Menu
BREAKING
Biggboss10 Telugu: కామనర్స్‌కు పెద్ద దెబ్బ.. అంతా ముఖేషే చేశాడు..   |   సాయి ధరమ్ తేజ్ కష్టాన్ని దోచేస్తున్నారా.. సంబరాల ఏటిగట్టు మళ్ళీ వాయిదా..?   |   చిరంజీవి టాక్ షో.. గెటప్ మార్చేస్తున్న బాస్.. ఎలా ఉండబోతుందో తెలుసా..?   |   రాజమౌళి కోసమే.. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాపై మహేష్, తారక్ రివ్యూ..!   |   భయపెడుతున్న వారణాసి బిజినెస్.. రిలీజ్‌కు ముందే 1000 కోట్లు ఏంటి స్వామి..?   |   ఆ అగ్ర నిర్మాత చేతికి జైలర్ 2 రైట్స్.. మధ్యలో మైత్రి మూవీ మేకర్స్ సడన్‌ ఎంట్రీ..!   |   Biggboss10 Telugu: ఎవరూ తగ్గట్లే.. ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్లదే…   |   Biggboss10 Telugu: ఝాన్సీ గ్రాఫ్ పడగొట్టుకుంటోందా? ఇలా అయితే కష్టమే..   |   బాలయ్య కోసం రేసులో ఇద్దరు దర్శకులు.. కొరటాల సినిమా ఆగిపోయిందా..?   |   Biggbogss10 Telugu: ఫైర్ లేని నామినేషన్స్.. ఇదే తొలిసారి..   |   Biggboss10 Telugu: వామ్మో ఈ గొడవలేంటి? ఒకటా.. రెండా.. ప్రతిదీ రచ్చే..   |   ఇదెక్కడి దిక్కు మాలిన కథ.. ఇదెక్కడి సినిమా.. కీర్తి సురేష్‌కు ఏమైంది..?   |   అప్పుడు నవనీతమ్మా.. ఇప్పుడు నారాయణమ్మ.. మళ్లీ దొరికిపోయావా తమన్..!   |   అంతా ఫేక్.. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు.. అంతా కనికట్టు..!   |   Biggboss10 Telugu: రోహిత్‌కు క్లాసే కాదు.. హ్యాపీ న్యూస్ అందించిన నాగ్..

Biggboss 10 Telugu: రోహిత్ లేకుంటే ఈ షో ఉండదేమో.. అతని చుట్టూనే కంటెంట్..

Biggboss 10 Telugu: రోహిత్ లేకుంటే ఈ షో ఉండదేమో.. అతని చుట్టూనే కంటెంట్..

బిగ్‌బాస్ తెలుగు (Bigg Boss 10 Telugu) (మంగళవారం) ఎపిసోడ్‌లో మహాపరీక్ష టాస్క్‌ కోసం రామ్ ప్రసాద్ (Ram Prasad), రోహిత్ (Rohith) ఇద్దరు నాయకుల్ని ఎన్నుకున్నారు. మిగిలిన వారు ఎవరు ఏ టాస్క్‌లో ఉండాలనే దాని కోసం బ్యాగులు పెట్టారు. అవి తీసుకొచ్చి ఎవరు ఏ జట్టులో ఉండాలనుకుంటున్నారో ఆ నాయకుడికి ఇవ్వాల్సి ఉంటుంది. అలా రామ్ ప్రసాద్‌కు 5 బ్యాగులు, రోహిత్‌కు నాలుగు బ్యాగులు వచ్చాయి. బ్యాగుల్లో బ్యాండ్స్ ఉన్నాయి. అవి ఎవరికైనా ఇవ్వొచ్చు. అలా రామ్ ప్రసాద్.. త్రిగుణ్, ముఖేష్, సుధీర్‌, నరేష్, దేబ్జాని, చరణ్, చైత్రకి ఇచ్చాడు. రోహిత్.. వంశీ, శాలిని, వంశీ, సృష్టి, ఝాన్సీ, కృష్ణుడుకి ఇచ్చాడు. మొత్తానికి టీమ్స్ అయితే ఫామ్ అయిపోయాయి. ఆ తరువాత నన్నెందుకు తీసుకోలేదంటూ రామ్ ప్రసాద్‌ దగ్గర వర్షిణి పంచాయతి పెట్టింది. ఝాన్సీ..

ఆ తరువాత బ్లూ టీమ్‌ను రూమ్‌లోకి పిలిచి హౌస్‌మేట్‌గా మారడానికి ఎవరు అనర్హులనేది అంతా కలిసి డిసైడ్ అయి ఐదుగురి ఫోటోలను డ్యాగర్‌ను స్టాబ్ చేయాలని బిగ్‌బాస్ చెప్పారు. ఫస్ట్ రామ్‌ప్రసాద్ (Ram Prasad).. చరణ్ (Charan) యాక్టివ్‌గా లేడంటూ డ్యాగర్‌ను చరణ్ ఫోటోపై పొడిచారు. అగ్నిపరీక్షలో 100 పర్సెంట్ చూస్తే ఇక్కడ 10 కూడా లేడని చెప్పాడు. సుధీర్.. అమన్ పేరును చెప్పాడు. షాలిని, చైత్రారాయ్ (Chaitra Rai) టాస్క్‌లో సంచాలక్‌గా సరిగా లేడని చెప్పాడు. తనకు కీస్ రాకపోవడంపై పాయింట్స్ సరిగా పెట్టలేదని అతడిని నామినేట్ చేశాడు. వర్షిణి.. రోహిత్‌ని నామినేట్ చేసింది. అతను గ్రీక్ గార్డ్ అన్న బిల్డప్‌తో వచ్చాడని.. ఆ తరువాత గేమ్‌లో ఓడిపోయాడు. అతడు ఎంతసేపూ కృష్ణుడు (Krishnudu)ని మాత్రమే బ్లేమ్ చేశాడని చెప్పింది. అతనిదొక డిఫరెంట్ మైండ్ సెట్ అని తెలిపింది. అగ్నిపరీక్షలో అతడిని లేపి లేపి ఎత్తులో కూర్చోబెట్టారని.. సార్ గారూ అంటూ చాలా దారుణంగా విషం కక్కేసినట్టుగా అనిపించింది. సార్‌కి అగ్ని పరీక్ష నుంచి బిగ్‌బాస్‌కి వచ్చే లోపు కళ్లు చాలా నెత్తికి ఎక్కాయని అతడికి రియాల్టీ తెలియాలని చెప్పింది.

Biggboss 10 Telugu: రోహిత్ లేకుంటే ఈ షో ఉండదేమో.. అతని చుట్టూనే కంటెంట్..

ఇక ముఖేష్ (Mukesh) వచ్చి సృష్టిని నామినేట్ చేశాడు. ఆమె ఒక్క వర్క్ కూడా చేసింది చూడలేదని నామినేట్ చేశాడు. దేబ్జాని.. వచ్చేసి షాలినిని ప్రవర్తన తనకు నచ్చలేదని చెప్పింది. గొడవ పెడతామన్న మైండ్‌సెట్‌లో ఉందని చెప్పి నామినేట్ చేసింది. రామ్ ప్రసాద్ పడుకోవడంతో బిగ్‌బాస్ పిలిచారు. దీంతో కాసేపు ఫన్ నడిచింది. ఇక రెడ్ టీం వంతు. బ్లూ టీం సభ్యుల్లో హౌస్‌మేట్స్‌గా మారేందుకు ఎవరు అనర్హులో చెప్పాలని బిగ్‌బాస్ చెప్పారు. ఆ బాధ్యతను రోహిత్‌(Rohith)కే అప్పగించారు. రోహిత్ ఫస్ట్ కృష్ణుడిని నామినేట్ చేశాడు. అంతకు ముందు టాస్క్‌లో గివ్‌అప్ ఇచ్చారని నామినేట్ చేశాడు. సెకండ్ రామ్‌ప్రసాద్‌ను నామినేట్ చేశాడు. నిన్నటి టాస్క్‌లో రెండు పేజీలుంటే ఒక్కటే చదివాడని.. పడుకుని రూల్ బ్రేక్ చేశాడంటూ నామినేట్ చేశాడు. ఆ తరువాత వర్షిణిని నామినేట్ చేశాడు. రెండు వైపులా వాదనను వినకుండా సేఫ్ గేమ్ ఆడుతోందని చెప్పాడు. ఆ సమయంలో వర్షిణి ప్రవర్తన చాలా చెత్తగా కనిపించింది. ఫోర్త్ త్రిగుణ్‌ని నామినేట్ చేశాడు. అసలు ఆయన ఎవరి మాట వినడం లేదన్నారు. ఎవరైనా మాట్లాడుతున్నా వారిని ఆపేస్తున్నాడని.. ఓవర్ డామినేషన్ చేస్తున్నాడని నామినేట్ చేశాడు. చివరిగా దేబ్జానిని నామినేట్ చేశాడు. డిపెండెంట్‌గా ఉందని చెప్పింది. వాష్ బేసిన్స్ అన్నీ సరిగా లేవని.. ఆమె చేయలేదని చెప్పాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. వాస్తవానికి దేబ్జాని వాదన సరిగానే ఉంది. వాష్‌రూమ్స్ నైట్ క్లీన్ చేస్తానని చెప్పింది. కాబట్టి దేబ్జాని విషయంలో రోహిత్ పెట్టిన పాయింట్ కానీ వాదన కానీ సరిగా లేదు.

ఆ తరువాత కృష్ణుడు ఫైర్ అయ్యాడు. అనవసరంగా ఎందుకంతలా ఫైర్ అయ్యాడో అర్థం కాలేదు. కీ తనకు ఇచ్చారని కుళ్లుబోతుతనం.. సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉందంటూ ఇష్టానుసారంగా మాట్లాడాడు. స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ లేదన్నాడు. కృష్ణుడు ఎంతలా మాట్లాడుతున్నా రోహిత్ మాత్రం నవ్వుతూ నిలబడిపోయాడు. రామ్ ప్రసాద్ తనను సిల్లీ పాయింట్‌తో నామినేట్ చేస్తావా? అని ఫైర్ అయ్యాడు. వర్షిణి సైతం దమ్ముంటే తన పాయింట్స్ పెట్టినవాళ్లు ముందుకు రావాలటూ ఫైర్ అయ్యారు. ఆ తరువాత నామినేట్ అయిన పదిమందికి ప్రొటెక్టివ్ బాస్ టాస్క్‌ను బిగ్‌బాస్ ఇచ్చారు. ఎవరి బాస్‌ను ఆ టీమ్ మెంబర్స్ కాపాడుకోవాలి. డిఫెండర్స్‌ను కిల్ చేస్తూ బాస్ వద్దకు చేరుకోవాలి. ఇదీ టాస్క్. మొదటి రౌండ్‌లో బ్లూ టీం అటాకర్స్.. రెడ్ టీం డిఫెండర్స్. టాస్క్ ప్రారంభమైంది. మొదటగా లాన్‌లోని రెడ్ టీం మెంబర్‌ని చంపేశాక రోహిత్‌ని టార్గెట్ చేసి చంపేశారు. ఆ తరువాత రెండో రౌండ్ ప్రారంభమైంది. హెల్మెట్ లేకున్నా తనపై ఫైర్ చేశారని.. దాని వల్ల దెబ్బ తగిలిందని షాలినిఫైర్ అయ్యింది. త్రిగుణ్ ఫౌల్ గేమ్ ఆడాడని రోహిత్ ఆరోపణ. కృష్ణుడు మాట్లాడిన మాటల గురించి రోహిత్, చరణ్, సృష్టి, షాలిని చర్చించుకున్నారు. పర్సనల్ స్టేట్‌మెంట్స్ చేశాడన్నారు. తన గురించి తెలియకుండా రామ్ ప్రసాద్ తనను యాటిట్యూడ్ అంటూ జడ్జి చేశాడంటూ షాలిని ఏడ్చేసింది.

Biggboss 10 Telugu: రోహిత్ లేకుంటే ఈ షో ఉండదేమో.. అతని చుట్టూనే కంటెంట్..

త్రిగుణ్(Thrigun), వర్షిణి (Varshini) అయితే ఎక్కడ కూర్చున్నా.. ఏం చేస్తున్నా రోహిత్ (Rohith) నామ జపం మాత్రం వీడటం లేదు. మొత్తంగా ఇవాళ్టి షోలో అయితే ఏమీ లేదు. కనీసం మార్నింగ్ సాంగ్ కూడా లేదు. కృష్ణుడు ఫైర్ అవడం, వర్షిణి కాస్త మాటలు జారడం మినహా ఏమీ లేదు. టాస్క్ కూడా ఆసక్తికరంగా ఏమీ లేదు. షో అయితే మొత్తంగా రోహిత్ చుట్టూనే తిరుగుతోంది. ఎవరు ఎక్కడ కూర్చొన్నా అతని గురించే చర్చ. అసలు రోహిత్ లేడంటే బిగ్‌బాస్ సీజన్ 10 లేదన్నట్టుగా తయారవుతోంది. శనివారం హోస్ట్ నాగార్జున (Bigg Boss Host Nagarjuna) వచ్చి అందరినీ సెట్ చేస్తే ఏమైనా మారుతుందేమో చూడాలి.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360