సినిమా వార్తలు

Bigg Boss10 Telugu: ఈవారం బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

ఈవారం బిగ్‌బాస్‌ ఏమాత్రం ఆసక్తిగా అనిపించడం లేదు. ముఖేష్, త్రిగుణ్‌లను డిక్టేటర్స్‌ను చేసి ఒక టాస్క్ ఆడించారు బిగ్‌బాస్. దానిలో గెలిచిన ముఖేష్‌కు తన టీం మెంబర్స్‌ను ఎంచుకునే అవకాశం ఇచ్చారు. అంతా బాగానే ఉంది కానీ త్రిగుణ్ ఏదీ పడనివ్వడం లేదు. దీంతో ఒక టాస్క్ రద్దు అయిపోయింది. మొత్తం హౌస్‌లో అసలు ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కాకుండా ఉంది.

ఇక ఈ వారం బయటి నుంచి రోహిత్, కృష్ణుడు మినహా ఎక్స్ కంటెస్టెంట్స్ అంతా వచ్చి హౌస్‌లోని వారిని నామినేట్ చేశారు. అలా నామినేట్ అయిన కంటెస్టెంట్స్‌లో వంశీ, త్రిగుణ్, దేబ్జాని, రామ్ ప్రసాద్, సుధీర్, నీతూ, అమన్, శివ, రామకృష్ణ, వర్షిణి, ముఖేష్ ఉన్నారు.

ఈ వారం వీరిలో ఎవరు నామినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. త్రిగుణ్, ముఖేష్ అయితే వెళ్లే ఛాన్సే లేదు. ఇద్దరూ ఓటింగ్‌లో వన్, టు పొజిషన్స్‌లో ఉన్నారు. వీరి తర్వాత పర్వాలేదన్న పొజిషన్స్‌లో దేబ్జాని, అమన్ ఉన్నారు. ఇక వంశీ అయితే మూడవ వారమే ఎలిమినేట్ అయి వెళ్లిపోవాల్సింది.. ముఖేష్ ఆపేశాడు. వర్షిణి సైతం గేమ్ ఏమీ లేదు. ఆమె కూడా లీస్ట్ టులో చాలా సార్లు నిలబడింది. ఇక గేమ్ అసలు ఆడటం లేదు అనుకున్న రామకృష్ణ ఈవారం ఆడే ఛాన్స్ వచ్చింది. దానిని బాగానే ఉపయోగించుకుంటున్నాడు. లాస్ట్లో రామకృష్ణకు వాళ్ల అమ్మ రావడం కూడా కలిసొచ్చిన అంశం.

నీతూ కూతురి పుట్టినరోజుకు రోహిత్ అటెండ్ అయ్యాడు. అతడిని చాలా రోజుల తర్వాత చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఇది నీతూకి బాగా కలిసొచ్చిన అంశం. ఇక వంశీకి త్రిగుణ్ నామినేషన్స్‌లో ఉండటం పెద్ద దెబ్బ. శివ‌కు ఏమాత్రం ఓటింగ్ లేదు. సుధీర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. మొత్తమ్మీద చూస్తే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే వర్షిణి, వంశీ, శివ, సుధీర్‌లలో ఇద్దరు వెళ్లిపోయే అవకాశం ఉంది. ఎక్కువ వెళ్లిపోయే ఛాన్స్ శివ, సుధీర్‌కు ఉంది. సింగిల్ ఎలిమినేషన్ అయితే మాత్రం శివ వెళ్లిపోయే అవకాశం ఎక్కువ. ఈ వారం టాస్క్‌లలో బాగా ఆడితేనే ఎవరికైనా గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంది. లేదంటే కష్టమే.

Pranav

Recent Posts

Bigg Boss10 Telugu: కెప్టెన్ అయిన అమన్.. నరేష్‌ కోసం కన్నీళ్లు పెట్టుకున్న రామ్ ప్రసాద్

నిన్న షో ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచే తిరిగి నేడు ప్రారంభమైంది. వంశీ వచ్చేసి టీం త్రిగుణ్ విన్నర్ అని..…

1 hour ago

Bigg Boss10 Telugu: నాగ్ సహా ఒక్కొక్కరినీ ఉతికి ఆరేసిన చరణ్

త్రిగుణ్ వెళ్లి కెమెరాతో మాట్లాడాడు. ముఖ్యంగా వర్షిణి తమ గురించి మాట్లాడటం గురించి బాగా కోపం పెంచుకుని మాట్లాడాడు. ఆ…

3 days ago

మారిపోయిన జేమ్స్ బాండ్.. నయా బాంబ్ బాబు ఎవరో తెలుసా..?

ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులకు అత్యంత ఇష్టమైన సూపర్ స్పై క్యారెక్టర్ జేమ్స్ బాండ్. ఇప్పటివరకు ఈ ఐకానిక్ పాత్రలో నటించిన…

3 days ago

2000 కోట్ల దిశగా రామాయణ.. ఆ రికార్డు రాముడి సొంతం అవుతుందా..?

పదేళ్ల క్రితం దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ప్యాన్ ఇండియా గేట్లను తెరిచింది. అప్పటివరకు…

3 days ago

నేను రాను.. వచ్చే సమస్యే లేదు.. కుండ బద్ధలు కొట్టిన రోహిత్ నాయుడు..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 చాలా రసవత్తరంగా సాగుతోందిప్పుడు. అయితే ఈ సీజన్ మొత్తం మీద అందరికీ పెద్ద…

3 days ago

ట్రెండింగ్‌లో జటాయు ఎర్త్స్ సెంటర్.. ఆ వైరల్ ప్లేస్ ఎక్కడుందో తెలుసా..?

రీసెంట్‌గా రిలీజ్ అయిన రామాయణ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ…

3 days ago