Menu
BREAKING
లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. ఆయన సాధించిన ఘనతలు ఎన్నో తెలుసా.. ?   |   ఏంది మచ్చా అంత పని చేసినావ్.. మీమ్స్‌తో నవ్వించిన అగ్గిపెట్టి మచ్చ హఠాన్మరణం..!   |   Biggboss10 Telugu: వామ్మో.. షాలిని వర్సెస్ అపూర్వ.. చూసేవారికి టార్చర్   |   స్పిరిట్ ముందుకు.. ఫౌజీ వెనక్కి.. ప్రభాస్ సినిమాల విషయంలో అసలు ఏం జరుగుతోంది?   |   Biggbogss10 Telugu: రోహిత్‌కు గుదిబండలా తయారైన షాలిని.. లవ్ ట్రాక్ ఇబ్బందే..   |   తమిళ హీరోలకు రాజకీయ పిచ్చి ముదిరిందా.. అందరూ విజయ్ అయిపోలేరు కదా..?   |   జబర్దస్త్ కామెడీ షో.. పోయిన వాళ్లే మళ్లీ.. అదిరిపోయిన మల్లెమాల స్ట్రాటజీ..!   |   Biggboss10 Telugu: ఈసారి హౌస్‌లోని వారికి కాదు.. రివ్యూవర్స్‌కి పెద్ద టాస్క్   |   విశ్వంభరను మరిచిపోదామా.. బాస్ సినిమా బాక్సుల్లోంచి బయటికి రానట్లేనా..?   |   కామ్రేడ్ కళ్యాణ్ ట్రైలర్ రివ్యూ.. వాళ్ల మనోభావాలు దెబ్బతింటే అంతే సంగతులు..!   |   Biggboss10 Telugu: రెచ్చిపోతున్న సుధీర్.. పడిపోతున్న గ్రాఫ్..   |   ఇదెక్కడి దిక్కుమాలిన ప్లానింగ్.. కనీసం ట్రైలర్స్ కట్ చేయడానికి టైమ్ దొరకట్లేదా..?   |   Biggboss10 Telugu: హాట్ హాట్‌గా నామినేషన్స్.. ఈవారం కూడా కామనర్స్ బలి..   |   లెజెండరీ నటి శారద పరిస్థితి చూస్తున్నారా.. 81 ఏళ్ళ వయసులో కూడా..!   |   Biggboss10 Telugu: నామినేషన్స్‌లో రెచ్చిపోయిన వర్షిణి, ముఖేష్..

Biggboss10 Telugu: వామ్మో.. షాలిని వర్సెస్ అపూర్వ.. చూసేవారికి టార్చర్

Biggboss10 Telugu: వామ్మో.. షాలిని వర్సెస్ అపూర్వ.. చూసేవారికి టార్చర్

నిన్న నామినేషన్స్ పూర్తైన సీన్ నుంచి ఇవాళ షో ప్రారంభమైంది. తనను కొన్ని కారణాల వల్ల తనను నామినేట్ చేశారని.. నరేష్ ఓటు కోసం ప్రేక్షకులను అభ్యర్థించాడు. ‘తుడుచుకుంటే పోతానంటే.. 99 సార్లు తుడుచుకుంటానని.. నేనే పోవాలంటే నేనెందుకు ఊరుకుంటా’ అని రామ్ ప్రసాద్ సవాళ్లు విసురుతున్నాడు. నామినేషన్స్‌ గురించి రోహిత్, అమన్, చరణ్ మాట్లాడుకుంటున్నారు. ‘వెంటనే ఝాన్సీ ఉంది వద్దు.. మళ్లీ వెళ్లి వీటినే నామినేషన్ పాయింట్స్‌లో పెడుతుందని’ అమన్ అన్నాడు. ఝాన్సీ.. ఒకవేళ అగ్నిపరీక్ష టీంను వాళ్లంతా దూరంగా ఉంచేలా అయితే తననెందుకు దగ్గరకు తీస్తున్నారని చెప్పింది. మొత్తానికి ఝాన్సీ మారేలా అయితే లేదు. మరోవైపు రామ్ ప్రసాద్, నరేష్, వంశీ, త్రిగుణ్ కూడా నామినేషన్స్ గురించి మాట్లాడుతున్నాడు. చరణ్ ఏం టాస్క్ ఆడాడని.. వాడిని చేయలేదు? అని త్రిగుణ్ అంటున్నాడు. ఇక వర్షిణి.. ముఖేష్‌తో తన రిలేషన్ గురించి త్రిగుణ్‌తో షేర్ చేసుకుంది. తనకు తండ్రితో ఎమోషన్ లేదని.. ఆ కారణంగానే తాను ముఖేష్‌కు దగ్గరవుతున్నానని చెప్పింది. మొత్తానికి ఎక్కడ ముఖేష్‌తో రిలేషన్ బయటకు వేరేలా పోతుందని దానిని కవర్ చేసినట్టుగాఅనిపించింది.

ముఖేష్‌తో ఎక్కువగా ఉండటం వల్ల తనకు హై ఎనర్జీ వస్తుందని.. సోది చెబితే వింటాడని.. బుల్‌షిట్ మాట్లాడితే ముఖేష్ వింటాడని వర్షిణి చెప్పింది. ముఖేష్ అర్థం చేసుకుని వెళ్లిపోతాడని త్రిగుణ్ చెప్పాడు. ముఖేష్ చేయి పట్టుకుంటే దడ తగ్గుతుందట. ఇది చూసేందుకు లవ్ ట్రాక్ కాదని చెప్పింది. ‘రోడ్ టు రీలోడ్’లో భాగంగా.. ఎండిన చెట్టుపై కంటెస్టెంట్స్ ఫోటోలన్నీ పెట్టారు. వికసించిన పూలతో ఉన్న చెట్లపై వంశీ, దేబ్జాని, వర్షిణి, సుధీర్ ఫోటోలను పెట్టారు. ఈ వారం ఈ నలుగురు సేఫ్ జోన్‌లోకి వెళ్లారు. మీ భవిష్యత్తును నిర్ణయించే తాళం చెవులు ఒకటి ప్రేక్షకుల దగ్గర, మరొకటి తను నిర్వహించబోయే టాస్క్‌ల్లో ఉంటుందని బిగ్‌బాస్ చెప్పారు. దీనికోసం పెయిర్స్‌గా ఏర్పడాల్సి ఉంటుంది. సేఫ్‌ జోన్‌లో ఉన్నవారిని మినహాయించి పెయిర్స్‌గా ఏర్పడాలని బిగ్‌బాస్ చెప్పారు. అమన్‌ను త్రిగుణ్ మనిద్దరం పెయిర్ అవుదామా? అని అడిగాడు. ఓకే అని అమన్ అన్నాడు. రోహిత్ అతడిని పిలిచి ఒకవేళ మీ ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ వస్తే ‘నిన్ను బలి చేస్తాడు’ అని రోహిత్ చెప్పాడు. ఒకవేళ ఛాన్స్ వస్తే నీకేమైనా ఇస్తాడేమో అడుగు అని అమన్‌కి రోహిత్ చెప్పడంతో వెళ్లి అడిగాడు. దానికి త్రిగుణ్ ఓకే చెప్పాడు.

Biggboss10 Telugu: వామ్మో.. షాలిని వర్సెస్ అపూర్వ.. చూసేవారికి టార్చర్

ఇక రోహిత్‌తో తను ఆడుతానని అపూర్వ అడిగింది. దీనికి రోహిత్ నో చెప్పి షాలినితో కలిసి ఆడనున్నట్టుగా చెప్పాడు. ఈ నేపథ్యంలో అపూర్వ వర్సెస్ షాలిని పెద్ద గొడవ అయ్యింది. అంతా వింటున్నారు.. చిన్నగా మాట్లాడాలని రోహిత్, చరణ్ చెబుతున్నా షాలిని వాయిస్ రేజ్ చేస్తోంది. అది ‘నీ పర్సనాలిటి.. పాయిజనస్’ అంటూ షాలిని మాటలు జారింది. షాలిని, అపూర్వ ఇద్దరూ కలిసి రోహిత్ కోసం కొట్టుకున్నారు. మొత్తానికి రోహిత్ ఆటను తుంగలో తొక్కేందుకు వీళ్లిద్దరు చాలని అనిపిస్తోంది. మరోవైపు త్రిగుణ్, వర్షిణి, రామ్ ప్రసాద్, నరేష్ కలిసి ఓ స్కిట్ చేశారు. అది ఏమాత్రం వర్కవుట్ కాలేదు. మరోవైపు షాలిని చేసిన రచ్చ చూపించారు. చాలా నస.. గొడవ. రోహిత్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఇది ఇలాగే నడిస్తే అతని గ్రాఫ్ పడిపోవడం ఖాయం. ఆ తరువాత అపూర్వ దగ్గరకు వెళ్లి రోహిత్ మాట్లాడాడు. తనకు మేనర్స్ తెలుసని.. తను ఎప్పుడూ ఒక వ్యక్తిని డీగ్రేడ్ చేసి మాట్లాడనని అపూర్వ చెప్పింది. అపూర్వను చీప్ పర్సనాలిటీ అని షాలిని అనడం దారుణం. వీళ్ల గొడవను సెలబ్రిటీలంతా ఆసక్తిగా వింటున్నారు.

షాలిని గొడవ మధ్యలో త్రిగుణ్ పేరు తీసుకురావడంతో మళ్లీ అపూర్వ వర్సెస్ త్రిగుణ్ గొడవ ప్రారంభమైంది. ‘పని దొంగా’ అంటూ ఆమెను ఏడిపించడం త్రిగుణ్ స్టార్ట్ చేశాడు. సుధీర్‌తో లవ్ స్టోరీ గురించి తానేదో సరదాగా అన్నానని దానిని తీసుకురావడం సరికాదని ఆమె గొడవకు దిగింది. ‘నువ్వు పెళ్లి కోసం వచ్చావని అన్నావు. పెళ్లి కోసం అడిగానని నామినేషన్‌లో అన్నావు’ అని రామ్ ప్రసాద్.. అపూర్వను అన్నాడు. బిగ్‌బాస్ తనకొక వైబ్ ఇస్తున్నాడు.. తాను కనెక్ట్ అవుతానని అన్నావని రామ్ ప్రసాద్ చెప్పాడు. తను కేవలం సరదాగా అన్నానని అపూర్వ చెప్పింది. బిగ్‌బాస్‌లో పవిత్రమైన పెళ్లి బంధం అని చెప్పడమేంటని సుధీర్ అన్నాడు. షాలిని దగ్గరకు రామ్ ప్రసాద్ వచ్చాడు. అంతకు ముందు జరిగిన పెళ్లి డ్రామా గురించి మాట్లాడాడు. తనకు మంచి అబ్బాయి కావాలి చెప్పమని ఝాన్సీని కూడా అడిగిందని రామ్ ప్రసాద్ చెప్పాడు. అప్పుడు ఝాన్సీని అపూర్వ పిలిచింది. ‘నీకు ఎవరు కావాలో చెప్పు’ అంటే మీ అన్న కావాలని చెప్పానని అపూర్వ చెప్పింది. దానికి ఝాన్సీ కూడా అవునని చెప్పింది. ఈ గొడవ చాలా సేపు కొనసాగింది. అపూర్వను పక్కనబెడితే అగ్నిపరీక్ష టీం నుంచి వచ్చిన ఆమెను పక్కనబెడుతున్నారని అంటారని షాలినికి రోహిత్ సర్ది చెప్పాడు.

Biggboss10 Telugu: వామ్మో.. షాలిని వర్సెస్ అపూర్వ.. చూసేవారికి టార్చర్

ఏడుస్తూ తనేదో సరదాగా చేసిన దానికి ఇలా చేస్తున్నారని చరణ్‌తో అపూర్వ చెప్పింది. ఇక టాస్క్ ప్రారంభమైంది. త్రిగుణ్, అమన్.. నరేష్, రామ్ ప్రసాద్.. ఝాన్సీ, ముఖేష్.. చరణ్, అపూర్వ.. రోహిత్, షాలిని పెయిర్స్‌గా టాస్క్ ప్రారంభించారు. తొలి టాస్క్.. స్టార్ స్టార్ సూపర్ స్టార్. బోర్డును థ్రెడ్‌తో హోల్డ్ చేయాలి. మరొకరు.. స్టార్‌ను దానిపై అమర్చాలి. ఇక ముందుగా ప్రారంభించిన వారికి 100.. తర్వాత 80.. 60.. 40.. 20 పాయింట్లు వస్తాయి. తమ ప్లేస్ మార్చడంపై అమన్, త్రిగుణ్.. సంచాలక్ అయిన వర్షిణితో గొడవ పడ్డారు. ప్రతిసారీ ముఖేష్‌కు ఫేవర్ చేయాలని చూస్తుంటావని త్రిగుణ్ అన్నాడు. ఇక ఈ టాస్క్‌ను ముందుగా అపూర్వ పూర్తి చేసి బెల్ కొట్టింది. తర్వాత త్రిగుణ్ బెల్ కొట్టాడు. తర్వాత ముఖేష్, నరేష్.. చివరిగా రోహిత్ పూర్తి చేశాడు. ఎందుకోగానీ రోహిత్ చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు. దీంతో చాలా వెనుకబడ్డాడు. ఫస్ట్ ప్లేస్ చరణ్, అపూర్వ.. సెకండ్ అమన్, త్రిగుణ్.. థర్డ్ ముఖేష్, ఝాన్సీ.. ఫోర్త్ నరేష్, రామ్ ప్రసాద్.. చివరిగా రోహిత్, షాలిని ఉన్నారు. ఇటీవలి కాలంలో రోహిత్ ఒక్క టాస్క్ కూడా ఆడిందే లేదు. షాలిని అంత బాగా ఆడింది.. రోహిత్ ఓడిపోవడమేంటి.. షాకింగ్ అని త్రిగుణ్ అన్నాడు.

చరణ్ ఒక్క టాస్క్ కూడా ఆడలేకపోయాడని చెప్పిన వారికి అతను గట్టి సమాధానమే ఇచ్చాడు. అప్పట్లో తను రోహిత్ గంట మాట్లాడుకునే వాళ్లమని చరణ్ చెప్పాడు. తను మధ్యలో వస్తున్నాననే కదా.. అంటున్నావని షాలిని అన్నది. దీనికి కూడా ఆమె ఫీలైపోయి చెప్పింది. అపూర్వ ఒంటరిదైపోయిందని నరేష్ చెప్పాడు. అందరినీ కూర్చోబెట్టి నరేష్ కథలు చెప్పడం మొదలు పెట్టాడు. అసలా కథలేంటో ఆ గొడవలేంటో చూసే ప్రేక్షకులకు ఏమాత్రం అర్థం కాదు. నరేష్ ఎప్పుడూ తనని తాను లేపుకునేందుకు ట్రై చేస్తుంటాడు. కామెడీ చేస్తాడు కానీ అది వర్కవుట్ కాదు. వామ్మో.. షాలిని వర్సెస్ అపూర్వ.. చూసేవారికి టార్చర్. మొత్తానికి ఇవాళ కూడా గొడవల నడుమ ఎలాగో ఒక టాస్క్‌ను కంటెస్టెంట్స్ అంతా పూర్తి చేశారు.

Pranav

Writer and contributor at Telugu Cinema 360