Menu
BREAKING
Bigg Boss10 Telugu: నేడు షో మొత్తం ముఖేష్ చుట్టూనే.. నోరు జారిన దేబ్జాని   |   Bigg Boss10 Telugu: అన్ని భాషల్లోనూ విజయ్‌కు ఐలవ్యూ చెప్పానన్న రష్మిక… నీతూ ఎలిమినేట్   |   Bigg Boss10 Telugu: వంశీకి క్లాస్.. త్రిగుణ్‌కు మాస్ ఎలివేషన్   |   Bigg Boss10 Telugu: ఈవారం బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరు?   |   Bigg Boss10 Telugu: కెప్టెన్ అయిన అమన్.. నరేష్‌ కోసం కన్నీళ్లు పెట్టుకున్న రామ్ ప్రసాద్   |   Bigg Boss10 Telugu: నాగ్ సహా ఒక్కొక్కరినీ ఉతికి ఆరేసిన చరణ్   |   మారిపోయిన జేమ్స్ బాండ్.. నయా బాంబ్ బాబు ఎవరో తెలుసా..?   |   2000 కోట్ల దిశగా రామాయణ.. ఆ రికార్డు రాముడి సొంతం అవుతుందా..?   |   నేను రాను.. వచ్చే సమస్యే లేదు.. కుండ బద్ధలు కొట్టిన రోహిత్ నాయుడు..!   |   ట్రెండింగ్‌లో జటాయు ఎర్త్స్ సెంటర్.. ఆ వైరల్ ప్లేస్ ఎక్కడుందో తెలుసా..?   |   ‘వారణాసి’ వాయిదా దాదాపు ఖాయమేనా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా..?   |   ఫేక్ గాళ్ల తాట తీయండి.. కేంద్రమంత్రికి ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి విన్నపం..!   |   అనిల్ రావిపూడితో జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు అవసరమా.. అవసరమే..!   |   బాహుబలి 2 ఔట్.. నెక్ట్స్ టార్గెట్ ధురంధర్ 2.. అక్కడ రామాయణ ఊచకోత..!   |   రియల్ స్టార్ శ్రీహరి ఇంట శుభకార్యం.. పెళ్ళి కొడుకు అవుతున్న పెద్ద కొడుకు..!

Bigg Boss10 Telugu: నేడు షో మొత్తం ముఖేష్ చుట్టూనే.. నోరు జారిన దేబ్జాని

Bigg Boss10 Telugu: నేడు షో మొత్తం ముఖేష్ చుట్టూనే.. నోరు జారిన దేబ్జాని

సార్ట్ చేసుకుని సాల్వ్ చేసుకునే దానికి ఎందుకు పెద్దగా చేసుకుంటున్నావని ముఖేష్‌ను వర్షిణి అడిగింది. అంతకు ముందు హోస్ట్ నాగార్జున ముఖేష్, వర్షిణికి పెట్టిన టాస్క్ గురించి అతడిని వర్షిణి నిలదీసింది. మరోవైపు ఇంట్లో అంతా ముఖేష్, వర్షిణి మినహా అంతా మాట్లాడుకుంటున్నారు. ఆ గేమ్ జరిగినప్పటి నుంచి ముఖేష్‌తో వర్షిణి మాట్లాడటం లేదని త్రిగుణ్ చెప్పాడు. వాష్‌రూమ్‌లో డస్ట్ బిన్ తీయకుండా క్లీన్ చేశాడని అమన్ చెప్పాడు. కిచెన్‌లోని సింక్‌లో కూడా మరకలు ఉన్నాయని అన్నాడు. త్రిగుణ్ వెళ్లి పిన్ టు పిన్ చెక్ చేసి లోపాలన్నీ చెప్పాడు. ఎన్నిసార్లు చెబుతాం.. చిన్నపిల్లలా అని అమన్ అన్నాడు. పని చేస్తే ఏమైనా ఉంటదని.. పని చేయకుండా ఉంటే ఎలా అని అమన్ అన్నాడు. మానిటర్‌ను మార్చి త్రిగుణ్‌ని పెడతానని అమన్ అన్నాడు. తనను పెడితే రోజూ గొడవలే అవుతాయని చెప్పాడు. ముఖేష్ వచ్చి తనతో ప్రాబ్లమ్ ఉంటే తనకే చెప్పమని అమన్‌కు చెప్పాడు. త్రిగుణ్ చెప్పిన కంప్లైంట్స్ అన్నీ ముఖేష్‌ను అడిగాడు. ఇవి నీ మాటలా? ఎవరైనా చెబితే అడుగుతున్నావా? అని ముఖేష్ అడిగాడు. అసలు అవి నీ మాటలు కాదని ముఖేష్ అన్నాడు. అసలు కెప్టెన్ రూంలోకి మరొకరు ఎలా వచ్చారని ముఖేష్ అడిగాడు. నీకు బుద్ధి లేదా? నువ్వు చెబితే చెయ్యనా? అని ముఖేష్ అడిగాడు. బుద్ధి గురించి మాట్లాడకని అమన్.

తన వాష్‌రూం వాడలేదని అమన్ చెప్పాడు. మరి త్రిగుణ్ ఎందుకు చెబుతున్నాడని ముఖేష్ ప్రశ్నించాడు. మార్నింగ్ చెబుతా.. ముందు ఇదంతా క్లీన్ చేయమని అమన్ చెబితే తాను చెయ్యనని ముఖేష్ చెప్పాడు. ఆ తరువాత గొడవ ఏమయ్యిందో చూపించలేదు. ఇవాళంతా షో మొత్తం ముఖేష్ చుట్టూనే తిరిగింది. కావల్సినంత కంటెంట్ ఇచ్చాడు. నరేష్ ఏ గేమ్స్‌కి ముందుకు రాడు కానీ తనను కెప్టెన్ చేయలేదని ప్రశ్నిస్తాడని ముఖేష్‌తో వర్షిణి చెప్పింది. ఏ గేమ్‌లోనూ ముందుకు రాలేదని చెప్పింది. తన డిక్టేషన్‌షిప్‌కి చెడ్డ పేరు రావడానికి కారణం రామన్న వెంటనే వేరే గ్రూప్‌లోకి వెళ్లడం.. నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడం వల్లనే కదా అని వర్షిణితో ముఖేష్ అన్నాడు. నెక్ట్స్ నామినేషన్స్ ప్రారంభయ్యాయి. ఫస్ట్ రామ్ ప్రసాద్ వచ్చేసి ముఖేష్‌ను నామినేట్ చేశాడు. లాస్ట్ వీక్ గేమ్‌లో డిక్టేటర్‌గా సరిగా చేయలేదు. నిన్ను నమ్మి మేము బయట పడుకున్నాం. ఒక గేమ్‌లో ఒక్క స్టెప్ నువ్వు దిగి ఉంటే మన పరిస్థితి వేరేలా ఉండేది అని రామ్ ప్రసాద్ పాయింట్స్ పెట్టాడు. ‘‘మిమ్మల్ని ఫాలోవర్‌గా తీసుకున్నానంటే కారణం మీపై రెస్పెక్ట్ ఉండటమే. 6-8 అని మీరు అంటున్నారు. కానీ సంచాలక్ వచ్చేసి 5-8 అంటోంది. ఒక్క గేమ్ చేంజింగ్ పాయింట్ కదా.

Bigg Boss10 Telugu: నేడు షో మొత్తం ముఖేష్ చుట్టూనే.. నోరు జారిన దేబ్జాని

6-8కి అంగీకరించకుండా అన్యాయం చేశారని అంటున్నప్పుడు త్రిగుణ్ 5-5 అన్నప్పుడు నువ్వు మాకు అన్యాయం చేశావని ఎందుకు చెప్పలేదని ముఖేష్ అడిగాడు. మన చేతిలో గేమ్ ఉన్నప్పుడు ఒప్పేసుకుంటే అయిపోయేది కదా అని రామ్ ప్రసాద్ అడిగాడు. ఆరోజు ఒప్పుకోలేదని వర్షిణి అన్నది. గోట్ ఆఫ్ ఎండ్యూరెన్స్‌లో ఎక్కువ బరువు మోశావని నీకు సపోర్ట్ చేశా.. రెండోసారి మీకు అవకాశం ఇచ్చా. సీరియస్‌గా ఉండమని.. కామెడీ వద్దని నేను చెప్పాను కదా అని ముఖేష్ అన్నాడు. శివపై చూపించిన ఫైర్ ముందు నుంచే చూపించి ఉంటే నీ గేమ్ ఇంకా బాగుండేదని రామ్ ప్రసాద్‌ను ముఖేష్ అడిగాడు. మధ్యలో నరేష్ వచ్చాడు. నరేష్‌కు గట్టిగానే ముఖేష్ కౌంటర్ ఇచ్చాడు. నరేష్‌ నువ్వెళ్లమని ప్రతిసారీ చెప్పినా కూడా నువ్వు వెళ్లలేదని.. అక్కడ గేమ్ చేంజర్ నువ్వు అయినా కూడా నువ్వు వెళ్లలేదని నరేష్‌తో ముఖేష్ అన్నాడు. ఆ తరువాత శివ్ వచ్చేసి త్రిగుణ్‌ను నామినేట్ చేశాడు. ‘‘బయట వచ్చిన వాళ్లు 13 స్టార్స్ వచ్చాయి. వాళ్లంతా మీపై హోప్ పెట్టుకున్నారు కానీ వాళ్లు డిజప్పాయింట్ అవుతారేమో అనిపిస్తోంది. ప్రవర్తన, ప్రదర్శన, పరివర్తన సరిగా లేదు. దీనికి కారణం మీ నోటి దూల. మీ టీంలోకి ఎందుకు వచ్చానంటే.. డెసిషన్ మేకింగ్ మీ దగ్గర ఉంది. అలయెన్స్‌లపై కాకుండా మీకు ఇచ్చిన టాస్క్‌లు బాగా ఆడుతారని నమ్మకం ఉంది. బ్యాక్ స్టాబర్.. మీరు నన్ను వెన్నుపోటు పొడిచారు. ఇప్పటి వరకూ నాకెవరూ అలా చేయలేదు’’ అని శివ్ తన పాయింట్స్ పెట్టాడు. రామ్ ప్రసాద్, నరేష్ ఇద్దరికీ ముఖేష్ వీక్, వీకెస్ట్ అని పెట్టాడనే బాధ ఏమాత్రం పోవడం లేదు. ఆ కారణాలే ఇద్దరూ చెప్పారు. నీ గేమ్‌లోకి రావడమే మేము చేసిన తప్పు అని నరేష్ అన్నాడు.

‘‘ఈ గేమ్ గురించి నాకు ఒక ఐడియా ఉంది. మ్యానిప్యులేటర్ అన్న పేరు నువ్వు ఇచ్చావు. నువ్విలా ఆడుతున్నావు. ఇది కరెక్ట్ కాదని ఎవరూ చెప్పలేదు. సర్ అని పిలుస్తూ ఆ మాటల్లో ఉన్న సర్.. లోపల మర్యాద లేకపోవడం చాలా దారుణం. మాట జారితే తడబడ్డాను తప్పైంది అని చెప్పే ధైర్యం లేదు. నాకు 13 స్టార్లు వచ్చాయి. నీకు ఒక్కటి కూడా రాలేదు. నేను నోరు జారాను. నేను మీలా నటించడం లేదు. నేను చెప్పి చేస్తున్నా. మిమ్మల్ని స్ట్రాంగ్‌లో పెట్టడం కూడా నా న్యూట్రల్ వేను చూపిస్తోంది. ఇంతకు ముందు నేను ఎందుకు మీలా ఆడలేకపోతున్నా. నేను ఎందుకు మిమ్మల్ని గెలవలేకపోతున్నా అని అన్నారు కదా.. అది నా గేమ్. నా కూతురు కోసం నెనెంత బాధపడ్డానో చూసి ఉంటారు కదా.. మరి అలాంటప్పుడు నా పేరు ఎలా రాశారు. నేను నెలల పాపను వదిలేసి వచ్చా. దానికోసం ఎంతో బాధపడ్డా. మీకు కనీసం మానవత్వం లేదు. నాకు నోటి దూల ఉంటే.. మీకు చెవిలో దూల ఉంది. ఏది సరిగా వినిపించుకోరు’’ అని త్రిగుణ్ చెప్పాడు. ‘‘ప్రతి దానిని అవకాశానుసారంగా మారుస్తూ ఉంటారు. అనుకూలంగా ఉన్నప్పుడు మంచిగా మాట్లాడతారు. లేనప్పుడు బ్యాడ్‌గా మాట్లాడతారు. బ్యాక్ స్టాబింగ్.. మోసం. .అబద్ధం చెప్పడం అన్నీ మీక్యారెక్టర్’’ అని శివ అన్నాడు.

Bigg Boss10 Telugu: నేడు షో మొత్తం ముఖేష్ చుట్టూనే.. నోరు జారిన దేబ్జాని

‘‘నువ్వు అతనితో ఉండాలనుకుంటున్నావు. అతడినే నామినేట్ చేస్తావు. నీ ఉద్దేశమేంటి’’ చెప్పమని ముఖేష్ అడిగాడు. ‘మీరు ఎప్పుడైనా త్రిగుణ్‌ను నామినేట్ చేశారా? చెప్పండి’ అని శివ అడిగాడు. ‘నీకు దమ్ముంటే నీ దగ్గరకు వచ్చి మాట్లాడేలా చేసుకో’ అని ముఖేష్ చెప్పాడు. అసలెందుకు ముఖేష్.. శివతో గొడవపడ్డాడో అర్థం కాలేదు. ఎవరిని ఎక్కడ తొక్కాలో నాకు తెలుసు కాబట్టి నేనలాగే ఉంటానని ముఖేష్ చెప్పాడు. బెట్ కడతా రేపు నువ్వెల్లి అతనితోనే ఉంటావు. అతనితోనే ఆడతావని చెప్పాడు. అమన్‌తో ముఖేష్.. మధ్యాహ్నం వరకూ చూస్తా.. ఆరబెట్టిన బట్టలు అక్కడ ఉంటే తీసుకెళ్లి పూల్‌లో పడేస్తానని ముఖేష్ చెప్పాడు. దీంతో అమన్ తీసేయమని చెప్పాడు. ముఖేష్ తీసుకెళ్లి పూల్‌లో పడేశాడు. నా ప్యాంట్ ఎందుకు పూల్‌లో వేశావని దేబ్జాని అడిగింది. నువ్వు పిచ్చోడయ్యావని అనడంతో ఎందుకు అన్నావని అడిగాడు. ఇది ఉలెన్ అని ఆరలేదని చెప్పింది. రెండు రోజులుగా అలాగే ఉంచిందని.. డ్రై అయినా కూడా తీయలేదని ముఖేష్ చెప్పాడు. వర్షిణి బట్టలు కూడా పూల్‌లో వేశాడు. నిన్న రాత్రి వేశానని చెప్పింది. దేబ్జాని ఈ సమయంలో బాగా నోరు జారింది. అతడిని బయటకు పంపమని చెప్పింది. వాడు అంటూ ఇష్టానుసారంగా మాట్లాడింది. పాగల్ ఆద్మీ అంటూ ఫైర్ అయిపోయింది. వెయ్యాలనే వేశాడని సుధీర్ బాగా రెచ్చగొట్టాడు.

ఉదయం స్నానం చేసి ఉతికానని త్రిగుణ్ చెప్పాడు. ఉదయం వేస్తే సాయంత్రానికి ఆరతాయా? అసలు ప్రతీకారానికి వచ్చాడా? ఎందుకు వచ్చాడు ఇక్కడికి అంటూ త్రిగుణ్ ఫైర్ అయ్యాడు. శివ కూడా తను పొద్దున ఆరబెట్టానని ఎందుకు తీసి పడేశావని శివ అడిగాడు. కంటెంట్ కోసం ఇలా చేస్తున్నాడంటూ త్రిగుణ్, శివ, దేబ్జాని నానా రచ్చ చేశారు. మొత్తానికి ముఖేష్ కంటెంట్ కోసం చేశఆడో.. దేనికి చేశాడో కానీ హౌస్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. నెక్ట్స్ సుధీర్ వచ్చేసి వర్షిణిని నామినేట్ చేశాడు. బాస్కెట్ బాల్ గేమ్ గురించి తీసి ఆ గేమ్‌లో బయాస్డ్‌గా ఆడావని నామినేట్ చేశాడు. అలాగే డిక్టేటర్ టాస్క్‌లో కూడా 6-8 పట్టుకుని కూర్చొన్నావని చెప్పాడు. కార్డ్ తీసినప్పుడు నా ఎమోషన్‌ను నేను నమ్మా. నాకు ఈ ఇంట్లో ఉన్న ఇంపార్టెంట్ పీపుల్ కూడా వీడిని నమ్మొద్దని చెప్పారని వర్షిణి చెప్పింది. త్రిగుణ్‌ను వీక్ పాయింట్ తీస్తానని వర్షిణి అంటే అది ఫ్యామిలీ అని తెలియక సపోర్ట్ చేశానని సుధీర్ చెప్పాడు. కావాలనే వర్షిణి త్రిగుణ్ ఫ్యామిలీ రాకూడదని ఆడిందని సుధీర్ చెప్పాడు. నీకు హెల్ప్ కావాలంటే ఒకలా.. వేరొకరికి హెల్ప్ చేస్తే ఒకలా బిహేవ్ చేస్తావని సుధీర్‌ను వర్షిణి నిందించింది.

రామ్ ప్రసాద్‌ను దేబ్జాని నామినేట్ చేసింది. వర్షిణి.. ముఖేష్‌తో ఆర్గానిక్ బాండ్ అని దేబ్జాని చెప్పింది. మధ్యలో నా పేరు రావాల్సిందేనా? అని ముఖేష్ అంటే.. ఇస్ కో కోయి దిమాక్ దో నైతో అండా దో (వీడికి ఎవరైనా తెలివి ఇవ్వండి. లేదంటే ఓ గుడ్డు ఇవ్వండి) అని దేబ్జాని అన్నది. దీంతో ముఖేష్ ఫైర్ అయ్యాడు. ‘తనకు కూడా చాలా మాటలొచ్చని ముఖేష్ అన్నాడు. ఇది నీ ఇల్లు కాదని.. జాగ్రత్తగా ఉండు.. నోటికి వచ్చినట్టుగా మాట్లాడమని.. నీ ఒళ్లంతా పాయిజన్ పెట్టుకుని నా పేరు ఎందుకు తీస్తున్నావ’ని ముఖేష్ అడిగాడు. ‘నరేష్ కోసం మీరు పెట్టిన హార్డ్ వర్క్ నా కోసం ఎందుకు పెట్టలేదు’ అని రామ్ ప్రసాద్‌ను దేబ్జాని అడిగింది. తనకు మైండ్‌లో కెప్టెన్సీ చేయలేదనే అని రామ్ ప్రసాద్ చెప్పాడు. ‘ఆ రోజు ఎక్కువ గేమ్స్ ఆడింది నువ్వే. థర్డ్ గేమ్ ఇద్దామని చెప్పింది నేను. నీకు ఆ స్ట్రాటజీ చెప్పడానికి కారణం నువ్వు. వంశీ, నువ్వు కెప్టెన్సీ రేస్‌లో ఉన్నారు. కానీ ఇంట్లో ఎవరూ నీపై నమ్మకం లేదు. దేబ్జానికి వేద్దామని అంటే.. హౌస్ అంతా వంశీ వైపు ఉంటే ఎలా ఓటు వేస్తావని నరేష్ నన్ను తిట్టాడు. కనీసం నరేష్ నుంచే నువ్వు ఓటు సంపాదించుకోలేకపోయావు’ అని రామ్ ప్రసాద్ అన్నాడు. స్టార్టింగ్ నుంచి నీకు సపోర్ట్ చేసిందంతా కేవలం కెప్టెన్సీకి చేయకపోతే అదొక్కటే పట్టుకుంటావా? అని నరేష్ అడిగాడు.

‘నువ్వు కెప్టెన్ ఎందుకు అవలేకపోయావో తెలుసా? నువ్వు సెల్ఫిష్. చాలా సెల్ఫిష్‌గా బిహేవ్ చేస్తావు. నేను సెల్ఫిష్‌గా బిహేవ్ చేస్తున్నావని నీ ఒక్కదానికే చెప్పా. కానీ నువ్వు నా విషయంలోనే అలా చూపించావు. కాఫీ విషయంలోనే నా దగ్గరే చూపించావు. నాకు కాఫీ అంటే ఎంత ఇష్టమో ఎన్ని సార్లు చెప్పాను. కానీ కాఫీ లేదని అబద్ధం చెప్పావు’ అని రామ్ ప్రసాద్ అన్నాడు. నెక్ట్స్ నరేష్ వచ్చేసి దేబ్జానిని నామినేట్ చేశాడు. ‘దేబ్జాని ఇందాక నువ్వొక మాటన్నావు. నాకు నరేష్ కంటే ఎక్కువ నువ్వే రామన్నా అన్నావు. ననేను విపరీతంగా హర్ట్ అయింది బాల్ గేమ్‌లో. ఎలాగైనా గేమ్ ఆడాలంటే షాలినికి ఛాన్స్ ఇచ్చి కెప్టెన్సీ నుంచి తీసేద్దామన్నది నేనే. నామినేషన్స్‌లో ఆ మాట అన్నది నరేష్ అని అందరిలో పెట్టేశావు. నీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ బాధేసిందంటే.. నీకొక ఎక్స్‌పెక్టేషన్ ఉంటది నాకొక ఎక్స్‌పెక్టేషన్ ఉంటది అన్నావు. ఝాన్సీతో నీకు గొడవ అయ్యింది. ఆమె సారీ చెబితే అది యాక్సెప్ట్ చేయకుండా వన్స్ చీటర్ ఈజ్ ఆల్వేస్ చీటర్ అన్నావు. ఎప్పటికైనా అలయెన్స్ విడిపోవాల్సిందే. మా అలయెన్స్‌లో ఎప్పుడో గొడవలు వచ్చాయి. మాలో ఏమైనా తప్పులుంటే నేను మొహం మీదే దేబ్జాని, రామ్ ప్రసాద్ కి చెబుతా’ అని నరేష్ అన్నాడు.

‘నరేష్ నాకోసం చెప్పాడని చెప్పా దానిలో తప్పేముందని దేబ్జాని అన్నది. నువ్వు అలా అనలేదని.. ప్లానే నరేష్ చేశాడని అనడంతో అంతా జూలో జంతువును చూసినట్టుగా నన్ను చూశారని నరేష్ అన్నాడు. రామన్నను నామినేట్ చేస్తూ నువ్వు కొన్ని పాయింట్స్ పెట్టడంతో నేను ఈ పాయింట్స్ చెప్పాను అని నరేష్ అన్నాడు. మొత్తానికి దేబ్జానికి తిరిగి కౌంటర్ ఇచ్చేందుకు పాయింట్స్ కూడా లేవు.

నెక్ట్స్ త్రిగుణ్ వచ్చేసి ఆర్కేను నామినేట్ చేశాడు. ఇంట్లో నుంచి నువ్వు దొబ్బేస్తే బాగుంటుందని నామినేట్ చేశాడు. ఆరు వారాలవుతోంది.. వాయిస్ రెయిజ్ చేస్తున్నావు కానీ ఎప్పుడు రెయిజ్ చేయాలనేది మాత్రం నీకు తెలియడం లేదు. నీ ఆట పోతా ఉంటే ఏదో ఒక వారంలోబెటర్‌గా ఆడాలని చెబితే వినడం లేదు. ఒకరికి కెప్టెన్సీ అర్హతే లేదని ఎంత గట్టిగా చెప్పావో.. ఇప్పుడు అంత గట్టిగా చెప్పడం లేదు. నరేష్ నిన్న నామినేట్ చేశాడు. నేను చెయ్యెత్తితే మాట్లాడమన్నాడు. కానీ నువ్వు నన్ను దొబ్బేయమన్నావు. నాకు లోపల అది లాగుతోంది. ఏదో ఒకరోజు అతి పోతది. ఫ్రెండ్ ఫ్రెండ్ అని వెనుక మొత్తం పోట్లే. అవన్నీ దులపుకుని పోతా. కానీ నువ్వన్న మాట నన్ను ఇబ్బంది పెడుతోందని నామినేట్ చేశాడు. తనకు కిచెన్ దగ్గర ఎక్కువ ఇవ్వమని అడిగానని నరేష్‌తో మాట్లాడుతుంటే మధ్యలో వచ్చావని అప్పుడు పొరపాటున అలా అన్నాను కానీ కావాలని దొబ్బేయమనలేదని మరోసారి ఆర్కే చెప్పాడు. ఎన్ని వీక్స్ ఉంటానో నాకు తెలుసు. ఉన్నంత కాలం నా గేమ్ నేను ఆడుకుంటానని చెప్పాడు. ఈవారం వంశీ, ముఖేష్, త్రిగుణ్, వర్షిణి, రామ్ ప్రసాద్, దేబ్జాని, రామకృష్ణ నామినేట్ అయ్యారు.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360