
నిన్న రోహిత్‌కు అమన్ బ్యాక్ స్టాబ్ చేయడం.. ఆ తరువాతి పరిణామాలతో నేడు బిగ్‌బాస్ షో ప్రారంభమైంది. రోహిత్ వచ్చేసి నీతూతో అమన్ గురించి చెప్పాడు. సుధీర్ వచ్చి అమన్ గురించి తనకు చెప్పాడని.. ఫస్ట్ నుంచి తనే ప్రయారిటీ అని ప్రస్తుతం శ్వేత అంటున్నాడని మాటల్లో మిస్ మ్యాచ్ ఉంది అన్నట్టుగా చెప్పాడు. గోట్గా నిలిచిన వారందరి కోసం ఒక్కొక్క బ్లూ టూత్ స్పీకర్ వచ్చింది. తన పరంగా అలయెన్స్ అంటే ఒక్కరితోనే ఉండటం.. ఒక్కరితోనే ఆడటమని చెప్పాడు. మరి మీ దగ్గర స్టార్స్ ఉంచుకుంటే గోట్ అవ్వొచ్చు కదా అని రోహిత్, నీతూ చెప్పారు. కానీ తనకు గోట్ అవడం లక్ష్యం కాదని.. గోట్ మేకర్ అవడమే లక్ష్యమని చెప్పాడు. ఆ తరువాత శివ్ వెళ్లి అమన్ గురించి త్రిగుణ్‌తో తనకు కాన్ఫిడెంట్ లేదని చెప్పాడు. నీతూ గట్టిగా ట్రై చేస్తుందని శివ్ చెప్పాడు. నీతూని రోహిత్ ఇన్ఫ్లూయెన్స్ చేస్తున్నాడని చెప్పాడు. తను ఇకపై అమన్‌తో ఇంతకు ముందులా ఉండలేనని.. క్లియర్ బ్యాక్ స్టాబ్ చేశాడని చెప్పారు. అంతకు ముందు కూడా అలాగే చేశాడని.. ఇప్పుడు మీ అందరికీ అది క్లియర్‌గా తెలిసిందని ముఖేష్‌కు చెప్పాడు. అల్టిమేట్ గోట్ అయ్యేందుకు ఛాలెంజ్‌ను బిగ్‌బాస్ ఇచ్చారు. అల్టిమేట్ గోట్ కోసం ముగ్గురి సపోర్టర్స్‌ని ఎంచుకోవచ్చు. వారి సాయంతో టాస్క్‌ను ముగించవచ్చు. ఈ టాస్క్‌కు రోహిత్ కెప్టెన్. అల్టిమేట్ గోట్గా గెలిచిన వారు ఈ హౌస్‌లో ఉన్నంత కాలం కెప్టెన్సీ కంటెండర్‌గా ఉంటారు.
అమన్‌కు ఈ వారం కూడా కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశం లేదు. దీంతో బాగా ఫీలయ్యాడు. త్రిగుణ్, దేబ్జాని వాళ్లు అమన్‌ను ఓదార్చారు. ఇక టాస్క్ ప్రారంభమైంది. గత వారం కెప్టెన్సీ టాస్కే జరగలేదు కాబట్టి ఈవారానికి అమన్‌కు పనిష్మెంట్ వర్తిస్తుందని బిగ్‌బాస్ చెప్పారు. వంశీని తాను నమ్మనని నీతూ చెప్పింది. తనకు వంశీ సపోర్ట్ వద్దని చెప్పింది. అలా అయితే హౌస్ నుంచి బయటకు వెళ్లమని చెప్పింది. సపోర్టర్స్ విషయంలో గొడవ జరిగింది. ఓటింగ్ చేద్దామని ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్లను పెడదామనుకున్నారు. ముఖేష్ టీంకు రోహిత్, సుధీర్ కావాలి. వేరొకరు వద్దని చెప్పారు. దీంతో అమన్ స్థానంలో ఝాన్సీని పెట్టమని రోహిత్ చెప్పడంతో అమన్ వర్సెస్ రోహిత్ గొడవ జరిగింది. తనకు కంటెండర్‌షిప్ లేదు కాబట్టి తాను గేమ్ ఆడతానని అమన్ చెప్పాడు. మాటా మాటా పెరిగి ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. నాకు నచ్చినట్టు నువ్వు ఆడకని అమన్.. నీకు నచ్చినట్టు నేనాడని రోహిత్ చెప్పాడు. నీ అంత కన్నింగ్ నేను కాదని అమన్ అనడంతో గొడవ మరింత పెద్దైంది. నువ్వు నాకేం చేయలేదని అమన్ చెప్పాడు. తన వెంట్రుకలు చూపించి ఇన్ని చూశాని అమన్ చెప్పాడు. అమన్ పేరు తీసే రైట్ కూడా లేదని అన్నాడు. షాలినిని, తను బ్యాక్ స్టాబ్ చేశావని రోహిత్ చెప్పాడు. నిన్ను రెడ్‌లో ఎందుకు పెట్టారని అమన్ అడిగాడు. పొడిచి చూపించు అని అమన్ అన్నాడు. అగ్నిపరీక్షలో తనేంటో చూపించాని.. అక్కడ పొడిచి చూపించాని అన్నాడు. మింగేదాకా తెచ్చుకోకు అని రోహిత్‌కు అమన్ చెప్పాడు.
ఓటింగ్ ప్రకారం అయితే ప్రతిసారీ తనను తీసి పక్కనబెడుతున్నారని రోహిత్ అన్నాడు. ప్రతి ఒక్కడూ మాట్లాడితే నేను ఒప్పుకోనని రోహిత్ గురించి అమన్ అన్నాడు. అమన్‌ను నిర్ణయం తీసుకోవడంలో మీరు కూడా పాలు పంచుకోవచ్చని బిగ్‌బాస్ చెప్పారు. రోహిత్, ముఖేష్, వర్షిణి మాట్లాడుకుంటుంటే అమన్.. మేము నలుగురం మాట్లాడుకున్నామని చెప్పాడు. మెజారిటీ మాదేనని అన్నాడు. అమన్, శివ, వంశీ సపోర్టర్స్ అని అమన్ చెప్పాడు. అమన్ చాలా ఓవర్ చేశాడు. రోహిత్ ఈ టాస్క్‌కు సంచాలక్. అమన్ ఇవాళ చాలా తప్పులు చేశాడు. కంప్లీట్‌గా త్రిగుణ్ టీంకి ఫేవర్‌గా ఉండి ఆడాడు. ఈ క్రమంలోనే ముఖేష్ పెద్ద గొడవ చేశాడు. వంశీ సిన్సియర్‌గానే వేసేందుకు ట్రై చేసినట్టుగా అనిపించింది. కానీ అది అవలేదు. వాస్తవానికి త్రిగుణ్ టీంలో ఎవరైనా బాల్ తీసుకొచ్చి వేస్తే అది ఎల్లోలో పడుతోంది. మిగిలిన వాళ్లవి వేస్తే ఎల్లోలో పడటం లేదు. వాస్తవానికి ముఖేష్ చాలా ఫాస్ట్‌గా ఆడాడు కానీ అతనికి సరైన సపోర్ట్ దొరకలేదు. దీంతో ముఖేష్ బాగా ఫ్రెస్టేట్ అయ్యాడు. ముఖేష్ బాల్ ఇస్తే శివ్ వెయ్యకుండా దేబ్జాని బాల్ వేశాడు. త్రిగుణ్ బాల్ అయితే చాలా జాగ్రత్తగా వేశారు. అలాగే వంశీ బాల్ తీసుకొస్తుంటే త్రిగుణ్ అడ్డు వచ్చాడు. చాలా స్పీడ్‌గా ముఖేష్ గేమ్ ఆడాడు. కానీ చివరకు త్రిగుణ్ గెలిచాడు. త్రిగున్ని గెలిపించు.. దేబ్జాని వద్దని ఎందుకు అమన్‌కు చెప్పావని రామ్ ప్రసాద్‌ను నిలదీసింది. న్యాయంగానే ఆడుదాం అనుకున్నామని వంశీ, అమన్ చెప్పుకున్నారు. రామ్ ప్రసాద్ నేరుగా నిన్ను ఓడించాలని ఉంది. అందుకే స్కెచ్ వేసి లేపాశని ముఖేష్‌కి చెప్పారని రోహిత్ అన్నాడు. త్రిగుణ్ అల్టిమేట్ గోట్గా నిలిచాడు. నేరుగా ఇక మీదట ప్రతి వారం కెప్టెన్సీ కంటెండర్ అవుతారని బిగ్‌బాస్ చెప్పారు. త్రిగుణ్ తన టీం మొత్తాన్ని పిలిచి అల్టిమేట్ గోట్ బ్యాడ్జ్ పెట్టించుకున్నాడు.
త్రిగుణ్ కెప్టెన్ అవడంతో అమన్ బాగా సంబరపడ్డాడు. బ్యాడ్జ్ కూడా త్రిగుణ్.. అమన్‌తో పెట్టించుకున్నాడు. ముఖేష్‌ను ఇష్టం ఉంటే రా.. లేకపోతే అక్కడే ఉండు అని త్రిగుణ్ అనడంతో ముఖేష్ దూరంగా ఉండిపోయాడు. త్రిగుణ్ తను అలా అనుకోలేదని వచ్చి పిలిచినా కూడా ముఖేష్ రానని చెప్పాడు. తన మెడల్‌ను వంశీ, అమన్‌లకు త్రిగుణ్ డెడికేట్ చేశాడు. థమ్సప్ ప్రమోషనల్ టాస్క్ జరిగింది. టాస్క్ తర్వాత రెడ్ లెవల్లో ఉన్న సభ్యులంతా తక్షణమే బ్యాగ్స్ సర్దుకోవాలని బిగ్‌బాస్ చెప్పారు. ఆ తరువాత త్రిగుణ్ అల్టిమేట్ గోట్ కాబట్టి సంకెళ్లు ధరించాల్సిన సమయం పూర్తైందని బిగ్‌బాస్ చెప్పారు. జైలులో పెట్టాలన్నారు కానీ జైలులో ఒక్క క్షణం కూడా త్రిగుణ్ ఉన్నది లేదు. ఆ పనిష్మెంట్ను త్రిగుణ్ తీసుకున్నది లేదు. పెట్టింది లేదు. రోహిత్ వచ్చేసి నీతూతో సుధీర్, తాను ఇద్దరిలో ఎవరు వెళ్లిపోయినా నీకు ఒకరం తోడుగా ఉంటామని చెప్పాడు. శివ్, దేబ్జాని, రామ్ ప్రసాద్, త్రిగుణ్ సమావేశమై రోహిత్‌ను తీసేయాలని డిసైడ్ అయ్యారు. నరేష్ మాత్రం వీళ్లలో ఎవరు వెళ్లినా తాను బాధ పడతానని చెప్పాడు. సుధీర్‌కు నరేష్ ధైర్యం చెప్పాడు. రోహిత్ ఇప్పటి వరకూ సోలోగా ఆడింది లేదని త్రిగుణ్ చెప్పాడు. అమన్‌ను కూడా పిలిచి రోహిత్‌ను పంపించాలని చెప్పాడు. అందరూ కలిసి రోహిత్‌ను పంపాలని డిసైడ్ అయ్యారు. ఇక ఓటింగ్ ప్రారంభమైంది. గ్రీన్ లెవల్లో ఉన్నవారు రెడ్ లెవల్లో ఉన్నవారి నుంచి ఎవరినైతే పంపాలనుకుంటున్నారో వారి నెత్తిపై షుగర్ బాటిల్ కొట్టాలని చెప్పారు. ముందుగా రామ్ ప్రసాద్ వచ్చి రోహిత్ నెత్తిపై షుగర్ బాటిల్ పగులగొట్టాడు. నిజంగా ఫీలవుతున్నానంటూనే రామ్ ప్రసాద్ పొడిచేశాడు.

ఇక ఆ తరువాత వర్షిణి, నీతూ, ముఖేష్ వచ్చి రామకృష్ణను, దేబ్జాని, త్రిగుణ్ వచ్చేసి రోహిత్‌ను అమన్ వచ్చేసి సుధీర్ తలపై పగులగొట్టారు. సుధీర్‌ను ప్రేక్షకులు ఇంటి నుంచి పంపించాలనుకున్నారని బిగ్‌బాస్ చెప్పారు. సుధీర్ ప్రయాణం ఇంతటితో పూర్తైందని.. అందరికీ చెప్పి బయలుదేరాలని బిగ్‌బాస్ అన్నారు. ఝాన్సీ, వర్షిణి, ముఖేష్ బాగా ఏడ్చారు. తాను మాత్రం ఏడవనని ఆడియెన్స్ వేశారు కాబట్టి రెస్పెక్ట్ చేసి వెళతానని చెప్పారు. రోహిత్‌ను చెప్పి వీళ్లకు నువ్వుంటావు కదా అని అడిగాడు. రోహిత్ ఉంటానని చెప్పాడు. రోహిత్ 50 రోజుల నుంచి కింద పడుకుంటున్నాడని.. తను ఇప్పుడు బాగా నచ్చుతున్నాడని తన బెడ్ రోహిత్‌కు ఇవ్వమని అందరినీ రిక్వెస్ట్ చేశాడు. తనైతే తల ఎత్తుకుని వెళుతున్నానని చెప్పాడు. తను సాధించింది చాలా ఎక్కువని చెప్పాడు. తాను మీతో చాలా హార్ట్‌ఫుల్‌గా ఉన్నానని వర్షిణి, ముఖేష్ వాళ్లకు చెప్పాడు. నరేష్ కూడా బాగా ఎమోషనల్ అయ్యాడు. ముఖేష్ ఒక్క నిమిషం అని చెప్పి వెళ్లి తన పవర్ కీ వాడి సుధీర్‌ని సేవ్ చేయవచ్చా? అని అడిగాడు. ఝాన్సీకి ఎవిక్షన్ ఫ్రి పాస్ ఇవ్వాలని ముఖేష్ రిక్వెస్ట్ చేశాడు. దీంతో బిగ్‌బాస్ కీ పంపించారు. యూజ్ చేసిన ఏ పవర్‌ని అయినా రివైజ్ చేసి వాడవచ్చని బిగ్‌బాస్ రూల్‌లో ఉండటంతో రీ యూజ్ చేసేందుకు ఝాన్సీకి ఆ పవర్‌ని ఇస్తున్నట్టు ముఖేష్ చెప్పాడు. మొత్తానికి సుధీర్‌ను సేవ్ చేశారు. అంతా హ్యాపీ ఫీలయ్యారు.
