
వీకెండ్ వచ్చేసింది. హోస్ట్ నాగార్జున వచ్చి ఏం ఇన్పుట్స్ ఇస్తారో.. ఎవరికి అక్షింతలు వేస్తారోనన్న ఆందోళన అయితే ఈవారం లేదు. దీనికి కారణం ఇది ఫ్యామిలీ వీక్ కావడమే. ఒక్క రామకృష్ణ, వర్షిణి ఫ్యామిలీ మినహా అందరి ఫ్యామిలీస్ హౌస్‌లోకి రావడం.. సందడిగా గడిచిపోయింది.
ఇక ఇవాళ్టి ప్రోమోల ప్రకారం.. వర్షిణి, రామకృష్ణకు చెందిన అమ్మలను పిలిపించారు. ఇద్దరినీ రప్పించి వారిని స్క్రీన్‌లో చూపిస్తూ.. ఎవరో ఒకరి అమ్మ మాత్రమే హౌస్‌లోకి వచ్చేందుకు వీలుందని.. దీనికోసం ఓటింగ్ చేయాలని చెప్పారు. వర్షిణి తన తల్లి కోసం చాలా ఆందోళన చెందుతోందని తెలిసి ఎక్కువమంది ఆమెకే ఓటు వేశారు. దీంతో వర్షిణి తల్లి హౌస్‌లోకి వచ్చారు.
రామకృష్ణకు ఓటింగ్ తక్కువ వచ్చిన కారణంగా వాళ్ల అమ్మ హౌస్‌లోకి రావడం లేదని చెప్పడంతో అతను చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు. అవతల వాళ్లమ్మ అంకమ్మ కూడా బాగా ఏడ్చేసింది. తల్లులతో ఇలా ఆడుకోవడం పట్ల నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బిగ్‌బాస్ సైకోలా మారిపోయాడని అంతా ట్రోల్ చేస్తున్నారు. మరి తరువాత అంకమ్మను కూడా హౌస్‌లోకి పంపించి ఉంటారేమో చూడాలి.
ఇకపోతే ఈవారం హౌస్ నుంచి శ్వేత ఎలిమినేట్ అయ్యింది. శ్వేత హౌస్‌లోకి వచ్చిన దగ్గర నుంచి సేఫ్ గేమ్ ఆడుతూ వెళ్లడంతో ఆమె ఎక్కడా పెద్దగా కనిపించిందే లేదు. పైగా ఆమెను నామినేట్ చేసేందుకు కూడా ఎవరి దగ్గరా రీజన్స్ లేకుండా పోయాయి. దీంతో ఆమెకు ఓటింగ్ కూడా లేదు. ఈవారం నామినేషన్స్‌లోకి రాగానే ఎలిమినేట్ అయ్యింది. శివ్లా నామినేషన్స్‌లో ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో కానీ ఆమె అది చెయ్యలేదు.
