
బిగ్‌బాస్ 10 తెలుగు రసవత్తరం అనే కన్నా.. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా ఉందనడం ఉత్తమమేమో. ఎవరూ తక్కువోళ్లు కాదు. కానీ సెలబ్రిటీలంతా అతి తెలివి ప్రదర్శించడంలో ఒక అడుగు ముందున్నారు. ఇక ఝాన్సీ కామనర్స్‌తో ఉంటూ సెలబ్రిటీలకు పావులా మారింది. ఆమె గేమ్ ప్లే ఆమెది. ఎవరిని తప్పుబట్టాలో.. ఎవరిని ఒప్పు అనాలో తెలియని పరిస్థితి. ఇక రోహిత్‌కి అంతా బాగుందనుకుంటున్న తరుణంలో అతని ఓటు బ్యాంకుకు షాలిని బ్రేకర్‌లా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే అతని పాలిట గుదిబండలా షాలిని తయారైంది. ఆమె బిహేవియర్ కారణంగా రోహిత్ చిక్కుల్లో పడుతున్నాడు. అది మాత్రమే కాకుండా అదో లవ్ ట్రాక్‌లా అనిపిస్తోంది. ఎప్పుడైనా లవ్ ట్రాక్‌లు కంటెస్టెంట్స్ మెడకు గుదిబండలే అవుతాయనడంలో సందేహం లేదు.
గతంలో కూడా ఎన్నో లవ్ స్టోరీలు చూశాం. కానీ హౌస్‌ను వీడి బయటకు వచ్చాక ఒక్కటంటే ఒక్కటి కూడా నిలవలేదు. రోహిత్, షాలిని లవ్ స్టోరీ బయటకు వచ్చాక ఎలా ఉన్నా పర్వాలేదు కానీ హౌస్‌లో మాత్రం అతనికి ఇబ్బందే కానుంది. ముఖ్యంగా షాలిని కామ్‌గా ఉండే రకం కాదు.. ప్రతి దానికి గొడవ చేస్తూ ఉంటుంది. ఆమె వాయిస్ ఆమెకే కాకుండా రోహిత్‌కు కూడా ఇబ్బందే కానుంది. ఇవాళ షాలిని, అపూర్వకు గొడవ జరిగింది. రోహిత్ అరవొద్దని ఎంత మొత్తుకున్నా షాలిని వినే పరిస్థితి లేదు. పైగా త్రిగుణ్, రామ్ ప్రసాద్ దగ్గర పంచాయతీ పెట్టింది. రోహిత్ ఎంత వారిస్తున్నా ఆమె ఆవేశం మాత్రం తగ్గడం లేదు. చూసేందుకు షార్ట్ టెంపర్‌లా కనిపిస్తోంది. రోహిత్ ఆమెను వదిలించుకుని తన గేమ్ తను ఆడకుంటే మాత్రం షాలిని అతనికి ఇబ్బందికరంగా మారుతుందనడంలో సందేహమే లేదని తెలుస్తోంది.
