Menu
BREAKING
విశ్వంభరను మరిచిపోదామా.. బాస్ సినిమా బాక్సుల్లోంచి బయటికి రానట్లేనా..?   |   కామ్రేడ్ కళ్యాణ్ ట్రైలర్ రివ్యూ.. వాళ్ల మనోభావాలు దెబ్బతింటే అంతే సంగతులు..!   |   Biggboss10 Telugu: రెచ్చిపోతున్న సుధీర్.. పడిపోతున్న గ్రాఫ్..   |   ఇదెక్కడి దిక్కుమాలిన ప్లానింగ్.. కనీసం ట్రైలర్స్ కట్ చేయడానికి టైమ్ దొరకట్లేదా..?   |   Biggboss10 Telugu: హాట్ హాట్‌గా నామినేషన్స్.. ఈవారం కూడా కామనర్స్ బలి..   |   లెజెండరీ నటి శారద పరిస్థితి చూస్తున్నారా.. 81 ఏళ్ళ వయసులో కూడా..!   |   Biggboss10 Telugu: నామినేషన్స్‌లో రెచ్చిపోయిన వర్షిణి, ముఖేష్..   |   Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ED సోదాలు.. అసలు నిజమేంటో తెలుసా..?   |   AK47: ఆదర్శ కుటుంబం మళ్లీ వాయిదా.. అసలు కారణం అదన్నమాట..!   |   Biggboss10 Telugu: రోహిత్ పని ఓవర్ అని సెలబ్రిటీలు అనుకుంటున్నారా?   |   Biggboss10 Telugu: నెరవేరిన సెలబ్రిటీల కోరిక.. బిగ్‌బాస్ నుంచి కామనర్ సృష్టి అవుట్   |   Anil Ravipudi: అనిల్ రావిపూడి యామినేషన్ సినిమా వెనక అంత పెద్ద కథ ఉందా..?   |   ఫ్లాప్ వాళ్లను ఆపలేదు.. రూట్ మార్చేలా చేసింది.. కుర్రాళ్ళూ జాగ్రత్త..!   |   లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఇక లేరు.. ది ట్రెండ్ సెట్టర్..!   |   Biggboss10 Telugu: రోహిత్‌కే ఫుల్ డోసు.. మిగిలిన వాళ్లంతా లైట్..

ఆగస్టు 7న థియేటర్లలోకి ‘కొరియన్ కనకరాజు’.. వరుణ్ తేజ్ పవర్‌ఫుల్ లుక్

ఆగస్టు 7న థియేటర్లలోకి ‘కొరియన్ కనకరాజు’.. వరుణ్ తేజ్ పవర్‌ఫుల్ లుక్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న హారర్-కామెడీ ఎంటర్‌టైనర్ ‘కొరియన్ కనకరాజు’ విడుదలకు ముహూర్తం ఖరారైంది. దర్శకుడు మేర్లపాక గాంధీ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు చివరి దశలో కొనసాగుతున్నాయి.

ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ సినిమాపై మంచి హైప్‌ను తీసుకొచ్చింది. హారర్, కామెడీ, కొరియన్ కల్చర్ అంశాలను వినోదాత్మకంగా మేళవించిన కాన్సెప్ట్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, తొలి పాట ‘కంసంనిదా’ కూడా మంచి స్పందనను అందుకుంది.

తాజాగా చిత్రబృందం సినిమాను ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోస్టర్‌లో వరుణ్ తేజ్ ఒక చేతిలో రక్తంతో తడిసిన కత్తి, మరో చేతిలో గ్రెనేడ్ పట్టుకుని అత్యంత స్టైలిష్‌గా కుర్చీలో కూర్చుని కనిపించారు. చుట్టూ కొరియన్ గ్యాంగ్‌స్టర్లు నిలబడి ఉన్నప్పటికీ, ఆయనలో కనిపించిన ధైర్యం, కాన్ఫిడెన్స్ పోస్టర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నియాన్ లైటింగ్‌తో రూపొందించిన విజువల్స్ సినిమా యాక్షన్, కామెడీ, థ్రిల్‌ల కలయికగా ఉండబోతుందనే సంకేతాలను ఇస్తున్నాయి.

రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కమెడియన్ సత్య కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, మనోజ్ రెడ్డి కటసాని సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు.

వినూత్నమైన కథ, భిన్నమైన టైటిల్, స్టైలిష్ ప్రెజెంటేషన్‌తో ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుకున్న ‘కొరియన్ కనకరాజు’ ఆగస్టు 7న ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి. విడుదల తేదీ ప్రకటించడంతో పాటు చిత్రబృందం త్వరలోనే ట్రైలర్, మరిన్ని ప్రమోషనల్ అప్‌డేట్స్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360