Menu
BREAKING
Biggboss 10 Telugu: ఇంట్రస్టింగ్‌గా కెప్టెన్సీ రేస్.. నక్కతోక తొక్కిన ఝాన్సీ   |   Biggboss 10 Telugu: ఎంట్రీ ఇచ్చిన చరణ్.. మారుతున్న ఈక్వేషన్స్..   |   Biggboss 10 Telugu: హౌస్ నుంచి షాలిని అవుట్.. అవాక్కైన కంటెస్టెంట్స్   |   Biggboss 10 Telugu: రోహిత్, షాలిని లవ్.. కన్ఫర్మ్ చేసిన రామ్ ప్రసాద్   |   అంజలి లేటెస్ట్ ఫొటోలు.. చీరలో మరింత అందంగా మెరిసిపోతున్న ‘గీతాంజలి’!   |   Biggboss 10 Telugu: హాట్ హాట్‌గా నామినేషన్స్.. ఆపరేషన్ త్రిగుణ్ సక్సెస్   |   The Paradise: నాని ‘ది ప్యారడైజ్’లో ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు.. స్క్రీన్ షేక్ అయిపోతుందేమో మరి..?   |   Fauzi: ‘ఫౌజీ’ సమస్యేంటి.. ప్రభాస్‌కు క్లారిటీ లేదా..? హను కన్ఫ్యూజ్ అవుతున్నాడా..?   |   Biggboss10 Telugu: మారిపోయిన సుధీర్.. త్రిగుణ్‌కు షాక్   |   ముఖేష్ అంటే చాలా ఇష్టమన్న దేబ్జాని.. ప్రేక్షకుల చేతుల్లో పవర్..   |   Biggboss 10 Telugu: సోషల్ మీడియాలో మారుమోగుతున్న రోహిత్..   |   Biggboss 10 Rohith: రోహిత్‌నే టార్గెట్ చేసిన నాగ్.. ఇకపై పెరగనున్న అటాక్..   |   Biggboss Telugu 10: రోహిత్‌కు క్లాస్.. త్రిగుణ్‌కు పనిష్మెంట్   |   Biggboss 10 Telugu: ఎలిమినేషన్‌లో భారీ ట్విస్ట్.. ఎవరూ ఊహించలే..   |   బిగ్ బాస్ లో ట్విస్ట్‌లు ఉంటాయంటే ఏమో అనుకున్నాం కానీ భారీ ట్విస్ట్‌లు…

Biggboss 10 Telugu: ఎంట్రీ ఇచ్చిన చరణ్.. మారుతున్న ఈక్వేషన్స్..

Biggboss 10 Telugu: ఎంట్రీ ఇచ్చిన చరణ్.. మారుతున్న ఈక్వేషన్స్..

నిన్నటి కెప్టెన్సీ టాస్క్ గురించి దేబ్జాని ఆవేదన చెందడం.. వర్షిణి వారించడంతో నేటి (గురువారం) షో ప్రారంభమైంది. ‘ముఖేష్ నిన్ను ట్రాప్ చేస్తున్నాడేమో అనిపిస్తోంది’ అని నరేష్ అంటే అంత సీన్ లేదని వర్షిణి అంటోంది. ‘నిన్ను వేరేలా చూస్తున్నాడేమోనని నాకనిపిస్తోంది’ అని నరేష్ అంటే అదేమీ లేదని వర్షిణి చెప్పింది. మీరిద్దరు ఫ్రెండ్స్ కాదా? లవ్ ఉందా? అని వర్షణిని సుధీర్, నరేష్ అడిగారు. ఇదంతా ముఖేష్ వచ్చి వర్షిణి వెనుక వచ్చి కూర్చొని ఒక్కొక్కటి అడిగిస్తుంటే వాళ్లు అడిగారు. తన దృష్టిలో ఈవారం టాప్ 5లో షాలిని, సృష్టి, వంశీ ఉంటారని త్రిగుణ్ చెప్పాడు. షాలిని తనకు చాలా నచ్చిందని తెలిపాడు. దేబ్జాని కాస్త పిచ్చిదని సగం సగం అర్థం చేసుకుంటుందని త్రిగుణ్ చెప్పాడు. సుధీర్, వర్షిణి మధ్య కాన్వర్సేషన్ జరుగుతోంది. ‘ముఖేష్.. నువ్వు తినిపించుకోవడం వేరేలా బయటకు వెళుతుంది’ అని సుధీర్ వర్షిణికి చెప్పాడు. రోహిత్ గురించి త్రిగుణ్, వంశీ మధ్య చర్చ జరిగింది. ‘వాడు గెలవడం కోసం పక్కనోడిని తొక్కడమైనా.. మరొకటైనా చేస్తాడు’ అని వంశీ అనడంతో ఎగ్జాట్లీ అని త్రిగుణ్ అన్నాడు.

Biggboss 10 Telugu: ఎంట్రీ ఇచ్చిన చరణ్.. మారుతున్న ఈక్వేషన్స్..

ఇన్ని రోజులవుతున్నా హార్ట్ టు హార్ట్ మాట్లాడటం లేదని సృష్టితో షాలిని చెబితే.. తనతో అందరూ బాగానే ఉంటారని సృష్టి చెప్పింది. ఫుడ్ టైమింగ్స్ గురించి ముఖేష్, వర్షిణి, రోహిత్ మధ్య ఒకవైపు.. వంశీ దేబ్జాని మధ్య మరవైపు వైపు చర్చ జరిగింది. ఫలానా టైమ్‌కే ఫుడ్ ప్రిపేర చేస్తామంటే ఎలా? ఆ టైమ్‌కి టాస్క్ ఉంటే అందరం మాడతాం కదాని ముఖేష్ వాళ్ల వర్షన్, టైమ్ చెప్పాం. ఆ టైంకే వండుతామని వంశీ అంటున్నాడు. మొత్తానికి ప్రశాంతంగానే ఫుడ్ తినేశారంతా. రోహిత్, త్రిగుణ్ మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. ‘మనం ఒక డీల్‌కి వద్దామా? అని త్రిగుణ్ అడిగాడు. బ్యాక్ స్టాబ్ చేయనంటే ఓకేనని రోహిత్ అన్నాడు. ‘నువ్వు, నేను చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్. ఇద్దరం కలిసి ఆడితే మన ఎదుట ఎవరూ నిలవలేరు. ఈ వారం అయిపోయింది. వచ్చేవారం కలిసి ఆడుదాం’ అని త్రిగుణ్ అనడంతో రోహిత్ ఓకే చెప్పాడు. అంటే నెక్ట్స్ వీళ్లిద్దరూ అవకాశం వస్తే కలిసి ఆడుతారన్న మాట.

ఇక లెవల్ 2 కెప్టెన్సీ టాస్క్ ప్రారంభమైంది. ఎస్ ఫర్ స్పీడ్.. ఎస్ ఫర్ స్టార్ట్ అనేది టాస్క్ నేమ్. దీనిని త్రిగుణ్, దేబ్జాని, రామ్ ప్రసాద్ ఆడారు. ఈ టాస్క్ కూడా దేబ్జాని అద్భుతంగా ఆడింది. త్రిగుణ్, రామ్‌ప్రసాద్‌ని మించి ఆడింది. అయితే బ్లాక్స్ టేబుల్ మీద వేయడంలో మాత్రం వెనుకబడిపోయింది. దీంతో రామ్ ప్రసాద్, త్రిగుణ్ ఈ టాస్క్ విన్ అయ్యారు. అన్నీ బాగా చేస్తూ లాస్ట్‌లో వచ్చి ఓడిపోతున్నానని దేబ్జాని.. బిగ్‌బాస్‌కి చెప్పి ఫీలవుతోంది. అయితే తను హ్యాపీ అని.. వాళ్లకంటే ముందుగా ఆడానని తెలిపింది. తనలో కాన్ఫిడెన్స్ పెరిగిందని దేబ్జాని చెప్పింది. మళ్లీ బాక్సులు ఏర్పాటు చేశారు. బయటి నుంచి యమ భటుల గెటప్‌లో ముగ్గురు వ్యక్తులు వచ్చారు. ఆ బాక్సులై ఓ లెటర్ పెట్టారు. దానిపై ఓపెన్ ఇట్ అని రాసి ఉంది. దానిని సృష్టి ఓపెన్ చేసింది. అయితే ఫస్ట్ ముట్టుకున్న షాలిని తీసుకుని మెయిన్ డోర్ వరకూ వెళ్లారు. అంతా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోయారు. అక్కడ షాలినితో పాటు యమ భటుడు ఒకరు ఉండిపోయాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు చరణ్. అంతా వచ్చి అతడిని హగ్ చేుకుని ఆనందం వ్యక్తం చేశారు.

Biggboss 10 Telugu: ఎంట్రీ ఇచ్చిన చరణ్.. మారుతున్న ఈక్వేషన్స్..

ఈసారి చరణ్ చాలా హుషారుగా కనిపించాడు. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకుని ప్రేక్షకులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతావని భావిస్తున్నానని బిగ్‌బాస్ చెప్పారు. దానికి చరణ్ కూడా అందరికీ నచ్చేలా ఆడుతానని మాటిచ్చాడు. ఎవరితోనూ ఏ విషయమూ పంచుకోవడానికి లేదని బిగ్‌బాస్ వార్నింగ్ ఇచ్చాడు. చరణ్‌తో రోహిత్.. ‘నేను నిన్ను మోసం చేశా’ అని అనిపించిందా? అని అడిగాడు. తన మనసులో మీ అందరి స్థానాలు పదిలమని చరణ్ చెప్పాడు. బయటకు వెళ్లి వచ్చాడు కాబట్టి చరణ్‌కు ప్రతిదీ తెలుసని అంతా మాట్లాడుకున్నారు. అందరినీ ఇమిటేట్ చేసి నరేష్, రామ్ ప్రసాద్ నవ్వించారు. ఈరోజేమో కానీ రోహిత్ తాను ఒకరోజు కలుస్తామని అప్పుడు అందరికీ ఉంటుందని త్రిగుణ్.. షాలిని, వంశీలకు చెప్పాడు. పవర్ ఆఫ్ పీపుల్ ద్వారా ప్రేక్షకులు ఓ పవర్ కూడా అందించారని బిగ్‌బాస్ చెప్పారు. అదేంటంటే.. కెప్టెన్సీ కంటెండర్స్ రేస్‌లో ఉన్న ఐదుగురిలో ఒకరిని తొలగించవచ్చని చెప్పారు. లేదంటే ఇప్పడున్న కంటెండర్స్‌లో ఒకరిని ఛాలెంజ్ చేసి వారితో ఆడి గెలిచి కెప్టెన్సీ కంటెండర్ అవ్వొచ్చని బిగ్‌బాస్ తెలిపారు. తను ఛాలెంజ్‌ని ఎంచుకుంటున్నానని.. త్రిగుణ్‌ని ఛాలెంజ్ చేస్తున్నట్టు చరణ్ తెలిపాడు. త్రిగుణ్ ఫోటోని ఛాలెంజ్ వైపు పెట్టమని బిగ్‌బాస్ చెప్పారు.

Charan, Thrigun in Bigg Boss 10 Telugu

చరణ్ వచ్చి తనతో తలపడుతున్నాడంటే తను స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అని కృష్ణుడితో త్రిగుణ్ చెప్పాడు. ఛాలెంజ్ చేయాలని చరణ్ బాగా ఎంచుకున్నాడని రోహిత్ వాళ్లు మాట్లాడుకున్నారు. తను ఎంత ఒంటరి అయితే అంత పవర్‌ఫుల్ అవుతానని అమన్‌తో త్రిగుణ్ చెప్పాడు. పాత్ ఆఫ్ పవర్ టాస్క్‌ను చరణ్, త్రిగుణ్‌కి బిగ్‌బాస్ చెప్పారు. రూల్స్‌ని పాటిస్తూ ఒక పాత్‌లో టైల్స్‌ను అమర్చి కంటెండర్ బోర్డును తీసుకోవాలి. ఇదీ టాస్క్. ఈ టాస్క్‌లో వేగం, అబ్జర్వేషన్ వంటివన్నీ కీలకం. ఈ టాస్క్‌కు రామ్ ప్రసాద్ సంచాలక్. ఈ టాస్క్‌ను చాలా ఇంటెలిజెంట్‌గా త్రిగుణ్ పూర్తి చేశాడు. రూల్స్ ఫాలో అయ్యాడు. దీంతో త్రిగుణ్ గెలిచాడు కానీ చరణ్ ఓడపోయాడు. చరణ్ స్మార్ట్ ప్లే చేశాడు. కానీ టాస్క్‌ని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. చరణ్ గేమ్‌ను సీరియస్‌గా తీసుకోలేదని చెప్పాడు. చరణ్‌ది అతి తెలివి అని ముఖేష్‌తో ఝాన్సీ అన్నది. అందరూ పొగిడే సరికి తెలివి అనుకుంటున్నాడంటూ మాట్లాడింది. మొత్తానికి టాస్క్‌లోనే చాలా కన్ఫ్యూజన్ ఉంది. దీనిని అంతా రాంగ్‌గానే అర్థం చేసుకున్నారు.

మొత్తానికి బిగ్‌బాస్ ఆసక్తికరంగా నడుస్తోంది. హౌస్‌లో ఈక్వేషన్స్ అన్నీ మారిపోతున్నాయి. త్రిగుణ్, రోహిత్ కలిసి ఆడేందుకు సన్నద్ధమవుతున్నారు. ఉప్పు – నిప్పులా ఉన్న త్రిగుణ్, షాలిని ఫ్రెండ్స్ అవుతున్నారు. వంశీ, త్రిగుణ్ బాగా కలిసిపోయారు. వర్షిణి, ముఖేష్, సుధీర్ ఓ గ్రూప్. దేబ్జాని, రామ్ ప్రసాద్, నరేష్ ఒక గ్రూప్. కామనర్స్ గ్రూప్ నుంచి మెల్లమెల్లగా అమన్ దూరమవుతున్నట్టుగా అనిపిస్తోంది. మొత్తానికి బిగ్‌బాస్ ఒకేలా సాగకుండా కొత్త కొత్త ట్విస్ట్‌లు, టర్న్‌లు తీసుకుంటోంది. ఇక చూడాలి ఏం జరుగనుందో..

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360