
ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులకు అత్యంత ఇష్టమైన సూపర్ స్పై క్యారెక్టర్ జేమ్స్ బాండ్. ఇప్పటివరకు ఈ ఐకానిక్ పాత్రలో నటించిన యాక్టర్స్ అందరూ వరల్డ్ వైడ్ గా ఓ రేంజ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా డేనియల్ క్రెయిగ్ తర్వాత ఆ రేంజ్ స్టైల్, యాక్షన్ తో నెక్స్ట్ జేమ్స్ బాండ్ గా ఎవరు వస్తారా అని ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఫైనల్ గా ఒక క్లారిటీ వచ్చేసింది. హాలీవుడ్ సెన్సేషన్, ట్విలైట్ మరియు ద బ్యాట్‌మ్యాన్ లాంటి సినిమాలతో గ్లోబల్ క్రేజ్ తెచ్చుకున్న రాబర్ట్ ప్యాటిన్సన్ నెక్స్ట్ జేమ్స్ బాండ్ గా ఫిక్స్ అయ్యారు. ఈ విషయాన్ని అమెజాన్ MGM స్టూడియోస్ రీసెంట్ గా సోషల్ మీడియాలో అఫీషియల్ గా ప్రకటించింది. రాబర్ట్ ప్యాటిన్సన్ 007 గెటప్ లో ఉన్న ఒక స్టైలిష్ పోస్టర్ ను రిలీజ్ చేసి అభిమానులకు అసలైన ట్రీట్ ఇచ్చింది. 40 ఏళ్ల ఈ బ్రిటిష్ యాక్టర్ జేమ్స్ బాండ్ సిరీస్ లో ఈ క్యారెక్టర్ ప్లే చేస్తున్న ఏడవ నటుడిగా రికార్డుల్లోకి ఎక్కారు. ఈ 26వ బాండ్ సినిమా 2028లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.
ఈ అనౌన్స్మెంట్ తర్వాత రాబర్ట్ ప్యాటిన్సన్ చాలా ఎమోషనల్ గా స్పందించారు. సినిమా హిస్టరీలోనే జేమ్స్ బాండ్ లాంటి మోస్ట్ ఐకానిక్ క్యారెక్టర్ గా సెలెక్ట్ అవ్వడం తన లైఫ్ లో మర్చిపోలేని అచీవ్ మెంట్ అని చెప్పారు. ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన అమెజాన్ MGM స్టూడియోస్ టీమ్ కు ఆయన స్పెషల్ థాంక్స్ చెప్పారు. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ, ఇది కేవలం ఒక క్యారెక్టర్ మాత్రమే కాదని, తన కల నిజమవ్వడం అని ఆయన ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఈ నెక్స్ట్ బాండ్ మూవీకి డ్యూన్ సిరీస్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డెనిస్ విల్లెనెయువే దర్శకత్వం వహించనుండగా, పీకీ బ్లైండర్స్ తో పాపులర్ అయిన స్టీవెన్ నైట్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ ఏంటి, రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంచారు. ఇదొక ఫెంటాస్టిక్ టీమ్ అని, వాళ్ళతో కలిసి పనిచేయడానికి తాను ఎంతగానో వెయిట్ చేస్తున్నానని ప్యాటిన్సన్ చెప్పారు.
నిజానికి డేనియల్ క్రెయిగ్ తప్పుకున్నప్పటి నుంచి కొత్త బాండ్ ఎవరనే దానిపై మీడియాలో ఎన్నో వార్తలు వచ్చాయి. జోష్ ఓ కానర్, కల్లమ్ టర్నర్, జాక్ లోడెన్ లాంటి యంగ్ యాక్టర్స్ పేర్లు గట్టిగా వినిపించాయి. వాళ్లకు స్క్రీన్ టెస్ట్ లు కూడా జరిగినట్లు టాక్ వచ్చింది. కానీ అమెజాన్ MGM టీమ్ మాత్రం బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ ట్రాక్ రికార్డ్ ఉన్న ప్యాటిన్సన్ వైపే మొగ్గు చూపింది. ప్రొడ్యూసర్లు అమీ పాస్కల్, డేవిడ్ హేమాన్ చెబుతున్న దాని ప్రకారం ప్యాటిన్సన్ కు ఉన్న యాక్టింగ్ స్కిల్స్, తనను తాను కొత్తగా మార్చుకునే టాలెంట్ వల్ల ఈ తరం జేమ్స్ బాండ్ క్యారెక్టర్ కు ఆయనే పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యారట. అలాగే డైరెక్టర్ డెనిస్ కూడా ప్యాటిన్సన్ ను వెల్కమ్ చేస్తూ, ఆయనలో 007 ఏజెంట్ కు కావాల్సిన ఒక ఫ్రెష్ అండ్ టైమ్ లెస్ సోల్ ఉందని ప్రశంసించారు. వీళ్లిద్దరు ఇప్పటికే డ్యూన్ పార్ట్ 3లో కలిసి పనిచేయడం విశేషం.
ఈ కొత్త జేమ్స్ బాండ్ అనౌన్స్మెంట్ కు బకింగ్ హామ్ ప్యాలెస్ నుంచి కూడా అదిరిపోయే వెల్కమ్ దక్కింది. వాళ్ల ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ప్యాటిన్సన్ కు వెల్కమ్ చెబుతూ పోస్ట్ పెట్టడం విశేషం. అలాగే 1969లో బాండ్ గా నటించిన ఆస్ట్రేలియన్ యాక్టర్ జార్జ్ లాజెన్బీ కూడా ప్యాటిన్సన్ కు వెల్కమ్ చెబుతూ, ఈ స్పెషల్ జర్నీని బాగా ఎంజాయ్ చేయమని ఒక వీడియో మెసేజ్ ద్వారా విష్ చేశారు. ఇక ప్యాటిన్సన్ కెరీర్ చూస్తే హ్యారీ పోటర్ తో స్టార్ట్ అయ్యి, ట్విలైట్ సిరీస్ తో గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. ఆ 5 సినిమాలతో ఏకంగా 3 బిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్స్ రాబట్టారు. తర్వాత ద బ్యాట్‌మ్యాన్ లాంటి కమర్షియల్ సినిమాలతో పాటు ఎన్నో డిఫరెంట్ ఎక్స్ పెరిమెంటల్, ఆర్ట్ హౌస్ సినిమాలు చేసి తన యాక్టింగ్ రేంజ్ ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు షాన్ కానరీ, జార్జ్ లాజెన్బీ, రోజర్ మూర్, తిమోతి డాల్టన్, పియర్స్ బ్రాస్నన్, డేనియల్ క్రెయిగ్ లాంటి లెజెండ్స్ లిస్టులో ప్యాటిన్సన్ చేరిపోయారు.
ఈ కొత్త సినిమాతో జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీ ఒక కొత్త శకంలోకి అడుగుపెట్టబోతోంది. ఎందుకంటే 2021లో అమెజాన్ సంస్థ MGM స్టూడియోస్ ను 8.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత 2025లో బాండ్ సిరీస్ ను ఎప్పటినుంచో హ్యాండిల్ చేస్తున్న ప్రొడ్యూసర్లు బార్బరా బ్రకోలీ, మైఖేల్ జి విల్సన్ ఈ ఫ్రాంచైజీ క్రియేటివ్ కంట్రోల్ ను అమెజాన్ ఎంజిఎమ్ కు ఇచ్చేశారు. 1962లో వచ్చిన ఫస్ట్ బాండ్ మూవీ డాక్టర్ నో నుంచి ఈ సిరీస్ బ్రకోలీ ఫ్యామిలీ చేతుల్లోనే ఉంది. వాళ్ళు ఇన్నేళ్ల పాటు ఈ బ్రాండ్ ఇమేజ్ ను కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు క్రియేటివ్ కంట్రోల్ అంతా అమెజాన్ చేతికి వెళ్లడంతో, ఇకపై బాండ్ సిరీస్ నుంచి మరిన్ని స్పిన్-ఆఫ్స్, కొత్త ఫ్రాంచైజీలు వచ్చే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ఇది బాండ్ సిరీస్ హిస్టరీలో ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. మొత్తానికి ఏడేళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న ఈ కొత్త బాండ్ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అని ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
