Menu
BREAKING
Bigg Boss10 Telugu: బిగ్‌బాస్‌కి ముందే వర్షిణి, త్రిగుణ్ మధ్య బిగ్ డీల్.. ఒప్పేసుకున్న త్రిగుణ్   |   Bigg Boss 10 Telugu: నామినేషన్లలో త్రిగుణ్ వర్సెస్ రోహిత్.. దేబ్జాని, వర్షిణితోనూ వాగ్వాదాలు   |   Bigg Boss10 Telugu: మాస్క్ తీసిన దేబ్జాని.. రోహిత్‌ని ఒంటరిని చేసేందుకు ప్రయత్నాలు..   |   Bigg Boss10 Telugu: హౌస్ నుంచి దక్షి, షాలిని ఎలిమినేట్.. పస లేని షో..   |   Bigg Boss10 Telugu: ఎలిమినేట్ అయిన శాలిని.. రోహిత్‌కు దెబ్బ మీద దెబ్బ   |   Bigg Boss 10 Telugu: రోహిత్‌కు బ్లాక్ కార్డ్.. మోకాళ్లపై కూర్చొని వేడుకున్న రోహిత్   |   ఫిట్‌నెస్, గాయాల నుంచి కోలుకోవడంపై డాక్టర్ వెంకటేష్ మోవ్వతో టైగర్ ష్రాఫ్ ఆసక్తికర చర్చ   |   Biggboss10 Telugu: సడెన్ ఎలిమినేషన్.. ఇవాళేనా? వెళ్లబోయేదెవరు?   |   RC17 సినిమాతో సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ విడిపోయినట్లే..!   |   నా బాడీ నా యిష్టం.. నా సైజ్‌ల గురించి మీకెందుకు.. ఆ హీరోయిన్ సీరియస్..!   |   Biggboss10 Telugu: హౌస్‌లోకి షాలిని ఎంట్రీ.. ఈ వారం ముప్పు ఆ ఇద్దరికే..   |   సో కాల్డ్ వారసులను అడిగే దమ్ముందా.. బ్యాగ్రౌండ్ లేని కుర్రాళ్లేనా టార్గెట్..?   |   కుర్రాడు సక్సెస్ అవుతాడా.. దొంగ నా కొడుకుతో మౌళి ఫ్యూచర్ ఏంటి..?   |   దసరాకు పట్టించుకోరా.. విజయదశమి కనీసం కళ్లకు కనిపించలేదా మన హీరోలకు..?   |   Biggboss10 Telugu: సుధీర్, ఝాన్సీలను ఒకాట ఆడుకున్న ఆర్కే.. బయటకొచ్చిన ఎలుకలు..

ఏంది మచ్చా అంత పని చేసినావ్.. మీమ్స్‌తో నవ్వించిన అగ్గిపెట్టి మచ్చ హఠాన్మరణం..!

ఏంది మచ్చా అంత పని చేసినావ్.. మీమ్స్‌తో నవ్వించిన అగ్గిపెట్టి మచ్చ హఠాన్మరణం..!

సోషల్ మీడియాలో తనదైన స్టైల్ డైలాగులతో నెటిజన్లను కడుపుబ్బా నవ్వించిన పాపులర్ యూట్యూబర్, కమెడియన్ కిరణ్ కుమార్ అలియాస్ ‘అగ్గిపెట్టి మచ్చ’ ఇకలేరు. తన మార్క్ ఎక్స్ ప్రెషన్స్ తో అందరినీ ఎంతగానో ఎంటర్టైన్ చేసిన ఆయన ఇలా సడెన్ గా లోకాన్ని విడిచివెళ్లడం అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. తిరుపతికి చెందిన కిరణ్, కేవలం ఒక సాధారణ వ్యక్తిగా కెరీర్ మొదలుపెట్టి సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీ హోదాను దక్కించుకున్నారు. కరోనా టైమ్‌లో మనోడు చేసిన కొన్ని మీమ్స్ భలే ఫేమస్ అయ్యాయి. ఎవరైనా డల్ గా ఉన్నప్పుడు ఆయన వీడియో చూస్తే చాలు నవ్వుల పాలు అవ్వాల్సిందే. తన యూనిక్ కామెడీ టైమింగ్ తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న కిరణ్ కుమార్ సంపాదించుకున్న ఫాలోయింగ్ చాలా పెద్దది. అలాంటి ఎంటర్టైనర్ సడెన్ గా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారన్న వార్త డిజిటల్ కమ్యూనిటీలో తీవ్ర విషాదం నింపింది.

ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే పరిస్థితి మరింత విషమించడంతో అక్టోబర్ 5న ఆయనను తిరుపతిలోని ప్రసిద్ధ స్విమ్స్ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. అక్కడ ఆయనకు డాక్టర్లు వెంటిలేటర్ పై ఉంచి అత్యవసర చికిత్స అందించారు. అయినా కూడా ఆయన శరీరం ట్రీట్మెంట్ కు సరిగ్గా సహకరించకపోవడంతో అక్టోబర్ 7న తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతూ వెల్లడించారు. నిజానికి గత కొన్ని రోజులుగా ఆయన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ఎక్కడా యాక్టివ్ గా కనిపించడం లేదు. కొత్త వీడియోలు రాకపోవడంతో ఫ్యాన్స్ అంతా ఏమైందా అని ఆలోచిస్తున్న టైమ్ లోనే ఇలా నేరుగా ఆయన మరణవార్త బయటకు రావడం అందరినీ కలచివేస్తోంది. నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆయన చివరికి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.

ఏంది మచ్చా అంత పని చేసినావ్.. మీమ్స్‌తో నవ్వించిన అగ్గిపెట్టి మచ్చ హఠాన్మరణం..!

డిజిటల్ ప్లాట్ ఫామ్స్ మీద ‘అగ్గిపెట్టి మచ్చ’ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మాట్లాడే స్లాంగ్, ఇచ్చే ఫన్నీ ఎక్స్ ప్రెషన్స్ కు యూత్ ఫుల్ గా కనెక్ట్ అయ్యారు. ఎక్కడ చూసినా ఆయన మీమ్స్, షార్ట్ వీడియోస్ విపరీతంగా ట్రెండ్ అయ్యేవి. ఒక స్టార్ హీరోకి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ తో సమానంగా కిరణ్ కూడా సోషల్ మీడియాలో ఆదరణ పొందారు. పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానెల్స్ అన్నీ ఆయనతో ఒక్క ఇంటర్వ్యూ అయినా చేయాలని క్యూ కట్టేవి అంటే ఆయన డిమాండ్ ఏ రేంజ్ లో ఉండేదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఎంతో మందికి స్ట్రెస్ బస్టర్ గా నిలిచిన కిరణ్ కుమార్ చనిపోవడంతో తోటి యూట్యూబర్లు, ఆర్టిస్టులు, అభిమానులు ఆన్లైన్ వేదికగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పోస్టులు పెడుతున్నారు. ఎప్పుడూ నవ్వించే మనిషి ఇలా విషాదం మిగిల్చి వెళ్లిపోయాడంటూ ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360