సినిమా వార్తలు

Bigg Boss10 Telugu: రోహిత్ ఎలిమినేట్..

నిన్న ఝాన్సీ ఎలిమినేట్ అయిన సీన్ నుంచి ఇవాళ్టి షో ప్రారంభమైంది. ఝాన్సీ స్టేజ్‌పైకి వచ్చాక ఆమె జర్నీ చూపించారు. మిక్స్‌డ్ ఎమోషన్స్‌తో ఆమె జర్నీ ఉంది. ఝాన్సీకి ఐదు సామెతలు ఇచ్చారు. ఏ సామెత ఎవరికి కనెక్ట్ అవుతుందో చెప్పమన్నారు. కుక్క తోక వంకరను రోహిత్‌కు ఝాన్సీ ఇచ్చింది. ఎన్నిసార్లు మాటలు కంట్రోల్ చేసుకోమన్నా అలాగే చేస్తావని చెప్పింది. ఎవరి తీసిన గోతిలో వారే పడతారనే సామెతను దేబ్జానికి ఇచ్చింది. గోరంత దాన్ని కొండంత చేస్తాడనే సామెతను త్రిగుణ్‌కు.. మెరిసేదంతా బంగారం కాదు అనే సామెతను ముఖేష్‌కు.. ఇంట్లో పులి.. వీధిలో పిల్లిని నరేష్‌కు ఝాన్సీ ఇచ్చింది. బిగ్‌బాస్ ఇంట్లో పులి అని.. ఆటలో పిల్లి అని ఝాన్సీ చెప్పింది. ఝాన్సీ వెళ్లిపోయాక నాగ్ బ్రేక్ ఇచ్చారు. అప్పుడు గత రాత్రి త్రిగుణ్‌కు కన్ఫెషన్ రూమ్‌లో చూపించిన వీడియోను దేబ్జానికి చెప్పాడు. సుధీర్‌ను కట్టప్ప నంబర్ 1 అని త్రిగుణ్ చెప్పాడు. ఆ తరువాత అమన్ దగ్గరకు వెళ్లి వాళ్లు మన గురించి మాట్లాడుకున్న వీడియోను చూపించారని త్రిగుణ్‌ చెప్పాడు. వర్షిణిని తన ఫ్రెండ్ అన్న దానికి తన చెప్పును పేడతో ముంచి కొట్టుకోవాలని చెప్పాడు. ఈ వారమంతా లాగుతానని త్రిగుణ్ చెప్పాడు. అల్టిమేట్‌లో మనం కరెక్ట్‌గా చేశామని చెప్పాడు. అంటే చీటింగ్ గేమ్ ఆడినట్టుగా త్రిగుణ్ ఒప్పేసుకున్నాడు. సుధీర్ గాడు మామూలు పాము కాదని అమన్‌కు త్రిగుణ్ చెప్పాడు. అమన్ వచ్చేసి ఇక మీదట ఆడుదామని చెప్పాడు. అసలు అమన్‌కు దీనితో ఏం సంబంధమో ఎందుకు ఆ గొడవలోకి వెళ్లి తన గేమ్‌ను పాడు చేసుకుంటున్నాడో అర్థం కాలేదు. హౌస్‌లోని మ్యానిప్యులేట్ అయ్యేవారిలో అమన్ ముందుంటాడని చెప్పాలి.

కాకరకాయ లడ్డూలను తీసుకొచ్చారు. అల్టిమేట్ గోట్ కాబట్టి ముందుగా గేమ్‌ను త్రిగుణ్‌నే స్టార్ట్ చేయమన్నారు. ‘నీ బొమ్మను నువ్వు పగులగొట్టి దానిలోని కార్డులో ఉన్నది చదవమన్నారు. ఫుల్ ఆఫ్ ఫేక్.. క్రుయెల్, కన్నింగ్, అన్ ఎథికల్, వెరీ వెరీ చీప్ అని రాశారు. కరెక్ట్‌గా గెస్ చేస్తే కాకరకాయ లడ్డూ వాళ్లకు.. చేయకుంటే త్రిగుణే తినాలి. ఈ చేదు నిజం రాసింది వర్షిణి అని చెప్పాడు. అమన్‌కు అన్‌ట్రస్ట్ వర్తీ.. యాక్షన్స్‌లో జీరో క్లారిటీ.. ఈజీగా మ్యానిప్యులేట్ అవుతాడు. వేరే వాళ్ల ఒపీనియన్స్‌పై డిఫెండ్ అవుతాడని వచ్చింది. ఇది రాసింది రోహిత్ అని అమన్ చెప్పాడు. తనకు ఫ్రెండ్ అనేది వెళ్లిపోయింది. అలాంటి ఫ్రెండ్ తనకు అవసరం లేదని రోహిత్ గురించి అమన్ చెప్పాడు. శ్వేతకు ఏమీ లేదు. నీపై ఎవరికీ ఏ ఒపీనియన్ లేదని నాగ్ చెప్పారు. దేబ్జానికి ఫేక్ పర్సనాలిటి. బ్యూటీ ఫ్రమ్ అవుట్ సైడ్.. పాయిజనస్ ఫ్రం ఇన్‌సైడ్. నరేష్ కామెడీని తన కంటెంట్ కోసం వినియోగించుకుంటుంది. తను స్లో పాయిజన్ అని ముఖేష్ రాశాడు. నరేష్ గురించి ఇమేజ్ కాన్షియస్, సేఫ్ ప్లేయర్ అని నరేష్‌కు దేబ్జాని రాసింది. అందరికీ ఫేవరెట్ అయితే సేఫ్ ప్లేయర్ అనే అనాలని అంటారు. రామ్ ప్రసాద్ కూడా అలాగేనని చెప్పింది.

సుధీర్‌కు ఫ్రంట్ ఫుట్ ప్లేయర్ కాదు.. ఎవరో ఒకరి షాడో.. క్లారిటీ లేదు అని అమన్ రాశాడు. నీతూకి వచ్చేసి వైల్డ్ ఫైర్ ట్యాగ్ అనేది ఆమెకు సూట్ అవదు. చిన్న చిన్న ఆటల్లోనూ రోహిత్‌తోనే ఉంటుందని వర్షిణి రాసింది. వర్షిణికి ఎమోషనల్ లూప్‌లో స్టక్ అవుతుంది. గేమ్ కోసం ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది. సెలబ్రిటీ స్టేటస్ వల్ల గొప్పగా ఫీలవుతుందని త్రిగుణ్ రాశాడు. రామకృష్ణకు అమాయకత్వం, తింగరితనం, పప్పుసుద్ద లాంటి వాడని రామ్ ప్రసాద్ రాశాడు. ముఖేష్‌కు హైలీ డిస్‌రెస్పక్టబుల్, స్టబన్ అని దేబ్జాని రాసింది. ముఖేష్‌కు గేమ్ ఆడమని చెప్పాలని దేబ్జాని అంటోంది. ముఖేష్ గేమ్‌లో ఏమాత్రం తగ్గడు. ఎవరూ అతని సాటి రాలేరు. నరేష్‌ను వర్షిణి గురించి ఒక జోక్ చెప్పమంటే అందంగా ఉంటుంది సర్ అని చెప్పాడు. శివకు ఇన్‌విడ్యువల్ ప్లేయర్‌గా ఫెయిల్, ఈజీగా మ్యానిప్యులేట్ అవుతాడు, వేరొక గేమ్ ఆడతాడు అని ముఖేష్ రాశాడు. రోహిత్‌కు హైలీ మ్యానిప్యులేటివ్, ఓవర్ కాన్ఫిడెన్స్, ఫేక్ పర్సనాలిటీ, హైలీ ఇగోయిస్టిక్ అని త్రిగుణ్ రాశాడు. రామ్ ప్రసాద్‌కు హౌస్‌లో ఉన్న ఓన్లీ కన్నింగ్ పర్సన్. ఆ ట్యాగ్ కరెక్ట్‌గా సూట్ అవుతుంది. హౌస్‌లో తనొక్కడే గేమర్ అన్నట్టుగా ఫీలవుతాడు. లిమిట్ క్రాస్ చేస్తున్నాడు. తను సర్వైవ్ అవడం కోసం నరేష్‌ను వాడుకుంటున్నాడు. అవసరమైతే నరేష్‌ను సైతం కిక్ అవుట్ చేస్తాడని వర్షిణి రాసింది. వంశీకి ఫేక్ పర్సనాలిటి, స్క్రీన్ స్పేస్ కోసం తనకొక ఒపీనియన్ ఉందని చెప్పడం కోసం గొడవలు పడుతుంటాడన్నట్టుగా రోహిత్ రాశాడు. సండే ఫన్‌డేలో భాగంగా.. కంటెస్టెంట్స్‌ను రెండు టీమ్స్‌గా విడదీశారు. దమ్ షరాడ్స్ ఆడించారు.

రెడ్ జోన్‌లో ఉన్న ముగ్గురిని లేపి నిలబెట్టారు. ఆడియెన్స్ ఓటింగ్‌తో ఒక ఎలిమినేషన్ జరిగిందని.. ఇప్పుడు హౌస్ అంతా కలిసి ఈ ముగ్గురిలో ఒకరిని ఎలిమినేట్ చేస్తారని నాగ్ చెప్పారు. ఒక్కొక్కరుగా వచ్చి ఎవరు ఎగ్జిట్ అవ్వాలో చెప్పాలన్నారు. మీకు అపోజిట్ కంటెస్టెంట్ స్ట్రాంగ్ ఉంటేనే గేమ్‌లో మజా వస్తుందని.. అలయెన్స్ పరంగా కాకుండా గేమ్ పరంగా చూడాలని రోహిత్ చెప్పాడు. మిగిలిని ఇద్దరూ రామకృష్ణ, శ్వేత కూడా తమ గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటున్నామని చెప్పారు. నరేష్, దేబ్జాని, రామ్ ప్రసాద్, శివ, అమన్, వంశీ, త్రిగుణ్… రోహిత్‌కు.. వర్షిణి, ముఖేష్, నీతూ, సుధీర్ రామకృష్ణకు ఎగ్జిట్ అవ్వాలని ఓటేశారు. శ్వేతకు ఒక్కరు కూడా ఓటేయలేదు. రోహిత్‌ వెళ్లిపోవాలని అమన్ ఓటేయడం అతనికి చాలా బాధపడ్డాడు. ఎఫర్ట్ పెట్టి ఉంటే.. ఆట మారి ఉంటే ఇవాళ పరిస్థితి ఇలా ఉండేది కాదని నాగ్ చెప్పారు. కానీ ఆడనివ్వలేదు. గ్రూప్ గేమ్స్‌లో తీసేశారు. ఇది మాత్రం నాగ్ మాట్లాడరు. రోహిత్ వెళ్లిపోతుంటే ఎవరూ త్రిగుణ్ టీం ఎవ్వరూ కూడా దగ్గరకు వెళ్లలేదు. రామ్ ప్రసాద్, నరేష్‌కు మిమ్మల్ని ఇలా ఊహించుకోలేకపోతున్నానని చెప్పాడు. నీతూ బాగా ఏడ్చింది. ప్రతిదీ మనసుకు తీసుకుని అన్నం మీద చూపించవద్దని చెప్పాడు. వాస్తవానికి రామ్ ప్రసాద్ గురించి బ్యాడ్‌గా ఎవరూ మాట్లాడలేదు. ఇక ముఖేష్ మాత్రం చాలా బాధపడినట్టుగా అనిపించింది. రోహిత్‌కు వెళ్లేటప్పుడు సెండ్ ఆఫ్ సరిగా ిచ్చేందుకు కూడా త్రిగుణ్ టీంకు మనసు రాలేదు. మరీ దారుణంగా అనిపించింది. రోహిత్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళితే త్రిగుణ్‌ దణ్ణం పెట్టడం గమనార్హం. మొత్తానికి రోహిత్ హౌస్ నుంచి స్టేజ్ పైకి వచ్చేశాడు.

రోహిత్ గ్రేట్ పొటెన్షియల్ అని తొలిసారిగా నాగ్ ఇవాళ చెప్పారు. నువ్వు ఎగ్జిట్ కావాలని ఓటేసిన ఏడుగురికి నీ రెస్పాన్స్ కావాలని నాగ్ అడిగారు. నరేష్ మనసులో తనను ఎగ్జిట్ చేయాలని లేదన్నట్టుగా చెప్పాడు. రామ్ ప్రసాద్ తను పొటెన్షియల్ అని.. నువ్వుంటేనే గేమ్‌లో మజా వస్తుందని చెప్పారు. దేబ్జాని తనను బ్లాక్ కార్డ్, ఎల్లో కార్డ్ అని అంటూనే ఉందని చెప్పారు. బ్యాక్‌లో ఉంటే గేమ్ ఉండదని శివ్‌కి చెప్పాడు. రోహిత్ వెళ్లేటప్పుడు కూడా శివ్ దారుణంగా మాట్లాడాడు. అందరూ నీకారణంగానే వెళ్లిపోయారని చెప్పాడు. వంశీకి, అమన్‌కు, త్రిగుణ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పి రోహిత్ వెళ్లిపోయాడు. సీజన్ 10 ఏ రోజు ఏ ట్విస్ట్ ఎలా వస్తుందోనని తను ఊహించలేదని నాగ్ చెప్పారు. నెక్ట్స్ వీక్ అవతారం వచ్చేసి రివార్డ్ అండ్ రివెంజ్ అని నాగ్ చెప్పారు. రోహిత్‌కు కనీసం జర్నీ వీడియో కూడా ప్లే చేయలేదు. అత్యంత దారుణమైన పరిస్థితుల్లో పంపించేశారు. బిగ్‌బాస్ చరిత్రలో ఇప్పటి వరకూ ఎవరు వెళుతున్నా కానీ మనసులో ఎలా ఉన్నా కానీ అందరూ వచ్చి కాస్త బాధతోనే సెండాఫ్ ఇస్తారు. కానీ రోహిత్‌కు మాత్రం దారుణమైన సెండాఫ్ ఇచ్చి పంపేశారు. చివరకు స్టేజ్‌పై ఉన్నప్పుడు కూడా శివ్.. ఏదో జన్మజన్మల పగ ఉన్నట్టుగా మాట్లాడాడు. మొత్తానికి రోహిత్ బయటకు వచ్చేశాడు.

Pranav

Recent Posts

మారిన సెన్సార్ (CBFC) రూల్స్.. దర్శక నిర్మాతలు గుర్తించుకోండి ఈ పాయింట్స్..!

సినిమాల రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేయడంలో, టైటిల్స్ ఫిక్స్ చేసి ప్రమోషన్స్ చేసుకోవడంలో మన మేకర్స్ ఎప్పుడూ ముందుంటారు. కానీ…

3 hours ago

ఏంటి గురూజీ ఆదర్శ కుటుంబం కూడా కాపీయేనా..? త్రివిక్రమ్‌పైనే ఎందుకిలా..?

టాలీవుడ్‌లో మాటల మాంత్రికుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన డైరెక్ట్…

10 hours ago

‘ఇరుముడి’ నిర్మాతలకు భారీ షాక్.. లేబర్ డిపార్ట్‌మెంట్ నోటీసులు..

రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ ఇరుముడి ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పనక్కర్లేదు. మైత్రీ…

12 hours ago

చిరంజీవికి బాలకృష్ణ సవాల్.. మెగావర్స్ టాక్ షో అన్ స్టాపబుల్ ను మ్యాచ్ చేయగలదా..?

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర దశాబ్దాలుగా హోరాహోరీగా పోటీ పడుతున్న ఇద్దరు అగ్ర హీరోలు ఇప్పుడు ఓటీటీ వేదికగా కూడా తమ…

12 hours ago

ఎమోషన్ లేని వైలెన్స్ కు అర్థం లేదు.. అది మనోళ్లకు చెప్పినా అర్థం కాదు..!

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే ట్రెండ్ నడుస్తోంది.. అదే వైలెన్స్, వైలెన్స్, వైలెన్స్. థియేటర్లోకి వెళితే చాలు…

14 hours ago

సాయి పల్లవి ఎందుకమ్మా అంత నోటిదురద.. రిలీజ్‌కు ముందు అవసరమా..?

అత్యంత భారీ బడ్జెట్ తో రూపొంది అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మైథలాజికల్ సినిమా రామాయణ మొదటి భాగం…

14 hours ago