Menu
BREAKING
Bigg Boss10 Telugu: ఎవరెవరు వచ్చారు? ఏ ఏ హింట్స్ ఇచ్చారంటే…   |   వారెవ్వా కమ్ బ్యాక్ అంటే ఇలా ఉండాలి.. సూర్య ఆల్ టైమ్ రికార్డులు..!   |   Bigg Boss10 Telugu: నీతూపై రెచ్చిపోయిన త్రిగుణ్, వంశీ.. ఇంట్లో ఉండేందుకు అర్హత లేదంటూ..   |   రామాయణపై రామ్ గోపాల్ వర్మ రివ్యూ.. వాళ్లంతా వీధి కుక్కలు..!   |   షాకింగ్.. పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు..!   |   బడ్జెట్ కంట్రోలింగ్.. మలయాళం వాళ్లను చూసి మనం నేర్చుకుందామా..?   |   Bigg Boss10 Telugu: నామినేషన్స్ పాయింట్స్ మాట్లాడుకున్న త్రిగుణ్ టీం.. నాగ్ ప్రశ్నిస్తారా?   |   జాన్వీ కపూర్‌కు తత్వం బోధపడిందా.. తిట్టిన నోటితోనే పొగడ్తల వర్షం కురిపిస్తుందిగా..!   |   Bigg Boss10 Telugu: బ్లాక్ కోతి పంచాయతీకి చెక్ పెట్టిన నాగ్.. ఇక టైం లేదు..   |   Bigg Boss10 Telugu: ఈ వారం ఎలిమినేట్ కాబోయేది ఎవరంటే…   |   Bigg Boss10 Telugu: ముఖేష్‌పై రివెంజ్ తీర్చుకున్న దేబ్జాని.. త్రిగుణ్‌ని నిలదీసిన నీతూ..   |   ఓ ఇంటివాడు కాబోతున్న మెగా మేనల్లుడు.. సాయి దుర్గ తేజ్ పెళ్ళి సందడి..!   |   Bigg Boss10 Telugu: ఫ్యామిలీ కోసం బిగ్ ఫైట్.. వంశీ, శ్వేత విన్..   |   వీకెండ్ అయిపోయింది.. ఆదర్శ కుటుంబం సిచ్యువేషన్..   |   హ్యాపీ బర్త్ డే టబు.. అప్పుడు పండు.. ఇప్పుడు మహంతి ఝాన్సీ రాణి..!

Bigg Boss10 Telugu: ఎవరెవరు వచ్చారు? ఏ ఏ హింట్స్ ఇచ్చారంటే…

Bigg Boss10 Telugu: ఎవరెవరు వచ్చారు? ఏ ఏ హింట్స్ ఇచ్చారంటే...

ఇవాళ కొందరు టీచర్స్‌గానూ.. మరికొందరు స్టూడెంట్స్‌గానూ యాక్ట్ చేయాలి. ముందుగా శ్వేత ఆర్ట్ అండ్ పీఈటీ టీచర్, శ్వేత డ్యాన్స్ టీచర్, దేబ్జాని తెలుగు టీచర్, వర్షిణి కెమెస్ట్రీ టీచర్, నరేష్ స్కూల్ ప్రిన్సిపాల్, ఇంగ్లీష్ టీచర్. మిగిలిన వారంతా టీచర్స్. స్టూడెంట్స్ అంతా యూనిఫామ్‌తో సిద్ధమైపోయారు. నరేష్ ముందుగా కెమెస్ట్రీ క్లాస్ తీసుకున్నారు. అటెండెన్స్ అని నరేష్ అనగానే.. ఇవాళ సబ్జెక్ట్ అటెండెన్సా సర్ అని సుధీర్ ఫన్నీగా అడిగాడు. త్రిగుణ్, ముఖేష్ కలిసి బాగా నవ్వించారు. అందరూ చాలా యాక్టివ్‌గా కనిపించారు. ఎవరికి తగినట్టు వారు స్క్రీన్ స్పేస్ కోసం బాగానే ప్రయత్నించారు. నరేష్ కోసం అతని తమ్ముడు సురేష్ వచ్చాడు. వంశీ వెళ్లి అతడిని తీసుకొచ్చాడు. నరేష్ బయట కూర్చొని కబుర్లు చెబుతున్నాడు. సురేష్‌ను చూసి నరేష్ ఎమోషనల్ అయ్యాడు. అస్సలు టెన్షన్ లేదని.. ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా 100 టైమ్స్ బాగా ఆడుతున్నావని చెప్పాడు. నువ్వేడిస్తే మమ్మీ ఏడుస్తోంది. అస్సలు ఏడవద్దని చెప్పాడు. ఇంత బాగా ఆడతావని అనుకోలేదని సురేష్ చెప్పాడు. త్రిగుణ్ వస్తే నీకు బిగ్ ఫ్యాన్ అని చెప్పాడు. నరేష్ స్ట్రెస్ బస్టర్ అని త్రిగుణ్ చెప్పాడు. నువ్వు ఉన్నన్ని రోజులు నరేష్ ఉంటాడని రామ్ ప్రసాద్‌కు సురేష్ చెప్పాడు. మీ బాండ్ ఒక్క రిమార్క్ కూడా లేకుండా బాగుందని చెప్పాడు.

ఏది ఉన్నా గేమ్ వరకే అని సురేష్ రామ్ ప్రసాద్, నరేష్ ఇద్దరికీ చెప్పాడు. నీ స్టాండ్ నువ్వు తీసుకో. రైట్ అయినా రాంగ్ అయినా పక్కాగా స్టాండ్ తీసుకో. ఫ్రెండ్ అంటే గేమ్ వరకేనని చెప్పాడు. గేమ్ తర్వాత ఎలాగైనా ఉండమని చెప్పాడు. టైం తక్కువ ఉందని త్యాగాలు వద్దని చెప్పాడు. నీ గేమ్ నువ్వు ఆడమని నరేష్‌కు సురేష్ చెప్పాడు. ఆ తరువాత దేబ్జానితో మాట్లాడాడు. ఇన్‌టెన్షనల్‌గా ఏమీ చేయలేదని.. సారీ అని సురేష్‌కు దేబ్జాని చెప్పింది. ఏదో జరిగిందని.. రామ్ అన్న కూర్చోబెట్టి మాట్లాడాడని అప్పటి నుంచి నరేష్ సరిగా ఉండటం లేదని దేబ్జాని కంప్లైంట్ చేసింది. తను క్లీన్ షేవ్ చేసుకుని ఉండటంతో తన కూతురు గుర్తు పడుతుందా? అని రామ్ ప్రసాద్‌తో త్రిగుణ్ చెప్పాడు. నరేష్ ఇంటి నుంచి ఫుడ్ వచ్చింది. కేవలం నరేష్‌కు మాత్రమే పంపించారు. ఆ తరువాత దేబ్జానితో కూడా బాగానే ఉండమని సురేష్ చెప్పాడు. అన్నీ చూస్తుంటే చాలా విచిత్రంగా ఉందని చెప్పాడు. ఫస్ట్ డే నుంచి బ్లాస్ట్ అని చెప్పాడు. ఏ సీజన్‌లో ఎవరికీ ఇవ్వలేని అప్రిసియేషన్స్ నీకు వచ్చాయని.. గివ్ అప్ ఇవ్వొద్దని చెప్పాడు. వీడేం చేయలేడు అన్నోళ్లకు కూడా నువ్వేంటనేది ప్రూవ్ చేశావని నరేష్‌కు సురేష్ చెప్పాడు. నరేష్ పర్సనల్ లైఫ్ గురించి సురేష్ చెప్పాడు.

ఇద్దరం కలిసి ఒకే సైకిల్‌పై స్కూలుకు వెళ్లే వాళ్లమని.. తను పదో తరగతిలో ఉండగా.. నరేష్‌కు ఓ షోలో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చిందని చెప్పాడు. ఎలాంటి బర్డెన్ అయినా తీసుకుంటాడని.. పీక్ సిట్యువేషన్ అయినా ఈజీగా హ్యాండిల్ చేస్తాడని చెప్పాడు. సంపాదించే ప్రతి రూపాయి తమ కోసమే ఖర్చు పెడుతుంటాడని సురేష్ చెప్పాడు. సురేష్ లగ్జరీ బడ్జెట్ కింద కేక్‌పై రింగ్ వేశాడు. ఆ తరువాత అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పి సురేష్ వెళ్లిపోయాడు. వర్షిణి కెమెస్ట్రీ క్లాస్ తీసుకుంది. అందరూ కలిసి బాగా ఫన్ చేశారు. ఫస్ట్ రామ్ ప్రసాద్‌ని ఫ్రీజ్ అవమన్నారు. ఆ తరువాత అందరినీ ఫాస్ట్ ఫార్వర్డ్ అని చెప్పి అందరినీ ఫ్రీజ్ చేశారు. చివరకు శ్వేత ఫ్యామిలీని పంపించారు. ముందుగా శ్వేత సోదరి వచ్చింది. టాస్క్‌లో ఇచ్చిపడేశావని.. అంతా చాలా గర్వంగా ఫీలవుతున్నారని శ్వేత సోదరి చెప్పింది. ఓ డ్రామా తర్వాత శ్వేత ఫాదర్ ఎంట్రీ ఇచ్చారు. తండ్రిని చూడగానే శ్వేత కన్నీళ్లు పెట్టుకుంది. తనకు ఏది ఉన్నా త్రిగుణ్‌తో చెప్పుకుంటానని శ్వేత చెప్పింది. ఎంత పాజిటివ్ అమ్మాయిని కన్నారని శ్వేత తండ్రితో త్రిగుణ్ చెప్పాడు. ముఖేష్‌ను పట్టుకుని హాయ్ శివగారు అనేశారు.

Bigg Boss10 Telugu: ఎవరెవరు వచ్చారు? ఏ ఏ హింట్స్ ఇచ్చారంటే...

చాలా బాగా ఆడుతున్నావని.. నీ టాలెంట్ అంతా తీయాలని శ్వేతకు ఆమె తండ్రి, అక్క చెప్పారు. గోళ్లు కొరకవద్దని చెప్పారు. శివ్, నరేష్, త్రిగుణ్ కూడా నీకు మంచి సపోర్ట్ అని చెప్పారు. హౌస్‌మేట్స్ అందరికీ కేక్, శ్వేతకు హోమ్ ఫుడ్ వచ్చింది. కేక్‌ను పంచే విషయంలో శివ్, త్రిగుణ్‌కు చిన్న గొడవ జరిగింది. ఇక శ్వేత తండ్రి ఐస్‌క్రీమ్‌పై రింగ్ వేశారు. ఆ తరువాత శ్వేత తండ్రి, అక్క వెళ్లిపోయారు. తరువాత వంశీ కూతురు వాయిస్ వినిపించింది. అంతా ఎక్కడ అని వెదుక్కున్నారు. ఆ తరువాత అంతా వెళ్లి మెయిన్ డోర్ దగ్గర నిలబడ్డారు. వంశీ కూతురు ఆర్య వచ్చింది. అది చూసి త్రిగుణ్ ఎమోషనల్ అయ్యాడు. ‘ఐ హావ్ ఎ హీరో.. ఐ కాల్ హిమ్ డాడీ (నాకొక హీరో ఉన్నాడు. నేను తనను డాడీ అని పిలుస్తా) అని తన ఫ్రాక్‌పై రాసుకుని వచ్చింది. అది తండ్రికి చూపించింది. హౌస్‌ లోపలకి కూతురిని తీసుకుని వంశీ వెళ్లాడు. తన కూతురి కోసం వంశీ ఎగ్ క్రమ్ చేసి పెట్టాడు. ఆ తరువాత వంశీ భార్య ఎంట్రీ ఇచ్చింది. భార్యను హగ్ చేసుకుని వంశీ ఏడ్చాడు. వంశీకి హెల్ప్ చేసినందుకు థాంక్యూ చెప్పింది. పరోక్షంగా వంశీని హౌస్‌లో ఉంచేందుకు పవర్ వాడిన విషయాన్ని గుర్తించమన్నట్టుగా చెప్పింది. వంశీ దానిని అసలు గుర్తించకపోవడంతో బయట నెగిటివ్ అవుతున్నాడు. దానిని పరోక్షంగా ఆమె చెప్పింది. మరి వంశీ గుర్తిస్తాడో లేదో తెలియాలి.

Vamsi with daughter in bigg boss 10 telugu

త్రిగుణ్‌తో కూడా వంశీ భార్య శిరీష చాలా బాగా మాట్లాడారు. తనను చూసి సడెన్‌గా ఏమనిపించిందని వంశీని అతని భార్య అడిగింది. చూశావు కదా అని చెప్పాడు. త్రిగుణ్ వచ్చేసి మీ ఆయన మీరు వచ్చేసరికి కెప్టెన్‌గా ఉన్నాడని చెప్పాడు. త్రిగుణ్ లాంటి ఫ్రెండ్ ఉంటే చాలా మంచి జరుగుతుందన్నట్టుగా చెప్పింది. త్రిగుణ్ గేమ్ చేంజర్ అని ఆమె చెప్పింది. తన ఫ్రెండ్షిప్‌ని విడదీయాలని చాలా మంది ట్రై చేశారని త్రిగుణ్ చెప్పాడు. వాస్తవానికి ఎవరూ ట్రై చేయలేదు. బాగా పాయింట్స్ పెడుతున్నావని.. అయితే ఎలా మాట్లాడకూడదనేది తెలుసుకోమని చెప్పింది. అందరూ నీకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పింది. నీకు దండ వేశారు కదా.. సపోర్ట్ ఇస్తున్నారని దానిని గుర్తించమన్నట్టుగా వంశీకి అతని భార్య చెప్పింది. ‘ఐ లవ్ యూ నాన్న’ అని వంశీ కూతురు బోర్డుపై రాసి సర్‌ప్రైజింగ్‌గా చూపించింది. ముఖేష్ చాలా మంచి ఫ్రెండ్ అని.. తనను సేవ్ చేయడం చాలా నచ్చిందని మరోసారి వంశీ భార్య చెప్పారు. ఎంత బిజీ షూట్‌లో ఉన్నా తనకు ఏం కావాలంటే అది పంపిస్తాడని శిరీష చెప్పింది. ఇక ఆర్య తండ్రిని బిగ్‌బాస్ హౌస్‌లో చూడటం చాలా బాగుందని చెప్పింది. శిరీష మష్రూమ్‌పై రింగ్ వేశారు. ఆతరువాత శిరీష, ఆర్య అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్లిపోయారు. మొత్తానికి బిగ్‌బాస్ ప్రారంభమైన ఇన్ని రోజులకు ఇవాళ హౌస్ అంతా కూల్ కూల్‌గా వచ్చిన వారందరినీ రిసీవ్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉంది. నరేష్, శ్వేత ఫ్యామిలీ పెద్దగా హింట్స్ ఏమీ ఇవ్వలేదు కానీ వంశీ భార్య మాత్రం వంశీ త్యాగాన్ని గుర్తించమని పదే పదే చెప్పింది. అలాగే త్రిగుణ్‌ను వదలొద్దన్నట్టుగా చెప్పింది.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360