Menu
BREAKING
నానిని కావాలనే ఇరికిస్తున్నారా.. ‘ప్యారడైజ్’ రిలీజ్ తర్వాత వదలట్లేదా..?   |   నానా పటేకర్ లాంటి దిగ్గజ నటుడికి ఇచ్చే గౌరవం ఇదేనా.. బాలీవుడ్ పట్టించుకోలేదా..?   |   విశ్వంభర టీం నమ్మకమేంటి… కాకా చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తాడా..?   |   Biggboss10 Telugu: ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్..   |   విజయ్ దేవరకొండ ముందున్న ఎన్నో సవాళ్లు.. రణబాలితో సమధానం చెప్తాడా మరి..?   |   సెక్స్ టాయ్స్ అనేది అమ్మాయిల యిష్టం.. దాంతో మీకెందుకు అంటున్న స్టార్ హీరోయిన్..!   |   Biggboss10 Telugu: కామనర్స్‌కు దెబ్బేసిన సెలబ్రిటీలు.. వీళ్లిక మారరు..   |   మొన్న నాని.. నేడు విజయ్ దేవరకొండ.. తొక్కేస్తున్నారా వీళ్లను.. మరి తొక్కేదెవరు..?   |   Biggboss10 Telugu: షాలిని వర్సెస్ అపూర్వ ఆగేలా లేదు.. రోహిత్‌కి కష్టమే..   |   భారతీయుడు 3 వస్తున్నాడు.. సేనాపతి ఈజ్ బ్యాక్.. శంకర్ ఏం చేస్తాడో..?   |   లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. ఆయన సాధించిన ఘనతలు ఎన్నో తెలుసా.. ?   |   ఏంది మచ్చా అంత పని చేసినావ్.. మీమ్స్‌తో నవ్వించిన అగ్గిపెట్టి మచ్చ హఠాన్మరణం..!   |   Biggboss10 Telugu: వామ్మో.. షాలిని వర్సెస్ అపూర్వ.. చూసేవారికి టార్చర్   |   స్పిరిట్ ముందుకు.. ఫౌజీ వెనక్కి.. ప్రభాస్ సినిమాల విషయంలో అసలు ఏం జరుగుతోంది?   |   Biggbogss10 Telugu: రోహిత్‌కు గుదిబండలా తయారైన షాలిని.. లవ్ ట్రాక్ ఇబ్బందే..

నానిని కావాలనే ఇరికిస్తున్నారా.. ‘ప్యారడైజ్’ రిలీజ్ తర్వాత వదలట్లేదా..?

నానిని కావాలనే ఇరికిస్తున్నారా.. ‘ప్యారడైజ్’ రిలీజ్ తర్వాత వదలట్లేదా..?

నాని చుట్టూ ఏదో ఒక వివాదం లేదా రూమర్ ఎప్పుడూ చక్కర్లు కొడుతూనే ఉంటుంది. రీసెంట్‌గా వచ్చిన ది ప్యారడైజ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లే తీసుకొచ్చింది.. దాదాపు 160 కోట్ల గ్రాస్‌తో నాని కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అయితే ఈ సినిమా విడుదల కాకముందు నుంచే కొందరు దీనిపై విపరీతంగా నెగిటివిటీ ప్రచారం చేశారు, సినిమా బాగోలేదంటూ ఫేక్ టాక్ స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేశారు. తీరా థియేటర్లలో సినిమాకు నైజాం ఆడియన్స్ బ్రహ్మరథం పట్టేసరికి, ఇప్పుడు అందరి చూపు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ వైపు మళ్లింది. కానీ ఇక్కడే మరో కొత్త డ్రామా మొదలైంది. థియేటర్ రిలీజ్ టైమ్‌లో నానిని టార్గెట్ చేసినట్టే, ఇప్పుడు ఓటీటీ వెర్షన్ విషయంలో కూడా లేనిపోని వార్తలను సృష్టిస్తూ ఆయన్ని కావాలనే ఏదో ఒక వివాదంలోకి లాగుతున్నారా అనే అనుమానాలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి.

అసలు విషయానికి వస్తే, ది ప్యారడైజ్ ఓటీటీ వెర్షన్‌లో చాలా మార్పులు చేర్పులు చేస్తున్నారని, థియేటర్లలో చూపించని సీన్లను యాడ్ చేస్తున్నారని, లేదా కొన్ని సీన్లను ఎడిట్ చేసి సరికొత్త వెర్షన్‌ను స్ట్రీమింగ్ చేయబోతున్నారని గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ఈ ప్రచారం కాస్తా వైరల్ అవ్వడంతో మూవీ టీమ్ వెంటనే రంగంలోకి దిగి గట్టి క్లారిటీ ఇచ్చింది. ఈ వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని, నిరాధారమైన పుకార్లు మాత్రమేనని మేకర్స్ తేల్చి చెప్పేసారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన పూర్తి కంటెంట్‌ను వారం రోజుల క్రితమే సబ్‌మిట్ చేసేశామని స్పష్టం చేశారు. థియేటర్లలో ఆడియన్స్ ఏ వెర్షన్ అయితే చూసి ఎంజాయ్ చేశారో, అదే ఒరిజినల్ వెర్షన్ ఎలాంటి కట్స్ లేదా అదనపు మార్పులు లేకుండా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోందని స్పష్టమైన వివరణ ఇచ్చారు.

ది ప్యారడైజ్ సినిమా సెన్సార్ రివ్యూ.. 21 కట్స్.. చాలా పెద్ద రిస్క్.. అవే మైనస్..!

నాని ఎదుగుదలను కొందరు ఓర్వలేకనే ఇలాంటి రూమర్స్ సృష్టిస్తున్నారనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. స్వశక్తితో ఎదిగి వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలో, గతంలో ది ప్యారడైజ్ ఈవెంట్ లో కూడా నాని స్వయంగా ఇండస్ట్రీలో నెగిటివిటీ, విషపూరిత వాతావరణం పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా రిలీజ్ కాకముందే డిజాస్టర్ అని ప్రచారం చేసిన వాళ్లు, అది భారీ విజయం సాధించాక ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌పై ప్రేక్షకుల్లో గందరగోళం సృష్టించాలని ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. నిజానికి థియేట్రికల్ రన్‌లో కోట్లు కొల్లగొట్టిన సినిమాకు ఓటీటీలో కూడా భారీ రెస్పాన్స్ రావడం ఖాయం. సరిగ్గా ఇలాంటి సమయంలో సినిమా హైప్‌ను పక్కదారి పట్టించడానికి లేదా నాని ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడానికి ఈ ఫేక్ ప్రచారం తెరపైకి తెచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఏదేమైనా ఇలాంటి అనవసరపు పుకార్లకు అధికారికంగా చెక్ పడటంతో నాని ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. సినిమా బాగుంటే థియేటర్లలోనైనా, ఓటీటీలోనైనా ఆడియన్స్ ఆదరిస్తారనే విషయం ది ప్యారడైజ్ మరోసారి రుజువు చేసింది. ఎలాంటి మార్పులు లేని అదే అసలైన సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సరికొత్త రికార్డులు సృష్టించడానికి రెడీ అవుతోంది. ఇక నాని కూడా ఇలాంటి సిల్లీ రూమర్లను ఏమాత్రం పట్టించుకోకుండా, తన నెక్ట్స్ మూవీ డైరెక్టర్ సుజీత్‌తో చేయబోయే బ్లడీ రోమియో ప్రాజెక్ట్ కోసం గ్యాంగ్‌స్టర్ మోడ్‌లోకి దిగిపోయారు. మాటలతో కాకుండా బాక్సాఫీస్ హిట్స్‌తోనే ట్రోలర్స్‌కు సమాధానం చెప్పడం నానికి అలవాటే కాబట్టి, ఈ ఓటీటీ వివాదం కూడా వాటంతట అదే ఆవిరైపోయిందనే చెప్పాలి.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360