
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా టైటిల్స్ ఆయన రియల్ లైఫ్‌కు భలే సెట్ అయిపోతుంటాయి. ముఖ్యంగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పెట్టిన ‘బిజినెస్ మెన్’ టైటిల్‌కు మహేష్ బాబు 100 శాతం న్యాయం చేస్తున్నాడు. సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు కొల్లగొట్టే ఈ సూపర్ స్టార్, బయట కూడా తనదైన స్టైల్‌లో వరుస బిజినెస్‌లు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే AMB సినిమాస్ పేరుతో థియేటర్ల బిజినెస్ లో సక్సెస్ అయిన మహేష్, ఆ తర్వాత బట్టల బ్రాండ్ తో పాటు ఇంకా కొన్ని రంగాల్లో ఇన్వెస్ట్ చేశాడు. ఎప్పటికప్పుడు కొత్త రంగాల్లోకి ఎంట్రీ ఇస్తూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాడు మన రియల్ లైఫ్ బిజినెస్ మెన్. తాజాగా ఈ టాలీవుడ్ సూపర్ స్టార్ మరో సరికొత్త వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి అందరినీ సర్ప్రైజ్ చేశాడు.
ఇంతకీ మహేష్ బాబు ఎంట్రీ ఇచ్చిన ఆ కొత్త బిజినెస్ ఏంటంటే గేమింగ్ ఇండస్ట్రీ. అవును, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు విపరీతమైన క్రేజ్ ఉన్న ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్ రంగంలో మహేష్ బాబు భారీగా ఇన్వెస్ట్ చేసారు. ముంబైకి చెందిన ప్రముఖ ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ అయిన ‘షాట్ గన్ గేమ్స్’ లో సూపర్ స్టార్ ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ గా భాగస్వామి అయ్యాడు. ఈ డీల్ గురించి షాట్ గన్ గేమ్స్ కంపెనీ కో ఫౌండర్స్ అయిన జీత్ చందన్, అలాగే విదిత్ మెహతా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. ఈ సరికొత్త జర్నీలో భాగం కావడం పట్ల మహేష్ బాబు కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నట్లు తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. గేమింగ్ ఇండస్ట్రీకి ఉన్న ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకుని మహేష్ వేసిన ఈ అడుగు బిజినెస్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
మహేష్ బాబు ఇన్వెస్ట్ చేసిన ఈ కంపెనీ ఇప్పుడు ఒక రేంజ్ గేమ్ ను డెవలప్ చేసే పనిలో ఉంది. డైరెక్టర్ విక్కీ అరోరా నేతృత్వంలో ‘టేక్ డౌన్ జెనెసిస్’ అనే అడ్వెంచర్ గేమ్ ను భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇది ఒక పిసి అండ్ కన్సోల్ అడ్వెంచర్ గేమ్ అని తెలుస్తోంది. ఇలాంటి వరల్డ్ క్లాస్ గేమింగ్ ప్రాజెక్ట్ కు మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ సపోర్ట్ తోడవడంతో దీనిపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఈ బిజినెస్ అనౌన్స్మెంట్ తో పాటు మహేష్ బాబుకు సంబంధించిన ఒక లేటెస్ట్ గ్లింప్స్ కూడా బయటకు వచ్చింది. ఇందులో మహేష్ బాబు ఎప్పట్లాగే సూపర్ ఛార్మింగ్ అండ్ హ్యాండ్సమ్ లుక్స్ తో అదరగొట్టేస్తున్నాడు. ఈ కొత్త పిక్ చూసిన ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో ఫుల్ ఖుషీ అవుతూ ఈ ఫోటోను తెగ వైరల్ చేస్తున్నారు.
ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం సిద్ధం అవుతున్నాడు. మహేష్ ప్రస్తుతం రాజమౌళి ‘వారణాసి’లో నటిస్తున్నాడు.. ఇండియన్ స్క్రీన్ మీద మునుపెన్నడూ చూడని రీతిలో భారీ స్థాయిలో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ థియేటర్లలోకి రావడానికి ఇంకా చాలా నెలల సమయం పట్టనుంది. ఈ గ్యాప్ లోనే మహేష్ బాబు ఇలా గేమింగ్ ఇండస్ట్రీ లాంటి వ్యాపారాలపై ఫోకస్ పెట్టడం విశేషం. వారణాసి లాంటి భారీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లడానికి, పూర్తవ్వడానికి చాలా టైమ్ పడుతుంది కాబట్టి, ఆ ఖాళీ సమయాన్ని తన బిజినెస్ ఎక్స్ ప్యాన్షన్ కోసం చాలా తెలివిగా వాడుకుంటున్నాడు.
ప్రస్తుతానికి మహేష్ బాబు లైనప్ లో ఈ ‘వారణాసి’ మినహా మరే ఇతర ప్రాజెక్టులు కమిట్ కాలేదు. పూర్తి ఫోకస్ అంతా ఈ ఒక్క సినిమా పైనే పెట్టినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ పాన్ వరల్డ్ రేంజ్ సినిమాను 2027 ఏప్రిల్ 7వ తేదీన థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వారణాసి సినిమాకు సంబంధించిన మిగిలిన డీటెయిల్స్ అన్నీ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఏదేమైనా ఒక పక్క సినిమాల పరంగా ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతూనే, మరో పక్క కొత్త జనరేషన్ కు నచ్చేలా గేమింగ్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేయడం చూస్తుంటే మహేష్ బాబు ఫ్యూచర్ విజన్ ఏంటో అర్థమవుతుంది. అటు సిల్వర్ స్క్రీన్ మీద యాక్టింగ్ తో పాటు, ఇటు బిజినెస్ వరల్డ్ లోనూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాడు.
