
బిగ్‌బాస్ 10 తెలుగు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకూ ఉన్న ఈక్వేషన్స్ అన్నీ తారుమారు అవుతున్నాయి. కంటెస్టెంట్స్ అంతా ఆట తీరును మార్చుకుంటున్నారు. రోహిత్, షాలిని కూడా ఇంతకు ముందులా కాకుండా కాస్త డిస్టెన్స్ మెయిన్‌టైన్ చేస్తున్నట్టుగానే కనిపిస్తోంది.
ఇక నిన్న అమన్ ఆడిన గోట్ టాస్క్‌తో అతనికి బీభత్సమైన హైప్ వచ్చింది. ఓటింగ్ అమాంతం పెరిగిపోయింది. మరోవైపు బిగ్‌బాస్ ఈ వారం సడెన్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రకటించారు. అది ఇవాళే ఉండబోతోందని టాక్ నడుస్తోంది. ఇవాళ ఒకరిని.. ఆదివారం ఒకరిని ఎలిమినేట్ చేస్తారని సమాచారం. అయితే ఇవాళ్టి ఎలిమినేషన్ రెడ్ టీం నుంచే ఉండనుంది.
రెడ్ టీంలో వంశీ, దక్షి, రోహిత్, షాలిని, సుధీర్, ఝాన్సీ ఉన్నారు. వీరిలో నుంచే ఒకరు ఎలిమినేట్ కానున్నారు. రోహిత్‌కు ఓటింగ్ తగ్గినా కూడా ఇప్పటికీ అతనే టాప్‌లో ఉన్నాడు. సుధీర్, ఝాన్సీకి కూడా ఈ వారం గడ్డుకాలమే. అయినా కూడా ముఖేష్ ఓటింగ్ కొంత మేర ఈ ఇద్దరికీ ట్రాన్స్‌ఫర్ అవుతోంది. షాలిని నామినేషన్స్‌లోనే లేదు. ఇక మిగిలిన వారిలో దక్షికి ఓటింగ్ ఏమాత్రం లేదు. కనీసం ఆమె వేసిన నామినేషన్‌లోనూ పస లేదు. ఏ రకంగా చూసినా కూడా ఆమెకు హైప్ క్రియేట్ అయ్యే ఒక్కటంటే ఒక్క ఎపిసోడ్ కూడా పడలేదు. అలాగే వంశీకి ఈవారం మంచి ఎపిసోడ్ పడిందే లేదు. పైగా త్రిగుణ్ కూడా నామినేషన్స్‌లో ఉన్నాడు. వంశీకి త్రిగుణ్ ఓటింగ్ ట్రాన్స్‌ఫర్ అవదు. మొత్తంగా చూస్తే దక్షి కానీ వంశీ కానీ సడెన్‌గా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
