
బిగ్‌బాస్ 10 తెలుగు ఆసక్తికరంగా నడుస్తోంది. దాదాపుగా వీకెండ్‌కు చేరుకోవడంతో మరికొన్ని గంటల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఈ వారం ఎలిమినేషన్ అనేది ఊహించడం కాస్త కష్టంగానే ఉంది. ఈ వారం ముఖేష్, వంశీ, అమన్, దేబ్జాని, శివ్, వర్షిణి, నీతూ, సుధీర్ నామినేషన్స్‌లో ఉన్నారు. ముఖేష్ అయితే ఓటింగ్‌లో టాప్‌లో ఉన్నాడు. అతనికి ఎలాంటి ఇబ్బందీ లేదు.
ఇక ముఖేష్ తర్వాత వంశీ సేఫ్ జోన్‌లో ఉన్నాడు. త్రిగుణ్ నామినేషన్స్‌లో లేకపోవడం అనేది వంశీకి కలిసొస్తున్న అంశం. దీంతో వంశీ ఓటింగ్‌లో టాప్ 2లో కొనసాగుతున్నాడు. ఆ తరువాత అమన్ ఉన్నాడు. వాస్తవానికి అమన్ సెకండ్ ప్లేస్‌లో ఉండాలి. కానీ రోహిత్‌కు వెన్నుపోటు పొడవడం అతనికి ఓటింగ్‌కు అవరోధంగా మారింది.
ఆ తరువాత నీతూ నాలుగో స్థానంలో ఉంది. రోహిత్ ఫ్యాన్స్.. నీతూకి సపోర్ట్‌గా ఉన్నారు. ఇక పోతే శివ్, వర్షిణి, సుధీర్‌పై ప్రస్తుతం ఎలిమినేషన్ కత్తి వేలాడుతోంది. సింగిల్ ఎలిమినేషన్ అయితే శివ్ వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. డబుల్ ఎలిమినేషన్ అయితే వర్షిణి, సుధీర్‌లలో ఒకరు వెళ్లిపోవడం ఖాయం.
ఇప్పటి వరకూ బిగ్‌బాస్ డబుల్ ఎలిమినేషన్ అనే విషయం చెప్పలేదు కాబట్టి సింగిల్ ఎలిమినేషనే ఉండే అవకాశం ఉంది. వీరిలో శివ్ దాదాపుగా వెళ్లిపోయే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఓటింగ్ చాలా తక్కువగా పడుతోంది. ఒకవేళ అటు ఇటు అయితే మాత్రం వర్షిణి, సుధీర్‌లలో ఒకరు వెళ్లిపోవడం ఫిక్స్.
శివ్ మంచి గేమర్ కానీ అతని గేమ్ అంతా సైడ్ ట్రాక్‌లో వెళుతోంది. నామినేషన్స్ సమయంలో అతను చేసిన ఓవర్ యాక్షన్ అతనికి ఇబ్బందికరంగా మారింది. ఇక చూడాలి ఈ వారం ఈ ముగ్గురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో..
