Menu
BREAKING
Bigg Boss10 Telugu: మాస్క్ తీసిన దేబ్జాని.. రోహిత్‌ని ఒంటరిని చేసేందుకు ప్రయత్నాలు..   |   Bigg Boss10 Telugu: హౌస్ నుంచి దక్షి, షాలిని ఎలిమినేట్.. పస లేని షో..   |   Bigg Boss10 Telugu: ఎలిమినేట్ అయిన శాలిని.. రోహిత్‌కు దెబ్బ మీద దెబ్బ   |   Bigg Boss 10 Telugu: రోహిత్‌కు బ్లాక్ కార్డ్.. మోకాళ్లపై కూర్చొని వేడుకున్న రోహిత్   |   ఫిట్‌నెస్, గాయాల నుంచి కోలుకోవడంపై డాక్టర్ వెంకటేష్ మోవ్వతో టైగర్ ష్రాఫ్ ఆసక్తికర చర్చ   |   Biggboss10 Telugu: సడెన్ ఎలిమినేషన్.. ఇవాళేనా? వెళ్లబోయేదెవరు?   |   RC17 సినిమాతో సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ విడిపోయినట్లే..!   |   నా బాడీ నా యిష్టం.. నా సైజ్‌ల గురించి మీకెందుకు.. ఆ హీరోయిన్ సీరియస్..!   |   Biggboss10 Telugu: హౌస్‌లోకి షాలిని ఎంట్రీ.. ఈ వారం ముప్పు ఆ ఇద్దరికే..   |   సో కాల్డ్ వారసులను అడిగే దమ్ముందా.. బ్యాగ్రౌండ్ లేని కుర్రాళ్లేనా టార్గెట్..?   |   కుర్రాడు సక్సెస్ అవుతాడా.. దొంగ నా కొడుకుతో మౌళి ఫ్యూచర్ ఏంటి..?   |   దసరాకు పట్టించుకోరా.. విజయదశమి కనీసం కళ్లకు కనిపించలేదా మన హీరోలకు..?   |   Biggboss10 Telugu: సుధీర్, ఝాన్సీలను ఒకాట ఆడుకున్న ఆర్కే.. బయటకొచ్చిన ఎలుకలు..   |   అన్నీ చెప్పిన రాజమౌళి ఆ ఒక్కటి తప్ప.. వారణాసి కథేంటో తెలుసా..?   |   దీపిక పదుకొనే, రణ్‌వీర్ సింగ్ రెండో కూతురు పేరు తెలుసా..?

Bigg Boss10 Telugu: మాస్క్ తీసిన దేబ్జాని.. రోహిత్‌ని ఒంటరిని చేసేందుకు ప్రయత్నాలు..

Bigg Boss10 Telugu: మాస్క్ తీసిన దేబ్జాని.. రోహిత్‌ని ఒంటరిని చేసేందుకు ప్రయత్నాలు..

బిగ్‌బాస్ ఆరు వారాలు గడిచిపోయాయి. ఇప్పటివరకూ తన రియాలిటీని పూర్తిగా బయటపెట్టని దేబ్జాని ఈవారం మాత్రం మాస్క్ తీసినట్టుగా అనిపిస్తోంది. ముందు నుంచి రోహిత్ అంటేనే మండిపడుతున్న దేబ్జాని.. ప్రస్తుతం రోహత్ పూర్తిగా నెగిటివ్ అయిపోయాడని ఫిక్స్ అయినట్టుగా ఉంది. అందుకే రోహిత్‌కు దగ్గరగా ఉన్న వాళ్లను సైతం దూరం చేసేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తోంది.

గత రాత్రి డాన్యూబ్ చైర్మన్ వచ్చి కంటెస్టెంట్స్ అందరికీ స్వీట్ బాక్స్ ఇచ్చి వెళ్లారు. షో పూర్తైన తర్వాత ముఖేష్ ఆ స్వీట్స్‌ను అందరికీ పంచుతుంటే గొడవ ప్రారంభించింది. రేషన్ మేనేజరే పంచాలని గొడవ పెట్టింది. బయటి నుంచి వచ్చిన స్వీట్స్‌ను ఎవరైనా పంచవచ్చు. కానీ ముఖేష్ చెప్పినా వినకుండా గొడవ పెట్టింది.

అప్పుడు రోహిత్‌తో దేబ్జాని ‘రామన్న నువ్వు పంచు అన్నావుగా’ అని అంది. తను అనలేదని.. ముఖేష్‌ను తనకు కూడా ఇవ్వమని మాత్రమే అడిగానని చెప్పింది. రామ్ ప్రసాద్ ఎందుకు పంచాలి? ముఖేష్ ఎందుకు పంచకూడదో చూసేవారికి అర్థం కాలేదు. అసలు దానికి అంత గొడవ ఎందుకు చేసిందో కూడా తెలియదు. ఈ గొడవ అయ్యాక బయటకు వెళ్లి కూర్చొంది. నరేష్ వస్తే కూడా అతనితోనూ ఇదే పంచాయతి పెట్టింది.

ఇక ఆ తరువాత నీతూతో దేబ్జాని, త్రిగుణ్ సమావేశమయ్యారు. త్రిగుణ్ ఫస్ట్ ‘మీరు ఇండివిడ్యువల్ ప్లేయర్’ అని అర్థమైందని పొగిడాడు. ఎందుకు రోహిత్‌కు సపోర్ట్‌గా ఉంటున్నావని దేబ్జాని అడిగింది. రోహిత్‌కు తను వెల్ విషర్ అని చెప్పింది. ‘మొన్న నామినేషన్స్‌లో నీకు సపోర్ట్‌గా ఉన్నాడు కానీ ఇవాళ గొడవ అవుతుంటే తింటూ కూర్చున్నాడు కానీ రాలేదు.. నువ్వు షాలినికి సపోర్ట్ చేయలేదనేమో’ అని దేబ్జాని చెప్పింది. ఎలాగైనా శ్వేత, నీతూలను తమ వైపు లాక్కోవాలని వాళ్లతో రకరకాలుగా చెబుతోంది. మొత్తానికి రోహిత్‌ను ఒంటరిని చేసేందుకు నానా విధాలుగా ప్రయత్నాలు సాగిస్తోంది.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360