Menu
BREAKING
‘ఆదర్శ కుటుంబం’లో చిట్టిబాబుగా విక్టరీ వెంకటేష్..   |   దుల్కర్ సల్మాన్ ‘శ్రీ శ్రీ’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘బొమ్మ బొమ్మ’ రిలీజ్ డేట్ ఫిక్స్..   |   Lenin Collections: ₹60 కోట్లు దాటిన అఖిల్ ‘లెనిన్’.. వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ ఇవే   |   Chennai Love Story Day 1 Collections: కిరణ్ అబ్బవరం సినిమాకు మంచి ఓపెనింగ్   |   ఓటీటీలోకి విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్లు’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?   |   ‘అబ్జెక్షన్ మై లార్డ్’ ట్రైలర్: కోర్ట్‌రూమ్ సస్పెన్స్‌తో ఆసక్తి రేపిన శ్రీకాంత్ సిరీస్.. చిరంజీవి ప్రశంసలు హైలైట్   |   ఆగస్టు 7న థియేటర్లలోకి ‘కొరియన్ కనకరాజు’.. వరుణ్ తేజ్ పవర్‌ఫుల్ లుక్   |   #ChiruBobby2: వర్షంలో 12 గంటలు నిరవధికంగా షూటింగ్..   |   దర్శకుడిని పెళ్లి చేసుకున్న నటి కలర్స్ స్వాతి   |   ‘దాదా – ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ ఫస్ట్ లుక్ విడుదల…   |   ‘ఓ.! సుకుమారి’ సెన్సార్ పూర్తి.. జూలై 17న పాన్ ఇండియా రిలీజ్   |   ఫుడ్ డెలివరీ బాయ్‌తో హీరో అఖిల్ రాజ్ గొడవ.. వీడియో వైరల్, నెటిజన్ల ఆగ్రహం   |   తలైవర్ 173 టైటిల్ రివీల్… ‘ధర్మన్ – ది డెడ్లీ డాక్టర్’గా రజనీకాంత్ సరికొత్త అవతారం   |   ‘ఓజి 2’ నిర్మాణంపై కొత్త బజ్..   |   రవితేజ ‘ఇరుముడి’లో అసలు హైలెట్ ఆ ట్విస్టేనా?

దర్శకుడిని పెళ్లి చేసుకున్న నటి కలర్స్ స్వాతి

దర్శకుడిని పెళ్లి చేసుకున్న నటి కలర్స్ స్వాతి

ప్రముఖ నటి కలర్స్ స్వాతి (స్వాతి రెడ్డి) దర్శకుడు శ్రీకాంత్ నాగోతిని వివాహం చేసుకున్నారు. ఈ శుభవార్తను స్వాతి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తమ వివాహ వేడుకకు సంబంధించిన అందమైన ఫొటోలను షేర్ చేస్తూ, “Hitched. 08-07-2026” అనే చిన్న క్యాప్షన్‌తో తమ కొత్త జీవితాన్ని అధికారికంగా ప్రకటించారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోల్లో స్వాతి, శ్రీకాంత్ నాగోతి సంప్రదాయ హిందూ వివాహ పద్ధతుల్లో పవిత్ర అగ్ని సాక్షిగా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ వివాహ వేడుక అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో నిరాడంబరంగా జరిగినట్లు తెలుస్తోంది.

ఇది స్వాతి జీవితంలో రెండో వివాహం. గతంలో ఓ పైలట్‌ను వివాహం చేసుకున్న ఆమె, కొన్నేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. అనంతరం ఇండోనేషియా నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన స్వాతి సినిమాలు, వెబ్ సిరీస్‌లతో తన నటనా ప్రయాణాన్ని మళ్లీ ప్రారంభించారు.

ఈ సమయంలో దర్శకుడు శ్రీకాంత్ నాగోతితో ‘మంత్ ఆఫ్ మధు’ చిత్రంలో కలిసి పనిచేశారు. నవీన్ చంద్ర హీరోగా నటించిన ఆ చిత్రంతో ప్రారంభమైన వారి పరిచయం క్రమంగా ప్రేమగా మారి, ఇప్పుడు వివాహ బంధంతో కొత్త జీవితానికి శ్రీకారం చుట్టింది.

స్వాతి వివాహ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, సినీ ప్రముఖులు, అభిమానులు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360