Menu
BREAKING
బడ్జెట్ కంట్రోలింగ్.. మలయాళం వాళ్లను చూసి మనం నేర్చుకుందామా..?   |   Bigg Boss10 Telugu: నామినేషన్స్ పాయింట్స్ మాట్లాడుకున్న త్రిగుణ్ టీం.. నాగ్ ప్రశ్నిస్తారా?   |   జాన్వీ కపూర్‌కు తత్వం బోధపడిందా.. తిట్టిన నోటితోనే పొగడ్తల వర్షం కురిపిస్తుందిగా..!   |   Bigg Boss10 Telugu: బ్లాక్ కోతి పంచాయతీకి చెక్ పెట్టిన నాగ్.. ఇక టైం లేదు..   |   Bigg Boss10 Telugu: ఈ వారం ఎలిమినేట్ కాబోయేది ఎవరంటే…   |   Bigg Boss10 Telugu: ముఖేష్‌పై రివెంజ్ తీర్చుకున్న దేబ్జాని.. త్రిగుణ్‌ని నిలదీసిన నీతూ..   |   ఓ ఇంటివాడు కాబోతున్న మెగా మేనల్లుడు.. సాయి దుర్గ తేజ్ పెళ్ళి సందడి..!   |   Bigg Boss10 Telugu: ఫ్యామిలీ కోసం బిగ్ ఫైట్.. వంశీ, శ్వేత విన్..   |   వీకెండ్ అయిపోయింది.. ఆదర్శ కుటుంబం సిచ్యువేషన్..   |   హ్యాపీ బర్త్ డే టబు.. అప్పుడు పండు.. ఇప్పుడు మహంతి ఝాన్సీ రాణి..!   |   ఎర్లీ మార్నింగ్ షోస్‌కు ఓకే.. టికెట్ హైక్స్‌కు నో.. విజయ్ సర్కార్ సంచలనం..!   |   మహేష్ బాబు.. ది రియల్ లైఫ్ బిజినెస్ మెన్‌.. వ్యాపారాల్లో దూకుడు..!   |   పాకెట్ రాకెట్స్ టీజర్ రివ్యూ.. మెగా డాటర్ హ్యాట్రిక్ కొట్టేలా ఉందిగా..!   |   “రాధిక ఆప్టే నీకు అసలు సిగ్గుందా..” సోషల్ మీడియాలో బాలయ్య అభిమానుల ఆగ్రహం..!   |   Bigg Boss10 Telugu: మరో రోహిత్ అవుతున్న ముఖేష్.. రెడ్ కార్డ్ ఇచ్చేంత తప్పు చేశాడా?

Bigg Boss10 Telugu: బ్లాక్ కోతి పంచాయతీకి చెక్ పెట్టిన నాగ్.. ఇక టైం లేదు..

Bigg Boss10 Telugu: బ్లాక్ కోతి పంచాయతీకి చెక్ పెట్టిన నాగ్.. ఇక టైం లేదు..

ఇవాళ హౌస్‌లో దీపావళి సందడి నెలకొంది. హోస్ట్ నాగార్జున హౌస్‌లోకి వెళ్లగానే ముందుగా నీతూ, శ్వేత పెర్ఫార్మెన్స్.. ఆ తరువాత అమన్, వర్షిణి, త్రిగుణ్ పెర్ఫార్మెన్స్.. మరోవైపు దేబ్జాని, నరేష్, రామ్ ప్రసాద్.. ఇంకోవైపు శివ్, వంశీ.. ఇలా వరుసగా అందరినీ చూపించిన మీదట.. మొత్తం కలిపి ఓ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. నిజంగా చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. అది చూసిన హోస్ట్ నాగార్జున కూడా చాలా హ్యాపీ ఫీలయ్యారు. ముందుగా పండుగ కాబట్టి ఒకరిని సేవ్ చేసి షోని మొదలు పెడదామని నాగ్ చెప్పారు. ముందుగా ముఖేష్‌ను సేవ్ చేశారు. ఆడియెన్స్‌లో ముఖేష్ ఫ్యాన్ అని చెప్పిన వ్యక్తితో మాట్లాడించారు. ముఖేష్‌ను గేమ్ బాగా చేంజ్ చేసుకున్నావని.. ఇక మీదట అలాగే ఆడమని చెప్పాడు. తనను బ్లాక్ కోతి అనడం తను తీసుకోలేకపోయానని నాగ్‌కు ముఖేష్‌ చెప్పాడు. శివ తన చుట్టూ తిరుగుతున్నాడని అనడంతో తను అలా అనాల్సి వచ్చిందని దేబ్జాని చెప్పింది. అప్పుడు ఆ వీడియోను నాగ్ చూపించారు.

నీతూని అది తప్పా.. కాదా? అని అడిగారు. తను కల్లు తాగిన కోతి అనబోయి బ్లాక్ కోతి అని చెప్పానని చెప్పింది. తను సారీ చెప్పానని అప్పుడే చెప్పానని దేబ్జాని చెప్పింది. కానీ తనకు సారీ చెప్పలేదని ముఖేష్ చెప్పాడు. వాళ్లు ఏం చేసినా కలర్ గురించి మాట్లాడటం వలన నువ్వు తప్పు చేసిన దానివి అయిపోయావని దేబ్జానికి నాగ్ చెప్పారు. నరేష్ కూడా ఇలా మాట్లాడితే ఆడియెన్స్ దృష్టిలో నువ్వు బ్యాడ్ అయిపోతావని దేబ్జానికి తాను అప్పటికే చెప్పానని అన్నాడు. యాక్షన్‌కి రియాక్షన్ ఉంటుందని నాగ్ చెప్పారు. ఇద్దరూ ఒకరికి ఒకరు సారీ చెప్పాలని చెప్పారు. ఇద్దరూ ఒకరికొకరు సారీ చెప్పుకున్నారు. మొత్తానికి బ్లాక్ కోతి పంచాయతీకి నాగ్ చెక్ పెట్టేశారు. ఆ తరువాత హౌస్‌ను రెండు టీములుగా విభజించారు. ఒక టీమ్‌కు ముఖేష్.. మరో టీమ్‌కు దేబ్జాని కెప్టెన్. బ్రేక్‌లో దేబ్జాని వెళ్లి ముఖేష్‌తో కలిసిపోతున్నట్టుగా చెప్పింది. సన్‌డే ఫన్‌డేలో భాగంగా.. ‘నో పాజ్.. ఓన్లీ ఆన్సర్’ అనే గేమ్ ఆడించారు. నాగ్ అడిగే క్వశ్చన్‌కు 3 సెకండ్స్‌లో ఆన్సర్ చేయాలి.

Bigg Boss10 Telugu: బ్లాక్ కోతి పంచాయతీకి చెక్ పెట్టిన నాగ్.. ఇక టైం లేదు..

గేమ్ అయిపోయాక నరేష్‌, రామ్ ప్రసాద్‌ను నామినేషన్స్ నుంచి సేవ్ చేశారు. ఆ తరువాత బీబీ సినిమా గేమ్‌ను ఆడించారు. కొన్ని టైటిల్స్ ఇచ్చి వాటిని ఎవరికి ఇవ్వాలో డిసైడ్ చేయమన్నారు. వర్షిణి వెళ్లి దేబ్జానికి ‘ఫేస్ ఒకటి వర్షన్స్ ఎన్నో’ ఇచ్చింది. తరువాత శివ్ వచ్చి త్రిగుణ్‌కు ‘అందరితో బాండింగ్.. లోపల ప్లానింగ్’ ఇచ్చాడు. నరేష్ వచ్చేసి ‘మాటల్లో తోపు.. ఆటల్లో ఫ్లాప్’ను రామకృష్ణకు ఇచ్చాడు. నీతూకి వంశీ.. ‘ఫస్ట్ వీక్ ఫైర్.. నెక్ట్స్ వీక్ ఎక్స్‌పైర్’ ఇచ్చారు. దేబ్జాని వచ్చేసి నరేష్‌కు ‘డ్రామాకి డైలీ రోజ్’ ఇచ్చింది. ఆ తరువాత ముఖేష్ వచ్చి త్రిగుణ్‌కు ‘వాల్యూమ్ ఫుల్.. వాలిడ్ పాయింట్ నిల్’ అని ఇచ్చాడు. రామకృష్ణ వచ్చేసి నీతూకి ‘బిల్డప్ కొండంత.. పెర్ఫార్మెన్స్ గోరంత’ అనేది ఇచ్చాడు. సుధీర్ వచ్చి.. వర్షిణికి ‘ప్రెజెన్స్ ఎక్కువ.. పర్సస్ తక్కువ’ అని ఇచ్చాడు. నీతూ వచ్చేసి త్రిగుణ్‌కు ‘డబుల్ గేమ్ దొంగ’ ఇచ్చింది. శివకు శ్వేత ‘కెమెరా కోసం కొత్త వేషం’ అని ఇచ్చింది.

రామ్ ప్రసాద్ వచ్చేసి రామకృష్ణకు ‘సినిమా లేని పోస్టర్’ ఇచ్చాడు. త్రిగుణ్ వచ్చేసి ‘స్నేహం నా పేరు.. మోసం నా ఊరు’ అని ముఖేష్‌కు ఇచ్చాడు. అమన్ వచ్చి సుధీర్‌కు ‘సినిమా లేని పోస్టర్’ ఇచ్చాడు. ఆ తరువాత నామినేషన్స్ నుంచి వర్షిణిని నాగ్ సేవ్ చేశారు. ఆ తరువాత ‘ఇట్లు అర్జున’ హీరో అనీష్, అనశ్వర రాజన్ వచ్చారు. వీరిద్దరితో నాగ్ కాసేపు మాట్లాడారు. ట్రైలర్ చూశారు. ఆ తరువాత హౌస్‌మేట్స్ ముందుకు వెళ్లారు. అనీష్, అనశ్వరను హౌస్‌మేట్స్‌కి పరిచయం చేశారు. ఈ హౌస్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా నరేష్‌ను నాగ్ పేర్కొన్నారు. ఆ తరువాత అనశ్వరను ఇంప్రెస్ చేయమన్నారు. ‘గిర గిర’ సాంగ్ పాడి ఇంప్రెస్ చేశాడు. ముఖేష్‌ను లేపి అనశ్వరను ఇంప్రెస్ చేయమంటే.. ‘హాయ్ అనశ్వర.. నిన్ను చూశాక.. నా గుండెకు నువ్వే నా నాదస్వర’ అని చెప్పి ఇంప్రెస్ చేశాడు. ఆ తరువాత వర్షిణిని.. అనీష్‌ని మాట్లాకుండా ఇంప్రెస్ చేయమంటే లవ్ సింబల్ పెట్టి… ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది.

Bigg Boss10 Telugu: బ్లాక్ కోతి పంచాయతీకి చెక్ పెట్టిన నాగ్.. ఇక టైం లేదు..

దేబ్జానిని లేపి అనీస్, అనశ్వరలలో ఎవరు బాగున్నారంటే.. ఇద్దరూ చూడముచ్చటగా ఉన్నారని చెప్పింది. మా ముగ్గురిలో ఎవరు బాగున్నారని నాగ్ అడిగితే.. ఒన్ అండ్ ఓన్లీ మీరు సర్ అని దేబ్జాని చెప్పింది. ఆ తరువాత మీరెక్కడా చూడని త్యాగాలు మీరు మా హౌస్‌లో చూస్తారని అనీష్, అనశ్వరలకు చెప్పానని.. ఇవాళ మీరు దానిని విట్నెస్ చేస్తారని చెప్పినట్టుగా నాగ్ చెప్పారు. నరేష్, వర్షిణి, ఆర్కేలకు ఫ్యామిలీ వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆ ముగ్గురిని ఓ వేయింగ్ స్కేల్ దగ్గర నిలబెట్టారు. ఆ తరువాత మిగిలిన హౌస్‌మేట్స్ అందరినీ మీకు సంబంధించిన వస్తువులను ఎవరి కోసం ఎక్కువగా శాక్రిఫైస్ చేస్తే వాళ్లకు ఫ్యామిలీ వస్తుందని చెప్పారు. అయితే ఆ వస్తువులు తిరిగి రావని చెప్పారు. అంతా వెళ్లి చకచకా వాళ్లకు నచ్చిన వస్తువులన్నీ తీసుకొచ్చి వారికి నచ్చిన కంటెస్టెంట్స్‌కు వేశారు. సుధీర్‌, ముఖేష్.. వర్షిణికి సపోర్ట్‌గా నిలవగా మిగిలిన వారిలో దాదాపుగా నరేష్‌కు సపోర్ట్‌గా నిలిచారు. నరేష్‌కు వెయిట్ ఎక్కువగా ఉండటంతో అతని ఫ్యామిలీ వస్తారని నాగ్ చెప్పారు.

నామినేషన్స్‌లో ఉన్న ముగ్గురిని యాక్టివిటీ రూమ్‌కు రమ్మన్నారు. శివ్, నీతూ, సుధీర్ యాక్టివిటీ రూమ్‌కు వచ్చారు. తనకు పూర్తి స్థాయిలో సహకారం ముఖేష్ నుంచి అందలేదని వర్షిణి.. అతడిని నిలదీసింది. బట్టలు వెయిట్ ఉంటాయని వర్షిణి చెప్పింది. తను జీన్స్ పెట్టానని చెప్పాడు. చాలా షూస్ ఉన్నాయి కదా అవి ఎందుకు పెట్టలేదని అడిగింది. వాస్తవానికి నరేష్‌కు చాలా మంది సపోర్ట్ ఉన్నారు. ముఖేష్ తనకు అయినంత వరకూ సపోర్ట్ చేశాడు. తనకు షూ ఝాన్సీ ఇచ్చిందని.. అందుకే పెట్టలేదన్నట్టుగా ముఖేష్ చెప్పాడు. అది తప్ప తన దగ్గర వేరే ఏమీ లేవని చెప్పాడు. ఆ తరువాత ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా ముగ్గురిలో శివ్ సేవ్ అయ్యాడు. ఆ తరువాత నీతూ, సుధీర్ మిగిలిపోయారు. ముందుగా నీతూని సేవ్ చేశారు. ఆ తరువాత నీతూతో సుధీర్‌ను ఓ డ్రామాతో సేవ్ చేశారు. పండుగ కాబట్టి ఇద్దరూ సేవ్ అయ్యారని నాగ్ చెప్పారు. ఇక మీదట పండుగ ఉండదని బాగా ఆడాలని నాగ్ చెప్పారు. వంశీ కెప్టెన్సీలో ఈ వారం ఎవరూ హౌస్ నుంచి వెళ్లడం లేదని నాగ్ చెప్పారు. ముఖేష్‌ పుట్టినరోజు కావడంతో అతనికి నాగ్ హ్యాపీ బర్త్‌డే చెప్పారు. ఇక వచ్చేవారం బిగ్‌బాస్ సరికొత్త అవతారాన్ని రివీల్ చేశారు. అది ‘ఫ్యామిలీ టైమ్’.

Pranav

Writer and contributor at Telugu Cinema 360