Menu
BREAKING
బడ్జెట్ కంట్రోలింగ్.. మలయాళం వాళ్లను చూసి మనం నేర్చుకుందామా..?   |   Bigg Boss10 Telugu: నామినేషన్స్ పాయింట్స్ మాట్లాడుకున్న త్రిగుణ్ టీం.. నాగ్ ప్రశ్నిస్తారా?   |   జాన్వీ కపూర్‌కు తత్వం బోధపడిందా.. తిట్టిన నోటితోనే పొగడ్తల వర్షం కురిపిస్తుందిగా..!   |   Bigg Boss10 Telugu: బ్లాక్ కోతి పంచాయతీకి చెక్ పెట్టిన నాగ్.. ఇక టైం లేదు..   |   Bigg Boss10 Telugu: ఈ వారం ఎలిమినేట్ కాబోయేది ఎవరంటే…   |   Bigg Boss10 Telugu: ముఖేష్‌పై రివెంజ్ తీర్చుకున్న దేబ్జాని.. త్రిగుణ్‌ని నిలదీసిన నీతూ..   |   ఓ ఇంటివాడు కాబోతున్న మెగా మేనల్లుడు.. సాయి దుర్గ తేజ్ పెళ్ళి సందడి..!   |   Bigg Boss10 Telugu: ఫ్యామిలీ కోసం బిగ్ ఫైట్.. వంశీ, శ్వేత విన్..   |   వీకెండ్ అయిపోయింది.. ఆదర్శ కుటుంబం సిచ్యువేషన్..   |   హ్యాపీ బర్త్ డే టబు.. అప్పుడు పండు.. ఇప్పుడు మహంతి ఝాన్సీ రాణి..!   |   ఎర్లీ మార్నింగ్ షోస్‌కు ఓకే.. టికెట్ హైక్స్‌కు నో.. విజయ్ సర్కార్ సంచలనం..!   |   మహేష్ బాబు.. ది రియల్ లైఫ్ బిజినెస్ మెన్‌.. వ్యాపారాల్లో దూకుడు..!   |   పాకెట్ రాకెట్స్ టీజర్ రివ్యూ.. మెగా డాటర్ హ్యాట్రిక్ కొట్టేలా ఉందిగా..!   |   “రాధిక ఆప్టే నీకు అసలు సిగ్గుందా..” సోషల్ మీడియాలో బాలయ్య అభిమానుల ఆగ్రహం..!   |   Bigg Boss10 Telugu: మరో రోహిత్ అవుతున్న ముఖేష్.. రెడ్ కార్డ్ ఇచ్చేంత తప్పు చేశాడా?

Bigg Boss10 Telugu: నామినేషన్స్ పాయింట్స్ మాట్లాడుకున్న త్రిగుణ్ టీం.. నాగ్ ప్రశ్నిస్తారా?

Biggboss10 Telugu: నామినేషన్స్ పాయింట్స్ మాట్లాడుకున్న త్రిగుణ్ టీం.. నాగ్ ప్రశ్నిస్తారా?

బిగ్‌బాస్ 10 తెలుగు చప్పగా సాగుతోంది. హౌస్‌లో రెండు గ్రూపులున్నాయి. ఒక గ్రూప్‌లో వర్షిణి, ముఖేష్ మాత్రమే ఉన్నారు. దీంతో నామినేషన్స్ సమయంలో అందరూ వచ్చి ఈ ఇద్దరిని మాత్రమే వేయలేరు. వాళ్లలో వాళ్లే వేసుకోవాల్సి ఉంటుంది. దీంతో స్ట్రాంగ్ పాయింట్స్ పెడితే ఎక్కడ అలయెన్స్ చెడిపోతుందోనని సిల్లీ సిల్లీ పాయింట్స్‌తో నామినేషన్స్ వేసుకుంటున్నారు. దీంతో నామినేషన్ ఎపిసోడ్ ఏమాత్రం హైప్ లేకుండా కొనసాగుతోంది. అయితే గత వారం త్రిగుణ్ పేరును అమన్ మాత్రమే కాకుండా శివ్ కూడా రాశాడు. ప్రస్తుతం ఆ విషయం త్రిగుణ్‌కు శ్వేత చెప్పేసింది. దీంతో త్రిగుణ్ షాక్ అయ్యాడు.

తన ఫ్యామిలీ రాకుండా ఉండేందుకు తన పేరు రాయడంపై త్రిగుణ్ గత వారమే అమన్‌పై ఫైర్ అయ్యాడు. అందరితో అంతకు ముందు రాసిన పేర్లను మార్పించి అమన్ పేరు రాయించాడు. చివరకు తనే గెలిచి అమన్‌కు ఫ్యామిలీ రాకుండా చేశాడు. అయితే ఆ సమయంలోనే శివ్‌కు త్రిగుణ్ తన పేరు అమన్ రాశాడని.. తన కూతురు వస్తే ముందుగా తనే ఎత్తుకుంటానన్న వ్యక్తి తన ఫ్యామిలీయే రాకుండా తన పేరు రాశాడని చెప్పాడు. అప్పుడు శివ్ అవాక్కైనట్టుగా నటించాడు కానీ తను కూడా త్రిగుణ్ పేరు రాసిన విషయం రివీల్ చేయలేదు. అలాగే మార్చుకునే అవకాశం ఎన్నిసార్లు బిగ్‌బాస్ ఇచ్చినా కూడా శివ్ మార్చుకోలేదు. ఈ క్రమంలోనే త్రిగుణ్‌కు విషయం తెలియడంతో శివ్‌పై నామినేషన్స్ సమయంలో బాగా ఫైర్ అయ్యాడు. మొత్తానికి వీరిద్దరి మధ్య రైవలరీ నడిస్తే మాత్రం శివ్‌కు ప్లస్ అయ్యే అవకాశం ఉంది.

ఇకపోతే గత రాత్రి షో ముగిసిన తరువాత నామినేషన్స్ గురించి దేబ్జాని, నరేష్, శ్వేత, త్రిగుణ్ చర్చించుకున్నారు. నీతూ తనకు వేస్తుందని.. ఆమెకు వేసి నామినేషన్ వేస్ట్ చేసుకోవాలా? అని అనడంతో నరేష్ ఏముంది? వేసేయమని చెప్పాడు. మనకు వేయడం ఎంత సేపు చెప్పు అని త్రిగుణ్ అన్నాడు. అప్పుడు శ్వేత మనం నామినేషన్స్ పాయింట్స్ మాట్లాడుకోకూడదు కదా.. అనడంతో మనం పెయిన్ పాయింట్స్ పెట్టి మాట్లాడుకుంటున్నాం కదా అన్నాడు. కానీ గతంలో రోహిత్ వాళ్లు కూడా పెయిన్ పాయింట్స్ పెట్టే మాట్లాడుకున్నారు. కానీ నాగ్ ఫుల్ ఫైర్ అయ్యారు. ఆ తరువాత ఆర్కేని నీతూ ఏమన్నారని అని త్రిగుణ్ అడిగాడు. రామ్ ప్రసాద్, శ్వేత చాలా మాటలన్నారని చెప్పారు. ఒకవేళ రెండు నామినేషన్స్ వస్తే ఎవరిని చేస్తావని త్రిగుణ్‌ని అడిగితే తనకు నాలుగు నామినేషన్స్ వేయాల్సి వచ్చినా కూడా పాయింట్స్ ఉన్నాయని అన్నాడు. మొత్తానికి నామినేషన్స్ పాయింట్స్ బాగా చర్చించుకున్నారు. మరి నాగ్ దీనిని ప్రశ్నిస్తారో లేదంటే త్రిగుణ్ టీమ్ కాబట్టి లైట్ తీసుకుంటారో చూడాలి.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360