Menu
BREAKING
భయపెడుతున్న వారణాసి బిజినెస్.. రిలీజ్‌కు ముందే 1000 కోట్లు ఏంటి స్వామి..?   |   ఆ అగ్ర నిర్మాత చేతికి జైలర్ 2 రైట్స్.. మధ్యలో మైత్రి మూవీ మేకర్స్ సడన్‌ ఎంట్రీ..!   |   Biggboss10 Telugu: ఎవరూ తగ్గట్లే.. ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్లదే…   |   Biggboss10 Telugu: ఝాన్సీ గ్రాఫ్ పడగొట్టుకుంటోందా? ఇలా అయితే కష్టమే..   |   బాలయ్య కోసం రేసులో ఇద్దరు దర్శకులు.. కొరటాల సినిమా ఆగిపోయిందా..?   |   Biggbogss10 Telugu: ఫైర్ లేని నామినేషన్స్.. ఇదే తొలిసారి..   |   Biggboss10 Telugu: వామ్మో ఈ గొడవలేంటి? ఒకటా.. రెండా.. ప్రతిదీ రచ్చే..   |   ఇదెక్కడి దిక్కు మాలిన కథ.. ఇదెక్కడి సినిమా.. కీర్తి సురేష్‌కు ఏమైంది..?   |   అప్పుడు నవనీతమ్మా.. ఇప్పుడు నారాయణమ్మ.. మళ్లీ దొరికిపోయావా తమన్..!   |   అంతా ఫేక్.. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు.. అంతా కనికట్టు..!   |   Biggboss10 Telugu: రోహిత్‌కు క్లాసే కాదు.. హ్యాపీ న్యూస్ అందించిన నాగ్..   |   సిగ్మాతో ఏం చేయబోతున్నారు.. సందీప్ కిషన్ జాతకం ఇప్పటికైనా మారుతుందా..?   |   Rajamouli: రాజమౌళి 25 ఏళ్ల ప్రస్థానం.. ఇంతింతై వటుడింతై..!   |   నన్ను తొక్కేయట్లేదు కదా.. వాళ్లకు సైలెంట్‌గా రాడ్ దించేసిన చిరంజీవి..!   |   ‘ది ప్యారడైజ్’ చుట్టూ రాజకీయం.. తెలియకుండానే నాని ఇరుక్కుపోయాడా..?

ఆ అగ్ర నిర్మాత చేతికి జైలర్ 2 రైట్స్.. మధ్యలో మైత్రి మూవీ మేకర్స్ సడన్‌ ఎంట్రీ..!

ఆ అగ్ర నిర్మాత చేతికి జైలర్ 2 రైట్స్.. మధ్యలో మైత్రి మూవీ మేకర్స్ సడన్‌ ఎంట్రీ..!

టాలీవుడ్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వరుస సినిమాలు నిర్మిస్తూ స్టార్ ప్రొడ్యూసర్‌గా దూసుకుపోతున్న నాగవంశీ, కేవలం నిర్మాణానికే పరిమితం కాకుండా ట్రేడ్ మార్కెట్‌లో ఓ పవర్‌ఫుల్ డిస్ట్రిబ్యూటర్‌గానూ అంతే స్పీడ్ చూపిస్తున్నారు. సాధారణంగా ఇతర ఇండస్ట్రీల భారీ చిత్రాలను, క్రేజీ డబ్బింగ్ సినిమాలను కొనుగోలు చేసేందుకు చాలామంది పెద్ద నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు మార్కెట్ ఒడిదుడుకులు చూసి ఆచితూచి అడుగులు వేస్తుంటారు. కానీ నాగవంశీ మాత్రం ట్రెండ్‌కు భిన్నంగా ఎంతటి రిస్క్ అయినా సరే ధైర్యంగా ముందుకు దూసుకెళ్లడం ఆయన స్పెషాలిటీగా మారిపోయింది. ఇప్పుడు అదే తరహాలో సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ జైలర్ 2 తెలుగు హక్కులను దక్కించుకున్నాడు. ఏకంగా 45 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి జైలర్ 2 తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను నాగవంశీ సొంతం చేసుకోవడం ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

నిజానికి జైలర్ 2 పై నాగవంశీ పెట్టిన ఈ 45 కోట్ల పందెం ట్రేడ్ పరంగా చాలా పెద్ద రిస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇటీవల రజినీకాంత్ నటించిన భారీ చిత్రం కూలీ హక్కులను సీనియర్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, ఏసియన్ సినిమాస్ సంస్థ దాదాపుగా ఇదే రేంజ్ భారీ ధరకు దక్కించుకున్నారు. కానీ తీరా సినిమా థియేటర్లలోకి వచ్చాక తెలుగు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది, బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అందుకోవడంలో తడబడి నష్టాలను మిగిల్చింది. కూలీ సినిమా రిజల్ట్ అలా ఉన్నప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా నాగవంశీ జైలర్ 2 కోసం మళ్లీ అంతే పెద్ద మొత్తాన్ని రిస్క్ చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే వంశీ ఇంత కాన్ఫిడెంట్‌గా ఉండటానికి బలమైన కారణం లేకపోలేదు. మొదటి భాగం జైలర్ రిలీజ్ అయినప్పుడు కేవలం 11 కోట్ల నామమాత్రపు రేటుకే తెలుగు రైట్స్ అమ్మారు. కానీ బాక్సాఫీస్ దగ్గర అది సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు, ఏకంగా 48 కోట్ల షేర్ రాబట్టి బయ్యర్లకు ఊహించని లాభాలు తెచ్చిపెట్టింది. ఆ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకునే నిర్మాతలు సీక్వెల్ రేటును ఏకంగా 45 కోట్లకు పెంచేయగా, వంశీ కూడా ఆ క్రేజ్ మీద నమ్మకంతోనే అక్టోబర్ 15న రాబోతున్న ఈ సినిమా హక్కులను లాక్ చేశారు.

కేవలం గుడ్డిగా రిస్క్ తీసుకోవడమే కాకుండా, తన బిజినెస్ ప్లానింగ్‌లోనూ నాగవంశీ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. 45 కోట్ల భారీ భారాన్ని మొత్తం తన భుజాలపైనే మోయకుండా నైజాం ఏరియా రైట్స్‌ను టాలీవుడ్‌లో బలమైన పంపిణీ నెట్‌వర్క్ ఉన్న మైత్రి మూవీ మేకర్స్ చేతుల్లో పెట్టారు. మైత్రి సంస్థకు నైజాం హక్కులను అప్పగించడమే కాకుండా, అందులోంచి వచ్చే కలెక్షన్లలో మళ్లీ 10 శాతం షేర్ నాగవంశీ తన ఖాతాలోనే ఉంచుకోవడం విశేషం. దీనివల్ల నైజాం డిస్ట్రిబ్యూషన్ పరంగా తనకున్న బేస్ రిస్క్ సేఫ్ అవ్వడమే కాకుండా, ఒకవేళ రేపు సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లు సాధిస్తే ఆ లాభాల్లోంచి కూడా పది శాతం వాటా ఆయన జేబులోకి వచ్చి పడుతుంది. భారీ సినిమాలు కొనేటప్పుడు ఇలాంటి తెలివైన పార్ట్‌నర్‌షిప్స్ చేసుకోవడం నాగవంశీ మార్క్ బిజినెస్ స్ట్రాటజీని స్పష్టం చేస్తోంది. ఏరియాల వారీగా బిజినెస్‌ను పంచుకుంటూనే తన ప్రాఫిట్ మార్జిన్స్‌ను కాపాడుకోవడంలో ఆయన వేస్తున్న ఎత్తుగడలు డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఆయనకున్న పట్టును చూపిస్తున్నాయి.

గత రెండేళ్ల మార్కెట్‌ను పరిశీలిస్తే నాగవంశీ డబ్బింగ్ సినిమాలు, ఇతర భారీ ప్రాజెక్టుల కొనుగోలులో చాలా అగ్రెసివ్‌గా దూసుకుపోతున్నారు. గతంలో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ మల్టీస్టారర్ వార్ 2 తెలుగు హక్కులను నాగవంశీ ఏకంగా 90 కోట్లకు కొన్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలపై నాగవంశీ స్వయంగా క్లారిటీ ఇస్తూ, ఆ సినిమాను తాను 90 కోట్లకు కొనలేదని, అసలు డీల్ విలువ 68 కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. అంతేకాదు యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ అడ్వాన్స్ బేసిస్ కింద ఇప్పటికే 18 కోట్లు తమకు రిటర్న్ ఇచ్చేసిందని, కాబట్టి అక్కడ కూడా తాను పూర్తిగా సేఫ్ జోన్‌లోనే ఉన్నానని ఓపెన్‌గా చెప్పారు. బయటకు భారీ నంబర్స్ కనిపించినా తెరవెనుక ఆయన చేసుకునే పేమెంట్ ఒప్పందాలు, అడ్వాన్స్ నిబంధనలు చాలా పక్కాగా ఉంటాయనడానికి వార్ 2 వ్యవహారమే అతిపెద్ద ఉదాహరణగా నిలిచింది.

ఇప్పుడు జైలర్ 2 విషయంలో కూడా అసలైన సస్పెన్స్ ఇక్కడే దాగి ఉంది. ఈ 45 కోట్ల భారీ మొత్తాన్ని నాగవంశీ పూర్తిగా ఔట్ రేట్ పద్ధతిలో సొంతం చేసుకున్నారా, లేక గతంలో యశ్ రాజ్ తరహాలోనే సన్ పిక్చర్స్ నుంచి కూడా ఏవైనా అడ్వాన్స్ బేసిస్ సేఫ్టీ నిబంధనలు పెట్టుకున్నారా అనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఒకవేళ ఇది పూర్తిగా నాన్-రిఫండబుల్ ఔట్ రేట్ బిజినెస్ అయితే మాత్రం సినిమా మొదటి ఆట నుంచే యునానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 50 కోట్లకు పైగా షేర్ వస్తేనే సినిమా క్లీన్ హిట్ స్టేటస్ అందుకుంటుంది. అంటే 100 కోట్లు గ్రాస్ రావాల్సిందే. అయితే నెల్సన్ మార్క్ డార్క్ కామెడీ, రజినీకాంత్ స్టైలిష్ మాస్ స్వాగ్, దానికితోడు అనిరుధ్ ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరోసారి థియేటర్లలో మ్యాజిక్ రిపీట్ చేస్తే ఈ టార్గెట్ అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఏది ఏమైనా ఎంతటి పెద్ద సినిమా అయినా తగ్గేదే లే అంటూ ముందడుగేస్తున్న నాగవంశీ గట్స్ టాలీవుడ్‌లో సెన్సేషన్ కాగా, అక్టోబర్ 15న రాబోతున్న జైలర్ 2 ఆయనకు ఎలాంటి లాభాలు తెచ్చిపెడుతుందో చూడాలి.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360