Menu
BREAKING
బాక్సాఫీస్ దగ్గర రామాయణ ప్రభంజనం.. పుష్ప 2 ఆల్ టైమ్ రికార్డ్స్ ఔట్..   |   Bigg Boss10 Telugu: గంగవ్వలా తయారైన నరేష్.. వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రశంసలే..   |   భోగి ఈవెంట్స్‌లో అనుపమ పరమేశ్వరన్ మిస్సింగ్.. అసలు కారణం ఇదేనా?   |   Bigg Boss10 Telugu: శ్వేత, నీతూ ఎంత రెమ్యూనరేషన్ అందుకున్నారంటే..   |   Bigg Boss10 Telugu: అదరగొట్టిన రీతూ, డెమాన్… త్రిగుణ్‌తో రీతూ గొడవ   |   Bigg Boss10 Telugu: నేడు షో మొత్తం ముఖేష్ చుట్టూనే.. నోరు జారిన దేబ్జాని   |   Bigg Boss10 Telugu: అన్ని భాషల్లోనూ విజయ్‌కు ఐలవ్యూ చెప్పానన్న రష్మిక… నీతూ ఎలిమినేట్   |   Bigg Boss10 Telugu: వంశీకి క్లాస్.. త్రిగుణ్‌కు మాస్ ఎలివేషన్   |   Bigg Boss10 Telugu: ఈవారం బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరు?   |   Bigg Boss10 Telugu: కెప్టెన్ అయిన అమన్.. నరేష్‌ కోసం కన్నీళ్లు పెట్టుకున్న రామ్ ప్రసాద్   |   Bigg Boss10 Telugu: నాగ్ సహా ఒక్కొక్కరినీ ఉతికి ఆరేసిన చరణ్   |   మారిపోయిన జేమ్స్ బాండ్.. నయా బాంబ్ బాబు ఎవరో తెలుసా..?   |   2000 కోట్ల దిశగా రామాయణ.. ఆ రికార్డు రాముడి సొంతం అవుతుందా..?   |   నేను రాను.. వచ్చే సమస్యే లేదు.. కుండ బద్ధలు కొట్టిన రోహిత్ నాయుడు..!   |   ట్రెండింగ్‌లో జటాయు ఎర్త్స్ సెంటర్.. ఆ వైరల్ ప్లేస్ ఎక్కడుందో తెలుసా..?

Bigg Boss10 Telugu: గంగవ్వలా తయారైన నరేష్.. వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రశంసలే..

Bigg Boss10 Telugu: గంగవ్వలా తయారైన నరేష్.. వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రశంసలే..

గతంలో ఓ సీజన్‌లో గంగవ్వ వచ్చారు. అభిజిత్ విన్నర్ అయిన సీజన్ అది. ఆ సమయంలో ఆమె చేసిందేమీ లేదు. ఆమె వయసుకు ఏమీ చేయలేదనే తెలిసే బిగ్‌బాస్ నిర్వాహకులు తీసుకున్నారు. తరువాత కొన్ని వారాలకు తను ఉండలేనంటూ ఆమె రిక్వెస్ట్ చేసి హౌస్ నుంచి వెళ్లిపోయారు. ఆమె హౌస్‌లో ఉన్నంత కాలం ఆమెను ఎవరూ ఏమీ అనలేకపోయారు. ఎందుకంటే ఏమైనా అంటే బయట నెగిటివ్ అయిపోతామన్న భయం. ఆమెను ఎవరూ నామినేట్ చేసింది కూడా లేదు. ప్రతివారం ప్రశంసలే. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో నరేష్ విషయంలో కూడా అదే జరుగుతోంది. వాస్తవానికి నరేష్ చేస్తున్నదేమీ లేదు. టాస్క్‌ల్లో విన్ అవుతున్నది కూడా లేదు. అలాగని అతడిని ఎవరూ పెద్దగా నామినేట్ చేసే సాహసం చేయడం లేదు.

ఒకవారం హోస్ట్ నాగార్జునే ఏదో ఒకటి చేసి నామినేషన్స్‌లోకి రమ్మని నరేష్‌కు సలహా ఇచ్చారు. ఎందుకంటే నామినేషన్స్‌లోకి రాకుంటే సడెన్‌గా ఎప్పుడైనా వస్తే ఎలిమినేట్ అవుతావని.. దీంతో నెక్ట్స్ వీక్ ఎలాగోలా నామినేషన్స్‌లోకి వచ్చాడు. అప్పుడు కూడా అతనికి బిగ్‌బాస్ తనను సేవ్ చేయమంటూ ప్రేక్షకులను నిత్యం అడిగే అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం హౌస్‌లోకి వచ్చిన వారంతా కూడా నరేష్‌కు డప్పు కొట్టడమే. ఇక హోస్ట్ నాగార్జున అయితే నరేష్ కారణంగానే బిగ్‌బాస్ నడుస్తుందన్నట్టుగా బిల్డప్ ఇచ్చేస్తున్నారు. అయితే ఇటీవల నామినేషన్స్ కోసం వచ్చిన చరణ్ మహాదేవ్ మాత్రం అతడు సినిమాలో ‘అందరూ చెబుతుంటే నువ్వేదో అందంగా ఉన్నావని ఫీల్ అవుతున్నావు కానీ నువ్వేమంత అందంగా లేవు’ అని డైలాగ్ చెప్పి.. నరేష్‌కు అందరూ ప్రశంసించడం వలన గొప్పగా ఫీలవుతున్నావని నీ గేమ్ ఏమీ లేదని చెప్పాడు. అది అక్షరాలా నిజం. కానీ అది చెబితే బయట తామెక్కడ నెగిటివ్ అవుతామోనని వెళ్లిన వాళ్లంతా భజన చేస్తున్నారు. మొత్తానికి నరేష్ నక్క తోక తొక్కినట్టున్నాడు. ఎక్స్‌పైరీ డేట్ ఎప్పుడో అయిపోయినా హౌస్‌లో కాలం గడిపేస్తున్నాడు.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360