
నిన్న ఎక్కడైతే టాస్క్‌లు ఆగిపోయాయో అక్కడి నుంచి బిగ్‌బాస్ షో నేడు తిరిగి ప్రారంభమైంది. త్రిగుణ్ వచ్చేసి గేమ్ ప్రారంభానికి ముందుగా నీతూతో దేబ్జాని, వంశీతో మాట్లాడుకుని మీరు ముగ్గురూ చివరి వరకూ ఉండేలా చూసుకోమని చెప్పాడు. ఆ తరువాత దేబ్జానికి మరొకటి చెప్పాడు. దీంతో నీతూ బ్యాగ్ ముందుగానే వంశీ చింపేశాడు. చాలా క్రూయెల్‌గా చేశాడు. ఈ క్రమంలోనే నీతూ గొడవకు దిగింది. దొంగ మాటలు మాట్లాడుతున్నావని.. దొంగ ఆటలెందుకని త్రిగుణ్‌ని నిలదీసింది. ముఖేష్ గురించి త్రిగుణ్ పాట పాడుతూ.. రాత్రైతే పిసుకుతాడు అని పాట పాడిన విషయాన్ని నీతూ తీసింది. ఒకమ్మాయిని నీ క్యారెక్టర్ జీరో అన్నాడని.. అందుకే అతనితో ఏదైనా మాట్లాడాలన్నా భయం వేస్తోందని దేబ్జానికి నీతూ చెప్పింది. వంశీ ఈ రౌండ్ గెలవడంతో వర్షిణి ఫోటోను తీసేసి రివెంజ్ తీర్చుకున్నాడు. దీంతో వర్షిణికి ఫ్యామిలీ రాదు. పైగా కెప్టెన్సీ కంటెండర్ కూడా కాలేదు. వర్షిణి బాగా ఏడ్చేసింది. ఇక్కడ వంశీ మాత్రం ఇది గేమ్ అని అర్థం చేసుకోమని సారీ చెప్పాడు. గేమ్ నుంచి ఎలిమినేట్ అయిన వారి పేరుంటే మార్చుకోమని దేబ్జాని చెప్పింది. ముఖేష్ తన సోదరికి కీమో థెరపి జరుగుతోందని చెప్పడంతో తనకు జాలి వేస్తోందని త్రిగుణ్ చెప్పాడు. నువ్వు ఆడటం తప్ప మరో ఛాన్స్ లేదని బ్రూటల్‌గా ఆడాలని ముఖేష్‌కు వర్షిణి చెప్పింది.
ముఖేష్‌పై తనకొక కన్సర్న్ అని అమన్ చెప్పాడు. తను కూడా పేరు మారుద్దామని అనుకుంటున్నానని.. నువ్వు కూడా మార్చుకోమని అమన్‌కు చెప్పాడు. అమన్ తన పేరు రాయడం.. తనకు డైజెస్ట్ కావడం లేదని త్రిగుణ్ చెప్పాడు. తన కూతురిని తనకు చూడాలని ఉందని నరేష్‌కు త్రిగుణ్ చెప్పాడు. వర్షిణి అయిపోయింది.. ఇంకా నలుగురున్నారని.. ఇంకా ముఖేష్, నీతూ, అమన్, శివ ఉన్నారని రామ్ ప్రసాద్ చెప్పాడు. ఇప్పుడు శివతో పాటు మరొకరు వస్తారని.. ఆడిన వాళ్లను పక్కనబెట్టి ఛాన్స్ రాని వాళ్లను ఆడనిద్దామని రామ్ ప్రసాద్‌కు త్రిగుణ్ చెప్పాడు. ఆ తరువాత శివ్‌తో త్రిగుణ్ సమావేశమయ్యాడు. ఒక పర్సన్ తన పేరు రాశారనగానే ఎవరని శివ్ అడిగాడు. అమన్ అని చెప్పగా.. అదేంటన్నట్టుగా శివ్ షాకయ్యాడు. తను నేమ్ చేంజ్ చేసి ఒక పర్సన్‌ని తీసేయాలనుకుంటున్నట్టుగా శివ్‌కు చెప్పాడు. ఇవాళ ప్లానేంటని రామ్ ప్రసాద్ అడిగాడు. నిన్న ఆడిన ముఖేష్, అమన్ ఇవాళ కూడా ఆడేందుకు గొడవ పడతారని శివ్ చెప్పాడు. నలుగురు ఆడాలంటే ముందుగా మనం నలుగురం (రామ్ ప్రసాద్, నరేష్, శివ్, అమన్) ఆడదామని.. మిగిలిన వాళ్లు ఎవరైనా కొట్టుకోనివ్వమని రామ్ ప్రసాద్ చెప్పాడు. అమన్‌పై అయితే త్రిగుణ్ పగబట్టేశాడు. వాడి పర్సనాలిటీ ఎవరికీ నచ్చలేదని.. వాడిని ఆడనివ్వకూడదని త్రిగుణ్ చెప్పాడు.
నలుగురూ కలిసి దేబ్జానిని తదుపరి టాస్క్ కోసం ఎంచుకున్నారు. రివేంజ్‌లో తన పేరు ఉంటే మార్చుకోమని దేబ్జానిని ముఖేష్ రిక్వెస్ట్ చేశాడు. త్రిగుణ్, శివ, దేబ్జాని, నరేష్, రామ్ ప్రసాద్‌లతో గేమ్ ప్రారంభమైంది. ఐదుగురూ ఒక్కొక్క సపోర్టర్‌ను ఎంచుకుని ఆడాలి. రామ్ ప్రసాద్ ముఖేష్‌ని.. వంశీని నరేష్.. సుధీర్‌ని త్రిగుణ్.. శ్వేతని శివ్.. అమన్‌ని దేబ్జాని సపోర్టర్స్‌గా ఎంచుకున్నారు. పోటీదారులు తాము రివెంజ్ తీర్చుకుందామనుకున్న సభ్యుల పేర్లు మార్చుకోవాలంటే అంతకు ముందు రాసిన పేర్లను కొట్టేసి కొత్త పేరు రాయాలని బిగ్‌బాస్ చెబుతారు. రామ్ ప్రసాద్, నరేష్ ఇద్దరూ వర్షిణి పేరు డిలీట్ చేసి అమన్ పేరు రాశారు. త్రిగుణ్ కూడా అమన్ పేరు రాశాడు. దేబ్జాని మాత్రం తిరిగి ముఖేష్ పేరే రాసి వచ్చింది. ఈ టాస్క్‌కు వర్షిణి సంచాలక్. ఫస్ట్ రౌండ్లో దేబ్జాని బాల్‌ను తీసుకొచ్చింది. తన ఎఫర్ట్ చూడమంటూ గేమ్‌లో దేబ్జాని గొడవ పడింది. ఒక పర్సన్ తన చేయి ఓపెన్ చేస్తున్నారని.. మరొకరు బాల్ తీసుకుంటున్నారని దేబ్జాని నిందలు వేసింది. వర్షిణి ఛాన్స్ ఇవ్వడం లేదని దేబ్జానికి అమన్ చెప్పాడు. మళ్లీ త్రిగుణ్.. అమన్ పేరు తీశాడు. తన కూతురు వస్తే ముందు తనే ఎత్తుకుంటానని చెప్పి తన పేరు రాశాడని సుధీర్, శ్వేతలకు త్రిగుణ్ చెప్పాడు.

అమన్‌తో త్రిగుణ్ వెళ్లి తన పేరు రాయడంపై గొడవ పడ్డాడు. తాను బాగున్నప్పుడు తన పేరెలా రాస్తావని అమన్‌పై ఫైర్ అయ్యాడు. తను బ్యాక్స్టాబర్ కాదని అమన్ చెప్పాడు. తెలుసురా ఎవరు బ్యాక్స్టాబరోనని త్రిగుణ్ అన్నాడు. మొత్తానికి తన పేరు రాయడంతో అమన్‌పై త్రిగుణ్‌కు విపరీతమైన కోపం వచ్చింది. అమన్‌ను దేబ్జాని విన్నింగ్ హార్స్ అంటే.. నో విన్నింగ్ హార్స్.. ఆ హార్స్‌ని నడిపేందుకు వేరొకరు కావాలని త్రిగుణ్ కౌంటర్ వేశాడు. ఈ టాస్క్‌లో శివ్, త్రిగుణ్ మధ్య టై అయ్యింది.. నరేష్ వర్సెస్ దేబ్జాని గొడవ జరిగింది. శివ్, త్రిగుణ్ కలిసి ఆడారని.. అలాంటప్పుడు మనం ఏం చేస్తామని నరేష్ అన్నాడు. మీ ఇద్దరూ పిచ్చోళ్లని దేబ్జాని అనడంపై నరేష్ ఫైర్ అయ్యాడు. శివ్, త్రిగుణ్ మధ్య గేమ్ టై అయ్యిందని బిగ్‌బాస్‌కు వర్షిణి చెప్పింది. ఏం చేయమంటారో చెప్పమంటారో అడిగింది. టై బ్రేకింగ్ కోసం మరో ఛాన్స్ బిగ్‌బాస్ ఇచ్చారు. త్రిగుణ్ గెలిచాడు. త్రిగుణ్‌ని హగ్ చేసుకుని ముఖేష్ అభినందించడం చాలా బాగా అనిపించింది. ఈ ఛాలెంజ్‌లో విజయం సాధించి రివార్డ్ పొంది మీ ఫ్యామిలీని గెలుచుకుంటారని బిగ్‌బాస్ చెప్పారు.
ఇవాళ ఉదయం వరకూ అమన్ పేరును రాయననే చెప్పేవాడినని.. కానీ ఆ గేటులో నుంచి తన కూతురు రాగానే ముందుగా తనే ఎత్తుకుంటానని చెప్పిన అమన్.. ఇలా చేయడం తనకు నచ్చలేదని అందుకే తను ఫస్ట్ రాసిన పేరు మార్చి అమన్ పేరు రాసినట్టుగా త్రిగుణ్ చెప్పాడు. తను ఎమోషనల్‌గా చాలా అటాచ్డ్గా ఉన్నానని.. కంటెండర్‌షిప్ అన్నీ తనకు నథింగ్ అని.. ఫ్యామిలీయే ఇంపార్టెంట్ అని త్రిగుణ్ చెప్పాడు. నాన్న గుర్తొస్తే నా ఒళ్లో వచ్చి పడుకున్నావని.. మీ అమ్మ చేతి ముద్ద తాను తిన్నానని త్రిగుణ్ చెప్పాడు. చివరకు అమన్ ఫోటోను వెల్‌లో వేసి రివెంజ్ తీర్చుకున్నాడు. సుధీర్ దగ్గరకు వెళ్లి తను చాలా తిట్టుకున్నానని.. తనను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పాడు. తనను కోల్పోయింది ముఖేష్ వాళ్లని.. నువ్వు కావని త్రిగుణ్‌కు సుధీర్ చెప్పాడు. రామ్ ప్రసాద్ వాళ్లకు బుర్ర లేదని.. అమన్ కూడా మోసమని.. తనకు ఇక్కడ ఎవ్వరూ లేరని దేబ్జాని హైడ్రామా మొదలు పెట్టింది. ఎప్పుడు గేమ్ ఓడినా కూడా తనకు ఎవ్వరూ లేరని డ్రామా ప్రారంభిస్తుంది.
ఇక నెక్ట్స్ గేమ్‌లో ముగ్గురు ఆడాలని వాళ్లెవరో డిసైడ్ చేసుకోవాలని బిగ్‌బాస్ చెప్పారు. మళ్లీ టాస్ వేసుకున్నారు. దీనిలో నరేష్, దేబ్జాని, నీతూ ఆడాలని వచ్చింది. త్రిగుణ్ సంచాలక్‌గా టాస్క్ ప్రారంభమైంది. మళ్లీ ఎవరిపై అయితే రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నారో వారి పేరును మార్చుకోవచ్చని బిగ్‌బాస్ చెప్పారు. నరేష్ వెళ్లి అమన్ పేరు కొట్టేసి నీతూ పేరు రాశాడు. దేబ్జాని మాత్రం తను మార్చుకునేది లేదని చెప్పింది. నీతూని పేరు మార్చుకోమని బిగ్‌బాస్ చెప్పారు. వారు ఆల్రెడీ రివెంజ్‌కు గురవడంతో పేరు మార్చుకోమని చెప్పారు. అప్పుడు నీతూ వెళ్లి దేబ్జాని పేరు రాసింది. నెక్ట్స్ ముగ్గురితో గేమ్ ప్రారంభమైంది. ఈ టాస్క్‌లో దేబ్జాని విన్ అయ్యింది. నీతూ కన్నీళ్లు పెట్టుకుంది. వచ్చేవారం ఫ్యామిలీని కలుసుకోవడంతో పాటు కెప్టెన్సీ కంటెండర్ అవుతారని బిగ్‌బాస్ చెప్పారు. ఇక ముఖేష్‌పై దేబ్జాని రివెంజ్ తీర్చుకుంది. వాస్తవానికి తన అక్క పరిస్థితిని చూసి త్రిగుణ్ కూడా మనసు మార్చుకున్నాడు కానీ దేబ్జాని మాత్రం మనసు మార్చుకోలేదు. కానీ ముఖేష్ మాత్రం.. దేబ్జాని పేరెంట్స్ వస్తే ముందుగా తనే రిసీవ్ చేసుకుంటానని చెప్పి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. శ్వేత, దేబ్జాని, వంశీ, త్రిగుణ్‌లు ఈవారం రివార్డులు పొంది ఫ్యామిలీని కలుసుకునే అవకాశంతో పాటు కెప్టెన్సీ కంటెండర్స్ గెలుచుకున్నారని బిగ్‌బాస్ చెప్పారు. వీరంతా నామినేషన్స్ నుంచి సేవ్ అయినట్టుగా ప్రకటించారు.
