
తనకు నామినేషన్ టెన్షన్ లేదు కానీ తను ఒక మాట కోసం హర్ట్ అయ్యానని నీతూ దేబ్జాని, సుధీర్‌కు చెప్పింది. తను అన్నం పెడతానని.. కాఫీ ఇస్తానని కానీ తన వెనుకే పడుతున్నాడని నీతూ చెప్పింది. మీరెంత మంచి చేసినా కూడా మీ వెనుకే పడతారని దేబ్జాని చెప్పింది. నరేష్ వచ్చి ముఖేష్‌ను ఆటపట్టిస్తుంటే.. ‘నేను దేబ్జాని కలిసి నరకం చూపిస్తాం. బాణలిలో ఆయిల్ వేసి చికెన్ ఫ్రైలా నిన్ను చేసి కొరుక్కుని తింటాం. కోల్కత్తా, కర్ణాటక కలిస్తే మామూలుగా ఉండదు’ అని ఫన్నీగా ముఖేష్ చెప్పాడు. నువ్వు చేసి నాస్టీ థింగ్ ఏంటో చెప్పమని ముఖేష్ అడిగితే నీతో ఫ్రెండ్షిప్ అని నరేష్ ఫన్నీగా చెప్పాడు. ఇక నామినేషన్స్ ప్రారంభమయ్యాయి. ఒక్కరిని మాత్రమే ఒకరు నామినేట్ చేయాలి. ఒకరిని నామినేట్ చేసి బాల్ని గేటు బయటకు వెళ్లేలా కిక్ చేయాలి.
ఇక అమన్ వచ్చేసి శివ్‌ను నామినేట్ చేశాడు. సౌండ్ శివ్ అని పేరు పెట్టానని.. మీరు తీసుకునే డెసిషన్స్ కారణంగా బ్యాక్ ఫైర్ అవుతోందని అమన్ చెప్పాడు. ఒకవేళ ఫౌల్ ఆడితే గేమ్ ఆపి చెప్పాలని.. తను, వంశీ ఆడుతున్నప్పుడు తన చేయి పట్టి లాగడం వలన తనకు ఎఫెక్ట్ అయ్యిందని తనకు అనిపించిందని చెప్పాడు. మీ కారణంగా ఏదైనా తప్పు జరిగితే అది నా గేమ్ ప్లే అని చెబుతున్నారు. బీబీ టాస్క్‌లో మూడు స్టార్లు పెట్టుకుని ఉంటే మీకు ప్లస్ అయ్యేది’’ అని చెప్పాడు. తనకు గోట్ అవ్వాలని లేదని.. తను లేటుగా రావడంతో నామినేషన్స్‌లో ఉండటం ముఖ్యమని చెప్పాడు. త్రిగుణ్ మధ్యలోకి వచ్చి గోట్ తనకు ఇచ్చేటప్పుడు తనకు గోట్ అవసరం లేదని..అప్పుడు చెప్పలేదని.. అంతా అయ్యాక అది తన గేమ్ ప్లే అని చెబుతుంటాడని చెప్పాడు. కప్పి పుచ్చుకోవడం కోసం మోసం చేస్తుంటాడని చెప్పాడు. ఆ గేమ్‌లో రామ్ ప్రసాద్, త్రిగుణ్ కలిసి ఆడితే ఒక్క బాల్ కూడా మీకు రాకపోయేదని.. తనేదో పొడిచేశానని ఇప్పుడు చెప్పుకుంటున్నావని అమన్ అన్నాడు. ఓడిపోతే గేమ్ ప్లాన్.. గెలిస్తే తన గొప్ప అని చెబుతుంటాడని శివ్ గురించి త్రిగుణ్ చెప్పాడు.

ముఖేష్ వచ్చేసి సుధీర్‌ను నామినేట్ చేశాడు. ఏదో ఒక రోజు కాటేస్తాడని అనుకున్నానని ఇప్పుడు కాటేశాడని అన్నాడు. ఇప్పుడు ఇండివిడ్యువల్ ప్లేయర్ అని చెబుతున్నాడని.. తను లేకుంటే కెప్టెన్ అయ్యేవాడివి కాదని.. ఈ హౌస్‌లో ఉండేవాడివి కాదని చెప్పాడు. తనకు, దేబ్జానికి ప్రాబ్లమ్ ఉంటే తాము సాల్వ్ చేసుకుంటామని.. మధ్యలో వచ్చి లేనిపోనివి చెప్పద్దొన్నాడు. ఇలాంటి అన్ ట్రస్ట్వర్తీ అని తెలిస్తే ఝాన్సీ పవర్‌తో నిన్ను సేవ్ చేసేవాడిని కానని.. అలా చేయడం వలన ఝాన్సీ కూడా బయటకు వెళ్లిపోయిందని చెప్పాడు. ఒక పర్సనాలిటీ అని జడ్జ్ చేస్తున్నావే.. కొంతమంది నిన్ను కల్లు తాగిన కోతి అని నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని చెప్పాడు. ఝాన్సీ నీవల్ల వెళ్లిపోయిందని అందరూ అంటుంటే.. నిలబడి ఝాన్సీ అంతా తన కారణంగా వెళ్లిపోయారని అంటున్నారని నీ కోసం ఆడతానని చెప్పట్లేదన్నాడు. నీకు డెలులు ఉందని అన్నాడు. సుధీర్ ఇష్టానుసారంగా ఏమాత్రం గ్రాటిట్యూడ్ లేకుండా మాట్లాడాడు.

శ్వేత వచ్చి నీతూని నామినేట్ చేసింది. అక్క అని కూడా అనొద్దని ఫిక్స్ అయ్యానని చెప్పింది. మీ పక్క నుంచి సపోర్ట్ చేయకుంటే పెద్ద బొక్క పెడతారని అన్నది. అలాగే త్రిగుణ్‌కు భజన చేస్తారని తమను అన్నదని చెప్పింది. ఏమాత్రం వాలిడ్ పాయింట్స్ లేకుండా నామినేట్ చేసింది. కూరగాయలు పాడైన వాటి గురించి నామినేట్ చేసింది. మీ దగ్గర గన్ ఉందేమో కానీ బుల్లెట్స్ లేవని అర్థమైందని చెప్పింది. ఈ పాయింట్స్ కారణంగా ఇంట్లో ఉండేందుకు అర్హులు కావని చెప్పింది. ఇంతకాలం ఏం చేస్తున్నావు? భజనే కదా చేస్తున్నావని అని శ్వేతను నీతూ అడిగింది. ఇంతమంది ఉండగా తనను మాత్రమే నామినేట్ చేయడం సేఫ్ ప్లేయర్ అని తెలుస్తోందని చెప్పింది. మధ్యలోకి త్రిగుణ్ వచ్చేసి తమ్ముడు తమ్ముడు అంటావంటూ నానా హంగామా చేశాడు. మిమ్మల్ని నామినేట్ చేస్తే సేఫ్ ప్లేయర్ అయిపోతామా? అని శ్వేత అడిగింది. అబద్ధాలు ఆడేది మీరని చెప్పింది. ఇంత మంది ఉండగా చిన్న చిన్న పాయింట్స్‌తో నామినేట్ చేస్తే సేఫ్ ప్లేయర్ అంటారని నీతూ చెప్పింది.
శివ్ వచ్చేసి ముఖేష్‌ను నామినేట్ చేశాడు. గత నామినేషన్స్‌లో ప్రాంక్ విషయం చాలా వస్తోందని.. తను వర్షిణిని ప్రాంక్ చేయవచ్చని అడిగానని అన్నాడు. వర్షిణిని తన దగ్గరకు పంపించాడని.. వచ్చి శివ మీరు దేబ్జాని వెనుక తిరుగుతున్నారు కదా.. అందుకే సేఫ్‌గా ఆడుతున్నారని అన్నదని చెప్పాడు. తనకు ఒకరి వెనుక తిరగాల్సిన అవసరం లేదని చెప్పాడు. ఇది ప్రాంక్ కాదని.. మీరు ఆడిన డర్తీ గేమ్ ఆడారని చెప్పాడు. ఝాన్సీ మీకోసం బయటకు వెళ్లిందని చెప్పినప్పుడు.. మీరెందుకు ఝాన్సీ కోసం ఆడతారని కప్ గెలుచుకుని వస్తానని ఎందుకు చెప్పలేదు? మబ్బుల్లో ఉండి మబ్బు ముఖేష్ అవుతారా? తేల్చుకోమని చెప్పాడు. ప్రాంక్ అంటే అది కాదని.. తాను చేసి చూపించానని చెప్పాడు. తనను క్యారెక్టర్‌లెస్ అన్నాడని.. అందరినీ రెస్పెక్ట్ ఇవ్వడం నా మేనర్స్ అని చెప్పి ఆ రోజున తనను ఇష్టానుసారంగా మాట్లాడావని చెప్పాడు. నిన్ను మీడియేటర్ అనడానికి కారణం మీరు అక్కడొక మాట.. ఇక్కడొక మాట మాట్లాడుతున్నారని.. ఝాన్సీ తనను ఏరోజు కూడా చెల్లి అని తను చెప్పలేదని అన్నాడు. మధ్యలోకి సుధీర్ వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడి నిజంగానే అన్ట్రస్ట్ వర్తీ అని నిరూపించుకుంటున్నాడు.
రామకృష్ణ వచ్చి సుధీర్‌ను నామినేట్ చేశాడు. ధర్మకోల్ బాల్ గేమ్‌లో వెంటనే గివ్ అప్ ఇచ్చారని అది తనకు నచ్చలేదన్నాడు. ప్రామిస్ చేసి ఆటలో దిగడం అవసరమా? అని అన్నాడు. మీరు ఇక్కడ ఉండటానికి మెయిన్ రీజన్ ముఖేష్ అన్న అని.. గేమ్ అయ్యిందే ఫ్యామిలీ వీక్ కోసమని.. అలాంటిది వెళ్లిపోతా అన్నయ్య అనడం ఎంతవరకూ కరెక్ట్ అని అడిగాడు. గేమ్ ఆడుతున్నప్పుడు ఎవరి శాక్ను వాళ్లు ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పాడు. అమన్ శాక్ను కంప్లీట్‌గా పడేయలేదని చెప్పాడు. ఎందుకు గొడవ పడ్డాడని ఏం జరిగిందని వర్షిణి ఒక్కసారి కూడా అడగలేదని చెప్పాడు. నాలుగు రోజులు అవుతున్నా వాళ్ల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని సుధీర్ చెప్పాడు. కానీ అందరి దగ్గర ముఖేష్, వర్షిణి గురించి మాట్లాడాడు. తనకు కృతజ్ఞత ఉందని.. అది వీళ్లు పోగొట్టుకున్నారని చెప్పాడు. డాన్యూబ్ రూంలో తనకు చెప్పాడని.. ముఖేష్ వచ్చి త్రిగుణ్ పేరు రాశాడని ప్రామిస్ చేసి మరీ చెప్పాడు. కానీ త్రిగుణ్ వచ్చేసి వంశీ పేరు రాశాడు. ఈ నేపత్యంలోనే సుధీర్ వర్సెస్ ముఖేష్ పెద్ద గొడవ అయ్యింది. నువ్వొక మనిషివా? అని సుధీర్ మాటలు బాగా జారాడు.

నరేష్ వచ్చేసి నీతూని నామినేట్ చేశాడు. త్రిగుణ్ టీం మొత్తానికి వేరే ఎవరూ లేకపోవడంతో అంతా వచ్చి నీతూని నామినేట్ చేస్తున్నారు. శాక్ గేమ్ టైంలో కొద్దిగా కొట్టారని అది తనకు నచ్చలేదని చెప్పాడు. రామకృష్ణని మాటలు అన్నారని అది కూడా తనకు నచ్చలేదన్నాడు. రామకృష్ణతో తనకు మంచి బాండ్ ఉందని చెప్పింది. అప్పుడు అన్నా కూడా దానిని క్యారీ ఫార్వర్డ్ చేయలేదని వెంటనే ఆర్కేతో బాగానే ఉంటున్నానని చెప్పింది. వంశీ తనను అంత దారుణంగా లాగారని అది మీకు కనిపించలేదా? అని అడిగింది. తను ఇంట్లో ఉండేందుకు ఏవిధంగా అర్హురాలిని కాదని అడిగింది. ఇక్కడ సేఫ్‌గా కనిపిస్తున్నారని అన్నది. శ్వేత మధ్యలో వచ్చి ఆమెను ఎవరు నామినేట్ చేసినా సేఫ్ అంటుందని అన్నది. నీతూపై ఎందుకు పగ బట్టాడో కానీ ప్రతిసారీ త్రిగుణ్ మధ్యలోకి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతూ.. వెటకారంగా నవ్వుతూ చాలా చిరాకు తెప్పించాడు.
దేబ్జాని వచ్చి నీతూని నామినేట్ చేసింది. సేఫ్ ప్లేయర్ అంటే ఏంటని అడిగింది. రోహిత్ తర్వాత తను ఎక్కువగా ఉన్నానని.. మరి అలాంటి తన పేరు ఎలా రాశావని అడిగింది. తన నవ్వు చూస్తూ చాలా ప్రశాంతంగా ఉంటుందని చెప్పి తన పేరు ఎలా రాశావని అన్నది. తన పేరు రాయడం సేఫ్ గేమ్ అని చెప్పింది. మష్రూమ్ రూమ్‌లో ఉన్నప్పుడు వర్షిణి పేరు ఎందుకు రాయలేదని చెప్పావని.. ముఖేష్ పేరు రాయాలని మ్యానిప్యులేట్ చేసేందుకు ట్రై చేశావని చెప్పింది. గేమ్ కోసం త్రిగుణ్ ఏం చేస్తాడో తెలుసని చెప్పింది. సుధీర్ వచ్చేసి ముఖేష్‌ను నామినేట్ చేశాడు. తను ఈ హౌస్‌లోకి వచ్చాక హార్ట్‌ఫుల్‌గా నమ్మిన వ్యక్తి ముఖేష్ అని చెప్పాడు. తను చాలా ట్రస్ట్వర్తీగా ఉన్నానని.. కానీ చూసే విధానం ఇప్పుడు మారుతోందని చెప్పాడు. పాతవి తీసి నువ్వలా చేశావు.. ఇలా చేశావని చెప్పే గుణం తనది కాదని అన్నాడు. సుధీర్‌ని తీసేస్తానని చెప్పడం తను తీసుకోలేకపోయానని చెప్పాడు. మధ్యలో త్రిగుణ్ వచ్చాడు. ‘నీలాంటి చిల్లర వేషాలు వేయనని.. నీ పేరు నేను రాయలేదని’ త్రిగుణ్ అన్నాడు. మీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో తనకు తెలుసని అన్నాడు.
ఝాన్సీ పేరు ఎందుకు తీసుకోలేదంటే.. సుధీర్ ‘వి’, ‘పి’ అని తీసుకొచ్చి సుధీర్ ఏదేదో మాట్లాడాడు. తను వంశీ దగ్గరకు వెళ్లి చెప్పుకున్నానని ఆయన పేరు రాశానని ముఖేష్ చెప్పాడు. నువ్వు చేసిన మిస్టేక్ వల్ల మీ అమ్మానాన్న తల దించుకున్నారని ముఖేష్ అన్నాడు. బాల్‌ను తన్నేందుకు మనసు రావడం లేదని సుధీర్ అనడంతో.. ‘నువ్వు నన్నే తన్నావు..నా ఫ్యామిలీనే తన్నావ’ని ముఖేష్ అన్నాడు. నీతూ వచ్చేసి త్రిగుణ్‌ను నామినేట్ చేసింది. ముందుగా తన మంచి గురించి మాట్లాడింది. ఫుడ్ అంతా తిన్నారా? లేదా చూసుకుంటారని చెప్పింది. ఇంట్లో ఎంత గొడవలైనా వన్ అవర్‌లో మాట్లాడతారని.. మీది బెస్ట్ కెప్టెన్సీ అని కానీ చెప్పే విధానం హార్ష్‌గా ఉంటుందని చెప్పారు. మీ మైనస్ ఏంటంటే.. అందరికీ పేర్లు పెడతారు. మీరు మాట్లాడే విధానం అస్సలు బాగోలేదు. ముఖేష్‌పై పాట పాడారని దానిలో వల్గర్ వర్డ్స్ వాడారని చెప్పింది. మీతో బాగుంటే ఓకే. బాగోకుంటే బయటకు వెళ్లే వరకూ టార్చర్ చూపిస్తారని అన్నది. తనను కూడా ఇప్పుడే కప్ప, మతిమరుపు అన్నారని చెప్పింది. ఇప్పటి వరకూ తానేమైనా అన్నానా? మిమ్మల్ని అని అడిగింది. తనను అంటేనే కదా అన్నదని చెప్పింది.
మీకు గ్యాస్ ఆఫ్ చేయడం రాదని చెప్పింది. మీతో మాట్లాడాలంటే భయమేస్తోందంటే భయపడితే బయటకు వెళ్లిపోండని చెప్పాడు. మధ్యలోకి వంశీ వచ్చాడు. వెక్కిరింతగా మాట్లాడాడు. మీ ఏజ్ ఏంటి మీ వెటకారమేంటని వంశీని నీతూ అడిగింది. ఎప్పుడూ కప్ప దూకినట్టుగా దూకుతావని అందుకే కప్ప అనాల్సి వచ్చిందని చెప్పాడు. మధ్యలోకి వచ్చి వంశీ అరుస్తుంటే మీకు టెంపర్ ఉంటే మీ దగ్గర పెట్టుకోండని వంశీకి చెప్పింది. కెప్టెన్ కాదని.. అతనొక అసిస్టెంట్ అని వంశీని నీతూ అన్నది. డాక్టర్ ఉంటారు.. మెడికల్ రూమ్‌కి వెళ్లి చూపించుకోండని.. మెంటల్ అన్నట్టుగా వంశీ మాట్లాడాడు. రామ్ ప్రసాద్ వచ్చి వర్షిణిని నామినేట్ చేశాడు. పోయిన వారం ఏవైతే పాయింట్స్ పెట్టాడో అవే పెట్టి నామినేట్ చేశాడు. తనను ఇన్సల్ట్ చేశాడని వర్షిణి చెప్పింది. అలా తనెప్పుడూ చేయలేదని రామ్ ప్రసాద్ చెప్పాడు. గత వారం పాయింట్సే కాబట్టి పెద్దగా చెప్పుకోవల్సిన అవసరం లేదు.
త్రిగుణ్ వచ్చి నీతూని నామినేట్ చేశాడు. తనను జోకర్ అన్నదని.. అలా అనిపించుకోవడం తనకు ఇష్టమని చెప్పాడు. తన దగ్గరకు వచ్చినప్పుడు జాగ్రత్తగానే ఉండాలని చెప్పాడు. మీకు చాలా చాలా మతిమరుపు ఉందని చెప్పాడు. ఆడలేకుంటే ఇంటికెళ్లి కూర్చోమని చెప్పాడు. ట్రిగర్ అయిపోయారా? ఇదేనా నీ మాట అని అన్నాడు. వంద తప్పులు చేస్తే బయటకు వెళ్లిపోతావని నీతూ చెప్పింది. సెన్స్‌లెస్ ఫెలో అని నోరు తెరిస్తే గలీజ్‌గా మాట్లాడతాడని నీతూ అన్నది. మధ్యలో వంశీ ఆమె మీదకు వెళ్లిపోయాడు. ఏంటి రౌడీ రాణి అంటూ రెచ్చిపోయాడు. బూతులు మాట్లాడతావని అన్నాడు. నీ అని నీతూ ఆపడంతో బూతులు మాట్లాడతావంటూ గొడవ పడ్డాడు. మర్యాద ఇస్తే ఉంచుకోవడం తెలియదని నీతూని త్రిగుణ్ అన్నాడు. మధ్యలో రామ్ ప్రసాద్ వెళ్లి త్రిగుణ్‌కు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా కూడా ఏం అర్థ: చేసుకోవాలంటూ ఇష్టానుసారంగా మాట్లాడాడు. వంశీని అలా మాట్లాడమేంటి? ఎంత సీనియర్? ఏం పీకావని? అంత గర్వమేంటి? ఆయనంత సైలెంట్‌గా ఉంటే మీదకు ఎక్కేయడమేనా? అంటూ త్రిగుణ్ ఫైర్ అయ్యాడు. ప్రతి దానికి తనను టార్గెట్ చేసిందని త్రిగుణ్ అన్నాడు.
తను ఏనాడూ ఈ ఇంట్లో సుధీర్‌ని నామినేట్ చేస్తానని అనుకోలేదని వర్షిణి చెప్పింది. మిత్రలాభం – మిత్ర భేదం గురించి తెలుసుకోమని నాగ్ సర్ చెబితే మిత్ర ద్రోహం చేశావని వర్షిణి చెప్పింది. తన కారణంగా ముఖేష్ గేమ్ స్పాయిల్ అయ్యిందా? అలా ఎందుకు అన్నావని సుధీర్‌ని అడిగింది. దేబ్జానిపై నామినేషన్ పాయింట్స్ చాలా ఉన్నాయని చెప్పాడని వర్షిణి అన్నది. సుధీర్ మాట్లాడుతూ.. ‘ఇంతకు ముందు దేబ్జానిని ఎందుకు ముఖేష్‌తో నీకు గొడవ అంటే ఏం లేదు నా లెటర్ చింపినందుకు’ అన్నదని సుధీర్ చెప్పాడు. నీ కారణంగా మేము మోసపోయామని వర్షిణి చెప్పి సుధీర్‌ని నామినేట్ చేసింది. నెక్ట్స్ వంశీ వచ్చి నీతూని నామినేట్ చేశాడు. మీరు ఇంట్లోకి వచ్చే ముందు హోస్ట్ సార్‌తో కలిసి ఆడదామంటే ఏంటండి అంతా ఇలా ఉన్నారని అన్నదని.. ఇప్పుడు మీరేంటి ఇలా ఉన్నారని అడిగింది. ప్రతి సారీ ఏడిస్తే అది ఎమోషన్ అని అంటావని.. మీ గురించి మీరు స్టాండ్ తీసుకోకుంటే మీరు హౌస్‌లో ఉండేందుకు అర్హులు కారని చెప్పింది. వంశీ ఉంటే నేను ఆడనని చెప్పేందుకు ఇదేమీ స్కూల్ గేమ్ కాదని అన్నాడు.
ఉదయమే వంట చేసుకుని రెడీ అవ్వాలంటే టైమ్ సరిపోవడం లేదని నీతూ చెప్పింది. అయినా కూడా తను వంట చేశానని చెప్పింది. కెప్టెన్సీ అడుక్కుంటే వచ్చిందని చెప్పింది. టెంపర్ వంశీ గారు ట్రిగర్ ఎందుకు అవుతున్నారని నీతూ కూడా వెటకారంగా అంది. ఒక గేమ్ ఆడితేనే ఇంట్లో ఉండాలంటే.. నిన్న తనకు అసలు ఒంట్లో బాగోలేదని అయినా కూడా వంట చేశానని చెప్పింది. ఏం చేసినా కూడా మనసులో పెట్టుకోనని చెప్పింది. అంతా పులిహోర, దద్దోజనం కలుపుతానని చెప్పింది. దేబ్జాని కల్పించుకుని బాగోలేదంటే ఫీమేల్ కాదని బయటకు చెప్పుకోలేమని చెప్పింది. ఇప్పటి దాకా ఏడ్చావని వంశీ అన్నాడు. మధ్యలో త్రిగుణ్ వచ్చాడు. జోకర్ కూర్చో అని అంటే కప్ప పో అని అన్నాడు. ఇంటికి ఫైనల్‌గా జోకర్‌గానే మిగిలిపోతావని అన్నాడు. మధ్యలో శివ వచ్చి ఓదార్చబోతే ఎన్ని పడాలని.. సిగ్గు లజ్జా అని పదాలు వాడి బిగ్‌బాస్ వీళ్ల సొంతమా? అని అడిగింది. నీతూ చాలా ఎమోషనల్ అయ్యింది. అంతా వచ్చి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు.
త్రిగుణ్ గ్యాంగ్ అంతా నీతూపై పడ్డారు. ముఖ్యంగా వంశీ, త్రిగుణ్ ఆమెను ఒకరకంగా హింసించారు. చాలా ట్రిగర్ చేశారు. దీంతో ఆమె కూడా కొన్నిసార్లు నోరు జారింది. అయితే ఒక లేడీ పిరియడ్స్ టైంలోనూ పని చేయలేదని నిందించడం.. ఆమెను ఇద్దరు కలిసి ఇలా మాట్లాడటం ఆమెకే ప్లస్ అవుతుందన్న విషయాన్ని ఎందుకు గ్రహించలేకపోయారో తెలియలేదు. ఈ వారంతో నీతూ వెళ్లిపోయే అవకాశం ఉందని ముందుగా అనిపించింది కానీ ఇవాళ బీభత్సమైన సింపతీ నీతూకి వర్కవుట్ అవడం ఖాయం. దాదాపుగా టాప్5లో త్రిగుణ్, వంశీ కలిసి కూర్చోబెట్టారేమో అనిపిస్తోంది.
