Menu
BREAKING
Biggboss10 Telugu: కామనర్స్‌కు పెద్ద దెబ్బ.. అంతా ముఖేషే చేశాడు..   |   సాయి ధరమ్ తేజ్ కష్టాన్ని దోచేస్తున్నారా.. సంబరాల ఏటిగట్టు మళ్ళీ వాయిదా..?   |   చిరంజీవి టాక్ షో.. గెటప్ మార్చేస్తున్న బాస్.. ఎలా ఉండబోతుందో తెలుసా..?   |   రాజమౌళి కోసమే.. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాపై మహేష్, తారక్ రివ్యూ..!   |   భయపెడుతున్న వారణాసి బిజినెస్.. రిలీజ్‌కు ముందే 1000 కోట్లు ఏంటి స్వామి..?   |   ఆ అగ్ర నిర్మాత చేతికి జైలర్ 2 రైట్స్.. మధ్యలో మైత్రి మూవీ మేకర్స్ సడన్‌ ఎంట్రీ..!   |   Biggboss10 Telugu: ఎవరూ తగ్గట్లే.. ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్లదే…   |   Biggboss10 Telugu: ఝాన్సీ గ్రాఫ్ పడగొట్టుకుంటోందా? ఇలా అయితే కష్టమే..   |   బాలయ్య కోసం రేసులో ఇద్దరు దర్శకులు.. కొరటాల సినిమా ఆగిపోయిందా..?   |   Biggbogss10 Telugu: ఫైర్ లేని నామినేషన్స్.. ఇదే తొలిసారి..   |   Biggboss10 Telugu: వామ్మో ఈ గొడవలేంటి? ఒకటా.. రెండా.. ప్రతిదీ రచ్చే..   |   ఇదెక్కడి దిక్కు మాలిన కథ.. ఇదెక్కడి సినిమా.. కీర్తి సురేష్‌కు ఏమైంది..?   |   అప్పుడు నవనీతమ్మా.. ఇప్పుడు నారాయణమ్మ.. మళ్లీ దొరికిపోయావా తమన్..!   |   అంతా ఫేక్.. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు.. అంతా కనికట్టు..!   |   Biggboss10 Telugu: రోహిత్‌కు క్లాసే కాదు.. హ్యాపీ న్యూస్ అందించిన నాగ్..

Biggboss 10 Telugu: ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్.. భారీగా మారిన గ్రాఫ్

Biggboss 10 Telugu: ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్.. భారీగా మారిన గ్రాఫ్

బిగ్‌బాస్ 10 తెలుగు ఆదిలోనే సంచలనంగా మారుతుంది. ప్రేక్షకుల ఊహలన్నీ తలకిందులవుతున్నాయి. ప్రస్తుతం కంటెస్టెంట్స్‌కి జరుగుతున్న ఓటింగ్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతోంది. దీనికి కారణం టాప్‌లో ఉంటారనుకున్న కంటెస్టెంట్స్ లీస్ట్‌లోకి వెళ్లిపోవడమే. సెలబ్రిటీలుగా వచ్చిన వారంతా ప్రేక్షకులకు బాగా తెలిసిన వారే. అలాగే కామనర్స్ సైతం అగ్నిపరీక్ష ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఒక్కసారిగా వాళ్లకు నెట్టింట ఫాలోయింగ్ భారీగా పెరిగింది. అంతా బాగానే ఉందనుకున్న తరుణంలో ఓటింగ్‌లో అనూహ్యమైన ట్విస్ట్. అసలు ఆ ట్విస్ట్‌కు కారణమేంటి? ఎందుకు ఓటింగ్ మారిపోయింది తెలుసుకుందాం.

బయట నుంచి చూస్తే వేరుగా ఉంటుంది. సీన్లోకి ఎంట్రీ ఇచ్చాక వేరుగా ఉంటుంది. బయట ఏదో అనుకుని.. గేమ్ ప్లాన్ గీసుకుని బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టాక పరిస్థితులు మారిపోవచ్చు. మారిన పరిస్థితులకు అనుగుణంగా గేమ్ ప్లాన్‌ను కూడా మార్చుకోవాలి. లేదంటే బిగ్‌బాస్ కంటెస్టెంట్ జీవితం అసమర్థుని జీవయాత్ర అవుతుంది. బిగ్‌బాస్ ప్రారంభ సమయంలో రైతు బిడ్డ ఝాన్సీపై భారీ అంచనాలున్నాయి. ఇప్పుడు అవన్నీ తలకిందులయ్యాయి. హౌస్‌లో పరిస్థితులకనుగుణంగా ఆమె తన గేమ్ ప్లాన్‌ను మార్చుకోకపోవడమే దీనికి కారణం. కృష్ణుడు ప్రేక్షకులకు బాగా తెలిసిన నటుడు అయినా కూడా ఇన్‌ఫ్లూయెన్స్ అయి.. మాటలు జారడంతో గ్రాఫ్ అంతా పడగొట్టుకున్నాడు. అసలు బిగ్‌బాస్ ఓటింగ్ ఎలా ఉందో చూద్దాం. తొలివారం నామినేషన్స్ లో పర్ఫామెన్స్ కంటే బయట ఉన్న ఫాలోయింగ్ మాత్రమే ఓట్లు రాబడతాయనేది కొంతవరకే కరెక్ట్ అనేది ఓటింగ్‌ని బట్టి నిరూపితమవుతోంది. అందరికంటే టాప్ ఫాలోయింగ్ ఝాన్సీకి ఉంది.

ఝాన్సీ ఓటింగ్ చూస్తే.. 12వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో రోహిత్ కొనసాగుతున్నాడు. కృష్ణుడు లీస్ట్‌లో ఉన్నాడు. త్రిగుణ్ కూడా ఓటింగ్ పరంగా ఏడవ స్థానంలో కొనసాగుతున్నాడని తెలుస్తోంది. పర్సెంటేజీల పరంగా చూస్తే.. రోహిత్‌కి ప్రస్తుతం 20% ఓటింగ్‌తో టాప్‌లో న్నాడు. ముఖేష్ గౌడ 18 శాతం ఓటింగ్ తో సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. రాంప్రసాద్ 10% ఓటింగ్‌ తో మూడవ స్థానంలో.. అమన్ మసూద్ కాస్త అటు ఇటుగా నాలుగో స్థానంలో, ఏడు శాతం ఓటింగ్ తో త్రిగుణ్, సింగర్ ఝాన్సీ , దేబ్జానీ నిలవగా.. మిగతా స్థానాలలో ఐదు శాతం ఓటింగ్ తో జబర్దస్త్ నరేష్ , యాంకర్ వర్షిణి , నాలుగు శాతం ఓటింగ్ తో టెంపర్ వంశీ, మూడు శాతం ఓటింగ్ తో చరణ్, శాలిని, చైత్ర రాయ్ ఒక్కొక్కరు రెండు శాతం ఓటింగ్.. ఇక చివరి నుంచి మూడు స్థానాల్లో సృష్టి , సుధీర్ క్రిష్ ఉన్నారు.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360