Menu
BREAKING
“రాధిక ఆప్టే నీకు అసలు సిగ్గుందా..” సోషల్ మీడియాలో బాలయ్య అభిమానుల ఆగ్రహం..!   |   Bigg Boss10 Telugu: మరో రోహిత్ అవుతున్న ముఖేష్.. రెడ్ కార్డ్ ఇచ్చేంత తప్పు చేశాడా?   |   మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. సాయి ధరమ్ తేజ్ పెళ్ళి ఎప్పుడో తెలుసా..?   |   Bigg Boss10 Telugu: వంశీకి ‘టెంపర్’ లేచింది.. వెకిలి చేష్టలతో చిరాకు తెప్పించిన శివ్..   |   మారిన సెన్సార్ (CBFC) రూల్స్.. దర్శక నిర్మాతలు గుర్తించుకోండి ఈ పాయింట్స్..!   |   Bigg Boss10 Telugu: రోహిత్ ఎలిమినేట్..   |   ఏంటి గురూజీ ఆదర్శ కుటుంబం కూడా కాపీయేనా..? త్రివిక్రమ్‌పైనే ఎందుకిలా..?   |   ‘ఇరుముడి’ నిర్మాతలకు భారీ షాక్.. లేబర్ డిపార్ట్‌మెంట్ నోటీసులు..   |   చిరంజీవికి బాలకృష్ణ సవాల్.. మెగావర్స్ టాక్ షో అన్ స్టాపబుల్ ను మ్యాచ్ చేయగలదా..?   |   ఎమోషన్ లేని వైలెన్స్ కు అర్థం లేదు.. అది మనోళ్లకు చెప్పినా అర్థం కాదు..!   |   సాయి పల్లవి ఎందుకమ్మా అంత నోటిదురద.. రిలీజ్‌కు ముందు అవసరమా..?   |   రామ్ చరణ్, సుకుమార్ సినిమాలో శ్రీ కృష్ణుడు.. కాన్సెప్ట్ పోస్టర్ అర్థం అదేనా..?   |   Bigg Boss10 Telugu: రోహిత్ ఎలిమినేషన్‌పై ఎన్నో ఊహాగానాలు.. అసలు నిజమేంటి?   |   Bigg Boss10 Telugu: ఝాన్సీ ఎలిమినేట్.. త్రిగుణ్ గ్రూప్‌కి ప్రశంసలు.. రోహిత్ గ్రూప్‌కి అక్షింతలు..   |   Bigg Boss10 Telugu: షాకింగ్.. బిగ్‌బాస్ నుంచి రోహిత్ ఎలిమినేట్..

“రాధిక ఆప్టే నీకు అసలు సిగ్గుందా..” సోషల్ మీడియాలో బాలయ్య అభిమానుల ఆగ్రహం..!

"రాధిక ఆప్టే నీకు అసలు సిగ్గుందా.." సోషల్ మీడియాలో బాలయ్య అభిమానుల ఆగ్రహం..!

సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్ల తీరు చూస్తుంటే ఆడియన్స్‌కు నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. మొదట్లో అవకాశాల కోసం సౌత్ ఇండస్ట్రీకి వస్తారు, ఇక్కడ హిట్స్ కొట్టి డబ్బులు సంపాదిస్తారు, ఆ టైమ్‌లో అవకాశం ఇచ్చిన వాళ్ళే దేవుళ్లు అంటారు. తీరా బాలీవుడ్‌కు వెళ్లి ఫేమస్ అయ్యాక, వాళ్లకు లైఫ్ ఇచ్చిన టాలీవుడ్ పైనే ఇష్టమొచ్చినట్లు వెటకారంగా కామెంట్స్ చేస్తుంటారు. ఇప్పుడు బాలీవుడ్ నటి రాధికా ఆప్టే వ్యవహారం కూడా అచ్చం ఇలాగే ఉంది. అవకాశం కోసం వచ్చినపుడు తెలుగు సినిమా గురించి సూపర్ అని పొగిడిన ఈమె, ఇప్పుడు ఇక్కడ ఇండస్ట్రీ మీద, టాలీవుడ్ కల్చర్ మీద దారుణమైన కామెంట్స్ చేసి అడ్డంగా బుక్కయింది. రాధికా ఆప్టే ఇలా తెలుగు ఇండస్ట్రీ మీద నోరు పారేసుకోవడం ఇదే మొదటిసారి కాకపోయినా, ఈసారి ఆమె మాట్లాడిన మాటలు, చూపించిన లాజిక్స్ చూసి తెలుగు ఆడియన్స్ తో పాటు నెటిజన్లు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

రీసెంట్ గా ఒక బాలీవుడ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాధికా ఆప్టే, పుష్కర కాలం కిందట తాను నటించిన ఓ తెలుగు సినిమా గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడింది. 2014లో నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘లెజెండ్’ సినిమా ద్వారా ఆమె టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఆ సినిమా గురించి ఆమె మాట్లాడుతూ.. ఆ సినిమాలో తనను అంకుల్‌ని పెళ్లి చేసుకోమన్నారని, అది తనకు చాలా వింతగా అనిపించిందని చెప్పుకొచ్చింది. అలాగే తన కంటే వయసులో చాలా పెద్దవాడైన హీరోతో రొమాన్స్ చేయించారని, పైగా సినిమా సగంలోనే తన క్యారెక్టర్ ను దారుణంగా చంపేశారని చాలా వెటకారంగా మాట్లాడింది. ఇదంతా చెబుతూ తెలుగు ఇండస్ట్రీలో ఒక రకమైన మేల్ డామినేషన్ ఉందని, హీరోయిన్లకు సరైన ప్రాధాన్యత ఉండదని బాలీవుడ్ మీడియాతో తన బాధను పంచుకునే ప్రయత్నం చేసింది.

ఇక్కడ నెటిజన్లు అడుగుతున్న పాయింట్ ఒక్కటే. రాధికా ఆప్టే ఆ సినిమా సైన్ చేసేటప్పుడు ఆమెకు కథ చెప్పలేదా? అందులో హీరో ఎవరో, తన క్యారెక్టర్ ఎప్పుడొచ్చి ఎప్పుడు పోతుందో ఆమెకు తెలియదా? అసలు ఈ సినిమాలో నటిస్తే ఎంత రెమ్యునరేషన్ ఇస్తారో మాట్లాడుకోకుండానే ఆమె షూటింగ్ కు వచ్చేసిందా అని జనాలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. అన్నీ తెలుసుకుని, కథ విని, అగ్రిమెంట్ మీద సైన్ చేసి, అడిగినంత రెమ్యునరేషన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తగా ఈ పాట్రియార్కి కబుర్లు ఎందుకు చెబుతోంది అనేది ఆమెకే తెలియాలి. సినిమా రిలీజ్ అవ్వకముందు ప్రమోషన్స్ టైమ్‌లో అయితే, తెలుగు సినిమాలో అవకాశం‌ రావటం తన అదృష్టం అని, టాలీవుడ్ చాలా గొప్పదని స్టేజ్ మీద మైక్ పట్టుకుని ఊదరగొట్టింది. ఇప్పుడు పన్నెండేళ్ల తర్వాత బాలీవుడ్ లో కూర్చుని తాను నటించిన సినిమాపై, హీరోపై ఇలాంటి చీప్ కామెంట్స్ చేయడం ఆమె హిపోక్రసీకి నిదర్శనం అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

అసలు రాధికా ఆప్టే మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఆమె చేస్తున్న సినిమాలను చూస్తేనే అర్థమవుతుంది అని ఆడియన్స్ కౌంటర్లు వేస్తున్నారు. తెలుగు సినిమాలో ఎంతో పద్ధతిగా చీర కట్టుకుని, సాంప్రదాయంగా పెళ్లి చేసుకునే క్యారక్టర్ ఇస్తే ఆమెకు అస్సలు నచ్చలేదు. అందులోనూ కజిన్ ని పెళ్లి చేసుకోవడం అనేది మన తెలుగు కల్చర్ లో ఎప్పటి నుంచో ఉన్న పద్ధతి. దాన్ని ఆమె ఒక క్రైమ్ లాగా చూపిస్తోంది. అదే బాలీవుడ్ సినిమాలో ఏదైనా బోల్డ్ క్యారక్టర్ ఇచ్చి, బట్టలిప్పమంటే మాత్రం అది ఆవిడకు సరైన పాత్ర అనిపిస్తుందేమో అని నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అక్కడ స్కిన్ షో చేస్తూ లిమిట్స్ క్రాస్ చేసి నటిస్తే అది మోడ్రన్ ఆర్ట్ అని ఫీల్ అవుతూ, ఇక్కడ మన పద్ధతి ప్రకారం ఫ్యామిలీ క్యారెక్టర్స్ ఇస్తే మాత్రం ఆమెకు రిగ్రెసివ్ గా అనిపించడం నిజంగా విడ్డూరం.

ఈ ఇంటర్వ్యూలో నెటిజన్లు గమనించిన మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. రాధికా ఆప్టే ఈ కామెంట్స్ చేస్తున్న సమయంలో ఆమె పక్కనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా కూర్చుని ఉంది. రాధికా ఆప్టే అలా టాలీవుడ్ మీద, ఇక్కడి కల్చర్ మీద విమర్శలు చేస్తుంటే కీర్తి సురేష్ చాలా అన్ కంఫర్టబుల్ గా ఫీల్ అవుతూ అదో రకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. రాధికా మాటలకు కీర్తి సురేష్ ఇచ్చిన ఆ రియాక్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఏదేమైనా అన్నం పెట్టిన ఇండస్ట్రీని కించపరిచేలా మాట్లాడటం రాధికా ఆప్టే లాంటి వాళ్ళకే చెల్లింది. సినిమా చేసేటప్పుడు డబ్బుల కోసం అన్నిటికీ తల ఊపి, ఇప్పుడు ఫేమస్ అయ్యాక ఇలా బురద జల్లడం అనేది చాలా చీప్ మెంటాలిటీ అని, ఇలాంటి వాళ్లకు టాలీవుడ్ లో మళ్లీ అవకాశాలు ఇవ్వకూడదని ప్రేక్షకులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

Pranav

Writer and contributor at Telugu Cinema 360