సినిమా వార్తలు

మారిన సెన్సార్ (CBFC) రూల్స్.. దర్శక నిర్మాతలు గుర్తించుకోండి ఈ పాయింట్స్..!

సినిమాల రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేయడంలో, టైటిల్స్ ఫిక్స్ చేసి ప్రమోషన్స్ చేసుకోవడంలో మన మేకర్స్ ఎప్పుడూ ముందుంటారు. కానీ ఇకపై సెన్సార్ బోర్డ్ దగ్గర వాళ్ల లాస్ట్ మినిట్ హడావిడి అస్సలు కుదరదు. సినిమాలు సెన్సార్ చేసుకోవడానికి వచ్చే నిర్మాతలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ కొత్త రూల్స్ పాస్ చేసింది. సినిమాటోగ్రాఫ్ చట్టం 1952, అలాగే 2024 సర్టిఫికేషన్ నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులు కచ్చితంగా పాటించాల్సిన కఠినమైన మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. ఇప్పటి వరకు మేకర్స్ తమకు నచ్చినట్లుగా అసంపూర్తిగా ఉన్న సినిమాలను సెన్సార్ కు పంపించి పనులు కానిచ్చేసేవారు. కానీ ఇకపై ఇలాంటి షార్ట్ కట్స్ కు ఎండ్ కార్డ్ వేస్తూ బోర్డ్ తీసుకున్న ఈ సీరియస్ డెసిషన్స్ సినిమా ఇండస్ట్రీ పనితీరును పూర్తిగా మార్చేయబోతున్నాయి.

ఇకపై సెన్సార్ కోసం పంపించే సినిమా కాపీ అన్ని విధాలుగా ఫుల్ అండ్ ఫైనల్ వెర్షన్ అయి ఉండాలని బోర్డ్ తేల్చి చెప్పింది. అంటే షూటింగ్, ఎడిటింగ్ మాత్రమే కాదు ఫైనల్ గ్రాఫిక్స్, టైటిల్స్, క్రెడిట్స్, సబ్‌టైటిల్స్, డిస్‌క్లెయిమర్‌లు అన్నీ పక్కాగా ఉండాలి. అంతేకాకుండా ఫైనల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ మిక్స్ కూడా పూర్తయి ఉండాలి. వీటితో పాటు వినికిడి, దృష్టి లోపం ఉన్నవారి కోసం థియేటర్లలో వేసే క్లోజ్డ్ క్యాప్షన్స్, ఆడియో డిస్క్రిప్షన్స్ లాంటి యాక్సెసిబిలిటీ ఫీచర్స్ కూడా కచ్చితంగా యాడ్ చేయాలి. ఈ ఫైనల్ వెర్షన్ సెన్సార్ బోర్డ్ కు చూపిస్తేనే వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. ఒకసారి CBFC అఫీషియల్ గా సర్టిఫికేట్ ఇచ్చాక, ఆ ఫైనల్ కాపీని మాత్రమే థియేటర్లలో ప్రదర్శించాలి తప్ప అందులో మళ్లీ ఎలాంటి మార్పులు చేయడానికి అస్సలు వీల్లేదు.

సినిమా అనౌన్స్ చేయగానే ఒక క్యాచీ టైటిల్ పెట్టి పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు వదిలేయడం మేకర్స్ కు చాలా మామూలు విషయం. అయితే మీరు అప్లికేషన్ లో పెట్టిన టైటిల్ ను ఫైనల్ అని అనుకోవడానికి వీల్లేదని సెన్సార్ బోర్డ్ స్పష్టం చేసింది. సినిమాటోగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ 5B(1), అలాగే కొత్త రూల్ 25 ప్రకారం సినిమా టైటిల్ ను పరిశీలించి, అవసరమైతే అందులో మార్పులు చేసే పూర్తి హక్కు ఎగ్జామినింగ్ లేదా రివైజింగ్ కమిటీకి ఉంటుంది. అందుకే సెన్సార్ సర్టిఫికేట్ చేతికి వచ్చే వరకు నిర్మాతలు తాము పెట్టుకున్న టైటిల్ అఫీషియల్ అని, అదే ఫైనల్ అని ఎక్కడా ప్రచారం చేయకూడదని బోర్డ్ గట్టిగా సూచించింది. అంటే సెన్సార్ వాళ్లు అన్నీ చెక్ చేసి ఓకే చెబితేనే ఆ టైటిల్ తో సినిమా రిలీజ్ అవుతుందన్నమాట.

సాధారణంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అవుతుండగానే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్న ప్రింట్లను సెన్సార్ కు పంపిస్తుంటారు మన ప్రొడ్యూసర్స్. కానీ ఇకపై ఇలాంటి అసంపూర్తి కాపీలను సెన్సార్ బోర్డ్ అస్సలు యాక్సెప్ట్ చేయదు. టెంపరరీ గ్రాఫిక్స్ ఉన్నా, ఫైనల్ కాని మ్యూజిక్ ట్రాక్స్ ఉన్నా, సబ్ టైటిల్స్ లాంటివి మిస్ అయినా ఆ అప్లికేషన్ ను వెంటనే రిజెక్ట్ చేస్తారు లేదా దరఖాస్తును వెనక్కి పంపించేస్తారు. మీరు అప్లికేషన్ తో పాటు కావాల్సిన అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి, పర్ఫెక్ట్ ఫైనల్ ప్రింట్ ఇస్తేనే మీ దరఖాస్తు పూర్తయినట్లు లెక్క. ఏ రోజు అయితే మీ అప్లికేషన్ అన్ని విధాలా కంప్లీట్ అవుతుందో, ఆ రోజు నుంచే మీ సినిమాను సెన్సార్ పరిశీలన క్యూలోకి తీసుకుంటారు కాబట్టి మేకర్స్ ఈ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండాలి.

చాలాసార్లు మేకర్స్ ముందుగానే రిలీజ్ డేట్ ప్రకటించేసి, ఆ డేట్ దగ్గర పడుతుందనే సాకుతో సెన్సార్ ప్రాసెస్ తొందరగా కంప్లీట్ చేయాలని బోర్డ్ పై ఒత్తిడి తెస్తుంటారు. కానీ మీ సినిమా రిలీజ్ డేట్ ను బట్టి మేము హడావిడిగా సెన్సార్ చేయబోమని CBFC కుండబద్దలు కొట్టింది. నిర్మాత అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ తో బోర్డుకు ఎలాంటి సంబంధం ఉండదు. చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారం, సెన్సార్ బోర్డ్ ప్రొసీజర్ ప్రకారమే సర్టిఫికేషన్ జరుగుతుంది. సినిమాను కమిటీ చూసి, రివ్యూ చేసి, అందులో మార్పులు సూచించడానికి చాలా టైమ్ పడుతుంది. కాబట్టి మేకర్స్ వాళ్ళ సినిమా రిలీజ్ డేట్ కంటే చాలా ముందుగానే సెన్సార్ కు అప్లై చేసుకోవాలి. అంతే తప్ప లాస్ట్ మినిట్ లో వచ్చి రిలీజ్ డేట్ పేరు చెప్పి ఒత్తిడి చేస్తే సెన్సార్ బోర్డ్ కరుణించే ప్రసక్తే లేదని చాలా క్లియర్ గా అర్థం చేసారు.

Telugu Cinema 360

Recent Posts

Bigg Boss10 Telugu: రోహిత్ ఎలిమినేట్..

నిన్న ఝాన్సీ ఎలిమినేట్ అయిన సీన్ నుంచి ఇవాళ్టి షో ప్రారంభమైంది. ఝాన్సీ స్టేజ్‌పైకి వచ్చాక ఆమె జర్నీ చూపించారు.…

4 hours ago

ఏంటి గురూజీ ఆదర్శ కుటుంబం కూడా కాపీయేనా..? త్రివిక్రమ్‌పైనే ఎందుకిలా..?

టాలీవుడ్‌లో మాటల మాంత్రికుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన డైరెక్ట్…

10 hours ago

‘ఇరుముడి’ నిర్మాతలకు భారీ షాక్.. లేబర్ డిపార్ట్‌మెంట్ నోటీసులు..

రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ ఇరుముడి ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పనక్కర్లేదు. మైత్రీ…

12 hours ago

చిరంజీవికి బాలకృష్ణ సవాల్.. మెగావర్స్ టాక్ షో అన్ స్టాపబుల్ ను మ్యాచ్ చేయగలదా..?

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర దశాబ్దాలుగా హోరాహోరీగా పోటీ పడుతున్న ఇద్దరు అగ్ర హీరోలు ఇప్పుడు ఓటీటీ వేదికగా కూడా తమ…

13 hours ago

ఎమోషన్ లేని వైలెన్స్ కు అర్థం లేదు.. అది మనోళ్లకు చెప్పినా అర్థం కాదు..!

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే ట్రెండ్ నడుస్తోంది.. అదే వైలెన్స్, వైలెన్స్, వైలెన్స్. థియేటర్లోకి వెళితే చాలు…

15 hours ago

సాయి పల్లవి ఎందుకమ్మా అంత నోటిదురద.. రిలీజ్‌కు ముందు అవసరమా..?

అత్యంత భారీ బడ్జెట్ తో రూపొంది అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మైథలాజికల్ సినిమా రామాయణ మొదటి భాగం…

15 hours ago