Menu
BREAKING
నానిని కావాలనే ఇరికిస్తున్నారా.. ‘ప్యారడైజ్’ రిలీజ్ తర్వాత వదలట్లేదా..?   |   నానా పటేకర్ లాంటి దిగ్గజ నటుడికి ఇచ్చే గౌరవం ఇదేనా.. బాలీవుడ్ పట్టించుకోలేదా..?   |   విశ్వంభర టీం నమ్మకమేంటి… కాకా చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తాడా..?   |   Biggboss10 Telugu: ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్..   |   విజయ్ దేవరకొండ ముందున్న ఎన్నో సవాళ్లు.. రణబాలితో సమధానం చెప్తాడా మరి..?   |   సెక్స్ టాయ్స్ అనేది అమ్మాయిల యిష్టం.. దాంతో మీకెందుకు అంటున్న స్టార్ హీరోయిన్..!   |   Biggboss10 Telugu: కామనర్స్‌కు దెబ్బేసిన సెలబ్రిటీలు.. వీళ్లిక మారరు..   |   మొన్న నాని.. నేడు విజయ్ దేవరకొండ.. తొక్కేస్తున్నారా వీళ్లను.. మరి తొక్కేదెవరు..?   |   Biggboss10 Telugu: షాలిని వర్సెస్ అపూర్వ ఆగేలా లేదు.. రోహిత్‌కి కష్టమే..   |   భారతీయుడు 3 వస్తున్నాడు.. సేనాపతి ఈజ్ బ్యాక్.. శంకర్ ఏం చేస్తాడో..?   |   లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. ఆయన సాధించిన ఘనతలు ఎన్నో తెలుసా.. ?   |   ఏంది మచ్చా అంత పని చేసినావ్.. మీమ్స్‌తో నవ్వించిన అగ్గిపెట్టి మచ్చ హఠాన్మరణం..!   |   Biggboss10 Telugu: వామ్మో.. షాలిని వర్సెస్ అపూర్వ.. చూసేవారికి టార్చర్   |   స్పిరిట్ ముందుకు.. ఫౌజీ వెనక్కి.. ప్రభాస్ సినిమాల విషయంలో అసలు ఏం జరుగుతోంది?   |   Biggbogss10 Telugu: రోహిత్‌కు గుదిబండలా తయారైన షాలిని.. లవ్ ట్రాక్ ఇబ్బందే..

Biggboss 10 Telugu: ఇంట్రస్టింగ్‌గా కెప్టెన్సీ రేస్.. నక్కతోక తొక్కిన ఝాన్సీ

Biggboss 10 Telugu: ఇంట్రస్టింగ్‌గా కెప్టెన్సీ రేస్.. నక్కతోక తొక్కిన ఝాన్సీ

నిన్నటి టాస్క్‌లో చరణ్‌ను గెలిపించడంపై త్రిగుణ్, కృష్ణుడు, వంశీ మధ్య చర్చ జరిగింది. ముగ్గురూ వాడిని (చరణ్) గెలిపించారే అందరూ కలిసి అని చర్చించుకున్నారు. ముఖేష్ పని చేయడం తానెప్పుడూ చూడలేదని వంశీ చెప్పాడు. రోహిత్‌తో కలిసి గిన్నెలు తోమితే తనకు కంటెంట్ రాదని.. వర్షిణితో కలిసి బాత్రూమ్స్ కడిగితే కంటెంట్ వస్తుందని చరణ్ అన్నాడు. ఆ తరువాత అంతా కలిసి ముఖేష్‌ను టార్గెట్ చేస్తున్నారని రోహిత్ చరణ్, షాలినికి చెప్పాడు. తినేటప్పుడు అతనిపై అరుస్తున్నారని అది అసలు కరెక్ట్ కాదని రోహిత్ చెప్పాడు. ముఖేష్ మంచోడని షాలిని చెప్పింది. ఆ తరువాత రోహిత్, నరేష్, రామ్ ప్రసాద్, వంశీ కలిసి ఛత్రపతి స్కిట్ చేశారు. అది కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేదు. సుధీర్, ముఖేష్, ఝాన్సీ మధ్య త్రిగుణ్ గురించి చర్చ. ఎవరిని ఎలా టార్గెట్ చేయాలా? అని ఆలోచిస్తున్నాడని ఝాన్సీ వాళ్లకు చెప్పింది.

కెప్టెన్సీ టాస్క్‌ను బిగ్‌బాస్ ప్రారంభించారు. పవర్ ఆఫ్ పీపుల్‌లో భాగంగా రెండవ లెవల్ నిర్వహించారు. కెప్టెన్సీ రేసులో ఉన్న త్రిగుణ్, షాలిని, ఝాన్సీ, ముఖేష్, రామ్ ప్రసాద్‌కు టాస్క్ నిర్వహించారు. చిక్కకు.. దొరక్కు అనేది టాస్క్. దీనిలో భాగంగా ఇతర హౌస్‌మేట్స్ గార్డ్స్‌గా వ్యవహరిస్తారు. తమకు అనుకూలంగా గార్డ్స్‌ను ఒప్పించుకోవచ్చు. ప్రతి రౌండ్‌లో ఒకరి ప్రయాణం ముగుస్తుంది. చివరిగా ఇద్దరు మిగులుతారు. వారి మధ్య టాస్క్ ఉంటుంది. ఈ టాస్క్‌లో వంశీ, రోహిత్ హెడ్ గార్డ్స్‌గా ఉంటారు. కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరు ఏం చేస్తారనేది చెప్పుకున్నారు. వర్షిణి మాటలు జారుతోంది. పొట్టిదాన్ని (షాలిని) ముందుగా ఆపేద్దామని సుధీర్, నరేష్‌కు వర్షిణి చెప్పింది. ఎవరి స్కెచ్‌లు వాళ్లు గీసుకున్నారు. త్రిగుణ్ అప్పటికప్పుడు బాణీలు కట్టుకుని మరీ పాట బాగా పాడాడు. బజర్ మోగింది. గార్డ్స్.. ఝాన్సీ, షాలినిని పట్టుకున్నారు. ఆ తరువాత ఝాన్సీని వదిలేశారు.

Biggboss 10 Telugu: ఇంట్రస్టింగ్‌గా కెప్టెన్సీ రేస్.. నక్కతోక తొక్కిన ఝాన్సీ

ఏజ్ విషయం చెప్పి తనను పట్టుకోవడంపై షాలిని ఫైర్ అయ్యింది. ఇక షాలిని కెప్టెన్సీ టాస్క్ నుంచి అవుట్ అయిపోయింది. ఇక నలుగురు మిగిలారు. ఆ తరువాత సుధీర్ వర్సెస్ షాలిని జరిగింది. తరువాత ఎవరిని ఆపాలనే విషయమై చర్చ జరిగింది. వర్షిణి నోరు మూయిస్తే ఎందుకు నన్నెందుకు ఆపేశావని సుధీర్‌ను షాలిని నిలదీసింది. గార్డ్స్ నుంచి ఇద్దరిని ఫైర్ చేయాలని బిగ్‌బాస్ చెప్పడంతో రోహిత్, వంశీ కలిసి కృష్ణుడు, సుధీర్‌ను చేశారు. షాలిని గార్డ్‌గా బిగ్‌బాస్ రిక్రూట్ చేసి బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఆ తరువాత బజర్ మోగింది. అంతా కలిసి ముఖేష్‌ను ఆపేశారు. ఇక ముగ్గురు మాత్రమే కెప్టెన్సీ రేసులో నిలిచారు. నెక్ట్స్ రౌండ్‌లో త్రిగుణ్‌ని ఆపేశారు. ఇక కెప్టెన్సీ రేసులో ఝాన్సీ, రామ్ ప్రసాద్ మాత్రమే మిగిలారు.

ఆ తరువాత షాలిని వర్సెస్ ముఖేష్ గొడవ జరిగింది. కావాలని తనను తీసేశావని ముఖేష్ చెబుతున్నాడు. గ్రూపిజం చేసి తనను నిలిపేశారని ముఖేష్ వాదన. ఫస్ట్ నలుగురూ కలిసి షాలినిని పట్టుకుంటే అది గ్రూపిజం కాదా? అని షాలిని నిలదీసింది. ఇక్కడ ముఖేష్ వాదనలో బలం లేదు. ముఖేష్ కొత్తగా గార్డ్‌గా రిక్రూట్ చేశారు. రోహిత్, వంశీకి ఆడే ఛాన్స్ బిగ్‌బాస్ ఇచ్చారు. అప్పుడు వంశీకి ఆ అవకాశం రోహిత్ ఇచ్చాడు. నిన్న తనకు ఆడే అవకాశం వచ్చిందని.. వంశీకి ఆ అవకాశం రాలేదని రోహిత్ చెప్పాడు. అందరూ కలిసి త్రిగుణ్‌ని ఆపేశారు. ఫైనల్ రేసులో రామ్ ప్రసాద్, ఝాన్సీ ఉన్నారు. ఆఖరి టాస్క్ వీరిద్దరి మధ్యే జరుగనుంది. ఈ కెప్టెన్సీ రేసులో సులభంగా గెలిచింది మాత్రం రామ్ ప్రసాదే. కాస్త ఝాన్సీని అయినా ఆపారు కానీ రామ్ ప్రసాద్‌ని మాత్రం ఎవరూ ఆపలేదు. తనను టార్గెట్ చేశారని చరణ్‌కు ఝాన్సీ చెప్పింది. జైలులో ఉన్నంత సేపు టార్చర్ అయ్యిందని చెప్పింది. త్రిగుణ్‌కు తను ముఖేష్‌తో ఉండటం ఇష్టం లేదని చెప్పింది.

Biggboss 10 Telugu: ఇంట్రస్టింగ్‌గా కెప్టెన్సీ రేస్.. నక్కతోక తొక్కిన ఝాన్సీ

తను ఫస్ట్ త్రిగుణ్‌నే ఆపుతారని ఝాన్సీ చెప్పింది. ఏమీ తెలియనట్టుగా త్రిగుణ్ ఇక్కడి ముచ్చట్లు అక్కడ.. అక్కడివి ఇక్కడ చెబుతాడా? అని చరణ్ అడగ్గా ఝాన్సీ పక్కాగా చెబుతాడని చెప్పింది. నువ్వెప్పుడూ చెప్పలేదా? అని చరణ్.. ఝాన్సీని అడిగాడు. తాను ముఖేష్ అన్నకు మాత్రమే చెబుతానని ఝాన్సీ చెప్పింది. కెప్టెన్సీ టాస్క్ ప్రారంభమైంది. పవర్ ఆఫ్ కెప్టెన్సీ టాస్క్‌ను బిగ్‌బాస్ ఆరంభించాడు. ఈ టాస్క్‌లో ఇద్దరూ సమానంగానే పెర్ఫార్మ్ చేశారు కానీ రామ్ ప్రసాద్ కీ ఓపెన్ చేయలేకపోయాడు. దీంతో ఝాన్సీ టాస్క్ గెలిచి ఫస్ట్ కెప్టెన్ అయ్యింది. బిగ్‌బాస్ సీజన్ 10 మొదటి కెప్టెన్‌గా ఝాన్సీ విన్ అయ్యింది. కెప్టెన్‌గా విజయం సాధించినందుకు లక్ష రూపాయల గోల్డ్‌ను వైట్ గోల్డ్ సంస్థ ఇచ్చింది. ఇక మీదట ఎవరు గెలిచినా కూడా ఇలాగే గోల్డ్ ఇస్తామని వైట్ గోల్డ్ ప్రకటించింది. దీంతో ఇవాళ్టి సీజన్ ముగిసింది. కెప్టెన్సీ రూంను సైతం బిగ్‌బాస్ ఓపెన్ చేశారు. దానిలోకి ఝాన్సీకి మాత్రమే బిగ్‌బాస్ యాక్సెస్ ఇచ్చారు. మొత్తానికి ఝాన్సీ నక్క తోక తొక్కి బిగ్‌బాస్‌లోకి అడుగు పెట్టినట్టుంది.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360