Menu
BREAKING
బడ్జెట్ కంట్రోలింగ్.. మలయాళం వాళ్లను చూసి మనం నేర్చుకుందామా..?   |   Bigg Boss10 Telugu: నామినేషన్స్ పాయింట్స్ మాట్లాడుకున్న త్రిగుణ్ టీం.. నాగ్ ప్రశ్నిస్తారా?   |   జాన్వీ కపూర్‌కు తత్వం బోధపడిందా.. తిట్టిన నోటితోనే పొగడ్తల వర్షం కురిపిస్తుందిగా..!   |   Bigg Boss10 Telugu: బ్లాక్ కోతి పంచాయతీకి చెక్ పెట్టిన నాగ్.. ఇక టైం లేదు..   |   Bigg Boss10 Telugu: ఈ వారం ఎలిమినేట్ కాబోయేది ఎవరంటే…   |   Bigg Boss10 Telugu: ముఖేష్‌పై రివెంజ్ తీర్చుకున్న దేబ్జాని.. త్రిగుణ్‌ని నిలదీసిన నీతూ..   |   ఓ ఇంటివాడు కాబోతున్న మెగా మేనల్లుడు.. సాయి దుర్గ తేజ్ పెళ్ళి సందడి..!   |   Bigg Boss10 Telugu: ఫ్యామిలీ కోసం బిగ్ ఫైట్.. వంశీ, శ్వేత విన్..   |   వీకెండ్ అయిపోయింది.. ఆదర్శ కుటుంబం సిచ్యువేషన్..   |   హ్యాపీ బర్త్ డే టబు.. అప్పుడు పండు.. ఇప్పుడు మహంతి ఝాన్సీ రాణి..!   |   ఎర్లీ మార్నింగ్ షోస్‌కు ఓకే.. టికెట్ హైక్స్‌కు నో.. విజయ్ సర్కార్ సంచలనం..!   |   మహేష్ బాబు.. ది రియల్ లైఫ్ బిజినెస్ మెన్‌.. వ్యాపారాల్లో దూకుడు..!   |   పాకెట్ రాకెట్స్ టీజర్ రివ్యూ.. మెగా డాటర్ హ్యాట్రిక్ కొట్టేలా ఉందిగా..!   |   “రాధిక ఆప్టే నీకు అసలు సిగ్గుందా..” సోషల్ మీడియాలో బాలయ్య అభిమానుల ఆగ్రహం..!   |   Bigg Boss10 Telugu: మరో రోహిత్ అవుతున్న ముఖేష్.. రెడ్ కార్డ్ ఇచ్చేంత తప్పు చేశాడా?

జాన్వీ కపూర్‌కు తత్వం బోధపడిందా.. తిట్టిన నోటితోనే పొగడ్తల వర్షం కురిపిస్తుందిగా..!

జాన్వీ కపూర్‌కు తత్వం బోధపడిందా.. తిట్టిన నోటితోనే పొగడ్తల వర్షం కురిపిస్తుందిగా..!

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఎంతలా ట్రోలింగ్ ఫేస్ చేసిందో మనందరికీ తెలిసిందే. రీసెంట్‌గా రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా గురించి, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ డైరెక్టర్ల వర్కింగ్ స్టైల్ గురించి ఆమె చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపాయి. ఇక్కడి దర్శకులకు ప్లానింగ్ ఉండదని, ఫ్రేమింగ్ సెన్స్ సరిగ్గా ఉండదని నోరు పారేసుకున్న ఈ అమ్మడిని సౌత్ ఆడియన్స్ ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. ఆమె ఆటిట్యూడ్ చూసి నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాలీవుడ్‌లో సరైన హిట్స్ లేక ఇబ్బంది పడుతున్న టైమ్‌లో, సౌత్ ఇండస్ట్రీ అవకాశాలు ఇస్తుంటే.. తిరిగి ఈ ఇండస్ట్రీనే తక్కువ చేసి మాట్లాడుతుందా అని ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. దీంతో జాన్వీ కపూర్ పరిస్థితి ఒక్కసారిగా రివర్స్ అయింది. ఇక్కడ ఆఫర్స్ రాకపోతే తన కెరీర్ కష్టమే అన్న విషయం ఈ బ్యూటీకి బాగా అర్థమైనట్లుంది.

నెగిటివిటీ ఎక్కువైపోవడం, సౌత్ ఫ్యాన్స్ కోపంతో ఊగిపోతుండటంతో జాన్వీ కపూర్ వెంటనే అలర్ట్ అయింది. ఇంక లాభం లేదనుకుని పక్కాగా డ్యామేజ్ కంట్రోలింగ్ మొదలుపెట్టింది. మొన్నటిదాకా సౌత్ మేకర్స్‌ను విమర్శించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సడెన్‌గా ప్లేట్ ఫిరాయించేసి కవరింగ్ డ్రామా స్టార్ట్ చేసింది. ఎక్కడైతే విమర్శలు ఎదుర్కొందో అక్కడే పాజిటివ్ మార్కులు కొట్టేయడానికి సౌత్ సూపర్ అంటూ భజన మొదలుపెట్టింది. తన మీద ఉన్న నెగిటివ్ ఇమేజ్‌ను చెరిపేసుకోవడానికి గట్టిగానే ట్రై చేస్తోంది. ఆడియన్స్ ఎక్కడ తనను పూర్తిగా బాయ్‌కాట్ చేస్తారో అన్న భయంతో.. తన మనసులో సౌత్ సినిమా అంటే ఎంత గౌరవం ఉందో చూపించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

తాజాగా జరిగిన ఒక ఇంటరాక్షన్‌లో జాన్వీ కపూర్‌కు తమిళ సినిమాల గురించి ఒక ప్రశ్న ఎదురైంది. రీసెంట్‌గా మీరు చూసిన తమిళ సినిమా ఏది అని అడగ్గానే.. జాన్వీ ఇచ్చిన ఆన్సర్ చూసి అందరూ షాక్ అయ్యారు. సాధారణంగా బాలీవుడ్ వాళ్ళను ఇలాంటి ప్రశ్న అడిగితే రజినీకాంత్, విజయ్, అజిత్ లాంటి బడా స్టార్ హీరోల సినిమాల పేర్లు చెబుతారు. కానీ జాన్వీ కపూర్ మాత్రం చాలా తెలివిగా ఎవరూ ఊహించని ఒక చిన్న సినిమా పేరు చెప్పింది. అర్జున్, ప్రీతి ముకుందన్ మెయిన్ లీడ్స్‌గా నటించిన ‘బ్లాస్ట్’ అనే సినిమా చూశానని, ఆ మూవీ తనకు చాలా బాగా నచ్చిందని చెప్పింది. ఈ సినిమా పేరును జాన్వీ కపూర్ చెప్పడంతో కోలీవుడ్ ఆడియన్స్ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

జాన్వీ కపూర్ కేవలం ఒక సినిమా పేరు చెప్పి ఊరుకోలేదు.. ఆ సినిమాతో పాటు అందులో నటించిన హీరోయిన్ ప్రీతి ముకుందన్ పేరును కూడా ప్రత్యేకంగా మెన్షన్ చేసింది. దీంతో జాన్వీ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆమె ఇచ్చిన ఈ ఆన్సర్‌తో ‘బ్లాస్ట్’ సినిమాకు, అందులో నటించిన నటీనటులకు సడెన్‌గా ఎక్కడలేని అటెన్షన్ వచ్చేసింది. అసలు ఆ సినిమా ఏంటి, ఆ హీరోయిన్ ఎవరు అని వేరే భాషల వాళ్లు కూడా గూగుల్‌లో వెతకడం స్టార్ట్ చేశారు. అయితే జాన్వీ కావాలనే ఒక చిన్న సినిమా పేరు చెప్పిందని, తాను సౌత్ సినిమాలను ఎంత డీప్‌గా ఫాలో అవుతుందో చూపించుకోవడానికే ఈ స్ట్రాటజీ ప్లే చేసిందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఆమె వేసిన ఈ మాస్టర్ స్ట్రోక్ మాత్రం బాగానే వర్కవుట్ అయిందని చెప్పాలి.

కేవలం సినిమాల పేర్లు చెప్పడమే కాకుండా, సౌత్ డైరెక్టర్ల మీద తనకు ఎంత ఇష్టం ఉందో కూడా కవర్ చేసేసింది జాన్వీ. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ అంటే తనకు పిచ్చి అని, ఆయన మేకింగ్ స్టైల్ చూసి ఫిదా అయిపోతానని ప్రశంసల వర్షం కురిపించింది. వెట్రిమారన్ నుంచి రాబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం తాను ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నానని చెప్పి కోలీవుడ్ ఫ్యాన్స్‌ను కూల్ చేసే ప్రయత్నం చేసింది. మొన్నటిదాకా సౌత్ డైరెక్టర్లకు ప్లానింగ్ లేదన్న నోటితోనే, ఇప్పుడు వెట్రిమారన్ లాంటి డైరెక్టర్ల గురించి గొప్పగా చెప్పడం చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి జాన్వీ కపూర్ ఆడుతున్న ఈ డ్యామేజ్ కంట్రోల్ డ్రామాతో రాబోయే రోజుల్లో తమిళంలో లేదా ఇతర సౌత్ భాషల్లో ఆమెకు మరిన్ని ఆఫర్లు వస్తాయా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఫ్యాన్స్ మాత్రం ఆమె కవరింగ్ టాలెంట్‌ను చూసి నవ్వుకుంటున్నారు.

Pranav

Writer and contributor at Telugu Cinema 360