Menu
BREAKING
నానిని కావాలనే ఇరికిస్తున్నారా.. ‘ప్యారడైజ్’ రిలీజ్ తర్వాత వదలట్లేదా..?   |   నానా పటేకర్ లాంటి దిగ్గజ నటుడికి ఇచ్చే గౌరవం ఇదేనా.. బాలీవుడ్ పట్టించుకోలేదా..?   |   విశ్వంభర టీం నమ్మకమేంటి… కాకా చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తాడా..?   |   Biggboss10 Telugu: ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్..   |   విజయ్ దేవరకొండ ముందున్న ఎన్నో సవాళ్లు.. రణబాలితో సమధానం చెప్తాడా మరి..?   |   సెక్స్ టాయ్స్ అనేది అమ్మాయిల యిష్టం.. దాంతో మీకెందుకు అంటున్న స్టార్ హీరోయిన్..!   |   Biggboss10 Telugu: కామనర్స్‌కు దెబ్బేసిన సెలబ్రిటీలు.. వీళ్లిక మారరు..   |   మొన్న నాని.. నేడు విజయ్ దేవరకొండ.. తొక్కేస్తున్నారా వీళ్లను.. మరి తొక్కేదెవరు..?   |   Biggboss10 Telugu: షాలిని వర్సెస్ అపూర్వ ఆగేలా లేదు.. రోహిత్‌కి కష్టమే..   |   భారతీయుడు 3 వస్తున్నాడు.. సేనాపతి ఈజ్ బ్యాక్.. శంకర్ ఏం చేస్తాడో..?   |   లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. ఆయన సాధించిన ఘనతలు ఎన్నో తెలుసా.. ?   |   ఏంది మచ్చా అంత పని చేసినావ్.. మీమ్స్‌తో నవ్వించిన అగ్గిపెట్టి మచ్చ హఠాన్మరణం..!   |   Biggboss10 Telugu: వామ్మో.. షాలిని వర్సెస్ అపూర్వ.. చూసేవారికి టార్చర్   |   స్పిరిట్ ముందుకు.. ఫౌజీ వెనక్కి.. ప్రభాస్ సినిమాల విషయంలో అసలు ఏం జరుగుతోంది?   |   Biggbogss10 Telugu: రోహిత్‌కు గుదిబండలా తయారైన షాలిని.. లవ్ ట్రాక్ ఇబ్బందే..

Biggboss 10 Telugu: హౌస్ నుంచి షాలిని అవుట్.. అవాక్కైన కంటెస్టెంట్స్

Biggboss 10 Telugu: హౌస్ నుంచి షాలిని అవుట్.. అవాక్కైన కంటెస్టెంట్స్

బిగ్‌బాస్ 10 తెలుగులో ఎలిమినేషన్ పర్వం తిరిగి ప్రారంభమైందా? అంటే ఇవాళ్టి సెకండ్ ప్రోమో చూస్తే మనకు అదే అనిపిస్తుంది. గత వారం ఇద్దరిని ఎలిమినేట్ చేశారు. ఈ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ చేశారు. రెండు బాక్సులు తీసుకొచ్చి గార్డెన్ ఏరియాలో పెట్టారు. ఎవరు వచ్చి ముందుగా ఆ బాక్సులను ఫస్ట్ ఎవరు ముట్టుకుంటారో వారిని పట్టుకునే వెళ్లే స్కెచ్‌తో వచ్చారు. అది తెలియని షాలిని బాక్సులను ముందుగా ముట్టుకుంది. ఆ వచ్చిన వారు ఆమెను బయటకు తీసుకుని వెళ్లిపోయారు. హౌస్‌లోని వారంతా నోరు వెళ్లబెట్టుకుని చూస్తూ ఉండిపోయారు. ఇది నిజమా? అంటే జరగడమైతే నిజంగానే జరిగింది కానీ దీనికి పెద్ద స్కెచ్చే ఉందని తెలుస్తోంది.

ఇవాళే చరణ్ మహాదేవ్ హౌస్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు. దీనికోసం చేసిన సన్నాహమే ఇదంతా అని తెలుస్తోంది. షాలినిని బయటకు తీసుకెళ్లి ఆమె ద్వారా చరణ్‌ను హౌస్‌లోకి ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. అందుకే హౌస్‌లోని వారికి ఏమీ అర్థం కాకుండా అలా తీసుకెళ్లి పోయారు. అయితే హౌస్‌లోని వారు దీనిని కనిపెట్టలేరా? అంటే గత వారం నిజంగానే రెండు ఎలిమినేషన్స్ జరిగాయి కాబట్టి ఈవారం కూడా అలాగే జరిగిందని అనుకునే అవకాశం ఉంది. అసలే ఈసారి షో అన్‌ప్రిడిక్టబుల్ కదా. మొత్తానికి ప్రోమో అయితే బయట చూసే వారికి ఏం జరగబోతోందనేది తెలుస్తూనే ఉంది కానీ హౌస్‌లోని వారికి మాత్రం బిగ్ కన్ఫ్యూజన్ అని చెప్పాలి. ఒక్కొక్కరినీ అయోమయంలో పడేసింది.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360