Menu
BREAKING
అప్పుడు నవనీతమ్మా.. ఇప్పుడు నారాయణమ్మ.. మళ్లీ దొరికిపోయావా తమన్..!   |   అంతా ఫేక్.. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు.. అంతా కనికట్టు..!   |   Biggboss10 Telugu: రోహిత్‌కు క్లాసే కాదు.. హ్యాపీ న్యూస్ అందించిన నాగ్..   |   సిగ్మాతో ఏం చేయబోతున్నారు.. సందీప్ కిషన్ జాతకం ఇప్పటికైనా మారుతుందా..?   |   Rajamouli: రాజమౌళి 25 ఏళ్ల ప్రస్థానం.. ఇంతింతై వటుడింతై..!   |   నన్ను తొక్కేయట్లేదు కదా.. వాళ్లకు సైలెంట్‌గా రాడ్ దించేసిన చిరంజీవి..!   |   ‘ది ప్యారడైజ్’ చుట్టూ రాజకీయం.. తెలియకుండానే నాని ఇరుక్కుపోయాడా..?   |   Biggboss10 Telugu: మళ్లీ హౌస్‌లో రాజుకున్న మంటలు.. రోహిత్ వర్సెస్ త్రిగుణ్   |   Biggboss10 Review: అందరికీ నాగ్ క్లాస్.. ఇలా వచ్చి అలా రూ.15 లక్షలతో మిథిలేష్ జంప్..   |   అయ్యా మోహన్ బాబు గారు.. మీ రేంజ్ ఏంటి.. ఈ క్యారెక్టర్స్ ఏంటి సర్..?   |   ఆ ప్యాన్ ఇండియన్ దర్శకుడిపై ప్రెజర్.. అంతా వారసుడి మహిమ..!   |   Biggboss10 Telugu: రోహిత్‌ వర్సెస్ అపూర్వ.. ఎంజాయ్ చేసిన ఇతర హౌస్‌మేట్స్..   |   Biggboss10 Telugu: వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో మళ్లీ టార్గెట్ రోహిత్..   |   ఇప్పుడేం చేస్తాడు మన చిరంజీవి..? శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేస్తాడా..?   |   నానిని ఏ‘మారుస్తున్నదెవరు..?’.. ఎందుకింత మాస్ పిచ్చి.. నీ రూట్స్ మరిచావా నాని..?

Rohith: బరస్ట్ అవుతాడా? భరిస్తూ ఉండిపోతాడా?

Rohith: బరస్ట్ అవుతాడా? భరిస్తూ ఉండిపోతాడా?

బిగ్‌బాస్ (Bigg Boss 10 Telugu) గతంలో అయితే వచ్చిన తొలి వారం కంటెంట్ ఏమీ వచ్చి ఉండేది కాదు. అంతా చక్కగా రాముడు మంచి బాలుడు అనేలా నడుచుకునేవారు. అంతా కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగేవారు. కలిసుంటే కలదు సుఖం అన్నట్టుగా ఉండేవారు. పదవ సీజన్ అలా కాదు. సీన్ మారింది.. సీజన్ మారింది. కంటెస్టెంట్స్ బాగా తెలివిమీరి పోయారు. ముందు తమకు అపోనెంట్ ఎవరనేది తెలుసుకుని మరీ వచ్చి టార్గెట్ చేయడం ఆరంభించారు. అలా ఆపరేషన్ రోహిత్ స్టార్ట్. గత సీజన్‌లో సామాన్యుడు విన్నర్ అవడంతో ఈసారి అలా కాకూడదని మొక్కి మరీ వచ్చినట్టున్నారు. వచ్చీరాగానే ఆపరేషన్ స్టార్ట్ చేశారు. మరి సక్సెస్ అవుతుందో లేదంటే.. బూమరాంగ్ అవుతుందో తెలియాల్సి ఉంది.

ప్రస్తుత సీజన్‌లో తొలిరోజు నుంచి బాగా వినిపిస్తున్న పేరు త్రిగుణ్ (Thrigun). ఈయనను బయట పుల్లారావు అంటున్నారు. ఈయనదో స్ట్రాటజీ. అగ్నిపరీక్షలో రోహిత్‌(Rohith)కి వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి మరీ తన అపోనెంట్ ఎవరనేది డిసైడ్ వచ్చినట్టున్నాడు. కనిపించిన వారికల్లా రోహిత్ గురించే చెబుతున్నారు. వర్షిణి (Varshini) సైతం ముందుగానే ఫిక్స్ అయినట్టుంది. అందుకే ఆమె కూడా రోహిత్‌ని టార్గెట్ చేసింది. అగ్నిపరీక్షలో వచ్చిన కళ్లు నెత్తికెక్కాయంటూ వ్యాఖ్యలు చేసింది. ఇక కృష్ణుడు అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అర్థం లేని కోపంతో ఊగిపోయాడు. కానీ వీరంతా కలిసి అనవసరంగా ఓ సామాన్యుడిని పైకి లేపుతున్నారని అంతా అంటున్నారు. అందరూ కలిసి టార్గెట్ చేస్తే బయట సిపంతి వర్కవుట్ అయి అది రోహిత్‌కే ప్లస్ అవుతుందన్న ఆలోచనే వారికి లేనట్టుగా ఉంది.

ఇదిలా ఉండగా.. రోహిత్ (Rohith) ఏమైనా గొప్పోడా? అంటే అతనూ తప్పులు చేస్తున్నాడు. ఆ తప్పుల్ని పట్టుకుని పాయింట్ టు పాయింట్ వాదిస్తే.. అతను మైనస్ అవుతాడు. ఎవరైతే టార్గెట్ చేశారో వారికి మైలేజ్ వస్తుంది. అదికాకుండా అతని తప్పుల్ని విమర్శించి అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ఇక రోహిత్ విషయానికి వస్తే.. అతనిదో టఫ్ సిట్యువేషన్. వాస్తవానికి తననొకరు టార్గెట్ చేస్తున్నారని తెలియకుంటే అతను కూడా వారిపై ఫైర్ అవుతాడు.. అప్పుడు ప్లస్సో మైనస్సో అవుతాడు. కానీ అతనికి కూడా అంతా కలిసి తనను టార్గెట్ చేస్తున్నారని తెలిసినట్టుగా ఉంది. దీంతో వారికి అనవసర మైలేజ్ ఇవ్వడం ఎందుకని సైలెంట్‌గా ఉండిపోతున్నాడు. అది కూడా అతనికి మైనస్ అవుతుందన్న ఆలోచన అతనికి లేదు. అసలు తననొక ముగ్గురు నేరుగా టార్గెట్ చేస్తుంటే సంయమనం పాటించగలగడం కూడా చాలా పెద్ద ఛాలెంజ్. మరి రోహిత్ బరస్ట్ అవుతాడో.. భరిస్తూ ఉండిపోతాడో చూడాలి.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360