Menu
BREAKING
Bigg Boss10 Telugu: వంశీకి క్లాస్.. త్రిగుణ్‌కు మాస్ ఎలివేషన్   |   Bigg Boss10 Telugu: ఈవారం బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరు?   |   Bigg Boss10 Telugu: కెప్టెన్ అయిన అమన్.. నరేష్‌ కోసం కన్నీళ్లు పెట్టుకున్న రామ్ ప్రసాద్   |   Bigg Boss10 Telugu: నాగ్ సహా ఒక్కొక్కరినీ ఉతికి ఆరేసిన చరణ్   |   మారిపోయిన జేమ్స్ బాండ్.. నయా బాంబ్ బాబు ఎవరో తెలుసా..?   |   2000 కోట్ల దిశగా రామాయణ.. ఆ రికార్డు రాముడి సొంతం అవుతుందా..?   |   నేను రాను.. వచ్చే సమస్యే లేదు.. కుండ బద్ధలు కొట్టిన రోహిత్ నాయుడు..!   |   ట్రెండింగ్‌లో జటాయు ఎర్త్స్ సెంటర్.. ఆ వైరల్ ప్లేస్ ఎక్కడుందో తెలుసా..?   |   ‘వారణాసి’ వాయిదా దాదాపు ఖాయమేనా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా..?   |   ఫేక్ గాళ్ల తాట తీయండి.. కేంద్రమంత్రికి ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి విన్నపం..!   |   అనిల్ రావిపూడితో జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు అవసరమా.. అవసరమే..!   |   బాహుబలి 2 ఔట్.. నెక్ట్స్ టార్గెట్ ధురంధర్ 2.. అక్కడ రామాయణ ఊచకోత..!   |   రియల్ స్టార్ శ్రీహరి ఇంట శుభకార్యం.. పెళ్ళి కొడుకు అవుతున్న పెద్ద కొడుకు..!   |   Bigg Boss10 Telugu: మీరు మీరు కొట్టుకోండి.. మమ్మల్ని ఎంటర్‌టైన్ చేయండి..   |   Bigg Boss10 Telugu: బిగ్‌బాస్ నుంచి ఈవారం ఎలిమినేట్ అయ్యిందెవరంటే…?

మారిన సెన్సార్ (CBFC) రూల్స్.. దర్శక నిర్మాతలు గుర్తించుకోండి ఈ పాయింట్స్..!

మారిన సెన్సార్ (CBFC) రూల్స్.. దర్శక నిర్మాతలు గుర్తించుకోండి ఈ పాయింట్స్..!

సినిమాల రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేయడంలో, టైటిల్స్ ఫిక్స్ చేసి ప్రమోషన్స్ చేసుకోవడంలో మన మేకర్స్ ఎప్పుడూ ముందుంటారు. కానీ ఇకపై సెన్సార్ బోర్డ్ దగ్గర వాళ్ల లాస్ట్ మినిట్ హడావిడి అస్సలు కుదరదు. సినిమాలు సెన్సార్ చేసుకోవడానికి వచ్చే నిర్మాతలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ కొత్త రూల్స్ పాస్ చేసింది. సినిమాటోగ్రాఫ్ చట్టం 1952, అలాగే 2024 సర్టిఫికేషన్ నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులు కచ్చితంగా పాటించాల్సిన కఠినమైన మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. ఇప్పటి వరకు మేకర్స్ తమకు నచ్చినట్లుగా అసంపూర్తిగా ఉన్న సినిమాలను సెన్సార్ కు పంపించి పనులు కానిచ్చేసేవారు. కానీ ఇకపై ఇలాంటి షార్ట్ కట్స్ కు ఎండ్ కార్డ్ వేస్తూ బోర్డ్ తీసుకున్న ఈ సీరియస్ డెసిషన్స్ సినిమా ఇండస్ట్రీ పనితీరును పూర్తిగా మార్చేయబోతున్నాయి.

ఇకపై సెన్సార్ కోసం పంపించే సినిమా కాపీ అన్ని విధాలుగా ఫుల్ అండ్ ఫైనల్ వెర్షన్ అయి ఉండాలని బోర్డ్ తేల్చి చెప్పింది. అంటే షూటింగ్, ఎడిటింగ్ మాత్రమే కాదు ఫైనల్ గ్రాఫిక్స్, టైటిల్స్, క్రెడిట్స్, సబ్‌టైటిల్స్, డిస్‌క్లెయిమర్‌లు అన్నీ పక్కాగా ఉండాలి. అంతేకాకుండా ఫైనల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ మిక్స్ కూడా పూర్తయి ఉండాలి. వీటితో పాటు వినికిడి, దృష్టి లోపం ఉన్నవారి కోసం థియేటర్లలో వేసే క్లోజ్డ్ క్యాప్షన్స్, ఆడియో డిస్క్రిప్షన్స్ లాంటి యాక్సెసిబిలిటీ ఫీచర్స్ కూడా కచ్చితంగా యాడ్ చేయాలి. ఈ ఫైనల్ వెర్షన్ సెన్సార్ బోర్డ్ కు చూపిస్తేనే వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. ఒకసారి CBFC అఫీషియల్ గా సర్టిఫికేట్ ఇచ్చాక, ఆ ఫైనల్ కాపీని మాత్రమే థియేటర్లలో ప్రదర్శించాలి తప్ప అందులో మళ్లీ ఎలాంటి మార్పులు చేయడానికి అస్సలు వీల్లేదు.

సినిమా అనౌన్స్ చేయగానే ఒక క్యాచీ టైటిల్ పెట్టి పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు వదిలేయడం మేకర్స్ కు చాలా మామూలు విషయం. అయితే మీరు అప్లికేషన్ లో పెట్టిన టైటిల్ ను ఫైనల్ అని అనుకోవడానికి వీల్లేదని సెన్సార్ బోర్డ్ స్పష్టం చేసింది. సినిమాటోగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ 5B(1), అలాగే కొత్త రూల్ 25 ప్రకారం సినిమా టైటిల్ ను పరిశీలించి, అవసరమైతే అందులో మార్పులు చేసే పూర్తి హక్కు ఎగ్జామినింగ్ లేదా రివైజింగ్ కమిటీకి ఉంటుంది. అందుకే సెన్సార్ సర్టిఫికేట్ చేతికి వచ్చే వరకు నిర్మాతలు తాము పెట్టుకున్న టైటిల్ అఫీషియల్ అని, అదే ఫైనల్ అని ఎక్కడా ప్రచారం చేయకూడదని బోర్డ్ గట్టిగా సూచించింది. అంటే సెన్సార్ వాళ్లు అన్నీ చెక్ చేసి ఓకే చెబితేనే ఆ టైటిల్ తో సినిమా రిలీజ్ అవుతుందన్నమాట.

సాధారణంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అవుతుండగానే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్న ప్రింట్లను సెన్సార్ కు పంపిస్తుంటారు మన ప్రొడ్యూసర్స్. కానీ ఇకపై ఇలాంటి అసంపూర్తి కాపీలను సెన్సార్ బోర్డ్ అస్సలు యాక్సెప్ట్ చేయదు. టెంపరరీ గ్రాఫిక్స్ ఉన్నా, ఫైనల్ కాని మ్యూజిక్ ట్రాక్స్ ఉన్నా, సబ్ టైటిల్స్ లాంటివి మిస్ అయినా ఆ అప్లికేషన్ ను వెంటనే రిజెక్ట్ చేస్తారు లేదా దరఖాస్తును వెనక్కి పంపించేస్తారు. మీరు అప్లికేషన్ తో పాటు కావాల్సిన అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి, పర్ఫెక్ట్ ఫైనల్ ప్రింట్ ఇస్తేనే మీ దరఖాస్తు పూర్తయినట్లు లెక్క. ఏ రోజు అయితే మీ అప్లికేషన్ అన్ని విధాలా కంప్లీట్ అవుతుందో, ఆ రోజు నుంచే మీ సినిమాను సెన్సార్ పరిశీలన క్యూలోకి తీసుకుంటారు కాబట్టి మేకర్స్ ఈ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండాలి.

చాలాసార్లు మేకర్స్ ముందుగానే రిలీజ్ డేట్ ప్రకటించేసి, ఆ డేట్ దగ్గర పడుతుందనే సాకుతో సెన్సార్ ప్రాసెస్ తొందరగా కంప్లీట్ చేయాలని బోర్డ్ పై ఒత్తిడి తెస్తుంటారు. కానీ మీ సినిమా రిలీజ్ డేట్ ను బట్టి మేము హడావిడిగా సెన్సార్ చేయబోమని CBFC కుండబద్దలు కొట్టింది. నిర్మాత అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ తో బోర్డుకు ఎలాంటి సంబంధం ఉండదు. చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారం, సెన్సార్ బోర్డ్ ప్రొసీజర్ ప్రకారమే సర్టిఫికేషన్ జరుగుతుంది. సినిమాను కమిటీ చూసి, రివ్యూ చేసి, అందులో మార్పులు సూచించడానికి చాలా టైమ్ పడుతుంది. కాబట్టి మేకర్స్ వాళ్ళ సినిమా రిలీజ్ డేట్ కంటే చాలా ముందుగానే సెన్సార్ కు అప్లై చేసుకోవాలి. అంతే తప్ప లాస్ట్ మినిట్ లో వచ్చి రిలీజ్ డేట్ పేరు చెప్పి ఒత్తిడి చేస్తే సెన్సార్ బోర్డ్ కరుణించే ప్రసక్తే లేదని చాలా క్లియర్ గా అర్థం చేసారు.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360