Menu
BREAKING
ఆ అగ్ర నిర్మాత చేతికి జైలర్ 2 రైట్స్.. మధ్యలో మైత్రి మూవీ మేకర్స్ సడన్‌ ఎంట్రీ..!   |   Biggboss10 Telugu: ఎవరూ తగ్గట్లే.. ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్లదే…   |   Biggboss10 Telugu: ఝాన్సీ గ్రాఫ్ పడగొట్టుకుంటోందా? ఇలా అయితే కష్టమే..   |   బాలయ్య కోసం రేసులో ఇద్దరు దర్శకులు.. కొరటాల సినిమా ఆగిపోయిందా..?   |   Biggbogss10 Telugu: ఫైర్ లేని నామినేషన్స్.. ఇదే తొలిసారి..   |   Biggboss10 Telugu: వామ్మో ఈ గొడవలేంటి? ఒకటా.. రెండా.. ప్రతిదీ రచ్చే..   |   ఇదెక్కడి దిక్కు మాలిన కథ.. ఇదెక్కడి సినిమా.. కీర్తి సురేష్‌కు ఏమైంది..?   |   అప్పుడు నవనీతమ్మా.. ఇప్పుడు నారాయణమ్మ.. మళ్లీ దొరికిపోయావా తమన్..!   |   అంతా ఫేక్.. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు.. అంతా కనికట్టు..!   |   Biggboss10 Telugu: రోహిత్‌కు క్లాసే కాదు.. హ్యాపీ న్యూస్ అందించిన నాగ్..   |   సిగ్మాతో ఏం చేయబోతున్నారు.. సందీప్ కిషన్ జాతకం ఇప్పటికైనా మారుతుందా..?   |   Rajamouli: రాజమౌళి 25 ఏళ్ల ప్రస్థానం.. ఇంతింతై వటుడింతై..!   |   నన్ను తొక్కేయట్లేదు కదా.. వాళ్లకు సైలెంట్‌గా రాడ్ దించేసిన చిరంజీవి..!   |   ‘ది ప్యారడైజ్’ చుట్టూ రాజకీయం.. తెలియకుండానే నాని ఇరుక్కుపోయాడా..?   |   Biggboss10 Telugu: మళ్లీ హౌస్‌లో రాజుకున్న మంటలు.. రోహిత్ వర్సెస్ త్రిగుణ్

Biggboss10 Telugu: ఝాన్సీ గ్రాఫ్ పడగొట్టుకుంటోందా? ఇలా అయితే కష్టమే..

Biggboss10 Telugu: ఝాన్సీ గ్రాఫ్ పడగొట్టుకుంటోందా? ఇలా అయితే కష్టమే..

బిగ్‌బాస్ 10 తెలుగు రసవత్తరంగా సాగుతోంది. గత సీజన్లలో అయితే గొడవలు ఎప్పుడు అవుతాయా? అని చూడాల్సి వచ్చేది. ఇప్పుడు గొడవలు ఎప్పుడు ఆగుతాయా? అని చూడాల్సి వస్తోంది. ప్రతిరోజూ గొడవే. అదేం విచిత్రమో కానీ వీకెండ్‌లో నాగార్జున వచ్చి అసలు గొడవలే జరగనట్టుగా సింపుల్‌గా ఒకరిద్దరిని లేపి అక్షింతలు వేసి వెళ్లిపోతున్నారు. దీంతో నాగ్‌పై కూడా ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక గత వారం నామినేషన్స్ విషయానికి వస్తే లీస్ట్ 3లో ఝాన్సీ, వర్షిణి, వంశీ ఉన్నారు. అయితే ఎందుకోగానీ ఝాన్సీని త్రిగుణ్ కంటే ముందుగా సేవ్ చేశారు. మరి ఈ ధీమానో.. తనకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారన్న ధీమానో కానీ ఝాన్సీ మాత్రం సెలబ్రిటీలను వీడటం లేదు.

ఝాన్సీకి రోహిత్ కూర్చోబెట్టి మరీ సెలబ్రిటీలంతా ఏకమయ్యారు మనం ఏకమవకుంటే కష్టమని చెప్పినా కూడా విన్నట్టే విని.. అవతలికి వెళ్లి తన వ్యవహారం తాను సాగిస్తోంది. ఏమాత్రం కామనర్స్‌తో కలవడం లేదు. ఇక గతవారం నాగార్జున నామినేషన్స్ గురించి మాట్లాడొద్దంటూ రామ్ ప్రసాద్‌కి వార్నింగ్ ఇచ్చారు. అది అందరికీ వర్తిస్తుంది. కానీ అదేమీ పట్టించుకోకుండా సెలబ్రిటీలంతా కలిసి అగ్నిపరీక్ష టీం మొత్తాన్ని నామినేషన్స్‌లోకి తీసుకురావాలని స్కెచ్ గీశారు. ఆ స్కెచ్‌లో ఝాన్సీ కూడా పార్టిసిపేట్ చేయడమే కాకుండా తెలియకుండా దెబ్బ కొట్టాలంటూ సలహాలు కూడా ఇచ్చింది.

తను కూడా అగ్నిపరీక్ష నుంచే వచ్చింది. ఈ విషయాన్నే ఆమె మరిచి.. తనతోటి కంటెస్టెంట్స్‌ను నామినేషన్స్‌లోకి తీసుకు రావాలన్న స్కెచ్‌కు సలహాలిచ్చింది. అంతేకాకుండా తను కూడా అగ్ని పరీక్ష టీంనే టార్గెట్ చేసింది. ఝాన్సీ వచ్చేసి సృష్టిని నామినేట్ చేసి తన వంతు సహకారం సెలబ్రిటీలకు అందించింది. ఈ స్కెచ్ షోలో రాకున్నా కూడా లైవ్ చూసిన వారంతా ఈ వీడియో క్లిప్‌ను నెట్టింట వైరల్ చేస్తున్నారు. దీంతో నెటిజన్లు అంతా ఫైర్ అవుతున్నారు. ఝాన్సీ ప్రవర్తన మొదటి నుంచి నెటిజన్లకు నచ్చడం లేదు. ఆమె ఇలా సెలబ్రిటీల స్కెచ్‌లో తను కూడా ఓ సెలబ్రిటీ అన్నట్టుగా భాగమవడంతో ఇక మీదట ఇలా ఉంటే కష్టమేనన్న అభిప్రాయం నెట్టింట వ్యక్తమవుతోంది.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360