సినిమా వార్తలు

Bigg Boss10 Telugu: కెప్టెన్ అయిన అమన్.. నరేష్‌ కోసం కన్నీళ్లు పెట్టుకున్న రామ్ ప్రసాద్

నిన్న షో ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచే తిరిగి నేడు ప్రారంభమైంది. వంశీ వచ్చేసి టీం త్రిగుణ్ విన్నర్ అని.. ముఖేష్ వచ్చేసి టీం ముఖేష్ విన్నర్ అని చెప్పాడు. అప్పుడు బిగ్‌బాస్ ఈ ఛాలెంజ్ ఏంటని అడిగారు. ఎవరు ఎక్కువ సేపు వెయిట్ మోశారని బిగ్‌బాస్ అడగటంతో అమన్ మోశాడని.. త్రిగుణ్ విన్నర్ అని ముఖేష్ చెప్పాడు. త్రిగుణ్ టీంకు కిచెన్ వచ్చింది. ఈ టీం నుంచి ఎవరినైనా రిమూవ్ చేయమంటే.. రామ్ ప్రసాద్‌ను త్రిగుణ్ తీసేశాడు. లైటర్ కావాలని త్రిగుణ్ అడగటంతో రామకృష్ణ తీసుకెళ్లి ఇచ్చాడు విన్నింగ్ టంకు బిర్యానీ పంపించారు. కేవలం గెలిచిన టీంతో పాటు టు డిక్టేటర్స్‌కు.. గంజి, పొటాటో ఓడిపోయిన టీం సభ్యులకని బిగ్‌బాస్ చెప్పారు. తనకు కొంచెం టైం కావాలని.. గట్టిగా ఆడమని రామ్ ప్రసాద్.. ముఖేష్ టీం మొత్తానికి చెప్పి వెళ్లిపోయాడు. వర్షిణిని చూస్తే తనకు చాలా కోపం వచ్చిందని.. ఆమెను పెట్టుకుని ఎక్కడ గెలుస్తాడు? అందుకే కోపం వచ్చి అక్కడి నుంచి వచ్చేశానని రామ్ ప్రసాద్ చెప్పాడు. మార్నింగ్ మిగిలిన ఫుడ్ తినమని ముఖేష్ చెప్పాడని వెళ్లి రామ్ ప్రసాద్‌కు సుధీర్ చెప్పాడు. ఆ తరువాత వెళ్లి తాను ఈ టీంలో ఉండనని చెప్పి వెళ్లిపోయాడు.

నరేష్ గంజి తింటుంటే చూడలేకపోయానని రామ్ ప్రసాద్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనకు బిగ్‌బాస్‌పై కోపం వచ్చిందని చెప్పాడు. తాము బయట ఎలా ఉంటామో తెలుసుకదాని రామ్ ప్రసాద్ బాధపడ్డాడు. నరేష్ కూడా వచ్చాడు. అది ప్రక్రియ అని నరేష్ చెప్పాడు. ఫుడ్ లేకపోయినా బాధపడనని గంజి అన్నం తింటుంటే బాధ అనిపించిందని కనీసం కాస్త పప్పు కానీ.. చారు కానీ పంపించవచ్చు కదా బిగ్‌బాస్ అని రామ్ ప్రసాద్ అన్నాడు. నరేష్‌ను త్రిగుణ్ తీసుకొచ్చి బిర్యానీ తినిపించాడు. బాత్రూం క్లీన్ చేయాలని శివ వచ్చి చెప్పాడు. తమకు ఫుడ్ కావాలంటే పని చేయాలని చెప్పాడు. దేబ్జాని వచ్చి ఆర్కేకు ఏమేం చేయాలో చెప్పింది. తమ డిక్టేటర్‌ను అడిగి చేస్తానని చెప్పాడు. ఆర్కే స్వీపించే చేయాలని అది తన ఆర్డర్ అని చెప్పి త్రిగుణ్ వెళ్లిపోయాడు. ఆర్కే వచ్చి ముఖేష్‌తో వాళ్లు రకరకాల రూల్స్ పెడుతున్నారు.. ఏం చేయాలని అడిగాడు. వాళ్ల టీం వాళ్లకు ఏం పని ఇస్తున్నాడని ముఖేష్ అడిగితే తనకు తెలియదని ఆర్కే చెప్పాడు. శివ్ రాగానే నీతూ, తను మూడు పూటలా వండిపెడుతున్నాం కాబట్టి తను అదే చేస్తానని వర్షిణి చెప్పింది. అలా అయితే కాఫీ, ఫుడ్ వద్దా? అంటే వద్దని వర్షిణి చెప్పింది. కాఫీ అనేది మీ డిక్టేటర్‌కు ఇచ్చేది లేదని చెప్పారని ముఖేష్‌తో నరేష్ చెప్పాడు.

తమ ఫుడ్ తీసుకెళ్లి వంశీ, శివ సైడ్ పెట్టుకోవడంపై వర్షిణి, ఆర్కే ప్రశ్నించారు. తన చేతిలోని ఫుడ్ శివ లాక్కున్నాడని వర్షిణి చెప్పింది. అసలు కిచెన్‌లోకి ఎందుకు వచ్చారని ముఖేష్‌ను త్రిగుణ్ ప్రశ్నించాడు. నిద్ర పోతున్న వాడిని లేపవచ్చని.. నిద్ర పోతున్నట్టు నటిస్తున్నవాడిని ఏం లేపుతామని త్రిగుణ్ అన్నాడు. నీతూ కూడా శివ ఫుడ్ తమ నుంచి తీసుకున్న విధానం అసలు బాగోలేదని త్రిగుణ్‌కు చెప్పింది. ఇక అల్టిమేట్ పవర్‌ను దక్కించుకోవడం కోసం కంటెండర్స్ త్రిగుణ్ టీం నుంచే వస్తారని బిగ్‌బాస్ చెప్పారు. ముఖేష్ టీం నుంచి కంటెండర్స్ లేకపోవడంతో అతని టీంకు ఒక చివరి అవకాశం ఇచ్చారు. ముగ్గురికి ఓ టాస్క్ ఇస్తానని.. ఆ ముగ్గురు ఎవరో చెప్పమని బిగ్‌బాస్ చెప్పారు. ముగ్గురిలో ముఖేష్ పేరు కూడా ఉండొచ్చని చెప్పారు. నీతూ వచ్చి తనకో అవకాశం ఇవ్వమని.. త్రిగుణ్ టీంలో తనకు అన్యాయం జరిగిందని ముఖేష్‌కు చెప్పింది. ముఖేష్ వచ్చేసి మీరు చాలా బాగా ఆడారని ప్రూఫ్ ఇస్తే తాను తీసుకుంటానని చెప్పాడు. నీతూ వెళ్లి శివకు విషయాన్ని చెప్పింది. శివ్ వెళ్లి త్రిగుణ్‌కు చెప్పడంతో అతను వెళ్లి ముఖేష్‌కు రిఫరెన్స్ ఇచ్చాడు. మరి అలాంటప్పుడు నీతూకి ఎందుకు వీక్ అని ఇచ్చావని అడిగాడు. దేబ్జానికి .5 ప్రిఫరెన్స్ ఇచ్చానని చెప్పాడు.

దేబ్జానిని గేమ్‌కి పంపించినందుకు చెప్పుతో కొట్టుకోవాలని చెప్పారు కదా.. అలా అని కూడా .5 ప్రిఫరెన్స్ దేబ్జానికే ఎక్కువ ఇస్తున్నారు కదా అని ముఖేష్ అడగాడు. ఆయన ఎందుకు మిమ్మల్ని వీక్‌లో పెట్టాడో మీకు అర్థమైందా? అని నీతూని ముఖేష్ అడిగాడు. మీరు ఆడకుంటే బెడ్‌రూమ్ యాక్సెస్ వాళ్లకు వచ్చేదా? అని నీతూని ముఖేష్ అడిగాడు. అయినా కూడా మిమ్మల్ని తీసేశారని ముఖేష్ చెప్పాడు. తనకు అన్యాయం జరిగిందని నీతూ చెప్పింది. ఏ ఆటలోనూ గెలవని వర్షిణిని తీసుకొచ్చి స్ట్రాంగ్‌లో పెట్టాడని.. అన్ని విషయాల్లో మాట్లాడుతున్న రామ్ ప్రసాద్‌ను వీక్‌లో పెట్టాడని త్రిగుణ్ అన్నాడు. నరేష్‌కు వీకెస్ట్ ఇచ్చాడు. ఆరుగురికి ముఖేష్ అన్యాయం చేశాడని త్రిగుణ్ అన్నాడు. నరేష్‌ను కంటెండర్‌షిప్ ఏం విషయంలో కావాలని ముఖేష్ అడిగాడు. బుద్ధిబలం గేమ్ ఆడమంటే తనకు కష్టమని ఆడనని చెప్పావు కదా అని ముఖేష్ అడిగితే అవునని నరేష్ చెప్పాడు. తమ టీంలో నలుగురిని మాత్రమే కంటెండర్‌షిప్ అవ్వాలంటే తన టీంలోని నలుగురిని పంపించి తను ఆగుతానని త్రిగుణ్ చెప్పాడు.

ముఖేష్‌ను ఏ ముగ్గురు పాల్గొంటున్నారని అడిగితే ఆర్కే, నీతూ, తను పాల్గొంటున్నట్టుగా ముఖేష్ చెప్పాడు. వెంటనే నరేష్ ఏమైందని రామ్ ప్రసాద్ అడిగాడు. బాల్‌ను బ్యాలెన్స్ చేస్తూ స్టెప్ ఎక్కాలి. ఇది టాస్క్. అంతా ముందుగానే ఒక లైఫ్ కోల్పోయారని త్రిగుణ్ చెప్పాడు. ముఖేష్ ముందుగా గేమ్ నుంచి అవుట్ అయిపోయాడు. ఆ తరవాత ఆర్కే కూడా గేమ్ నుంచి అవుట్ అవడంతో నీతూ గెలిచింది. మీ ఆశీర్వాదం అని త్రిగుణ్‌కు నీతూ చెప్పింది. త్రిగుణ్‌ను మీ ఐదుగురిలో కంటెండర్‌గా నిలిచేందుకు ముగ్గురికి అవకాశం ఉంటుందని వారెవరో చెప్పమని బిగ్‌బాస్ అడిగారు. త్రిగుణ్ కాస్త ఆలోచించుకుని చెప్పమన్నాడు. తను ఎందుకు ఓడిపోయానో తెలుసా? అని సుధీర్‌ను ముఖేష్ అడిగాడు. బాల్ బ్యాలెన్స్ కాలేదని సుధీర్ చెప్పాడు. అలా కాదని.. ఇన్‌టెన్షనల్‌గా ఓడిపోయానని చెప్పాడు. గేమ్‌లో ఓడిపోతే నీకేం వస్తుందని సుధీర్ అడిగాడు. తనను పెట్టింది డిక్టేటర్‌గానని.. కాబట్టి తన టీంను డిక్టేట్ చేస్తూ వారిని గెలిపించాలని అందుకే ఓడానని ముఖేష్ చెప్పాడు. ముందుగానే ఇద్దరికీ చెప్పి ఓడిపోయానని చెప్పాడు. సడెన్‌గా వచ్చి ఎందుకు తన టీంలో ఉండనని ఎందుకు చెప్పి వెళ్లావని సుధీర్‌ని ముఖేష్ అడిగాడు. దీనికి రామ్ ప్రసాద్‌ను వీక్‌లో.. నరేష్‌ను వీకెస్ట్‌లో.. వర్షిణిని స్ట్రాంగ్‌లో పెట్టడం తనకు నచ్చలేదని సుధీర్ చెప్పాడు. తాను ఎందుకు పెట్టాల్సి వచ్చిందో వాళ్లకు క్లారిటీ ఉందని అది నీకెందుకన్నట్టుగా ముఖేష్ అడిగాడు. సుధీర్ ఏం సమాధానం ఇవ్వలేదు.

ఈగేమ్‌లో డిక్టేటర్‌గా సెలక్ట్ అయ్యానంటే తనకు బాగా ఆడానని త్రిగుణ్ చెప్పాడు. మీ నలుగురిలోనే ముగ్గురికి ఇవ్వాలనుకుంటున్నట్టుగా తన టీంకు చెప్పాడు. వర్షిణిని బ్యాటరీలు మార్చుకున్నావా? అని అడిగితే మరచిపోయానని వర్షిణి చెప్పింది. వర్షిణి బ్యాటరీలు మార్చుకునేందుకు వెళ్లగా ఆ రూంను బిగ్‌బాస్ లాక్ చేశాడు. ఆర్కే, ముఖేష్ అక్కడకు వచ్చారు. బిగ్‌బాస్ లైట్స్ ఆఫ్ చేస్తూ.. ఆన్ చేస్తూ కాసేపు వర్షిణిని భయపెట్టారు. బయటి నుంచి ముఖేష్, అమన్, ఆర్కే ఆమెను మరింత భయపెట్టే ప్రయత్నం చేశారు. అమన్, శివ, దేబ్జానిలకు కంటెండర్‌షిప్ త్రిగుణ్ ఇచ్చాడు. ‘నిలబెట్టు.. పడగొట్టు’ టాస్క్‌ను కెప్టెన్సీ కంటెండర్స్‌కు బిగ్‌బాస్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో గెలిచిన వారికి కెప్టెన్సీ మాత్రమే కాకుండా టికెట్ టు ఫినాలే కంటెండర్ కూడా అవుతారని బిగ్‌బాస్ చెప్పారు. ఈ టాస్క్‌లో అమన్ విన్ అయ్యి కెప్టెన్ కూడా అయ్యాడు. ఈ వారం ఎలిమినేషన్ నుంచి సేవ్ అయితే నేరుగా 13వ వారంలోకి అడుగు పెడతాడు. అమన్‌కు కెప్టెన్సీ బ్యాండ్ పెట్టారు. మొత్తానికి ఎన్నో వారాలుగా చివరి వరకూ వెళ్లి కెప్టెన్ కాలేకపోయిన అమన్ చివరకు కెప్టెన్ అయ్యాడు. అమన్ కోసం వైట్ గోల్డ్ మెడల్ వచ్చింది.

Pranav

Recent Posts

Bigg Boss10 Telugu: ఈవారం బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

ఈవారం బిగ్‌బాస్‌ ఏమాత్రం ఆసక్తిగా అనిపించడం లేదు. ముఖేష్, త్రిగుణ్‌లను డిక్టేటర్స్‌ను చేసి ఒక టాస్క్ ఆడించారు బిగ్‌బాస్. దానిలో…

1 hour ago

Bigg Boss10 Telugu: నాగ్ సహా ఒక్కొక్కరినీ ఉతికి ఆరేసిన చరణ్

త్రిగుణ్ వెళ్లి కెమెరాతో మాట్లాడాడు. ముఖ్యంగా వర్షిణి తమ గురించి మాట్లాడటం గురించి బాగా కోపం పెంచుకుని మాట్లాడాడు. ఆ…

3 days ago

మారిపోయిన జేమ్స్ బాండ్.. నయా బాంబ్ బాబు ఎవరో తెలుసా..?

ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులకు అత్యంత ఇష్టమైన సూపర్ స్పై క్యారెక్టర్ జేమ్స్ బాండ్. ఇప్పటివరకు ఈ ఐకానిక్ పాత్రలో నటించిన…

3 days ago

2000 కోట్ల దిశగా రామాయణ.. ఆ రికార్డు రాముడి సొంతం అవుతుందా..?

పదేళ్ల క్రితం దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ప్యాన్ ఇండియా గేట్లను తెరిచింది. అప్పటివరకు…

3 days ago

నేను రాను.. వచ్చే సమస్యే లేదు.. కుండ బద్ధలు కొట్టిన రోహిత్ నాయుడు..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 చాలా రసవత్తరంగా సాగుతోందిప్పుడు. అయితే ఈ సీజన్ మొత్తం మీద అందరికీ పెద్ద…

3 days ago

ట్రెండింగ్‌లో జటాయు ఎర్త్స్ సెంటర్.. ఆ వైరల్ ప్లేస్ ఎక్కడుందో తెలుసా..?

రీసెంట్‌గా రిలీజ్ అయిన రామాయణ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ…

3 days ago