్‌బాస్ టీం కొన్ని సీజన్లుగా ట్రై చేస్తోందట కానీ అతను నో చెబుతున్నాడు. ఇక ఈ సీజన్‌కి ఓకే చెప్పాడు. రామ్ ప్రసాద్ రెమ్యూనరేషన్ వచ్చేసి వారానికి రూ.12.5 లక్షలు అని తెలుస్తోంది. అంటే నెలకు రూ.50 లక్షలు బిగ్‌బాస్ టీం చెల్లించనుందన్న మాట. ఇక సెకండ్ హయ్యస్ట్ యాంకర్ వర్షిణి (Anchor Varshini)కి ఇస్తున్నారు. ఆమెకు వారానికి రూ.3.75 లక్షలని టాక్. ఆమె తరువాతి స్థానంలో నటుడు ముఖేష్ గౌడ ఉన్నారు. ఆయనకు రూ.3 లక్షలు అని తెలుస్తోంది. ముఖేష్‌(Mukesh)కు సోషల్ మీడియా ఫాలోవర్స్ చాలా ఎక్కువ. ఇక ఆ తరువాతి స్థానంలో ముగ్గురు ఉన్నారు. ముగ్గురు కంటెస్టెంట్స్ సేమ్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని టాక్. వాళ్లెవరంటే.. నటుడు త్రిగుణ్ (Thrigun), బుల్లితెర నటులు చైత్రా రాయ్ (Chaitra Rai), దేబ్జానీ (Debjani). త్రిగుణ్ ‘చెన్నై లవ్‌స్టోరీ చిత్రంలో బాగా ఫేమస్ అయ్యాడు. మిగిలిన ఇద్దరూ సీరియల్ హీరోయిన్స్. ఇద్దరికీ బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాబట్టి ఈ ముగ్గురికీ బిగ్‌బాస్ టీం రూ.2.75 లక్షలు చెల్లిస్తున్నట్టు టాక్.

Auto Ram Prasad in Bigg Boss 10 Telugu House

ఇక ఆ తరువాతి స్థానంలో జబర్దస్త్ నరేష్ ఉన్నాడు. అతనికి రూ.2.5 లక్షలు చెల్లిస్తున్నారని టాక్. వాస్తవానికి నరేష్ (Jabardasth Naresh) కూడా చాలా ఫేమస్. అందుకే ఆయనకు కూడా వారానికి పెద్ద మొత్తమే అందనుందని తెలుస్తోంది. నరేష్ తర్వాత ఇద్దరికి సేమ్ రెమ్యూనరేషన్ అట. టెంపర్ వంశీ (Temper Vamsi), కృష్ణుడు (Krishnudu). ఇద్దరూ ఫేమసే కానీ ప్రస్తుతం కాదు. దీంతో వీరికి రెమ్యూనరేషన్ తగ్గింది. ఇక సెలబ్రిటీల్లో చివరిగా సుధీర్ రెడ్డికి వారానికి రూ.1.25 లక్షలు చెల్లించనున్నారని టాక్. ఇక కామనర్స్ విషయానికి వస్తే.. గత సీజన్‌లో కామనర్స్‌కి వారానికి రూ.70 వేలు ఇచ్చారు. అయితే గత సీజన్‌లో వీరికి అగ్నిపరీక్షకు హాజరైన ఫైనల్ 15 మందికి ఒక్కొక్కరికీ రూ.50 వేల చొప్పున ఇచ్చినట్టు టాక్. గత సీజన్‌లో ఇది జరగలేదు. ఇక ఇప్పుడు హౌస్‌లోకి ఎంటరైన కామనర్స్‌కి ఎంత ఇస్తున్నారో తెలుసుకుందాం. ఈ సీజన్‌లో కూడా గత సీజన్ మాదిరిగానే కామనర్స్‌కు వారానికి ఒక్కొక్కరికి రూ.70 ఇస్తున్నట్టు టాక్.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360