వీకెండ్ రానే వచ్చేసింది. హోస్ట్ నాగార్జున వచ్చి ముందుగా శుక్రవారం ఏం జరిగిందో చూశారు. ఇక శుక్రవారం.. ముందుగా ముఖేష్‌ను రామకృష్ణ తనేం మార్చుకోవాలో చెప్పమని అడిగాడు. గేమ్ స్ట్రాంగ్‌గా ఆడుతున్నావని.. పాయింట్స్ మరికొంత స్ట్రాంగ్‌గా ఉండాలని చెప్పాడు. ఇంతలోనే అమన్ వచ్చి మష్రూమ్‌లో డ్యూటీస్ విని వెళ్దురు రమ్మంటే.. తను డిక్టేటర్ అని రానని ముఖేష్ చెప్పాడు. దీంతో అమన్.. బిగ్‌బాస్‌కు కంప్లైంట్ చేశాడు. రానూ గీనూ కుదరదని రమ్మని ముఖేష్ వాళ్లకు అమన్ వచ్చి మరోసారి చెప్పాడు. ఆర్కే లేచి ముఖేష్‌తో ‘సర్.. వాళ్ల డిక్టేటర్‌నే ఇక్కడకు రమ్మని చెప్పండి సర్’ అన్నాడు. మజాక్ కాదని అమన్ చెప్పాడు. డిక్టేటర్షిప్ క్యాన్సిల్ అయ్యిందని బిగ్‌బాస్ చెప్పారు. ముఖేష్ తనకు ఏం చెప్పాడో రామ్ ప్రసాద్ వెళ్లి త్రిగుణ్‌కు చెప్పాడు. ముఖేష్ చెప్పినవన్నీ మొత్తం చెప్పేశాడు. గేమ్ అంతా మనం మార్చకుంటే మనందరికీ రిస్కేనని చెప్పాడని చెప్పాడు. ముఖేష్ అలా చెబుతుంటే నరేష్ బిక్కచిక్కి పోయాడని రామ్ ప్రసాద్ చెప్పాుడ. దేబ్జాని వచ్చి ముఖేష్ చాలా టాక్సిక్ అని చెప్పింది. నిన్ను తీసుకుంది గేమ్ మారుద్దామని.. వేరొకరి గేమ్‌లో పావు అవ్వొద్దంటూ త్రిగుణ్ హితబోధ చేశాడు. అది మీకు అర్థమవ్వాలనే తాను రామ్ ప్రసాద్ ముఖేష్ టీంలోకి వెళుతున్నా ఆపలేదని చెప్పాడు.
ఆర్కే నిద్ర పోతుంటే కోడి కూత వినిపించింది. దీంతో అమన్ వెళ్లి ‘ఒక్కొక్కరి దగ్గరకు వెళ్లి మూడు డిప్స్ కొట్టి ‘సారీ కంటెస్టెంట్స్ మళ్లీ పడుకోను’ అని ఆర్కేతో చెప్పించాడు. ఆ తరువాత కోల్గేట్ ప్రమోషనల్ టాస్క్ నడిచింది. గార్డెన్ ఏరియాలో అమన్, శివ మినహా అంతా పడుకున్నారు. ఇంతలో కోడి కూత వినిపించింది. ఒక్కొక్కరినీ తీసుకెళ్లి అమన్, శివ స్విమ్మింగ్ పూల్‌లో పడేశారు. ఆ తరువాత వైల్డ్ గోల్డ్ ప్రమోషనల్ టాస్క్ నడిచింది. సాంగ్స్ వస్తుంటాయి. పిల్లో ఒకరి నుంచి మరొకరికి అందిస్తూ ఉండాలి. పాట ఆగినప్పుడు పిల్లో ఎవరి చేతిలో ఉంటుందో వాళ్లు గోల్డ్‌కు సంబంధించిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఈ టాస్క్ చాలా సేపు నడిచింది. కెప్టెన్ గురించి ఎలా అనిపిస్తోందని ముఖేష్ అడిగాడు. పనిష్మెంట్ ఇవ్వడం తప్ప ఏం చేయడం లేదన్నట్టుగా మాట్లాడుకున్నారు. హెయిర్ వెయిట్ కారణంగా అమన్‌కు యాటిట్యూడ్ వచ్చిందేమో అనుకుంటే అది హెడ్ వెయిట్ కారణంగా వచ్చిందని ముఖేష్ అన్నాడు. ఆ తరువాత జియో హాట్‌స్టార్‌లో ప్రసారం కానున్న ‘సింహరాశి’ సీరియల్ ప్రమోషన్ నడిచింది.
ఇక కంటెస్టెంట్స్ ముందుకు డిక్టేటర్‌గా నాగ్ వచ్చారు. నాగ్ చేతిలో రాడ్‌తో కనిపించడంతో తనకు భయం వేసిందని త్రిగుణ్ చెప్పగా.. ఈ రాడ్ అంటే నీకు భయమా? అని నాగ్ సరదాగా అడిగారు. ఆ తరువాత వెల్ డిజర్వింగ్ కెప్టెన్ అని అమన్‌ను నాగ్ ప్రశంసించారు. ముఖేష్ టీం మెంబర్స్‌ను నాగ్ లేపారు. డిక్టేటర్‌గా ముఖేష్‌కు ఎన్ని మార్కులు ఇస్తారో చర్చించుకుని రమ్మని డాన్యూబ్ రూంకి పంపించారు. ముగ్గురూ చర్చించుకున్నారు. అంతా కలిసి ముఖేష్‌కు 50 ఇచ్చారు. ఆ తరువాత త్రిగుణ్ టీంను చర్చించుకుని రమ్మని పంపించారు. త్రిగుణ్ టీం అతనికి 90 మార్కులు ఇచ్చారు. తమపై నోరు జారడం కారణంగా 10 తగ్గించినట్టు శివ చెప్పారు. తనను తిట్టుకున్నానని ఎవరినీ అనలేదని త్రిగుణ్ చెప్పడంతో నువ్వు నోరు జారడం గురించి ప్రత్యేకంగా చెప్పాలా? అన్నాడు. త్రిగుణ్‌కు అన్ని మార్కులు ఇవ్వడం సరికాదని ముఖేష్ చెప్పాడు. ఆడియెన్స్‌లో ముఖేష్ అభిమానితో నాగ్ మాట్లాడించారు. ముఖేష్‌కు 50 కూడా సరికాదని.. 30 ఇవ్వాలని చెప్పారు. చాలా చోట్ల స్టాండ్ తీసుకోలేదని ఆమె చెప్పారు. సంచాలక్‌గా ఛాన్స్ ఇవ్వడం బాగోలేదని.. స్ట్రాంగ్‌లో వర్షిణిని నిలబెట్టడం కరెక్ట్ కాదని ముఖేష్ అభిమాని చెప్పారు.
త్రిగుణ్‌ను లేపి ముఖేష్ ఎక్కడ తప్పు చేశాడని నాగ్ అడిగారు. కొన్ని ఇంపార్షల్ డెసిషన్స్ తీసుకోవాలని.. స్టాండ్ తీసుకోవాలని నాగ్ చెప్పారు. డిక్టేటర్‌గా నువ్వు ఎంత బాగా చేసినా నీకు 90 ఇవ్వడానికి కారణం నీ టంగ్ అని త్రిగుణ్‌కు నాగ్ చెప్పారు. త్రిగుణ్ కెమెరాతో మాట్లాడిన ఓ వీడియో చూపించారు. ఇదేంటని అడిగితే.. తనను కావాలనే ఇంట్రప్ట్ చేస్తున్నారని త్రిగుణ్ చెప్పాడు. బిగ్‌బాస్ హౌస్‌లో ప్రైవేట్ ఏంటి? ఎవ్రీథింగ్ ఓపెన్ అని నాగ్ చెప్పారు. ఫ్యామిలీస్ వచ్చి నిన్నెక్కడో పెట్టారని.. అక్కడ పెట్టిన వారు కింద పడేస్తారు కూడా అని నాగ్ చెప్పారు. ఈ సారి సారీ చెప్పనని.. ఆచరణలో చూపిస్తానని త్రిగుణ్ చెప్పాడు. నాగ్ ఫన్నీగా నమ్మాంలే అని ఫన్నీగా చెప్పారు. తన టీంకు 100 మార్కులు ఇస్తానని చెప్పాడు. అంతా ఎలాగైనా విన్ అవ్వాలనే స్పిరిట్‌తో ఆడారని చెప్పారు. నీతూ తన టీం నుంచి బయటకు వెళ్లారని అది తనకు బాధించిందని చెప్పాడు. కానీ అమన్ రావడం తమకు ప్లస్ అయ్యిందని చెప్పాడు.
నాగ్ చిన్న బ్రేక్ తీసుకున్నప్పుడు హౌస్‌లో మంటలు చెలరేగాయి. ఆట రద్దు చేస్తానన్నప్పుడు కాంప్రమైజ్ అవ్వాలని టు టైమ్స్ వార్నింగ్ ఇచ్చినా ఒప్పుకోలేదని అది చాలా పెద్ద తప్పని ముఖేష్‌కు రామ్ ప్రసాద్ చెప్పాడు. వర్షిణిని ఒప్పించి డెసిషన్ తీసుకోవాలని రామ్ ప్రసాద్ అన్నాడు. నువ్వు సంచాలక్ అయినప్పుడు నువ్వు తీసుకునే డెసిషన్ కరెక్ట్ అని.. లేదంటే తప్పా? అని ముఖేష్ అడిగాడు. ఫౌల్ అయినా ఓకేనా? అని అన్నాడు. అప్పుడు శివ్ వస్తే ఆ రోజు నువ్వు ఒప్పుకోలేదా? అని అడిగాడు. కానీ 6-8కి ఒప్పుకుని ఉంటే బాగుండేదని రామ్ ప్రసాద్ చెప్పాడు. వర్షిణి ఒప్పుకుందని ముఖేష్ చెప్పాడు. ఒప్పుకుంటే ఇక్కడి వరకూ వచ్చి ఉండేది కాదని ముఖఏష్ అన్నాడు. మధ్యలో నరేష్ కూడా వచ్చాడు. వర్షిణిని ఒప్పించమని చెప్పామని నరేష్ కూడా గట్టిగా వాదించాడు. వర్షిణి ఒప్పుకుందని ముఖేష్.. ఆమె ఒప్పుకోలేదని మిగిలిన వారు గొడవ కొనసాగింది. వర్షిణి సంచాలక్‌గా ఉన్నప్పుడు 6-8కి ఒప్పుకుంటే బాగుండేదని తిరిగి రామ్ ప్రసాద్ చెప్పాడు. ఈ గొడవంతా చూసిన నాగ్.. లాస్ట్ 15 నిమిషాల నుంచి ఆడియెన్స్, నేను మీ గొడవ చూస్తున్నామని చెప్పారు. అప్పుడు రామ్ ప్రసాద్ ఆ రోజు రద్దైన టాస్క్ గురించి వివరించాడు.
వర్షిణి కారణంగా తాము టాస్క్ ఓడిపోయామని ఆ రోజున 6-8కి ఒప్పుకుని ఉంటే తాము గేమ్ గెలిచి ఉండేవారమని.. ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేదని రామ్ ప్రసాద్ చెప్పాడు. అది లెవల్ 1 అని ముఖేష్ చెప్పాడు. 6-8 అయినా 5-8 అయినా గెలిచేది ముఖేష్ టీమే కదా.. ఒప్పుకుంటే పోయేది కదా అని నాగ్ అడిగారు. వర్షిణి ఆ రోజున ఫౌల్ జరిగిందని తాను దానికి అంగీకరించలేదని వర్షిణి చెప్పింది. లెవల్ 1లో ముఖేష్ అండ్ టీం గెలిచిందని వర్షిణి చెప్పింది. అది చెప్పి ఉంటే అయిపోయేది కదా అని నాగ్ అడిగారు. శివ్ కూడా దానికి అంగీకరించాడని నాగ్ చెప్పారు. ఒక ఫౌల్ గురించి పట్టుకుని గెలుపును వదులుకున్నారని నాగ్ అన్నారు. తెలివిగా త్రిగుణ్ 5-5 అని చెప్పి ఆటనే రద్దు చేయించాడని నాగ్ అన్నారు. రామ్ ప్రసాద్, నరేష్, అమన్, ఆర్కే ప్రాబ్లమ్ అదేనని నాగ్ చెప్పారు. మీకున్న అడ్వాంటేజ్‌ని త్రిగుణ్ తెలివిగా రద్దు చేయించాడని అన్నారు. మీ టీంకి వచ్చిన గెలుపుని చేతులారా పోగొట్టుకున్నారని నాగ్ చెప్పారు. మీ మైండ్ ఫౌల్ దగ్గర స్టక్ అయ్యిందని.. అసలు అది ఫౌలా కాదా చూద్దామని నాగ్ చెప్పారు. వంశీ ఫౌల్ చేశాడనేది వర్షిణి కంప్లైంట్. ఆర్కే కూడా తప్పు చేశాడు. రెండు ఫౌల్స్కి నల్లిఫై అయ్యిందని నాగ్ చెప్పారు.
నరేష్‌కి ప్రీం టైం దొరికినప్పుడు వర్షిణి దగ్గరకు వెళ్లినప్పుడు ఆమె చేతిని నీ చేతిలోకి తీసుకుని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయమని నాగ్ చెప్పారు. అప్పటికి కూడా అర్థం చేసుకోకుంటే స్టోర్ రూంలో పెట్టమని సరదాగా అన్నారు. ఆ తరువాత వంశీని లేపారు. సినిమాల్లోనేనా విలన్.. మాటల్లో కూడా విలన్‌లాగే ప్రవర్తిస్తావా? అని నాగ్ అడిగారు. నీ మాటలకు తాను సిగ్గు పడ్డానని నాగ్ చెప్పారు. వంశీ నామినేషన్స్‌కి సంబంధించిన వీడియోను చూపించారు. ఈ వీడియో చూశాక నాగ్.. కులకడం గురించి మాట్లాడాక తానే జస్టిఫై చేశానని ఇది చూశాక తానే తల దించుకున్నట్టుగా చెప్పారు. వంశీ కూడా తనది తప్పేనని వర్షిణికి సారీ చెప్పాడు. తనకు ఏ పనిష్మెంట్ అయినా ఓకే అన్నాడు. వర్షిణిని లేపి అడిగితే ఆయన ఒక పెద్దాయన అన్న అనే ఫీలింగే ఉంటుందని.. పనిష్మెంట్ ఏమీ వద్దని చెప్పింది. నాగ్ మాత్రం వంశీని డైరెక్ట్‌గా నామినేట్ చేశారు. రామ్ ప్రసాద్లో కోపం అన్నీ చూశానని.. కళ్ల వెంట నీళ్లు చూశానని రియల్ రామ్ ప్రసాద్ ఈ వీక్ కనిపించాడని నాగ్ చెప్పారు. ఓ టాస్క్‌లో శివ్ కరెక్ట్ ఆన్సర్ చెప్పాడని డౌట్ ఉంది కదాని నాగ్ అడిగి దానికి సంబంధించిన వీడియోను చూపించారు. శివ్‌ను రాంగ్గా అర్థం చేసుకుని బొబ్బిలి బ్రహ్మన్నలా మారిపోయాడని చెప్పారు. చిన్న క్లూ దొరికినా ఇక్కడ రెచ్చిపోతారని రామ్ ప్రసాద్ అన్నాడు. నీకళ్ల వెంట కన్నీళ్లు రావడం తనకు బాధ అనిపించిందని నాగ్ చెప్పారు. బిగ్‌బాస్ ఇన్సల్ట్ చేయాలని అలా చేయరని నాగ్ చెప్పారు.
ఆర్కేను లేపి లివింగ్ రూం నుంచి నువ్వు దొబ్బేయమని నాగ్ చెప్పారు. ఆర్కే అలా చూస్తూ ఉంటే.. మరోసారి నాగ్ చెప్పారు. సారీ సర్ అలా తాను అనకుండా ఉండాల్సిందని ఆర్కే చెప్పాడు. త్రిగుణ్ సుద్దపూస అని తాను చెప్పడం లేదని మీ అందరికంటే నోరు జారతాడని నాగ్ అన్నారు. త్రిగుణ్‌కి, ఆడియెన్స్‌కు ఆర్కే సారీ చెప్పాడు. నరేష్‌ను ఈ వారం శాడ్‌గా ఉన్నావని నాగ్ అడిగారు. నీ గేమ్ ఇంకా బాగుండాలని కొందరు చెప్పడంతో తను నిజంగానే అలా ఆడటం లేదేమోననే ఫీలింగ్ ఉందని నరేష్ చెప్పాడు. ప్రతి గేమ్‌ను ఎందుకు వదిలేసుకోవాల్సి వచ్చిందో చెప్పి.. వాటి కారణంగా కెప్టెన్సీ కంటెండర్‌షిప్ తనకు తమ డిక్టేటర్ ఇవ్వలేదని నరేష్ చెప్పాడు. ఓడిపోయిన తర్వాత శాక్రిఫైస్ చేశానని చెప్పావా? అని ముఖేష్‌ను నాగ్ అడిగారు. నువ్వు, వర్షిణిలో ఎవరు స్ట్రాంగ్ అనేది చెప్పేందుకు బిగ్‌బాస్ ఒక టాస్క్ పెడుతున్నారని.. ఇద్దరినీ యాక్టివిటీ రూంకి రమ్మన్నారు. వచ్చే వారం కెప్టెన్సీకి చివరి వారమని నాగ్ చెప్పారు. ఇక ఇది ఇండివిడ్యువల్‌గా ఆడాల్సిన తరుణమని నాగ్ చెప్పారు. 12 మందిని 6 గ్రూపులుగా విడదీస్తున్నట్టు నాగ్ చెప్పారు. ఓడిన వారికి కంటెండర్‌షిప్ లేదని చెప్పారు.
ఇక వర్షిణి, ముఖేష్‌కి టాస్క్ ఇచ్చారు. దీనికి సుధీర్ సంచాలక్. మీ చెల్లి (దేబ్జాని) ఒక్కసారి కరెక్ట్ ఆన్సర్ చెబితే నీకు ప్రాబ్లమా? అని రామ్ ప్రసాద్‌ను నాగ్ అడిగారు. ముఖేష్, వర్షిణికి 3 నిమిషాల సమయం ఇచ్చారు. వాళ్ల దగ్గర ఉన్న హార్ట్స్ తీసుకెళ్లి గ్రిడ్‌లో పెట్టాలి. ఒకరు హార్ట్ పెట్టాక వేరొకరు తీసి పారేయవచ్చు. ఇద్దరూ చకచకా పెట్టారు. ముఖేష్ వెళ్లి వర్షిణిని గట్టిగా పట్టుకున్నాడు. ఆడాలి తప్ప ఆపకూడదని నాగ్ చెప్పారు. మళ్లీ ఒకరివి మరొకరు మొత్తం తన్నేసుకున్నారు. ముఖేష్వి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ముఖేష్ విన్ అయ్యాడు. నెక్ట్స్ వీక్ కంటెండర్షిప్కి ముఖేష్ ఎలిజిబుల్ అని నాగ్ చెప్పారు. ముఖేష్ ఆడటం ఫెయిరా? అంటే వర్షిణి కాదని చెప్పింది. ముఖేష్ తన ఆట తను ఆడాడని.. ఇక మీదట నువ్వు ఆడటం మొదలు పెట్టమని నాగ్ చెప్పారు. మిగతా వాళ్ల టాస్క్‌లు ఆదివారం ఆడదామని చెప్పి నాగ్ వెళ్లిపోయారు. ఇవాళ ఇది జరిగింది. మొత్తానికి ఇవాళ ముఖేష్‌కు నాగ్ క్లాస్ తీసుకుని త్రిగుణ్‌కు మాత్రం మాస్ ఎలివేషన్ ఇచ్చారు.
ఈవారం బిగ్‌బాస్ ఏమాత్రం ఆసక్తిగా అనిపించడం లేదు. ముఖేష్, త్రిగుణ్‌లను డిక్టేటర్స్ను చేసి ఒక టాస్క్ ఆడించారు బిగ్‌బాస్. దానిలో…
నిన్న షో ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచే తిరిగి నేడు ప్రారంభమైంది. వంశీ వచ్చేసి టీం త్రిగుణ్ విన్నర్ అని..…
త్రిగుణ్ వెళ్లి కెమెరాతో మాట్లాడాడు. ముఖ్యంగా వర్షిణి తమ గురించి మాట్లాడటం గురించి బాగా కోపం పెంచుకుని మాట్లాడాడు. ఆ…
ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులకు అత్యంత ఇష్టమైన సూపర్ స్పై క్యారెక్టర్ జేమ్స్ బాండ్. ఇప్పటివరకు ఈ ఐకానిక్ పాత్రలో నటించిన…
పదేళ్ల క్రితం దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ప్యాన్ ఇండియా గేట్లను తెరిచింది. అప్పటివరకు…
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 చాలా రసవత్తరంగా సాగుతోందిప్పుడు. అయితే ఈ సీజన్ మొత్తం మీద అందరికీ పెద్ద…