Menu
BREAKING
నానా పటేకర్ లాంటి దిగ్గజ నటుడికి ఇచ్చే గౌరవం ఇదేనా.. బాలీవుడ్ పట్టించుకోలేదా..?   |   విశ్వంభర టీం నమ్మకమేంటి… కాకా చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తాడా..?   |   Biggboss10 Telugu: ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్..   |   విజయ్ దేవరకొండ ముందున్న ఎన్నో సవాళ్లు.. రణబాలితో సమధానం చెప్తాడా మరి..?   |   సెక్స్ టాయ్స్ అనేది అమ్మాయిల యిష్టం.. దాంతో మీకెందుకు అంటున్న స్టార్ హీరోయిన్..!   |   Biggboss10 Telugu: కామనర్స్‌కు దెబ్బేసిన సెలబ్రిటీలు.. వీళ్లిక మారరు..   |   మొన్న నాని.. నేడు విజయ్ దేవరకొండ.. తొక్కేస్తున్నారా వీళ్లను.. మరి తొక్కేదెవరు..?   |   Biggboss10 Telugu: షాలిని వర్సెస్ అపూర్వ ఆగేలా లేదు.. రోహిత్‌కి కష్టమే..   |   భారతీయుడు 3 వస్తున్నాడు.. సేనాపతి ఈజ్ బ్యాక్.. శంకర్ ఏం చేస్తాడో..?   |   లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. ఆయన సాధించిన ఘనతలు ఎన్నో తెలుసా.. ?   |   ఏంది మచ్చా అంత పని చేసినావ్.. మీమ్స్‌తో నవ్వించిన అగ్గిపెట్టి మచ్చ హఠాన్మరణం..!   |   Biggboss10 Telugu: వామ్మో.. షాలిని వర్సెస్ అపూర్వ.. చూసేవారికి టార్చర్   |   స్పిరిట్ ముందుకు.. ఫౌజీ వెనక్కి.. ప్రభాస్ సినిమాల విషయంలో అసలు ఏం జరుగుతోంది?   |   Biggbogss10 Telugu: రోహిత్‌కు గుదిబండలా తయారైన షాలిని.. లవ్ ట్రాక్ ఇబ్బందే..   |   తమిళ హీరోలకు రాజకీయ పిచ్చి ముదిరిందా.. అందరూ విజయ్ అయిపోలేరు కదా..?

Biggboss10 Telugu: ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్..

Biggboss10 Telugu: ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్..

బిగ్‌బాస్ 10 తెలుగు వారమంతా ఒక గోల అయితే వీకెండ్ ఆ గోలకు హోస్ట్ నాగార్జున వచ్చిన రేవు పెడతారు. ఈ వారం ఎప్పుడూ లేనంతగా నాగ్ ఫైర్ మీద ఉన్నారు. నాలుగు ప్రోమోలు వచ్చాయి. ఒక్కటంటే ఒక్క దానిలోనూ ఆయనలో నవ్వు మొహమే కనిపించింది లేదు. చాలా సీరియస్‌గా కనిపించారు. రోహిత్, షాలినిలకు గట్టిగా ఇచ్చిపడేశారు. వాష్ రూమ్ డ్యూటీ సరిగా చేయడం లేదని అపూర్వ చెప్పడంతో వాళ్లకు (రోహిత్, షాలిని) అంత టైమ్ ఎక్కడుంటుంది? రాత్రంతా మాట్లాడుకోవడానికే టైం సరిపోవడం లేదంటూ సీరియస్‌గా చురకలు వేశారు. షాలినిని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి మరీ నాగ్ క్లాస్ తీసుకున్నారు. ఒక్క రోహిత్, షాలినినే కాదు.. అమన్, రామ్ ప్రసాద్, ఝాన్సీ, వర్షిణి అందరిపై ఫైర్ అయ్యారు.

ఇక ఈవారం ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్ ఏంటంటే… అపూర్వ ఎలిమినేట్ అయిపోయింది. ఇదొక్కటే కాదు.. మరో రెండు ఎలిమినేషన్స్ కూడా ఉన్నాయని టాక్. అయితే ఆ ఇద్దరిలో ఒకరు సీక్రెట్ రూమ్‌కి వెళ్లే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అపూర్వను ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ చేస్తే.. హౌస్‌లో ఎవరు అన్‌వర్తీ అనుకుంటున్నారో చెప్పి వారి ఫేస్‌పై ముద్ర వేయమంటే.. ఎక్కువ ఓట్లు రోహిత్‌కు వచ్చాయి. ఐదుగురు రోహిత్ హౌస్‌లో ఉండేందుకు అనర్హుడని చెబుతూ ముద్ర వేశారు. దీంతో రోహిత్‌ను ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. అంటే ఎలిమినేట్ అయితే అవడు కానీ సీక్రెట్ రూంకి పంపించవచ్చని టాక్ నడుస్తోంది. రోహిత్ కానీ.. షాలిని కానీ సీక్రెట్ రూమ్ పక్కా అని అంటున్నారు. ఇద్దరిలో ఎవరు సీక్రెట్ రూమ్‌కి వెళ్లినా కూడా తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరికీ బ్యాడ్ అయ్యే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360