Menu
BREAKING
పునీత్ రాజ్‌కుమార్ 5వ వర్ధంతి.. అప్పు దూరమై అప్పుడే ఐదేళ్ళు..!   |   Nara Rohith: ఆదర్శ కుటుంబానికి నారా రోహిత్ దూరం దూరం.. అదేనా అసలు కారణం..?   |   Bigg Boss10 Telugu: బీబీ హోటల్ టాస్క్ ప్రారంభం.. రోహిత్ ఈజ్ బ్యాక్..   |   Janhvi Kapoor: పెద్దిపై జాన్వీ కపూర్ రియాక్షన్.. ఏరు దాటాక తెప్ప తార్చడమంటే ఇదేనా..?   |   మూర్తన్న ఆన్ డ్యూటీ.. కోట్లు ఇస్తా అన్నా నటించని పీపుల్ స్టార్.. హుషారు 2లో ఎలా..?   |   Bigg Boss10 Telugu: బిగ్‌బాస్‌కి ముందే వర్షిణి, త్రిగుణ్ మధ్య బిగ్ డీల్.. ఒప్పేసుకున్న త్రిగుణ్   |   Bigg Boss 10 Telugu: నామినేషన్లలో త్రిగుణ్ వర్సెస్ రోహిత్.. దేబ్జాని, వర్షిణితోనూ వాగ్వాదాలు   |   Bigg Boss10 Telugu: మాస్క్ తీసిన దేబ్జాని.. రోహిత్‌ని ఒంటరిని చేసేందుకు ప్రయత్నాలు..   |   Bigg Boss10 Telugu: హౌస్ నుంచి దక్షి, షాలిని ఎలిమినేట్.. పస లేని షో..   |   Bigg Boss10 Telugu: ఎలిమినేట్ అయిన శాలిని.. రోహిత్‌కు దెబ్బ మీద దెబ్బ   |   Bigg Boss 10 Telugu: రోహిత్‌కు బ్లాక్ కార్డ్.. మోకాళ్లపై కూర్చొని వేడుకున్న రోహిత్   |   ఫిట్‌నెస్, గాయాల నుంచి కోలుకోవడంపై డాక్టర్ వెంకటేష్ మోవ్వతో టైగర్ ష్రాఫ్ ఆసక్తికర చర్చ   |   Biggboss10 Telugu: సడెన్ ఎలిమినేషన్.. ఇవాళేనా? వెళ్లబోయేదెవరు?   |   RC17 సినిమాతో సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ విడిపోయినట్లే..!   |   నా బాడీ నా యిష్టం.. నా సైజ్‌ల గురించి మీకెందుకు.. ఆ హీరోయిన్ సీరియస్..!

Bigg Boss10 Telugu: బీబీ హోటల్ టాస్క్ ప్రారంభం.. రోహిత్ ఈజ్ బ్యాక్..

Bigg Boss10 Telugu: బీబీ హోటల్ టాస్క్ ప్రారంభం.. రోహిత్ ఈజ్ బ్యాక్..

చాలా రోజుల తర్వాత మార్నింగ్ సాంగ్‌తో షో ప్రారంభమైంది. వర్షిణి, ముఖేష్, సుధీర్ ముగ్గురూ కలిసి త్రిగుణ్ గురించి మాట్లాడుకున్నారు. తనకు ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉందని అది తీయాలని ఉందని.. తను దెబ్బేస్తే వాడు పడిపోవాల్సిందేనని వర్షిణి చెప్పింది. ఇంత మంది కడుపు కొట్టాడు.. తప్పే కాదు కానివ్వమని సుధీర్, ముఖేష్ చెప్పాడు. మరోవైపు త్రిగుణ్ కెమెరాలతో మాట్లాడాడు.. ఎవడి గేమ్ వాడు ఆడుతున్నాడు. వాళ్లకు (ముఖేష్ గ్రూప్) నచ్చినట్టు జరగాలి. మన ప్లాన్ బాగానే వర్కవుట్ అవుతోందని త్రిగుణ్ చెప్పాడు. ముఖేష్‌ను సైడ్ చేయడానికి నీతూ, అమన్‌ని జడ్జిలను చేయాల్సి వచ్చిందని చెప్పాడు. ఎందుకంటే ముఖేష్ పిచ్చోడిలా చేస్తున్నాడని అని త్రిగుణ్ కెమెరాలకు చెప్పాడు. ఇక బీబీ హోటల్ టాస్క్‌ను ప్రారంభిస్తున్నట్టు బిగ్‌బాస్ చెప్పారు. ఈవారం మూడు లెవల్స్‌లో ఉన్న సభ్యులు మూడు రకాల పాత్రలు పోషిస్తారు. ఎల్లో హోటల్ ఓనర్స్.. రెడ్ లెవల్‌లో ఉన్న సభ్యులు హోటల్ వర్కర్స్.. గ్రీన్ లెవల్‌లో ఉన్న సభ్యులు హోటల్‌కి వచ్చే గెస్ట్‌లు. ఈ ఛాలెంజ్‌లో గెస్ట్‌ల దగ్గర డబ్బులు ఉంటాయి. వాటిని వర్కర్స్‌కు టిప్స్‌గా ఇవ్వొచ్చు. ఇది గతంలో మనం చూసిన టాస్కే. ప్రతి సీజన్‌లోనూ ఉంటుంది.

దేబ్జాని వచ్చేసి ప్రతి విషయంలో పర్ఫెక్షన్ కోరుకునే రిచ్ గర్ల్. ముఖేష్ ఆమె బాయ్ ఫ్రెండ్. అతనికి విపరీతమైన మతిమరుపు. వీరిద్దరూ తమ ప్రి వెడ్డింగ్ ప్రిపరేషన్ కోసం వస్తారు. తమ పెళ్లి కోసం ఈ హోటల్‌కు వస్తారు. నీతూ గాసిప్ క్వీన్. ప్రతి చిన్న విషయానికి బిల్డప్ ఇస్తుంది. త్రిగుణ్ చార్మింగ్ డాన్. అమన్.. డాన్ త్రిగుణ్‌కి అసిస్టెంట్, బెస్ట్ ఫ్రెండ్, లెఫ్ట్ హ్యాండ్. రోహిత్, శ్వేత, సుధీర్ హౌస్ కీపింగ్. రామకృష్ణ, ఝాన్సీ కుక్స్. వంశీ మసాజ్ థెరపిస్ట్, డ్యాన్స్ ట్రైనర్. ‘నీకు మనీ కావాలి.. నాకు స్టార్ కావాలి’ అని రోహిత్‌తో వర్షిణి డీల్ పెట్టుకుంది. ఇద్దరూ ఒకరికొకరం సాయం చేసుకుందామనుకున్నారు. ఆ తరువాత వర్షిణి మళ్లీ సుధీర్‌తో డీల్ పెట్టుకుంది. రామకృష్ణ, వంశీ కూడా డీల్ పెట్టుకున్నారు. స్టార్ పోయిందని వర్షిణి అందరినీ ప్రశ్నించడం ప్రారంభించింది. త్రిగుణ్ దానిని తీశాడు. ముఖేష్, త్రిగుణ్ మధ్య దీని గురించి వాగ్వాదం జరిగింది.

Bigg Boss10 Telugu: బీబీ హోటల్ టాస్క్ ప్రారంభం.. రోహిత్ ఈజ్ బ్యాక్..

కంటెస్టెంట్స్ అంతా తమ పేర్లు మార్చుకున్నారు. రోహిత్ విజ్ఞానం అని.. రామకృష్ణ ధనియాలు అని రకరకాల పేర్లు పెట్టుకున్నారు. ఇక ముఖేష్, దేబ్జాని కపుల్ పెళ్లి చేసుకోవడానికని బీబీ హోటల్‌కు వచ్చారు. ఎవరి గోల వారిదే. దేబ్జాని మెడలో నెక్లెస్ తీసుకొచ్చి ఇస్తే స్టార్ ఇస్తానని రామ్ ప్రసాద్‌తో త్రిగుణ్ డీల్ చేసుకున్నాడు. ‘నా ప్రియుడు వేరొక అమ్మాయితో గడిపేస్తున్నాడు’ అని దేబ్జాని నరేష్‌కు చెప్పింది. రోహిత్ వచ్చేసి త్రిగుణ్, అమన్‌లకు సేవ చేశాడు. అమన్ డబ్బులిచ్చాడు. ఈ టాస్క్ అంతా చాలా చిరాకుగా ఉంది. ఏమాత్రం వర్కవుట్ అవలేదు. మరోవైపు ముఖేష్ వెళ్లి వర్షిణితో పులిహోర కలపడం ప్రారంభించాడు. దేబ్జాని వెళ్లి తనకు కాబోయే భర్త వేరొకామెతో ఉంటున్నాడని చెప్పాడు. ముఖేష్‌ను వర్షిణి కిస్ చేసి.. హగ్ ఇచ్చింది. మన పాత ప్రేమను మరిచిపోవద్దని ముఖేష్ చెప్పాడు. వాళ్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుందామనుకుంటున్నానని.. మీ సాయం కావాలని దేబ్జాని వెళ్లి త్రిగుణ్‌ని అడిగింది.

ఒక పోస్ట్ వచ్చింది. దానిని రోహిత్ తీసుకున్నాడు. వర్షిణిని పిలిచి అది మీకు చాలా స్పెషల్ అని.. తనకు డబ్బులిస్తే దానిని మీకు ఇస్తానని చెప్పాడు. దీంతో ముఖేష్ నుంచి డబ్బులు వసూలు చేసి ఫోటోను అతని చేతిలో పెట్టాడు. ముఖేష్‌ను వర్షిణి కిస్ చేసిన ఫోటోను బిగ్‌బాస్ లాన్‌లో పెట్టారు. తనకొక స్టార్ ఇవ్వమని దేబ్జానిని నరేష్ అడిగాడు. తనను హర్ట్ చేసిన ఝాన్సీ, సుధీర్‌లకు హెల్ప్ చేస్తే తను మాత్రం స్టార్ ఇవ్వనని దేబ్జాని చెప్పింది. త్రిగుణ్‌ను వర్షిణి స్టార్ అడిగింది. తన దగ్గర ఒక్కటే స్టార్ ఉందని చెప్పింది. తనకు మాత్రమే ఇస్తానని చెప్పమని వర్షిణి అడిగింది. ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేయవద్దని వర్షిణికి త్రిగుణ్ చెప్పాడు. తన దగ్గరున్న డబ్బంతా మేడమ్‌కు ఇచ్చేస్తానని.. తనకు స్టార్ తెచ్చి ఇవ్వమని సుధీర్.. రోహిత్‌ను అడిగాడు. సుధీర్‌ను నమ్మి తన దగ్గర ఉన్న డబ్బులు సుధీర్‌కు ఇచ్చేశాడు. అంతా స్టార్స్ కోసం గెస్ట్‌ల చుట్టూ తిరుగుతున్నారు. ఆతరువాత ఓనర్స్, వర్కర్స్ మధ్య కో ఆర్డినేషన్ ముఖ్యమని బిగ్‌బాస్ చెప్పారు. ఆ కో ఆర్డినేషన్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు ‘కమ్యూనికేషన్ అండ్ కో ఆర్డినేషన్’ టాస్క్‌ను బిగ్‌బాస్ ఇచ్చారు. దీనికి త్రిగుణ్ సంచాలక్.

Bigg Boss10 Telugu: బీబీ హోటల్ టాస్క్ ప్రారంభం.. రోహిత్ ఈజ్ బ్యాక్..

ఓనర్స్, వర్కర్స్ నుంచి ఇద్దరు.. ఇద్దరు వస్తారు. ఓనర్స్ చేసే సైగలను అర్థం చేసుకుని తమ ఓనర్ చూపించిన పిక్చర్‌ను సరైన స్థానంలో బోర్డులో వర్కర్ అంటించాలి. ఏ పెయిర్ అయితే సరైన సమయంలో సరైన స్థానంలో అమరుస్తుందో ఆ టీం గెలుస్తుంది. ఓనర్స్ నుంచి నరేష్, వర్షిణి… వర్కర్స్ నుంచి రోహిత్, ఝాన్సీ వచ్చారు. ఈ వారం కూడా సడెన్, ప్రేక్షకుల ఓటింగ్‌తో ఎలిమినేషన్ ఉంటుందని బిగ్‌బాస్ చెప్పారు. అంటే ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని బిగ్‌బాస్ చెప్పారు. రోహిత్, వర్షిణి ఒక టీం.. నరేష్, ఝాన్సీ ఒక టీం. ఝాన్సీ.. నరేష్‌కు బోర్డ్ చూపించి పెడుతోంది. దీంతో బిగ్‌బాస్ గేమ్‌ని పాజ్ చేసి.. ఝాన్సీని గేమ్ ఏంటో చెప్పమని బిగ్‌బాస్ అడిగారు. తను చూపించలేదని చెప్పింది. కింద ఉన్న టైల్స్‌ని చూడకూడదని అర్థమైందా? అని బిగ్‌బాస్ అడిగారు. ఆ తరువాత టాస్క్ ప్రారంభమైంది. రోహిత్ సూపర్ ఫాస్ట్‌గా టాస్క్ ఫినిష్ చేశాడు. ఆర్డర్ మార్చావని త్రిగుణ్ అన్నాడు. కానీ తను మార్చలేదని చెప్పాడు. నిజంగానే రోహిత్ చీట్ చేయలేదు. అడిగే మార్చాడు. రోహిత్ ప్రామిస్ చేసినా కూడా వినలేదు. అయినా కూడా వర్షిణి, రోహిత్ ఈ ఛాలెంజ్‌లో గెలిచారు. మొత్తానికి ఇవాళ షో చూసిన వారికి రోహిత్ ఈజ్ బ్యాక్ అనిపించడం ఖాయం. చాలా హుషారుగా.. అందరితో కలిసిపోయి సందడి చేశాడు. అలాగే ఛాలెంజ్‌లోనూ సత్తా చాటాడు.

Pranav

Writer and contributor at Telugu Cinema 360