Menu
BREAKING
Biggboss 10 Telugu: హౌస్‌లో కుంపటి పెట్టిన బిగ్‌బాస్.. అంతా రచ్చే..   |   Ram Prasad: Bigg Boss 10 హౌస్‌లొ ఎవరి రెమ్యూనరేషన్ ఎంత? రామ్‌ప్రసాద్‌కు ఎంతో తెలిస్తే…   |   Biggboss 10 Telugu Thrigun: హైలైట్ అవుతున్న త్రిగుణ్.. ప్లస్సా, మైనస్సా?   |   Biggboss 10 Telugu: రీల్ ఫేసెస్ ఓకే.. రియల్ కలర్స్ ఇకపై..   |   ఘనంగా ప్రారంభమైన ‘వేట’.. సందీప్ సరోజ్, సాత్విక జంటగా కొత్త గ్రామీణ కమర్షియల్ ఎంటర్‌టైనర్   |   ‘ఆదర్శ కుటుంబం’లో చిట్టిబాబుగా విక్టరీ వెంకటేష్..   |   దుల్కర్ సల్మాన్ ‘శ్రీ శ్రీ’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘బొమ్మ బొమ్మ’ రిలీజ్ డేట్ ఫిక్స్..   |   Lenin Collections: ₹60 కోట్లు దాటిన అఖిల్ ‘లెనిన్’.. వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ ఇవే   |   Chennai Love Story Day 1 Collections: కిరణ్ అబ్బవరం సినిమాకు మంచి ఓపెనింగ్   |   ఓటీటీలోకి విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్లు’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?   |   ‘అబ్జెక్షన్ మై లార్డ్’ ట్రైలర్: కోర్ట్‌రూమ్ సస్పెన్స్‌తో ఆసక్తి రేపిన శ్రీకాంత్ సిరీస్.. చిరంజీవి ప్రశంసలు హైలైట్   |   ఆగస్టు 7న థియేటర్లలోకి ‘కొరియన్ కనకరాజు’.. వరుణ్ తేజ్ పవర్‌ఫుల్ లుక్   |   #ChiruBobby2: వర్షంలో 12 గంటలు నిరవధికంగా షూటింగ్..   |   దర్శకుడిని పెళ్లి చేసుకున్న నటి కలర్స్ స్వాతి   |   ‘దాదా – ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ ఫస్ట్ లుక్ విడుదల…

Biggboss 10 Telugu: హౌస్‌లో కుంపటి పెట్టిన బిగ్‌బాస్.. అంతా రచ్చే..

Biggboss 10 Telugu: హౌస్‌లో కుంపటి పెట్టిన బిగ్‌బాస్.. అంతా రచ్చే..

బిగ్‌బాస్ 10 తెలుగు తొలిరోజే హౌస్‌లో పెద్ద గొడవ జరిగింది. వాస్తవానికి బిగ్‌బాస్ పెట్టిన కుంపటే అది. అసలు సోమవారం ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇప్పటికే 8 కీసులు ఇచ్చారు కాబట్టి మిగిలిన రెండు కీస్‌లు ఎవరికి ఇవ్వాలో కీస్ వచ్చిన వారంతా డిసైడ్ అవ్వాలని బిగ్‌బాస్ చెప్పారు. కానీ ఎవ్వరినీ మాట్లాడనివ్వకుండా త్రిగుణ్ తన ఒపీనియన్ చెప్పి వారిని ఒప్పించేందుకు ట్రై చేశాడు. ఆతరువాత కూడా షాలినిని పొట్టిది.. మాట్లాడనివ్వడం లేదంటూ బాడీ షేమింగ్ కామెంట్ చేశాడు. ఆ తరువాత కంటెస్టెంట్స్ అంతా ఎవరికి వారు తమకు ఇష్టమైన ఇద్దరిని కారణాలు చెప్పి మరీ ఎంచుకున్నారు. ఈ విషయంలో రోహిత్‌కి ఝాన్సీకి, త్రిగుణ్‌కి మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. చివరకు కీస్.. వంశీ, కృష్ణుడికి ఇచ్చారు.

మహా పరీక్షకు సిద్ధమవ్వాలని బిగ్‌బాస్ చెప్పాడు. ఆ తరువాత దేబ్జాని, రామ్ ప్రసాద్‌కి మధ్య చర్చ జరిగింది. అక్కడ రామ్ ప్రసాద్ మాట్లాడిన విధానం చాలా బాగుంది. వంశీ, కృష్ణుడిని ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చిందో చాలా కన్విన్సింగ్‌గా చెప్పాడు. దేబ్జాని.. మనుషులతో మాట్లాడటం కంటే ఎక్కువగా బిగ్‌బాస్‌తో మాట్లాడటం గమనార్హంం. అయితే ఆమె వచ్చీరాని తెలుగు కారణంగా కాస్త కామెడీ వర్కవుట్ అవుతోంది. త్రిగుణ్ తనకు ఇచ్చిన టాస్క్‌ని మెల్లగా చేయడం ఆరంభించాడు. అంటే కనీసం నలుగురిని బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉందని నమ్మించాలని నాగార్జున చెప్పారు. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఓ సినిమా షూటింగ్‌లో దయ్యం సీన్ గురించి నలుగురిని కూర్చోబెట్టి చెప్పాడు. రామ్ ప్రసాద్, నరేష్ ఇద్దరూ నామినేషన్స్ గురించి ఫన్నీగా కాసేపు మాట్లాడుకున్నారు. సుధీర్ – సృష్టి కాస్త కనెక్ట్ అవుతున్నారనిపిస్తోంది. సుధీర్ అయితే ఫ్లర్ట్ చేయడానికి బాగానే ట్రై చేస్తున్నాడు.

కీస్ ఎవరి దగ్గరైతే ఉన్నాయో వారు మ్యాజిక్ బాక్స్ ఓపెన్ చేయాలని బిగ్‌బాస్ చెప్పాడు. త్రిగుణ్ వెళ్లి ఓపెన్ చేసిన తర్వాత ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో మాట్లాడుకుని షేర్ చేసుకున్నారు. ఆ తరువాత ఝాన్సీ వెళ్లి బాక్స్ ఓపెన్ చేసింది. ఆమెకు నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యే పవర్ వచ్చింది. దానిని ఈ వారం కావాలన్నా వాడుకోవచ్చని చెప్పారు. ఇలా ఒక్కొక్కరిక బిగ్‌బాస్ ఒక్కో పవర్ ఇచ్చారు. అయితే నరేష్ బాక్స్ ఓపెన్ చేయడానికి ఎంత కష్టడ్డాడో.. బాక్స్‌లోని మేటర్ అర్థం చేసుకోవడానికి అంత కష్టపడటం హిలేరియస్‌గా అనిపించింది. పది మంది తమ పవర్ ఏంటో చూశాక. అందరినీ కీస్ రిటర్న్ చేయమని బిగ్‌బాస్ చెప్పారు. ప్రతి ఒక్కరూ దాదాపుగా నామినేషన్స్ గురించే చర్చ. త్రిగుణ్ అయితే రోహిత్‌కే నామినేషన్ వేస్తానని చెప్పాడు. ఇప్పటి వరకూ చూసినదాన్ని బట్టి చూస్తే రోహిత్‌ను త్రిగుణ్ టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది.

Biggboss 10 Telugu: హౌస్‌లో కుంపటి పెట్టిన బిగ్‌బాస్.. అంతా రచ్చే..

ఇక మహా పరీక్ష గురించి బిగ్‌బాస్ చెప్పాడు. ఇప్పటి వరకూ హౌస్‌మేట్స్ కాదని.. మహాపరీక్షలో పాల్గొని హై రిస్క్ నుంచి నో రిస్క్‌గా మారి హౌస్‌మేట్ హోదాను పొందాలని బిగ్‌బాస్ చెప్పాడు. అలాగే ఈ వారం కచ్చితంగా ఎలిమినేషన్ ఉంటుందని చెప్పాడు. హౌస్ మేట్స్‌ని రెండు టీమ్స్‌గా విడిపోవాలని.. మీ జట్లకు ఇద్దరు నాయకులను ఎన్నుకోవాలని బిగ్‌బాస్ చెప్పాడు. ఇక్కడి నుంచి రచ్చ ప్రారంభమైంది. హౌస్ అంతా ఒక్కొక్కరూ ఒక్కో పేరు చెప్పారు. అలా రోహిత్‌కు 4 ఓట్లువచ్చాయి. త్రిగుణ్, రామ్ ప్రసాద్‌లకు చెరి మూడు పాయింట్స్ వచ్చాయి. రామ్ ప్రసాద్‌కు త్రిగుణ్ ఇచ్చేశాడు. ఇక్కడి నుంచి త్రిగుణ్ అనవసర వాదన ప్రారంభించాడు. ఎవ్వరినీ మట్లాడనివ్వలేదు. రోహిత్ వర్సెస్ త్రిగుణ్ గొడవ జరిగింది. రోహిత్‌కు కామనర్స్ ఓటేశారని.. కాబట్టి ఝాన్సీకి వేసిన తన ఓటును మార్చేసి రామ్ ప్రసాద్‌కు వేసినట్టు త్రిగుణ్ చెప్పాడు. భేదభావాలంటూ నానా రచ్చ చేశాడు.

త్రిగుణ్ వినకపోవడమే పెద్ద ప్రాబ్లమ్‌గా మారింది. సెలబ్రిటీలంతా సెలబ్రిటీలకే ఓటేశారు కదా.. అది గ్రూపిజం కాదా? అని కామనర్స్ వాదన. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. మొత్తానికి లీడర్స్‌గా రోహిత్, రామ్ ప్రసాద్ ఎంపికయ్యారు. కృష్ణుడు సైతం సర్ది చెప్పేందుకు ప్రయత్నించాడు. ఇక్కడ అగ్నిపరీక్ష, సెలబ్రిటీలు అంతా ఒక్కటేనని చెప్పాడు. ఈ క్రమంలోనే జరిగిన గొడవలో రోహిత్ ఎంగిలి కప్పులు కడగాలా? అంటూ ఫైర్ అయ్యాడు. వంశీ ఇక్కడ స్టాండ్ తీసుకుని ఆ మాట తప్పని చెప్పాడు. రామ్ ప్రసాద్ బ్లూ టీంకి నాయకుడు.. రోహిత్ రెడ్ టీంకి నాయకుడు. ఇక టాస్క్ రేపు ప్రారంభం కానుంది.

తొలిరోజే కాబట్టి ఒకరకంగా బీభత్సమైన సన్నివేశాలు అంతగా ఏం లేకుండానే సాగిపోయింది. మొత్తానికి త్రిగుణ్ అయితే ముందు నుంచే నెగిటివ్ అవుతున్నట్టుగా అనిపిస్తోంది. ఝాన్సీ అయితే సెపరేట్ రూటులో వెళుతోంది. ప్రస్తుతం రోహిత్‌కు బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే రోహిత్‌కు యాంటీగా ఝాన్సీ వెళుతున్నట్టుగా అనిపిస్తోంది. అగ్నిపరీక్షలో నోరు వేసుకుని పడిపోయిన షాలిని.. హౌస్‌లో మాత్రం చాలా చాలా బాగా పాయింట్స్ మాట్లాడుతోంది. త్రిగుణ్, రోహిత్, నరేష్, రామ్ ప్రసాద్, దేబ్జాని.. అంతో ఇంతో కృష్ణుడు, వంశీ, సృష్టి సుధీర్‌లకు మినహా మిగిలిన వారెవరికీ పెద్దగా ఇవాళైతే పెద్దగా స్క్రీన్ స్పేస్ దొరకలేదు.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360